
234views
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట రుద్రప్రభల తీర్థానికి అరుదైన గుర్తింపు లభించింది. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఉత్సవ్’ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కింది. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ ఏకాదశ రుద్రప్రభల తీర్థం విశిష్టతపై ప్రధాని నరేంద్ర మోదీ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్‌కు ఇటీవల లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, ఈ గుర్తింపునిచ్చింది. 2023 జనవరి 26న గణతంత్ర వేడుకల్లోనూ ఏకాదశ రుద్రప్రభల నమూనాను ఏపీ తరఫున శకటంగా ప్రదర్శించారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా నిర్వహించే విభిన్న సంప్రదాయ పండుగల జాబితాలో రుద్రప్రభలకు చోటు కల్పించడంపై శివకేశవ యూత్ సభ్యులు ఆదివారం హర్షం వ్యక్తంచేశారు.




