
68views
అల్లంత దూరం నుంచే కనువిందు చేసే దేవుళ్ల విగ్రహాల గోపురాలు- ఏ గుడిలోనైనా సాధారణమే! కానీ ఆ ఆలయంలో మాత్రం బయటేకాదు… లోపల సైతం స్తంభాలు మొదలు పైకప్పు వరకూ ఎక్కడ చూసినా అందంగా చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. భక్తులు గర్భగుడిలోని దేవుడికి దండం పెట్టుకోవడం కన్నా ముందు, దేవాలయం అంతా నిండి ఉన్న శిల్పకళా సంపదను చూసే ఆశ్చర్యపోతుంటారు! కళ్లుచెదిరే రంగుల్లో దేవుళ్ల, రాక్షసుల, జంతువుల బొమ్మలన్నీ పురాణాల్లోని వివిధ ఘట్టాలతో ఆకట్టుకుంటాయి. శ్రీలంకలోని ట్రింకోమలీలో కొలువైన ఈ ‘పతిరకాళి అమ్మన్ ఆలయం’ గొప్పతనం అదే. 11వ శతాబ్దంలో చోళుల కాలంలో అద్భుతమైన ద్రవిడ నిర్మాణశైలితో దీన్ని నిర్మించారు. ఈ భద్రకాళి గుడిలో మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాల్నీ దర్శించుకోవచ్చు. వ్యాధుల్ని తగ్గించే క్షేత్రంగా పేరున్న ఈ గుడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు బారులు తీరతారు!





