News

ఉత్తర ద్వార దర్శనం రేపు

311views

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ముస్తాబైంది. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి 10.30 గంటల వరకూ సింహాచలేశుడు వైకుంఠ నారాయణుడి అలంకారంలో ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిస్తారు. దీంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర ద్వారం ఎదురుగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి భక్తులను ఆర్టీసీ బస్సుల్లో సింహగిరికి అనుమతిస్తారు. ఏర్పాట్లను ఈవో వాండ్ర త్రినాథరావు, ఈఈ శ్రీనివాసరాజు, రాంబాబు, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఉత్తర ద్వారంలో స్వామి అతి శీఘ్ర దర్శనం కోసం రూ.500 టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఏకాదశి విశేషమైన పొంగలి ప్రసాదాన్ని అందజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మినహా ఇతరులకు అంతరాలయ దర్శనం ఉండదని తెలిపారు.