Sri Lanka – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: ఉచితాలు, అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో కుప్పకూలిన శ్రీలంక పరిస్థితులను చూసి అప్రమత్తం కావాలని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. శ్రీలంకలోని స్థితిగతులను చెప్పడానికి విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాల స్థితిగతులనూ ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని వివ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌ రుణాలు జీఎస్‌డీపీలో 32%కి చేరినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలు రుణ, ఆర్థిక కొలమానాలను దాటినట్టు పేర్కొన్నారు. ‘2019-2022 మధ్యకాలంలో ఏపీ బడ్జెటేతర మార్గాల నుంచి రూ.28,837 కోట్ల రుణం తీసుకుంది.

విద్యుత్తు సంస్థలకు రూ.10,109 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.34,208 కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది’ అని వివరించారు. తెలంగాణ రుణాలు జీఎస్‌డీపీలో 25%కి చేరాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి, వృద్ధి రేటు, అప్పుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? బడ్జెటేతర రుణాలు ఎంత మేరకు తీసుకున్నాయి? ఆస్తుల తాకట్టు, డిస్కంలు, జెన్‌కోలకు చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రాలు ఇచ్చిన గ్యారెంటీల గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించి అప్రమత్తం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకను చూసైనా జాగ్రత్త పడండి… ఏపీ సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే ప్రమాణ స్వీకారం
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే(73) ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్‌ స్పీకర్‌ అబేయవర్దనే వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే ప్రమాణ స్వీకారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి
భారత వ్యాపారవేత్తలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: శ్రీలంకలో చైనా అండతో నిర్మిస్తున్న పోర్ట్ సిటీ కొలంబో ప్రాజెక్ట్‌ విషయంలో దూరం పాటించాలని భారత్ నిర్ణయించింది. భారతీయ ప్రైవేటు భాగస్వాములకు ఈ విషయాన్ని తెలియజేసింది. పీసీసీ(పోర్ట్ సిటీ ఆఫ్ కొలంబో) ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు సీనియర్ అధికారులు ఉన్నత స్థాయి సమావేశంలో తేల్చారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు దూరంగా ఉండండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే, రాజపక్షే తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​!
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని అత్యధిక అత్యయిక స్థితి విధిస్తున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. పశ్చిమ ప్రావిన్స్​లో కర్ఫ్యూను విధిస్తున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు గొటబాయ పరారైన నేపథ్యంలో ఆ స్థానంలో తాత్కలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే ఈ ఆదేశాలను జారీ చేశారు.

మరోవైపు ప్రధాని రణిల్​ విక్రమసింఘే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించారు. విక్రమసింఘే కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు. అధికారులు నిరసనకారులను నియంత్రించేందుకు బాష్పాయువు ప్రయోగించారు. విక్రమసింఘే ప్రధాని పదవిని నుంచి ఈరోజు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రణిల్​ తాత్కలిక అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ​! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంక తీరం వెంబడి భారత్ గట్టి నిఘా!
న్యూఢిల్లీ: శ్రీలంక దేశంలో రాజుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యంపై నిరసనలు శ్రీలంకలో తీవ్రరూపం దాల్చిన కొన్ని గంటల తర్వాత, ఆ దేశ జలాల వెంబడి భారత్ నిఘా పెంచింది. భారత సముద్రంలో అదనపు హోవర్‌క్రాఫ్ట్‌లు, పెట్రోలింగ్ బోట్‌లను మోహరించారు. అక్రమ వలసదారులను నిరోధించేందుకు నిఘా పెంచామని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. నిరసనకారులు నివాసాన్ని ముట్టడించడంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు.

ఈ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలోని కోస్టల్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. భారతదేశంలోని ఇతర ఏజెన్సీలు కూడా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. రామేశ్వరం సమీపంలోని మండపం ప్రాంతంలోని కోస్ట్‌గార్డ్ హోవర్‌పోర్ట్ నిఘా కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంక తీరం వెంబడి భారత్ గట్టి నిఘా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌!
కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు.

విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన కొరత కారణంగా వారం పాటు దేశంలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూలై 4 నుంచి వారం పాటు సెలవులను ప్రకటించారు. గతంలో జూన్ నెలలో ఒకసారి ఇలాగే శ్రీలంక ప్రభుత్వ కార్యాలయాలను, స్కూళ్లను మూసేసింది. అయితే ఆన్ లైన్ బోధ‌న చేయాలని పాఠశాలలకు ప్రభుత్వం సూచిస్తోంది. ఇందు కోసం వారాంతంలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ కోతలు ఎత్తేయడానికి శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ అంగీకరించింది. అయితే, విద్యార్థుల రవాణాకు ఇబ్బందుల లేని పాఠశాలల్లో తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీలంకలో పాఠ‌శాల‌లు మూత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్షోభంలో శ్రీలంక తర్వాత పాకిస్తాన్‌!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, అంతర్జాయ పరిణామాల నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు కొంత మెరుగుగా ఉన్నాయి. శ్రీలంక తరువాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రెండో ఆసియా దేశం పాకిస్తాన్‌.

తాజా స్టాక్‌ మార్కెట్ల పరిస్థితులను పరిశీలిస్తే శ్రీలంక కంటే దాయాది దేశ స్టాక్‌ మార్కెట్లు దారుణంగా మారాయి. పాక్‌ స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 6 లక్షల 95వేల కోట్ల రూపాయలను నష్టపోయింది. దాదాపు లక్షా 35 కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణ ఆర్థిక పతనం ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం పాకిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీపెక్‌ ప్రాజెక్టులే కారణమని విశ్లేషిస్తున్నారు.

రాజకీయ, ఆర్థిక సంక్షోభం.. పొరుగు దేశం పాకిస్తాన్‌ను నిండా ముంచుతున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్‌ కంటే వేగంగా దూసుకుపోతోంది. అంతే వేగంగా విదేశీ మారక నిధులు పడిపోతున్నాయి. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్సోభం కన్నా.. రాజకీయ ఘర్షణలే ఆందోళనకరంగా మారాయి. ప్రస్తుత సంక్షోభానికి ఇమ్రాన్‌ ఖాన్ పీటీఐ ప్రభుత్వమే కారణమని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపిస్తున్నారు. బాగున్న పరిస్థితులను పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ షరీఫ్‌-పీఎంఎల్‌ఎన్ ప్రభుత్వమే మరింత దారుణంగా మార్చిందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపిస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సంక్షోభంలో శ్రీలంక తర్వాత పాకిస్తాన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ సాయానికి మేం సదా దాసులమే…
శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే

కొలంబో: శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్‌ స్వాగతించింది. శ్రీలంకకు భారత్ సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్‌ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు.

తన పదవీకాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని, అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్‌ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు వివిధ రూపంలో భారతదేశం మూడు బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ సాయానికి మేం సదా దాసులమే… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌కు శ్రీ‌లంక శ‌ర‌ణార్థుల తాకిడి!
న్యూఢిల్లీ: శ్రీలంకలో బతకలేక అక్కడి తమిళులు పడవ మార్గంలో తమిళనాడులోని ధనుష్కోటికి చేరుకున్నారు. వీళ్లకు ఆశ్రయం కల్పించే విషయంలో భారత్ ఇంకా స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే, రాబోయే రోజుల్లో లంకేయుల రాకలు పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో ఇండియా ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం దెబ్బకు నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి, సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొంది.

అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనల బాటపట్టారు. ఆందోళనలు హోరెత్తడంతో కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. కానీ, ప్రధాని మహీంద రాజపక్స, ఆయన సోదరుడైన అధ్యక్షుడు గొటబయ రాజపక్స మాత్రం ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్నారు. లంకలో పరిస్థితులు చేయిదాటిపోయిన తరుణంలో పెద్దన్నలా భారత్ ఆదుకుంటున్నది. శ్రీలంకకు భారీ ఎత్తున ఇంధనం, బియ్యాన్ని సహాయంగా అందిస్తున్నది భారత్. అయితే, లంకలో బతకలేమంటూ ఇండియాకు వచ్చేస్తోన్నవారి సంఖ్య ఇప్పుడు క్రమంగా పెరుగుతోంది.

శ్రీలంకలోని జాఫ్నా, మున్నార్ ప్రాంతాల్లో తమిళులు ఎక్కువ సంఖ్యలో జీవిస్తారని తెలిసిందే. ఎల్టీటీఈ ఉద్యమం జోరుగా సాగిన కాలంలో ప్రత్యేక దేశం కోసం పోరాడిన తమిళులు.. ప్రభాకరన్ మరణం, ఎల్టీటీఈపై శ్రీలంక సైన్యం ఉక్కుపాదం తర్వాత ఆందోళనలకు స్వస్తి చెప్పడం విదితమే. కాగా, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో బతకలేకపోతున్నామంటూ ఇండియాకు శరణార్థులుగా వస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌కు శ్రీ‌లంక శ‌ర‌ణార్థుల తాకిడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.