News

‘శుక్రవారం’ దాడుల‌పై బంగ్లా ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియ‌స్‌!

527views

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై శుక్ర‌వారాల‌తోపాటు ఇత‌ర రోజుల్లో జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ ఆ దేశ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) “లౌకిక దేశం”లో మతపరమైన హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం, అవాంఛిత దాడిని నివారించడంలో నిర్లక్ష్యం ఉందా? పరిస్థితిని నియంత్రించడంలో పోలీసులు సరైన పాత్ర పోషించారా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం… “బంగ్లాదేశ్ వంటి లౌకిక దేశంలో మత హింస ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు” అని కమిషన్ పేర్కొంది.

ఇటీవల శుక్రవారం నరైల్‌లోని లోహగరాలోని సహపరా ప్రాంతంలో హిందూ మైనారిటీల ఇళ్ళ‌కు నిప్పుపెట్టినట్టు డైలీ స్టార్ అనే మీడియా పేర్కొంది.

శుక్రవారం ప్రార్థనల అనంతరం పొరుగున ఉన్న 18 ఏళ్ళ యువకుడు ఫేస్‌బుక్‌లో తమ మతపరమైన భావాలను దెబ్బతీశాడని ఆకతాయిలు రెచ్చిపోయారు.

గ్రామంలోని కళాశాల విద్యార్థి ఆకాష్ సాహా ఈ పోస్ట్ చేసినట్టు స్థానికులు ఆరోపించారు. జుమా నమాజు తర్వాత వారు గుమిగూడి విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అతని ఇంటి ముందు నిరసన తెలిపారు.

అత‌ను ప‌రార్‌లో ఉండ‌డంతో అత‌ని ఇరుగుపొరుగు ఇళ్ళ‌ను నిందితులు ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డ్డారు.

“ఒక గుంపు మా విలువైన వస్తువులన్నింటినీ దోచుకున్న తర్వాత, మరో గుంపు వచ్చి మా తలుపు తెరిచి చూసింది. దోచుకోవడానికి ఏమీ మిగలకపోవడంతో మా ఇంటికి నిప్పు పెట్టారు.”

“ఈ హింస ముప్పు ఎంతకాలం మ‌మ్మ‌ల్ని వెంటాడుతుందో నాకు తెలియదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు? మాకు భద్రత ఎవరు ఇస్తారు? … వారు నిప్పంటించేటప్పుడు నేను ఇంట్లో ఉంటే, నేను చనిపోతాను. దేవుడు నన్ను రక్షించాడు. కానీ మనుగడకు ఇది ఏదైనా మార్గమా? ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా శరీరంపై ఉన్న చీర మాత్రమే” అని ఓ బాధితురాలు బోరుమంది.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు శుక్రవారం ఆకాష్ తండ్రి అశోక్ సాహాను అదుపులోకి తీసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి