
76views
కంటైనర్లలో పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందడంతో వేంపాడు టోల్గేట్ వద్ద కంటైనర్‌ను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా మానాపురం నుంచి విజయవాడ సమీపంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్దకు కంటైనర్‌లో రెండు అరలను ఏర్పాటు చేసి 48 ఎద్దులను ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటైనర్‌ను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తవలసలో ఉన్న గోశాలకు తరలించినట్టు సీఐ జె.మురళి తెలిపారు. కాగా ఇదేవిధంగా నిత్యం 30 నుంచి 40 కంటైనర్లలో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా పోలీసుల కంట పడడం లేదు. పోలీసుల కళ్లు కప్పడానికి లారీలు, వ్యాన్లు బదులుగా పశువుల రవాణాకు కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా ఈ పశురవాణా ఏళ్ల తరబడి జరుగుతోంది. కంటైనర్‌లో 40 నుంచి 50 గోవులను కుక్కి ఊపిరి ఆడకుండా చేసి వందల కిలోమీటర్ల దూరం మేత గాని, తాగడానికి నీళ్లు గాని ఇవ్వకుండా హింసిస్తూ కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని పశువులు మృత్యువాత కూడా పడుతున్నాయి.





