News

విజయవాడలో సంత్ రవిదాస్ ‘కలశవందన్’ శోభాయాత్ర

31views

విజయవాడ: సంత్ రవిదాస్ గురూజీ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జన్మస్థలమైన వారణాసి నుంచి తీసుకువచ్చిన పవిత్ర మట్టి కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ‘కలశవందన్’ పేరుతో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని అనంతరం జరిగిన సభలో నాయకులు ప్రసంగించారు.

ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పనతల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఏలూరు రోడ్డులోని రామమందిరం నుంచి పవిత్ర కలశాలతో ప్రారంభమైన శోభాయాత్ర బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కలశాలకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. సంత్ రవిదాస్ గురూజీ సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువలను సమాజానికి చాటిచెప్పిన మహనీయులని అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సమరసత, సమానత్వాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంత్ రవిదాస్ గురూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పవిత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవతా విలువలను మరింత బలోపేతం చేయడమే సంత్ రవిదాస్ గురూజీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎస్సీ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.