News

మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

357views

మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఇందులో కొత్తగా వాడిన పరిజ్ఞానాల సమర్థత రుజువైందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా ప్రయోగం సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ అస్త్రం.. ‘అగ్ని’ శ్రేణికి సంబంధించింది కాదని తెలుస్తోంది.