MONOLITHIC IN NETHERLANDS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రత్యక్షమవుతూ….. మాయమవుతూ…… అంతు చిక్కని వింత స్తంభం
నిర్జన ప్రదేశాల్లో ప్రత్యక్షమై.. ఆ తర్వాత కొద్దిరోజులకే మాయమవుతూ పరిశోధకులను పరుగులు పెట్టిస్తున్న ఏకశిల ఈ సారి నెదర్లాండ్స్‌లో ప్రత్యక్షమైంది. ఉత్తర ఫ్రైస్‌ల్యాండ్ ప్రావిన్స్‌లోని కీకెన్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ సమీపంలో హైకర్లు ఓ ఏకశిలను కనుగొన్నారు. ఈ విషయాన్ని డచ్ ఫారెస్ట్రీ కమిషన్ ప్రతినిధి ఇమ్కే బోర్మా ఏఎఫ్‌పీ అనే న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. ఓ ప్రైవేటు భూమిలో దానిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆదివారానికి ముందు అక్కడ ఎటువంటి నిర్మాణం లేదన్నారు. ఆదివారం రోజు ఆ వింత నిర్మాణాన్ని కొందరు గుర్తించినట్లు ఇమ్కే బోర్మా పేర్కొన్నారు. కానీ, దాన్ని ఎవరు, ఎందుకు పాతిపెట్టారో తెలియడంలేదన్నారు. ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత నవంబర్‌ 18న అమెరికాలోని యుటాలో ఓ ఏకశిల దర్శనమిచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అక్కడి రెడ్‌ రాక్‌ ఎడారిలో వన్యప్రాణి సిబ్బంది ఓ వింత స్తంభాన్ని గుర్తించారు. అయితే, జన సంచారం లేని ఎడారిలో ఆ వింత స్తంభాన్ని ఎవరు పాతిపెట్టారో అధికారులకు అంతుచిక్కలేదు. కొద్దిరోజుల అనంతరం అది అకస్మాత్తుగా మాయమైపోయింది. తర్వాత 24 గంటలు గడవకముందే రొమానియాలో అదే తరహా స్తంభాన్ని కొందరు గుర్తించారు. పరిశోధకులు దానిపై పరిశోధనలు చేస్తుండగానే అది కనిపించకుండాపోయింది. దాన్ని ఎవరో తవ్వి తీసుకెళ్లిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. అది మాయమైన కొద్దిరోజులకే బ్రిటన్‌లో ప్రత్యక్షమైంది. మళ్లీ అక్కడ నుంచి కూడా మాయమైంది. ప్రస్తుతం అదే తరహా ఏకశిల నెదర్లాండ్స్‌లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఆ వింత ఆకారంపై అధికారులు, పరిశోధకులు దృష్టి సారించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రత్యక్షమవుతూ….. మాయమవుతూ…… అంతు చిక్కని వింత స్తంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.