#ISLAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా’… ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడి దారుణం!
లక్నో: ఉత్తర​ప్రదేశ్ బరేలీలో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్​ నిర్వహిస్తున్న ఓ మహిళను గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్ళి చేసుకోమని మహిళను బెదిరించాడు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్​మెయిల్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ర్వహిస్తోంది. తరన్నమ్, గజాలా అనే ఇద్దరు మహిళలు.. బ్యూటీ పార్లర్​కు వచ్చేవారు. అలా బాధితురాలితో వారిద్దరు పరిచయం పెంచుకున్నారు. ఓ సారి బాధితురాలిని తరన్నమ్​ తన ఇంటికి తీసుకెళ్ళి బంధించింది. అప్పుడు ఆమె సోదరుడు అక్లీమ్​.. బాధితురాలిని గన్​తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని అతని ఇద్దరు సోదరీమణులు వీడియో తీశారు. బాధితురాలు మతం మార్చుకుని అక్లీమ్​ను పెళ్ళి చేసుకోవాలని.. లేదంటే అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో వైరల్​ చేస్తామని బెదిరించారు. వారి మాటలకు బెదిరిపోయిన బాధితురాలు.. అక్లీమ్​తో వివాహానికి బలవంతంగా ఒప్పుకుంది.

బాధితురాలు తన నగలను నిందితుడికి ఇచ్చింది. మత్తుమందు ఇచ్చి నిందితుడు ఆమెను బరేలీ తీసుకెళ్ళి బలవంతంగా పెళ్ళి దస్తావేజుపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం ఆగ్రాకు తీసుకెళ్ళాడు. అప్పుడు అక్లీమ్ సోదరులు షాదల్, విసల్​ కూడా ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబరు 23న బాధితురాలు నిందితుల చెరనుంచి బయటపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఇస్లాంలోకి మారి పెళ్ళి చేసుకో.. లేదంటే రేప్ వీడియోను సోషల్ మీడియాలో పెడతా’… ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం యువకుడి దారుణం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రేమ కోసం ఇస్లాంను వీడిన యువతి.. వేదమంత్రాలతో ఘనంగా పెళ్ళి
గుణ: ప్రేమించిన అబ్బాయి కోసం మతం మార్చుకుంది ఓ యువతి. మత కారణాల దృష్ట్యా పెద్దలు వీరి వివాహానికి అంగీకరించకపోవడం వల్ల మతాన్ని మార్చుకుంది. మత మార్పిడి చేసుకున్న అనంతరం ప్రియుడిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ హిందూ సంప్రదాయంలో గాయత్రీ గుడిలో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు.

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన నజ్నియా బానో అనే యువతి, కుంభరాజ్​ నివాసి దీపక్ గోస్వామితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వీరి పరిచయం స్నేహంగా మారి, ప్రేమకు దారి తీసింది. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ యువతి ముస్లిం మతస్థురాలు కాగా.. యువకుడు హిందూ సంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. దీంతో పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించలేదు. వీరి వివాహానికి మతం అడ్డుగోడగా నిలిచింది. దీంతో ఆ యువతి మత మార్పిడి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గురువారం సాయంత్రం గాయత్రీ టెంపుల్​లో హిందూ మత గురువైన మణి మోహన్​ చైతన్య సమక్షంలో మత మార్పిడి చేసుకుని వివాహం చేసుకుంది. మత గురువు ఆమె పేరు నజ్నియా బానో నుంచి నాన్సి గోస్వామిగా మార్చారు.

అయితే, మత మార్పిడి చేసే ముందు మత గురువు చట్టపరమైన అన్ని ఆచారాలను పూర్తిచేశారు. వివాహం చేసుకున్న అనంతరం ఆ యువతి తమకు భద్రత కల్పించమని పోలీసులను అభ్యర్థించింది. మతం మార్చుకున్న నేపథ్యంలో తనకు ముస్లింల నుంచి ఆపద పొంచి ఉందని తెలిపింది. తమ గ్రామానికి వెళ్ళేందుకు భయంగా ఉందని.. పోలీసుల నుంచి భద్రత కల్పించమని కోరింది. కాగా, ఈ ఆరునెలల కాలంలో మందసౌర్​లో మూడు మతమార్పిడి కార్యక్రమాలు జరిగాయి. మహమ్మద్​ నిసార్ అనే యువకుడు మత మార్పిడి చేసుకుని సోనూ సింగ్​గా మారి రాణి అనే యువతిని హిందూ ఆచారాలతో వివాహం చేసుకున్నాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రేమ కోసం ఇస్లాంను వీడిన యువతి.. వేదమంత్రాలతో ఘనంగా పెళ్ళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

షాలిని ఫాతిమాగా ఎలా మారింది?
ముంబాయి: షాలిని ఫాతిమాగా ఎలా మారింది? నర్సుగా మారిన అమ్మాయి ISIS ఉగ్రవాదిగా ఎలా మారింది? సుమారు 32 వేల మంది మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి ఎలా మార్చబడ్డారు… వంటి మహిళల దీనగాథలతో తెరకెక్కుతున్న చిత్రం “ది కేరళ స్టోరీ” !!. అతి త్వరలో మనముందుకు రాబోతుంది.

शालिनी से फातिमा बनी लड़की !!

नर्स बनने वाली लड़की कैसे बन गयी ISIS की आतंकवादी !!

फ़िल्म "The Kerala Story" 32 हजार महिलाओं की कहानी लेकर आ रही है जिसे जबरन मुस्लिम बनाकर ISIS का आतंकवादी बनाया गया !! pic.twitter.com/hdFIqRx4NA

— Panchjanya (@epanchjanya) November 4, 2022

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post షాలిని ఫాతిమాగా ఎలా మారింది? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇస్లాంలోకి మారాలని హిందూ బాలిక‌ల‌పై తీవ్ర ఒత్తిడి… ఆరుగురి అరెస్టు!
ఉన్నావ్: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా మౌరన్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిందూ మైనర్ సోదరీమణులను ఇస్లాంలోకి మారాలని ముస్లిం యువ‌కులు వారిపై తీవ్ర ఒత్తిడి చేశారు. బాధితులు లచ్చి ఖేడా గ్రామానికి చెందిన వారు. వీరిని బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించ‌డంతో పోలీసులు ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. రాజ్‌వాడా స్కూల్‌లో చదువుతున్న తన ముగ్గురు కూతుళ్ళ‌ను ఆ ప్రాంతంలోని ఇస్లామిక్ వ్యక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాలికలు 11, 8, 6 తరగతులు చదువుతున్నారు. వారు దాదాపు నాలుగేళ్ళుగా లచ్చి ఖేడాలో నివసిస్తున్నారు. స్థానిక యువకులు జీషన్, గుడ్డు, అతీక్, రాజా, వారి వర్గానికి చెందిన మరికొంత‌మంది అబ్బాయిలు వీరిని నిత్యం వేధిస్తున్నారు. ఈ నెల 15న‌ మైనర్ బాలిక ట్యూషన్ నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా వేధించార‌ని ఆమె త‌ల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ), జిల్లా మేజిస్ట్రేట్(డిఎం)ని కలవకుండా తమను అడ్డుకున్నారని బాధితురాలు వెల్లడించింది.

కాగా, వీడియో ద్వారా, తనకు వివిధ నంబర్ల నుండి బెదిరింపు సందేశాలు వచ్చాయని మైనర్ ఆరోపించింది. తాము చెప్పినట్టే జీవించాలని నిందితులు తనను బెదిరించారని, తన స్వేచ్ఛా సంకల్పం ప్రకారం జీవించడానికి అనుమతించబోమని ఆమె వెల్లడించింది.

ఈ బెదిరింపు కాల్స్ చేయడమే కాకుండా, నిందితులైన యువకులు ఈ హిందూ మైనర్లను క్రమం తప్పకుండా వేధిస్తున్నారు. ముస్లిం దుస్తులు ధరించాలని, పాఠశాలకు వెళ్ళ‌డం మానేసి, మదర్సాకు వెళ్ళి చదువుకోవాలని ఒత్తిడి తెచ్చారు. తమ డిమాండ్లకు అనుగుణంగా లేకుంటే వారిని కిడ్నాప్ చేస్తామని కూడా నిందితులు బాలికలకు హెచ్చ‌రించారు.

పోలీసులు జీషన్, రాజా, అతిక్, మరో నలుగురిపై అభియోగాలు మోపారు. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత తమకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితురాలి తల్లిదండ్రులు పంచుకున్నారు. నిందితుల్లో ఒకరైన కైఫ్‌ను రక్షించే ప్రయత్నంలో హైదరాబాద్ నుంచి అలాంటి కాల్ వచ్చిందని తండ్రి చెప్పారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇస్లాంలోకి మారాలని హిందూ బాలిక‌ల‌పై తీవ్ర ఒత్తిడి… ఆరుగురి అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రైస్తవం, ఇస్లాంలో చేరిన వారిపై అధ్యయనానికి కమిషన్‌
అక్టోబర్‌ 11న సుప్రీం విచారణకు రానున్న పిటిష‌న్లు

న్యూఢిల్లీ: హిందూ మాల రిజర్వేషన్‌ ఫలాలను అనుభవిస్తూ, ఇతర మతాలు క్రైస్తవం, ఇస్లాంలను ఆచరిస్తున్న వారికి రిజర్వేషన్‌లు అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు అక్టోబర్‌ 11న సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మ‌త‌మార్పిడి అయిన వారిపై…

షెడ్యూల్డు కులాలకు చెందిన వారై ఉండి.. క్రిస్టియన్లుగా, ముస్లింలుగా మతమార్పిడి అయిన వారిపై అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సోమవారం నిర్ణయించింది. హిందూ మతం, బౌద్ధమతం, సిక్కు మతాలను ఆచరించకుండా క్రిస్టియన్లు లేదా ముస్లింలుగా మతమార్పిడి చెందిన షెడ్యూల్డ్‌ కులం లేదా దళితుల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులను అధ్యయనం చేయడానికి కేంద్రప్రభుత్వం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ కమిషన్‌పై కేంద్రం చర్చించి త్వరలో ఏర్పాటు చేయనుందని మైనార్టీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ, డిపార్టమెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రెయినింగ్‌ శాఖలు వెల్లడించాయి. ఆ శాఖల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే, కమిషన్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ప్రస్తుతం కమిటీ ప్రతిపాదనలపై హోం, లా, సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌, ఆర్థిక శాఖల మంత్రుల వద్ద చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ కులం)ఆర్డర్‌, 1950, ఆర్టికల్‌ 341 ప్రకారం, హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజంలను పాటించకుండా ఏ ఇతర మాతాల్లో ఉన్నా, వారు షెడ్యూల్డ్‌ కులం కాదని స్పష్టం చేస్తోంది.

1956లో సిక్కులను, 1990లో బౌద్ధమతాన్ని చేర్చడం జరిగింది. మతం మారిన షెడ్యూల్డ్‌ కులాలు లేదా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ల అమలు పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వడానికి మూడు వారాల సమయం ఇవ్వాల్సిందిగా, సుప్రీంకోర్టు త్రిసభ్యధర్మాసనం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌లను ఆగస్ట్‌ 30న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. దీంతో, కేసు విచారణ అక్టోబర్‌ 11కు లిస్ట్‌ అయింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క్రైస్తవం, ఇస్లాంలో చేరిన వారిపై అధ్యయనానికి కమిషన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి
‘An Agenda for Unity’ పేరుతో ప్రచురితమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీ ఇంటర్వ్యూ తెలుగు అనువాదం…..

స్వదేశ్ సింగ్ : వెయ్యి సంవత్సరాలకు పైగా అనేక దండయాత్రలను, విభజనను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశం ఇప్పటికీ తన మౌలిక ఐక్యతను, నాగరికతను, వారసత్వాన్ని నిలుపుకుంది. ఈ ఫలితానికి ఏ ఏ అంశాలు దోహదపడ్డాయని మీరు అనుకుంటున్నారు?

కృష్ణ గోపాల్ : మనం భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, ఒక సత్యాన్ని గ్రహిస్తాం. మన దేశంలోని రాజ్యాలు అనేకమంది రాజుల పాలనలో ఉన్నప్పటికీ, ప్రతి రాజ్యమూ ఈ విశాల భారతదేశంలో భాగమనే భావన, స్పృహ పాలకులలోనూ, ప్రజలలోనూ లోతుగా ఉండేది. అందుకే భారతదేశం ఐక్యంగా ఉంది. ఇది సైద్ధాంతిక, సాంస్కృతిక, తాత్విక నిర్మాణం. ఇది వేలాది సంవత్సరాలుగా ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యా కుమారి వరకు మరియు పశ్చిమాన గుజరాత్, పాకిస్తాన్ తీర ప్రాంతాల నుండి అరుణాచల్ ‌లోని పరశురామ కుండ్ వరకు విస్తరించి ఉన్న భూభాగాన్ని కలిగి ఉంది. ఇది రాజకీయ ఐక్యతకు మించిన మౌలిక ఐక్యత. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్, విలీనాన్ని ప్రోత్సహించినప్పుడు 560కి పైగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి.

స్వదేశ్ సింగ్ : మరలాంటప్పుడు మన దేశంలో “హిందూ-ముస్లిం-సిక్కు-క్రైస్తవ భాయి భాయి” వంటి నినాదాలు ఎందుకొచ్చాయి? ప్రజల మధ్య అలాంటి విభేదాలున్నాయని భావించి, వారి మధ్య సయోధ్య నిర్మించడం కోసం అలాంటి నినాదాలు సృష్టించారా?

కృష్ణ గోపాల్ : మన దేశంలో భాషాపరమైన, భౌగోళిక వైవిధ్యం దేశవ్యాప్తంగా పర్యటించే ఎవరికైనా కనిపిస్తుంది. మనం అలా చూస్తూ పోతే…. ప్రజల ఆహారపుటలవాట్లు, పండుగలు, రంగులు మారిపోతుంటాయి. కానీ ఇవి బాహ్యంగా కనిపించే వ్యత్యాసాలు మాత్రమే. కానీ మౌలికంగా, అంతర్గతంగా, దేశమంతటా ఒకే సహజమైన తాత్వికత ఉంది. భాషలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ప్రతి భాష, ప్రధానంగా ఒకే తాత్వికతను ప్రతిపాదిస్తుంది. జీవన విలువలు, భక్తి, భూమి పట్ల గౌరవం, కర్మ భావన, జన్మ – పునర్జన్మ, నిర్వాణం, మోక్షం, మొదలైన భావనలన్నీ బెంగాలీ, ఒరియా లేదా మరే ఇతర భారతీయ భాషలోనైనా ఒకే విధంగా ప్రతిధ్వనిస్తాయి. భాష ఏదైనా సరే… ప్రతిపాదించబడిన తత్త్వం మాత్రం ఒకటే కావడమే దీనికి కారణం. మీరు ప్రస్తావించిన నినాదాలన్నీ తర్వాత తెచ్చినవే. అవన్నీ రాజకీయ నినాదాలు మాత్రమే.

స్వదేశ్ సింగ్: మీరు చెబుతున్న ఈ మౌలిక ఐక్యత నేటి సమాజం నేపథ్యంలో ప్రజలకు ఎలా అర్థమవుతుంది?

కృష్ణ గోపాల్: మౌలిక ఐక్యత ఇప్పటికే ఉంది. దీన్ని అర్థం చేసుకోవటానికి, మన చుట్టూ ఉన్న వైవిధ్యాన్ని మనం దర్శించవలసి ఉంటుంది. అస్సాం, పశ్చిమ బెంగాల్ ల నుండి ప్రజలు ఉత్తర భారతదేశానికి వెళితే, వారు కృష్ణుడి పట్ల అదే భక్తిని పాటిస్తారు. కేరళలో భాష మలయాళం. కానీ భక్తి కవిత్వం మాత్రం ఒకటే. అస్సాం, బెంగాల్ కవులు, రచయితలు రాసిన నాటకాలు, వ్యాసాలు అదే భావాన్ని తెలియజేస్తాయి. ఇదే మౌలిక ఐక్యత. దీనిని మరింత లోతుగా తెలుసుకోవడానికి, ప్రజలు మరింతగా ప్రయాణించాల్సిన, అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. తమిళనాడులోని తిరువల్లువర్, పంజాబ్ ‌లోని గురునానక్ దేవ్ జీల రచనలలో సారూప్యతను మనం గమనించవచ్చు. ఇదే మౌలిక ఐక్యత.

స్వదేశ్ సింగ్: 15వ శతాబ్దంలో అస్సాంకు చెందిన గొప్ప పండిత కవి శంకరదేవుడు, ఎనిమిదో శతాబ్దంలో శారదాపీఠాన్ని స్థాపించిన కేరళకు చెందిన ఆదిశంకారుల వంటి భారతదేశం యొక్క ఈ స్ఫూర్తిని, ఐక్యతను ప్రచారం చేసిన గొప్ప జ్ఞానులు శతాబ్దాలుగా మనకు ఉన్నారు. పదహారవ శతాబ్దంలో మనకు రసఖాన్ అనే ముస్లిం ఉన్నాడు. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. అలాగే తాజ్ ‌బీబీ. ఇది సంస్కృతి యొక్క పరస్పర కలయికను మరియు సమీకరణను చూపింది. భారతదేశం సాంస్కృతిక సమ్మేళనానికి ప్రధాన కేంద్రం. అయనప్పటికీ దేశం విభజన గాయాన్ని ఎందుకు భరించవలసి వచ్చింది? ఆ సమయంలో మౌలిక ఐక్యతకు ఏమైంది?

కృష్ణ గోపాల్: మన దేశంలో ఒక నిర్దిష్ట భావజాలాన్ని వ్యాప్తి చేయడానికే సుమారు 1000 సంవత్సరాల క్రితం మన దేశంపై ఇస్లామిక్ దండయాత్రలు జరిగాయి. యుద్ధంలో గెలిచిన తర్వాత, తమ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి, స్థానిక మతంపై దాడి చెయ్యడం, మన దేవాలయాలను, మన సిద్ధాంతాలను, మన ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసే పరిస్థితి మన దేశ వాసులు జీవితంలో అంతకముందు ఎప్పుడూ అనుభవించలేదు. ఏడెనిమిది వందల సంవత్సరాల పాటు ఇస్లాం పాలనలో ఉన్నప్పటికీ, ఇస్లాం పాలనలో కూడా, తమ సిద్ధాంతాలను, సంస్కృతిని, సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి భారతదేశపు మేథావి వర్గం సుదీర్ఘ పోరాటం చేసింది. ఆ విషయంలో వారు విజయం సాధించారు కూడా. ఇస్లామిక్ ఆక్రమణకు గురైన, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, స్థానిక జనాభా దండయాత్రికుల భావజాలానికి తేలికగా లొంగిపోయింది. కానీ భారతదేశం మాత్రమే అందుకు మినహాయింపు. కాబట్టి, మొదట గుర్తించవలసిన విషయం ఏమిటంటే, భారతదేశ ప్రజలు తమ మతాన్ని, సంస్కృతిని, సిద్ధాంతాలను, సమాజాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడారు. కానీ బ్రిటీషర్లు వచ్చాక, వారు పాలించిన రెండు వందల సంవత్సరాల కాలంలో, వారు భారతదేశం యొక్క ఈ మౌలిక ఐక్యతపై తెలివిగా దాడి చేశారు. భారతదేశం యొక్క సాంస్కృతిక ఐక్యత ఇస్లామిక్ దండయాత్రల ద్వారా విచ్ఛిన్నం కాలేదు. ఎందుకంటే ఈ ఐక్యత రాజకీయమైనది కాదు. హిందూ రాజులు లేకపోయినా, ప్రజల తీర్థయాత్రలు మాత్రం కొనసాగాయి. హిందువులకు సైన్యం లేకపోయినా, దేవాలయాలు ద్వంసమైనా, ప్రజల వద్ద భగవద్గీత, రామాయణం, భారతం ఉన్నాయి. అవి హిందువుల విశ్వాసం విచ్ఛిన్నం కాకుండా కాపాడాయి. కానీ, బ్రిటీష్ వారు నెమ్మదిగా భారతీయ సమాజంలో చీలికలను సృష్టించారు. ఇది సమాజంలో లోతైన విభజనకు దారితీసింది. చివరికి దేశ విభజనకు దారితీసింది.

స్వదేశ్ సింగ్: నిజంగా హిందూ-ముస్లిం ఐక్యత గురించి మాట్లాడితే, నేడు, వారి మధ్య మత సామరస్యాన్ని, ఐక్యతను ప్రోత్సహించడం అవసరం. ఒకవేళ రెండు వర్గాలను విడివిడిగా పరిగణించినట్లయితే, ఐక్యత అనేది ఎండమావే కదా? లేకపోతే మనం కేవలం రాజకీయ ఐక్యత కోసం మాత్రమే చూస్తున్నామా?

కృష్ణగోపాల్ : సనాతన భారతీయ సమాజం చాలా బలమైన ఐక్యతా మూలాలను కలిగివుంది. భారతదేశంలో విభిన్న ఆచారాలు, ఆరాధనా పద్ధతులు, సంప్రదాయాలు కలిగిన వందలాది వివిధ రకాలు శాఖలు ఉన్నాయి. వారందరూ ఐక్యంగానే ఉన్నారు. ఈ ఐక్యతకు ఆధారమేమిటన్న దాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. ‘సర్వే భవన్తు సుఖినః’ అనే భారతదేశం యొక్క శాశ్వతమైన ఆలోచనలోనే ఈ ఐక్యత యొక్క ఆధారం ఇమిడి ఉంది. ఆ మాటల పరమార్థం ఆధారంగానే మనం అనేక విషయాలను ఆమోదించాం. కేవలం మన ఆలోచనలు, సిద్ధాంతాలతో ఏకీభవించే ఒక వర్గం ప్రజల సుఖ సంతోషాల కోసం కాదు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం చేసే ప్రార్ధన అది. ఈ తాత్వికత పాకిస్తాన్, చైనాల వంటి వివిధ ప్రపంచ దేశాల ప్రజల సుఖ సంతోషాలను కూడా కోరుకుంటుంది. విశ్వ మానవ సౌభాగ్యాన్ని కోరుకునే సిద్ధాంతమది. ‘సర్వే భవన్తు సుఖినః’ లో ఈ విధంగా సర్వవ్యాప్త ఐక్యత దాగి ఉంది. మనం దీనిని అర్థం చేసుకోవాలి. రెండవది, వేద కాలం నుండి నేటి వరకు, వేల సంవత్సరాలుగా సనాతన భారతీయ సమాజం, మరొక సూత్రాన్ని కూడా ఆమోదించింది. ఈ ఆలోచనలో ఉన్న అంతర్లీన సూత్రం ఏమిటంటే, మనం నమ్మే దానికి భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులుంటారు. ఋగ్వేదం ప్రకారం మనకంటే భిన్నమైన అభిప్రాయాలు, విశ్వాసాలు కలిగిన వ్యక్తులు కూడా మంచివారే. వేద ఋషి “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అని చెప్పాడు. అంటే అతను ప్రత్యామ్నాయ దృక్కోణానికి కూడా ఆమోద పత్రాన్ని ఇచ్చాడు. ప్రతి ఆలోచనా గొప్పదే, ప్రతి ఆలోచనా సత్యమే, దానిని తిరస్కరించకూడదని ఋషులు ఉద్బోధించారు. ఇది అనంతమైన వైవిధ్యాన్ని ఏకం చేసే మంత్రం. మరో మాటలో చెప్పాలంటే, ఇది వైవిధ్యంలో ఏకత్వం. అందువల్ల, మనకు రెండు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సర్వ మానవాళి సుఖ సంతోషాలను కోరుకోవడం, రెండవది, ఏ ఆలోచననైనా గౌరవంగా అంగీకరించే పెద్ద మనస్సు కలిగి ఉండటం. భాషలు, మాండలికాలు, వాతావరణం, ఆహారం, దుస్తులు మరియు భావజాలాల వైవిధ్యాన్ని అధిగమించి, సాధించవలసిన సామరస్యం మరియు ఐక్యత కోసం ఇది మనం తప్పనిసరిగా పాటించవలసిన సూత్రం.

స్వదేశ్ సింగ్: మీరు దారా షికోపైన, భారతీయ తత్వ శాస్త్రాన్ని, ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక మంది ఇతర ముస్లిం సాధువులపైన చాలా అధ్యయనం చేశారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు గత రెండు వందల సంవత్సరాల నాటి బ్రిటీష్ వారి కొత్త తరహా రాజకీయాల ఆవిర్భావం గురించి మాట్లాడుకుందాం. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ‌ను మత ప్రాతిపదికన విభజించింది. 1906లో ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటయింది. 1909లో, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఇచ్చారు. ఇది వారికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వడమే కాక, వారు ప్రత్యేక దేశాన్ని కోరుకోవడానికి మార్గం సుగమం చేసింది. ఇప్పుడు, ఈ ప్రజలందరూ కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో భాగమయ్యారు. గ్రామాల్లో, వారు ఇతర వర్గాల ఆచారాలు, సంప్రదాయాలను కూడా అనుసరించారు. ఆ తర్వాత, కొన్ని దశాబ్దాలలోనే దేశ విభజన జరిగింది. నేడు, ఈ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మెజారిటీ మరియు మైనారిటీ చర్చలు మతాల మధ్య దూరం పెంచాయి. ఇప్పుడు మనం ఈ సమస్యను ఎలా అధిగమించాలి?

కృష్ణ గోపాల్: బ్రిటిష్ వారు ఒక విషయం అర్థం చేసుకున్నారు. భారతదేశం ఐక్యంగా ఉంటే ఈ దేశంలో వారి పాలన త్వరగా ముగుస్తుంది. ఆ కారణంగా హిందువులు, ముస్లింల మధ్య చీలికను సృష్టించడానికి బ్రిటిష్ వారు ప్రయత్నాలు ప్రారంభించారు. ముస్లిం దండయాత్రల సమయంలో, అనేక రంగాలలో అనేక సాంస్కృతిక కలయికలు జరిగాయి. ముస్లింలు భారతీయ సంగీతంలో మునిగిపోయారు, ముస్లిం ఖవ్వాలిలు ప్రాచుర్యం పొందాయి, ముస్లింలు సమాధులను పూజించడం ప్రారంభించారు, తజియా ఊరేగింపు మొదలైన వాటిని మనం చూస్తాం. చాలా మంది ముస్లింలు హిందూ పవిత్ర గ్రంథాలను పర్షియన్ మరియు అరబిక్ భాషలకు అనువదించడం కూడా మనం చూశాం. ఇది ఐదు నుండి ఆరు వందల సంవత్సరాల పాటు కొనసాగింది. భారతదేశాన్ని నిరంతరాయంగా పాలించడానికి, ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం చాలా అవసరమని బ్రిటన్ గ్రహించింది. ఆ విధంగా ముస్లిం సమాజాన్ని విభజించి, వారిని వివిధ రకాలుగా రెచ్చగొట్టి, వారిని భారతీయ సమాజం నుంచి వేరు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బెంగాల్ ‌ను ముస్లిం బెంగాల్ ‌గా, హిందూ బెంగాల్ ‌గా విభజించేందుకు కుట్ర పన్నినట్లే బ్రిటీష్ వారు ముస్లిం లీగ్ ‌ని ఏర్పాటు చేశారు. క్రమంగా, భారతదేశంలోని ముస్లిం సమాజం తన మూలాలకు దూరం జరిగింది. దేశ విభజన ముసాయిదా సిద్ధమైంది. కానీ దేశ విభజన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోవడంతో సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయింది. “మెజారిటీ హిందూ రాజ్యంలో మైనారిటీ ముస్లింలు ఎలా సురక్షితంగా ఉండగలరు?” అని అంతకుముందు జిన్నా చెప్పేవారు. ఆ వాదం వారిలో ఇప్పటికీ అలాగే ఉంది. కాబట్టి, ఐక్యతను తీసుకురావడానికి, మనస్సు, హృదయం మరియు భావాలలో మార్పు తీసుకురావాలి. ఇది వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

స్వదేశ్ సింగ్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుండి 30 వరకు మైనారిటీల హక్కుల రక్షణకు హామీ ఇస్తున్నాయి. అయితే, భారతదేశంలో గత 75 ఏళ్లుగా రాజకీయాలు, మైనారిటీల హక్కులను పరిరక్షించడం నుండి మైనారిటీల సంతుష్టీకరణ దిశగా పయనించాయి, పరిణమించాయి. ఇది భారత ఐక్యతకు విఘాతం కలిగించిందా?

కృష్ణగోపాల్: స్వాతంత్ర్యంతో ప్రతి పౌరుడికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు చాలా విలువైన వస్తువుగా మారింది. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్లను గంపగుత్తగా సేకరించడం ప్రారంభించాయి. అలాంటి ఓట్లను పొందడానికి కొత్త పదజాలం సృష్టించాయి. అటువంటి కోవలోనిదే ‘మైనారిటీ’ అనే పదం. ఈ పదం ఐరోపా నుండి వచ్చిన విదేశీ పదం. మైనారిటీ అంటే ఆ దేశానికి చెందిన వారు కాని, ఏదో ఒక కారణంతో ఎక్కడి నుంచో వలస వచ్చిన చిన్న సమూహం అని అర్థం. ఇది ఆ దేశానికి లేదా ఆ జాతికి చెందని ప్రజలను సూచిస్తుంది. కానీ భారతదేశంలో, ముస్లిం సమాజం ఒక పెద్ద సమాజం. స్వాతంత్ర్యం తరువాత, ఇది మొత్తం భారతీయ సమాజంలో దాదాపు 12 నుండి 13 శాతం. దాని ఆధారంగానే వారిని మైనారిటీలుగా పేర్కొనకూడదు. ఈ ముస్లింలలో ఎక్కువ మంది ఇక్కడి నుండి మతం మారినవారే. కేవలం మతం మారినందున వారిని మైనారిటీలు అని ఎలా అంటారు? కానీ వారి ఓట్లను పొందడానికి, వారు ఎల్లప్పుడూ మిగతా సనాజం నుంచి విడిగా ఉండేలా చూసుకోవడానికి వారికి ఏదో ఒక పేరు పెట్టబడింది. బ్రిటీష్ వారి నిష్క్రమణతో ఆ అధ్యాయం ముగియవలసినది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. అనవసరంగా మెజారిటీ – మైనారిటీ భావన సృష్టించబడింది. మనం ఇప్పుడు దాని దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నాము.

స్వదేశ్ సింగ్: ఐక్యతా సాధనకు ఇప్పుడు ఎంత ప్రయత్నం అవసరం?

కృష్ణ గోపాల్: భారతదేశం పౌరసత్వాన్ని ఇస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రతి వ్యక్తికి అన్ని హక్కులనూ అందిస్తుంది. కానీ జాతీయత పొందాలంటే మాత్రం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. పౌరసత్వం మీకు రాజ్యాంగపరంగా కొన్ని హక్కులను ఇస్తుంది. జాతీయత మీ విధులను నిర్ణయిస్తుంది. మీరు ఈ జాతీయులైన వెంటనే, మీరు వేల సంవత్సరాల ఈ సంస్కృతీ సంప్రదాయాల ద్వారా ఈ దేశంతో అనుసంధానింపబడతారు. ఈ దేశం యొక్క సుఖదుఃఖాలను, జయాపజయాలను మీవిగా భావిస్తారు. ఈ దేశం యొక్క చరిత్ర, భౌగోళికతను మీదిగా భావిస్తారు. జాతీయత కాబట్టి అందరికీ సమానంగా ఉండాలి. జాతికి సుఖ దుఃఖాలు, శత్రుమిత్ర భావనలు ఒక్కటే. పౌరులందరూ ఈ జాతీయవాద భావాన్ని అలవరచుకోవాలి. ఉదాహరణకు, మన మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశం కోసం వివిధ క్షిపణులను అభివృద్ధి చేశారు. వాటికి ఆకాష్, నాగ్, త్రిశూల్ మొదలైన పేర్లను పెట్టారు. ఈ పేర్లు జాతీయవాద భావానికి ప్రతీకలు. మన ముస్లిం సోదరులు, సోదరీమణులు తమను తాము ఈ దేశ చరిత్రతో ముడిపెట్టాలి తప్ప దేవాలయాలను ధ్వంసం చేసిన, ప్రజలను హింసించిన, జిజియా పన్ను విధించి, ప్రజలను బాధించిన, ఆక్రమణదారుల చరిత్రతో కాదు. వారు ఆక్రమణదారులతో తమను తాము అనుసంధానించుకున్నట్లయితే, వారిని ఈ జాతీయులుగా ఎలా పిలవగలం?

స్వదేశ్ సింగ్: భారతదేశంలో గత 75 ఏళ్లుగా మత సామరస్యంపై చర్చ, సెక్యులరిజంపై కేంద్రీకృతమై ఉంది. హిందూ సమాజం దాని స్వభావ రీత్యా లౌకికమైనది. కానీ లౌకికవాదం యొక్క అభ్యాసం రాజకీయాలలో మరియు కొన్ని వర్గాలలో ఏకరీతిగా లేదు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం రాబోయే 25 సంవత్సరాల పాటు ముందుకు సాగాల్సిన ‘అమృత కాలం’ గురించి మాట్లాడారు. మనం సుసంపన్నమైన, సమర్థమైన భారత్ ‌ను ఊహించుకుంటాం. అయితే ఇప్పుడు మనం మత సామరస్యం గురించి ఎలా చర్చించాలి? దాని రూపం ఎలా ఉండాలి? మరి దాన్ని సమాజం ఎలా ముందుకు తీసుకెళ్లాలి?

కృష్ణగోపాల్: ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంది. మొదటిది మైనారిటీలకు ఆర్థిక మరియు ఇతర సహాయాలను అందించడం. ఇది వారి సంక్షేమం పేరుతో జరుగుతోంది. కానీ అది ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వదు. ఉదాహరణకు, మైనారిటీ వర్గాల పిల్లలకు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ‌లు ఇస్తారు. పేద పిల్లలకే ఇస్తారు. అయితే, ఉదాహరణకు 40 మంది పిల్లలున్న ఒక తరగతిలో, మైనారిటీ వర్గాల నుండి ఐదుగురు పేదలు ఉన్నారని, వారికి స్కాలర్‌షిప్ ఇస్తున్నారని అనుకుందాం. కానీ ఆ తరగతిలో మరో 10 మంది పిల్లలు కూడా పేదలు ఉన్నారు. కానీ వారు మైనారిటీ వర్గానికి చెందినవారు కానందున వారికి స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. ఇది వారిలో అసమ్మతిని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ పది మంది పిల్లల మనస్సులలో, ప్రశ్న తలెత్తుతుంది : మా ఇంటి పరిస్థితి వారి కంటే అధ్వాన్నంగా ఉన్నప్పుడు మాకు ఎందుకు సహాయం చేయడంలేదు? ఇటువంటి ఏకపక్ష సహాయం సమాజంలో సామరస్యానికి బదులుగా వ్యత్యాసాలను సృష్టిస్తుంది. కాబట్టి, విభజన ప్రాతిపదికన కాకుండా ఆర్థిక మరియు ఇతర సహాయాలు అందరికీ ఒకే విధంగా అందించబడాలి. ఇటీవల ప్రభుత్వం, మతంతో సంబంధం లేకుండా అన్ని పేద కుటుంబాలకూ మరుగుదొడ్లు, వంటగ్యాస్ ‌ను అందించింది. సహాయం అవసరమైన వారికి అందించాలి. మైనారిటీ కమ్యూనిటీలో ఎక్కువ పేదరికం ఉంటే, సహజంగానే వారిలో ఎక్కువమంది సహాయం పొందుతారు. బ్యాంకు అవసరం ఉన్న చోట బ్యాంకులు తెరవాలి. అవసరమైన కళాకారులకు శిక్షణ ఇవ్వాలి. ఈ దేశం మనది-ఇప్పటివరకు జరిగినట్లుగా మైనారిటీ – మెజారిటీ విభజన ఇకమీదట ఉండకూడదు. మనం పౌరులందరినీ ఒకే దృష్టితో చూడాలి తప్ప మత దృష్టితో కాదు. ఇది రాజ్యాంగ పరిషత్ ‌లో చెప్పబడింది. కానీ అమలు కావడంలేదు. రాజ్యాంగ పరిషత్ ‌లో ఉన్న వ్యక్తులకు, మన రాజ్యాంగ నిర్మాతలకు ఈ దృష్టి ఉంది. మొత్తం సమాజాన్ని ఒక్కటిగా చూడటం ద్వారా సమగ్ర వికాసం సాధ్యమయ్యే ఈ దృక్పథాన్ని మనం గ్రహించాలి. పేదరికాన్ని అంతం చేయడానికి, మనం మొత్తం సమాజంలోని పేదలందరినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక నిర్దిష్ట మత సమూహాన్ని మాత్రమే కాదు.

స్వదేశ్ సింగ్: గత 50 సంవత్సరాలుగా, మీ పని మొత్తం సమాజ కేంద్రంగా సాగింది కదా? మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, సమానత్వ సాధనకు కూడా చాలా కృషి జరిగింది. నేను ఇప్పుడు సోదరభావం (సౌభ్రాతృత్వం) సమస్యను తీసుకుంటాను. ఒక సమాజంగా భారతదేశం ఈ దిశలో ఎలా పయనించాలి?

కృష్ణగోపాల్: రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, సమాన స్వేచ్ఛను ఇచ్చింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, చదువుకోవచ్చు, న్యాయం పొందవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, భూములు కొనవచ్చు, ఓటు వేయవచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు- ఇది ప్రతి ఒక్కరి హక్కు. రాజ్యాంగం లాగే న్యాయస్థానాలు కూడా అందరికీ ఒకే విధంగా ఉంటాయి. అయితే ఇది స్వతహాగా సౌభ్రాతృత్వానికి దారితీయదు. రాజ్యాంగం హక్కులు ఇవ్వగలదు. కానీ రాజ్యాంగం ఆలోచనలో మార్పు తీసుకురాదు. అందుకు ఇంకేదో చేయాలి. గత 700 నుండి 900 సంవత్సరాల చరిత్ర కూడా ప్రజల మనస్సులలో కొన్ని జ్ఞాపకాలను లోతుగా నాటుకుపోయేలా చేసిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆక్రమణదారులను రోల్ మోడల్స్ ‌గా పరిగణించలేము. కాబట్టి ఈ రకమైన ఆలోచనా విధానంలో మార్పు అవసరం. మన దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని, జిజియా పన్ను విధించి, ప్రజలపై దౌర్జన్యం చేసి, క్రూరంగా ప్రవర్తించిన వారిని, కొందరు నాయకులుగా భావిస్తే, మిగిలిన సమాజం వారిని ఆక్రమణదారులతో కలుపుతుంది. సోదరభావం ఏర్పడదు. అలాంటప్పుడు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, భారతదేశంలో నివసిస్తున్న ప్రజలను ఈ దేశ వినాశన చరిత్రను వ్రాసిన వ్యక్తుల నుండి వేరు చేయాలి. రెండవది, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రపంచంలో ఎన్ని విశ్వాసాలు, మతాలు, వర్గాలైనా ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ గౌరవం అనే భావన భారతదేశం యొక్క ‘సనాతన’ భావజాలం. భారతీయుడిగా ఉండటం అంటే, ప్రపంచంలోని ప్రతి విశ్వాసాన్ని, మతాన్ని గౌరవించడం, ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలను కోరుకోవడం. ఈ రెండు గుణాలు భారతీయుడిగా ఉండటాన్ని నిర్వచించాయి. ఈ రెండు పరిస్థితులు వచ్చే వరకు మనం వేచి చూడాలి. అయితే ఇది ఎలా జరుగుతుందో సమాధానం చెప్పడం కష్టం. భారతీయ సంప్రదాయంలో అందరి అభిప్రాయాలను గౌరవించడం పెద్ద షరతు. అందరి సుఖ సంతోషాలను ఆకాంక్షించటం రెండవ పెద్ద పరిస్థితి. ఒక భారతీయుడు విదేశాలకు వెళ్ళినప్పుడు, అతను ఈ రెండు ఆలోచనలను తనతో తీసుకువెళతాడు. ఆ దేశంలోని ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తాడు. అది యునైటెడ్ స్టేట్స్, కెనడా, UK, జర్మనీ లేదా ప్రపంచంలోని మరే ఇతర భాగమైనా సరే అక్కడి ప్రజల సుఖ సంతోషాలను కోరుకుంటాడు. తన ప్రార్థనలో, అతను ఎల్లప్పుడూ ‘సర్వే భవన్తు సుఖినః’ అని చెబుతాడు. ఈ రెండు విషయాలూ ప్రజలందరికీ వస్తే, అప్పుడు సోదర భావాన్ని తీసుకురావడం సులభం అవుతుంది. మనం వందల సంవత్సరాలుగా కల్లోలం, పోరాటాలు, ఒడిదుడుకులు మరియు బాధలను అనుభవించాం. కానీ ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం అంటే…. తన ప్రాచీన మహిమాన్వితమైన రూపాన్ని స్మరించుకుంటూ, తన తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే ఆ తాత్వికత వెలుగులో ముందుకు సాగడం. చాలా సార్లు, ఈ వైవిధ్యం వందలాది రకాల చెక్కల కట్ట రూపంలో, తాడుతో ముడిపడి ఉంటుంది. ఇది నిజం, కానీ ఇది సగం నిజం మాత్రమే. మనం దానిని చెట్టు పరంగా అర్థం చేసుకుందాం, ఆ చెట్టు తన చుట్టూ విస్తరించే బహుళ శాఖలను కలిగి ఉంటుంది. ఆ శాఖలన్నిటి మూలం ఒక్కటే. భారతదేశం యొక్క వైవిధ్యం ఈ చెట్టు యొక్క ఒక శాఖ నుండి మరొక శాఖకు విస్తృతంగా విస్తరించింది. ఏకత్వం మూలంలో ఉంది, వైవిధ్యం శాఖలలో మాత్రమే కనిపిస్తుంది. ఆ వైవిధ్యంలో వైరుధ్యాలు తలెత్తవచ్చు, అయితే మౌలిక ఏకత్వం దర్శనమైతే ఈ పోరాటాలు, విభేదాలు ఆగిపోతాయి. ఇది భారతదేశపు మౌలిక తత్త్వం. అనేకతలో ఏకత్వాన్ని దర్శింపజేసే, అన్ని రకాల వివక్షలు, అసూయ, సంఘర్షణలను అంతం చేసే శక్తి ఈ ఏకాత్మ దర్శనానికి ఉంది. ఈ ఐక్యతలో గొప్ప శక్తి ఉంది. ఈ ఐక్యతా దృష్టి అన్ని వివాదాలనూ అణచివేయగలదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఐక్యతా వ్యూహం : RSS సహ సర్ కార్యవాహ శ్రీ కృష్ణగోపాల్ జీతో ముఖాముఖి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం
ఢాకా: ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుకు నిర‌స‌న‌గా బంగ్లాదేశ్‌లోని ఒక హిందూ ఆల‌యం, దుకాణాలు, కొన్ని ఇళ్ళ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఈ పోస్టు ఉందంటూ ఆందోళ‌న‌లు సాగాయ‌ని మీడియా నివేదిక‌లు వెల్ల‌డించారు. శుక్ర‌వారం సాయంత్రం న‌రైల్ జిల్లాలోని స‌హ‌ప‌రా గ్రామంలో ఇళ్ళ‌ను ధ్వంసం చేసిన గుంపును చెద‌ర‌గొట్ట‌డానికి పోలీసులు కాల్పులు జ‌రిపార‌ని స్థానిక పోలీస్ స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌ర‌న్ చంద్ర‌పాల్‌ను ఉటంకిస్తూ స్థానిక ప‌త్రిక తెలిపింది. ఒక యువ‌కుడు ఫేస్‌బుక్‌లో అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్టు పెట్టాడ‌ని, ఆయ‌న కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు వివ‌రించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బంగ్లాదేశ్‌లో హిందూ ఆల‌యం ధ్వంసం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.!
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో అనాథను బలవంతంగా ఇస్లాంలోకి మార్చినందుకు, సున్తీ చేయించినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. తొమ్మిదేళ్ళ బాలుడిపై శారీరకంగా దాడి చేసి, హింసించి ముస్లిం దంపతులకు అమ్మేశారు.

అనాథ‌ను దత్తత తీసుకున్న దంపతులు దుర్భాషలాడి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని ఆరోపిస్తూ ఓ ట్విట్టర్ యూజర్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని బలవంతంగా సున్తీ చేయించి, ఉర్దూ నేర్చుకునేందుకు మరో ముస్లిం వ్యక్తికి అప్పగించినట్టు గుర్తించారు.

ట్విట్టర్ వినియోగదారులు చర్య కోరుతూ వీడియోకు ట్యాగ్ చేయడంతో ఘజియాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. బాలుడి పేరును పోలీసులు తెలుసుకున్నారు. అతను బీహార్‌లోని ఔరంగాబాద్‌లోని రఫీగంజ్‌లో నివసించేవాడని దర్యాప్తులో తేలింది. అతని తల్లి రైలు ప్రమాదంలో మరణించింది. తండ్రి అతనిని విడిచిపెట్టాడు. దీంతో బాలుడు కొన్ని నెలల తర్వాత ఇంటిని విడిచిపెట్టాడు. ఈ స్థితిలో బాలుడి తల్లి స్నేహితురాలు తీసుకువెళ్ళింది. బాలుడు ఆమె ఇంట్లో పెరిగాడు. అయితే, అక్క‌డ రోజూ వేధింపుల‌కు గురయ్యాడు.

ఈ క్రమంలోనే బాలుడిని విక్రయించేందుకు మధ్యవర్తి జుల్ఫికర్ ద్వారా ఉమర్ మహ్మద్, బాబ్లీ అనే మరో దంపతులతో దంపతులు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రూ.50 స్టాంపు పేపర్‌పై సంతకాలు చేశారు. తరువాత జుల్ఫికర్ తీసుకువెళ్ళిపోయాడు. అతను బాలుడికి సున్తీ చేయించి, అతనికి ఉర్దూ నేర్పించి ఇస్లాంలోకి మార్చాడు. బాలుడు ఘజియాబాద్‌కు వచ్చి తన తల్లికి పరిచయమైన రాజేష్ కుమార్‌ను కలిసినప్పుడు జుల్ఫికర్ బారి నుండి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా, మొత్తం అయిదుగురు నిందితుల్లో ఇద్ద‌రు ప‌రార్‌లో ఉన్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 9 ఏళ్ళ అనాథను వేధించి, ఇస్లాంలోకి మార్చారు.! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాలుడిపై మ‌ద‌ర్సా మ‌త పెద్ద‌ల అఘాయిత్యం, పోక్సో కింద కేసు!
గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ‌ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చ‌ట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

గోమతీపూర్‌లో నివసించే ఒక దినసరి కూలీ తన ఆరుగురు పిల్లల్లో 13 ఏళ్ళ పెద్దవాడిని 29 మే 2022న తనకు సమీపంలోని బాపునగర్‌లోని మదానీ మదర్సాకు వేసవి సెలవుల్లో మతపరమైన అధ్యయనం కోసం పంపించాడు. 30 మే 2022న, పిల్లవాడు ఇంటికి వచ్చి మదర్సాలోని ఇద్దరు మతపెద్దలు తనపై చేసిన అమానవీయ చర్య గురించి చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు.

పిల్లవాడు చెప్పిన ప్రకారం, మ‌ద‌ర్సాలో దాడికి గుర‌య్యాడు. ఇద్దరు మతపెద్దలు క్రూరమైన సోడోమైజేషన్ కారణంగా అతని శరీరంపై కొట్టిన గుర్తులు. అంగ భాగాలలో గాయాలు ఉన్నాయి.

పెద్దవాడు 13 ఏళ్ళ వయస్సు గల ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడని చిన్నారి తండ్రి తెలిపాడు. ప్రస్తుతం పాఠశాలకు వేసవి సెలవులు కావ‌డంతో, అతను తన మతం ఆచారాల ప్రకారం ఇస్లాంను అభ్యసించడానికి కొడుకును మే 29వ తేదీ ఉదయం బాపునగర్‌లోని సుందరంనగర్‌లోని మదీనా మదర్సాకు మదర్సాకు పంపాడు.

మరుసటి రోజు, అంటే మే 30 న, అతను తెల్లవారుజామున మూడు గంటలకు పని నుండి ఇంటికి వచ్చినప్పుడు, తన కొడుకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తెల్ల‌వారి ఉద‌యం … ఇంటికి ఎందుకు వచ్చావని కొడుకును ప్రశ్నించగా.. తనకు జరిగిన అమానవీయ ఘటనను చెప్పాడు. 29న కుటుంబసభ్యులు తనను మదర్సా వద్ద వదిలి వెళ్లడంతో సాయంత్రం వరకు అంతా సవ్యంగానే జరిగిందని కొడుకు చెప్పాడు. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో మదానీ మదర్సా ప్రధాన మతపెద్ద, మరో మతపెద్ద ఆయన వద్దకు వచ్చారు. ప్రధాన మతగురువు, కారణం లేకుండా, బాలుడి కుడి చీలమండ వెనుక చెక్క కర్రతో ఏడుసార్లు తీవ్రంగా కొట్టాడు. మ‌రో మతాధికారి అతని ఎడమ చేతిని పట్టుకుని భుజం వైపు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ వేసిన అయిదు నిమిషాలకే బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు.

30-35 నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు, తనకు మలద్వారంలో విపరీతమైన నొప్పి వస్తోందని పిల్లవాడు తన తండ్రికి చెప్పాడు. దాంతో అతడు భయపడి మదర్సా నుంచి తప్పించుకునే క్రమంలో మదర్సాకు చెందిన ముగ్గురు వ్యక్తులు బాలుడిని పట్టుకునేందుకు వెంబడించారు. వారిని తప్పించుకునేందుకు రాజేంద్ర పార్కు సమీపంలోని ఓ హోటల్‌లో తలదాచుకున్నాడు. అక్కడ కాసేపు తలదాచుకుని హోటల్ నుంచి బయలుదేరిన బైక్‌పై లిఫ్ట్ తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు.

దీంతో బాధితురాలి తండ్రి బాపునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీఫ్ మౌల్వీ (మత గురువు), మరో మౌల్వీ తన కుమారుడితో అసహజ సంభోగానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాలుడిపై మ‌ద‌ర్సా మ‌త పెద్ద‌ల అఘాయిత్యం, పోక్సో కింద కేసు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిజంగా అందరూ ఒక్కటేనా?
నా చిన్నతనం నుంచి చూస్తున్నా…. “మా దేవుడొక్కడే దేవుడు” మిగిలిన వాళ్ళు సైతాన్ లు. మా దేవుడ్ని నమ్మనివాళ్ళు కాఫిర్లు. వాళ్ళని చంపినా తప్పులేదు. గొంతు మీద కత్తి పెట్టయినా వారిని మతం మార్చాలి. మతం కోసం క్రూసేడులు చెయ్యాలి.” అని బోధించేవారికి బోధించాల్సిన సూక్తులు పిల్లిలో, బల్లిలో, చెట్టులో, పుట్టలో, రాయిలో, రప్పలో సృష్టిలోని అణువణువులో భగవంతుడున్నాడని విశ్వసించే మాకు బోధిస్తారెంటీ? దురదృష్టవశాత్తూ ఇలాంటి బోధనలకు లొంగి గోమాతను పూజించే అమాయక హిందూ యువతులు గోమాంసం భక్షించే సంకుచిత మతావలంబకులను వివాహం చేసుకుని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు. “నీవే సర్వాంతర్యామివి. నీలో ఉన్న ఆత్మే సృష్టి అంతా ఆవరించి ఉంది. అన్నీ నీవే. అంతటా నీవే. పాప చింతనను వీడి పుణ్య కార్యాలను ఆచరించి యోగ సాధన చేస్తే ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు.” అనే విశాల తత్వం కలిగిన మతంలోంచి…. “మీరు పాపులు. నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని పాపాల నుంచి రక్షిస్తాను. నేను పాపులను రక్షించటానికే అవతరించాను. నన్ను కాక మీరు వేరెవరినైనా విశ్వసిస్తే నేను మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను.” వగైరాలను బోధించే మతంలోకి వెళుతున్నారు అమాయకంగా.

మన పిచ్చి కాకపోతే… అసలు ఇలా పరస్పర భిన్నమైన తత్వాలు కలిగిన మతాలు, వాటి దేవీదేవతలు ఒకటెలా అవుతాయి? గోవును తల్లిగా భావించి పూజించేవారు, గోహంతకులు ఒక్టేక ఎలా అవుతారు? “నేను దేవుడ్ని, నువ్వు పాపివి’ అని చెప్పేవాడు, “నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. నీలోనూ ఉన్నాను. తరచి చూసుకుంటే నువ్వే నేను. నేనే నువ్వు. అంతటా నువ్వే ఉన్నావు. నీవు అమృతపుత్రుడవు. అనంత శక్తి సంపన్నుడవు.” అని చెప్పేవాడు ఇద్దరూ ఒకటేనా? మనం ట్రాప్లో పడిపోతున్నాం. కఠినంగా అనిపించినా ఇదే నిజం. దేవుళ్ళందరూ ఒక్కటే అంటూ వారు చెప్పేదే నిజమైతే వారిని మత మార్పిడులు ఆపేయమనండి. దేవాలయ విధ్వంసాలను, దాడులను, హింసని, హత్యలనూ ఆపేయమనండి. అందరిలోనూ, అన్నిటిలోనూ దైవాన్ని దర్శించే సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించమనండి. మరీ ముఖ్యంగా మత ఛాందసులకు, పరమత ద్వేషులకు, విధ్వంసకులకు, హంతకులకు, ఉగ్రవాదులకు ఈ సూక్తులు బోధించమని ఈ సిద్ధాంతకర్తలకి చెప్పండి. బంగ్లాదేశ్ లో పిలిచి భోజనం పెడితే, ప్లాన్ చేసి దేవాలయాన్ని కూల్చేశారు చూడండి…. వారికి చెప్పమనండి. అమ్మమ్మ, అమ్మ, అమ్మాయిలను బహిరంగంగా, సామూహికంగా మానభంగం చేసి చంపేశారు చూడండి… ఆ మతోన్మాదులకు చెప్పమనండి. చీమలకు చక్కెర, పాములకు పాలు పోసే కారుణ్యమూర్తులకు, సాత్వికులకూ ఈ సూక్తి ముక్తావళి అవసరం లేదని, మమ్మల్ని ఇంకా దద్దమ్మల్ని చెయ్యొద్దనీ ఆ పెద్దమ్మలకి చెప్పండి. శుభం.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిజంగా అందరూ ఒక్కటేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.