
సీతాపహరణానికి సంకల్పించిన రావణుడు అందుకు తనకు సహరించాలని, మాయలేడిగా మారాలని మారీచుడిని ఆదేశించాడు. ‘ఖరదూణనాదులను చంపిన రాముడు మానవాతీతుడు. ఆయనను ఎదుర్కోవడం మృత్యువును కౌగిలించుకోవడమే’ అని మారీచుడు పదేపదే హెచ్చరిస్తున్నా వినని దశకంఠుడు తన పంతమే నెగ్గించుకోవాలనుకున్నాడు. మారీచుణ్ణి మాయలేడిగా మారిపొమ్మనే ఆదేశిస్తాడు.
“అన్నా! అడవిలో అనేకులు రాక్షనులు కామరూప ధారులై ఉంటారు. ఇతడు మారీచుడనే రాక్షసుడు. లేడికాదిది.. మాయిలేడి కాని” అన్న లక్ష్మణుని మాటలకు ప్రత్యుత్తరమిస్తూ శ్రీరాముడు “అక్ష్మణా! మారీచుడే గనుక ఇట్లావస్తే అవశ్యం అతన్ని వధిస్తాను. తమ్ముడూ! మీ వదిన సీత జింక చర్మం కొరకు మనసుపడుతున్నదోయి” అనడంలో ధర్మరక్షణ దీక్షా దక్షతకు ప్రక్కనే పొదిగికొన్న మనుజ సహజత్వం ఉట్టిపడుతుంది.
సీతాపహరణానంతరం సాధ్వీమతల్లి సీతకై విలవించిన శ్రీరాముడు ముమ్మూర్తుల మానవుడే. స్థాణువులైన వృక్షాలను, జడములైన రాయిరప్పలను, గట్టుపుట్టలను జానకిజాడ కోసం కన్నీటితో ప్రశ్నించడంలో సతి పట్ల పతికి ఉుండే ప్రేమాభిమానాలు ద్యోతకమౌతాయి.
రామ రావణసంగ్రామ సన్నాహము ధర్మాధర్మ యుద్ధమునకు ఒక సారూప్యము. ఇందలి పాత్రలు 5 ధర్మాధర్మాలకు ప్రతీకలై ఉన్నాయని కూడా వివరణ చేసుకోవచ్చు. సాధుత్వం, బ్రహ్మతేజం, బ్రహ్మచర్యం, క్రమశిక్షణ, స్వామి భక్తి, వానరులు, మారుతి, తక్కుంగల పదాతులుగా రూపుదాల్చారు. రాక్షసత్వం కౄరత్వం, హింస, కుంభకర్ణాది అసురులు.
రామ, రావణులే విభిన్నములగు రెండు వ్యవస్థల ప్రతిబింబములనవచ్చు. ఒకటి అసురశక్తి, భౌతికవాదం, స్వార్థపరత్వం, ధర్మవిదూరత. మరొకటి దైవీశక్తి, ఆస్తికత, ఆధ్యాత్మికత, ఇందు రెండవదానిదే అంతిమ విజయమని వేరే చెప్పనక్కరలేదు. ధర్మాధర్మ సంఘర్షణల శాశ్వతఫలితం ‘ధర్మమేవ జయతే’ అనేది మరల నిరూపితమైనది.
విజయగర్వం ఇనుమంతయిన లేని వీరశిఖామణి శ్రీరాముడు. దేశాభిమానం, వీసమైత్తైన తరుగని మాతృభక్తి అతనిది. కావుననే రావణ వధా నంతరము లక్ష్మణుడు లంకను చూచి సంపదలను గాంచి సమ్మోహితుడై అక్కడనే ఉండగోరినప్పుడు “జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపిగరీయసీ” అనే కలకాలం నిత్యనూతన కాంతులతో దీపించే సత్యాన్ని ప్రవచించినాడు.
రామాయణం భారతజాతీయ జీవనగాథతో వేరుపడలేనంత సన్నిహిత సంబంధం కలిగినది. రముకుల రత్నదీపుని చరిత్ర రాయడానికి గ్రంథములు సరివడవు. అతని చరిత్ర మహాద్యంతమైనది. త్రైలోక్యపావనమైనది.
ఏటేటా వచ్చే శ్రీరామనవమి పండుగ మనకు ఈ పురాణ పురుషుని మహా మహిమాన్విత జీవితాన్ని జ్ఞప్తికితెచ్చి కర్తవ్యోమ్మఖులును చేయుచున్నది. కావుననే శ్రీరామనవమి భారతీయుల వండుగలలో ప్రముఖస్థానం ఆక్రమించినది.రామరాజ్యం ధర్మరాజ్యం, ఆదర్శ సామ్రాజ్యం.
రావణ వధానంతరము లక్ష్మణుడు లంకను చూచి సంపదల గాంచి సమ్మోహితుడై అక్కడనే ఉడగోరినప్పుడు “జననీ జన్మభూమిశ్చ స్వర్గా దపిగరీయసీ” అనే కలకాలం నిత్యనూతన కాంతులతో దీపించే సత్యాన్ని ప్రవచించినాడు.
ప్రజారాజ్యం, శ్రీమద్రామాయణంలోని ప్రతి అక్షరం పారాయణీయము. శ్రీరామచంద్రుని గుణాలలో ప్రతి ఒక్కటీ అనుకరణీయము. ఆయన ఆచరించిన ప్రతి కృత్యం భారతీయులందరికీ గర్వకారణమే.




