#Woman – Vishwa Samvad Kendra Andhra Pradesh

దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది…
వాషింగ్టన్‌: వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ విపరీత చర్యకు పాల్పడింది. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన సిబ్బంది, ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికా మీడియా కథనాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ళ ఎలోమ్‌ అగ్బెనినో ఇటీవల ఒహైయోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానంలో బయల్దేరింది. అయితే విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు.

వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ”దేవుడు నన్ను ఒహైయో రమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు” అంటూ గట్టి గట్టిగా అరవడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానం గాల్లో 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె గట్టిగా కొరికి గాయపర్చింది.

ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌లోని బిల్‌ అండ్‌ హిల్లరీ క్లింటన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహైయోకు బయల్దేరినట్టు ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పిందట. ఆమె మానసిక స్థితి కూడా సరిగ్గా లేనట్టు తెలుస్తోంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేవుడు చెప్పాడని విమానం డోర్‌ తీయబోయింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా బోర్డర్​కు సైకిల్ ​మీద వెళ్ళిన మహిళ
న్యూఢిల్లీ: ఆమెకు 45 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. అయితేనేం! గుజరాత్‌ నుంచి సైకిల్‌పై బయల్దేరి అరుణాచల్‌ప్రదేశ్‌ చేరుకొంది. ఆమె.. పుణెకు చెందిన ప్రీతి మాస్కే. పాకిస్తాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులోని కోటేశ్వర్‌ ఆలయం నుంచి ఈనెల ఒకటోతేదీన సైకిల్‌ యాత్రను ఆరంభించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, బంగాల్‌, అసోం రాష్ట్రాల మీదుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న కిబితుకు చేరుకొంది. 13 రోజుల 19 గంటల 12 నిమిషాల వ్యవధిలో మొత్తం 3,995 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేసింది.

అనారోగ్యం, కుంగుబాటును అధిగమించేందుకు ఐదేళ్ళ కిందట సైకిలింగ్‌పై దృష్టి సారించిన ప్రీతి.. తక్కువ సమయంలోనే దేశంలోని పశ్చిమ భూభాగం నుంచి తూర్పు భూభాగం వరకూ సైకిల్‌పై ప్రయాణించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. వరల్డ్‌ ఆల్ట్రా సైకిలింగ్‌ అసోసియేషన్‌, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు ఈ సాహసానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా బోర్డర్​కు సైకిల్ ​మీద వెళ్ళిన మహిళ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు.

ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. బీజేపీ నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు.

అభ్య‌ర్థి వివ‌రాలు

పూర్తి పేరు : ద్రౌపది ముర్మూ

పుట్టిన తేదీ : 1958 జూన్‌ 20

పుట్టిన ప్రదేశం : బైదపొసి, మయూర్‌భంజ్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం

తండ్రి : బిరించి నారాయణ్‌ తుడు

భర్త : శ్యామ్‌చరణ్‌ ముర్మూ (మృతిచెందారు)

సంతానం : ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్మూ

విద్యార్హత : బీఏ (రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్‌)

వృత్తి జీవితం : నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ (1979-1983). గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌, శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, రాయ్‌రంగ్‌పూర్‌ (1994-1997)

రాజకీయ ప్రస్థానం..

1997: బీజేపీలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నిక

2000: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం)

2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి

2004: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక

2002-2009: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు

2010: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు

2013-2015: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు

2015: ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం

భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాకే ప్రకటన

“20 పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణాల్లో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ఆమె పనిచేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కంఠ్‌ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగస్వాములన్నింటితో మాట్లాడిన తర్వాత ఆమె పేరు ప్రకటిస్తున్నాం”

– జేపీ నడ్డా, బీజేపీ అధ్య‌క్షుడు

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్​ చేశారు.

“చనిపోయిన నక్సల్స్ ను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్‌గా గుర్తించారు. అతనిపై రూ. 15 లక్షల రివార్డు కూడా ఉంది. ఏరియా కమాండర్లు మనోజ్, ఒక మహిళ రమే, ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డును ఉంది” అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఎన్​కౌంటర్​ స్థలంలో నక్సల్స్‌ నుంచి ఏకే-47, 303 రైఫిల్‌, 12-బోర్‌ యాక్షన్‌ గన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఎం చౌహాన్​ తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదంలో మహిళలు!
కశ్మీర్‌ లోయలోని భద్రతా బలగాలకు స‌రికొత్త సవాలు

న్యూఢిల్లీ: కశ్మీర్‌ లోయలోని సాఫ్ట్‌ టార్గెట్‌లపై దాడి చేస్తున్న ఉగ్రవాదులను ఖ‌తం చేసేపనిలో ఇప్పటికే బిజీగా ఉన్న భద్రతా బలగాలకు స‌రికొత్త స‌వాల్ ఎదురైంది. తాజాగా ఇక్కడి తీవ్ర‌వాదంలో మ‌హిళ‌లు కూడా పాలుపంచుకుంటున్నారు.

పాక్ ఆక్రమిత J&K (POJK) నియంత్రణ రేఖ (LOC) నుండి శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడుతున్న ఉత్తర క‌శ్మీర్‌లో కొన్ని రోజులుగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు వెలుగులోకి వ‌చ్చారు.

పక్షం రోజుల క్రితం సోపోర్ పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డుపై ఉన్న సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై బురఖా ధరించిన మహిళ గ్రెనేడ్ విసురుతుండగా సీసీటీవీలో రికార్డయింది. తౌహీదాబాద్ బాగ్‌కు చెందిన షీమా షఫీ వాజాగా పోలీసులు గుర్తించిన మహిళ, ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW)గా ఉగ్రవాదంలో నిమగ్నమై ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) హ్యాండ్లర్లు ఆమెకు వై-ఫై హాట్‌స్పాట్, వసతి కల్పించడంతోపాటు ఉగ్రవాదులు ఎల్‌ఓసి మీదుగా చొరబడిన తర్వాత వారిని నిర్దేశించిన గమ్యస్థానానికి తీసుకెళ్ళే బాధ్యతను అప్పగించారు.

సెక్యూరిటీ బంకర్ వద్ద పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయిన మ‌రో మ‌హిళ హసీనా అక్తర్‌ను సోపోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర క‌శ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన మహిళ తన ముఖాన్ని బురఖాతో ఈ నేరానికి పాల్ప‌డింది. ఇప్ప‌టికే ఆమెపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద మూడు ఎఫ్‌ఐఆర్‌లు న‌మోదైవున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమోదు చేసిన తీవ్రవాద నిధుల కేసులో జైలులో ఉన్న అగ్రశ్రేణి మహిళా వేర్పాటువాది, పాకిస్తాన్ అనుకూలరాలు ఆసియా ఆంద్రాబీ ఆమెను ప్రేరేపించినట్టు నివేదించబడింది.

Source: The Statesman

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాదంలో మహిళలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్త‌వుల వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!
మ‌తం మారాల‌ని ప‌దేళ్ళుగా మ‌తోన్మాదుల వేధింపులు

ఫిర్యాదుపై ప‌ట్టించుకోని పోలీసులు

చెన్నై: తమిళనాడులో మతం మారిన క్రైస్తవుల వేధింపుల‌తోపాటు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన ఫిర్యాదులపై పోలీసు శాఖ ఉదాసీనత వైఖ‌రి ప్ర‌ద‌ర్శించింది. దీనికి నిరసనగా ఓ నడివయస్కురాలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది. పదేళ్ళుగా తమ గ్రామంలోని క్రైస్తవులు తనను, తన కుటుంబాన్ని మతం మారాలని బలవంతం చేస్తున్నారని ఆమె ఆరోపించింది.

వలర్మతి రామనాథపురం జిల్లా, ఆర్‌ఎస్‌ మంగళం సమీపంలోని కరుప్ప కుడుంబన్‌ పచేరి నివాసి. ఆమె కుటుంబంతో కలిసి పదేళ్ళుగా గ్రామంలోనే ఉంటోంది. తన గ్రామంలో మతం మారిన క్రైస్తవులు తనను క్రైస్తవ మతాన్ని స్వీకరించమని బలవంతం చేస్తున్నారని ఆమె అన్నారు. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు.

పోలీసుల నిర్లక్ష్యానికి విసిగిపోయి, క్రైస్తవుల వేధింపులు తట్టుకోలేక కలెక్టరేట్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యకు యత్నించింది. అదృష్టవశాత్తూ ఆవరణలో ఉన్న ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది ఆమెను కిందకు దిగకుండా ఆపి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తనను అడ్డుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన వలర్మతి.. క్రైస్తవులు తనపై ఫేక్ కేసులు పెట్టారని, రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులపై దాడి చేసి వేధిస్తున్నారని అన్నారు. మతం మార్చుకోవడానికి నిరాకరించినందుకు తన కుమారుడిని కొట్టి చంపారని, క్రైస్తవులపై ఫిర్యాదు చేశారని తెలిపింది. ఆర్ఎస్ మంగళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, క్రైస్తవులు తన కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నారని ఆమె ఆరోపించారు.

కొద్ది నెలల క్రితం, 17 ఏళ్ళ‌ హిందూ బాలిక లావణ్య క్రైస్తవ మతంలోకి మారాల‌ని తన క్రైస్తవ పాఠశాలలో పెట్టిన చిత్రహింసల కారణంగా తన ప్రాణాలను బలిగొంది. మతం మారిన క్రైస్తవులు తమ ప్రాంతంలోని హిందూ కుటుంబాలను వేధించడం కొత్త కాదు.

Source: HIINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్త‌వుల వేధింపులు త‌ట్టుకోలేక హిందూ మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.