#Lokmanthan2026 #Jaipur #JawaharKalaKendra #JNandakumar #DiyaKumari #IndianCulture – Vishwa Samvad Kendra Andhra Pradesh

జైపూర్‌లో డిసెంబర్ 4 నుంచి ‘లోక్ మంథన్ ’ ఐదో ఎడిషన్
భారతీయ జ్ఞాన పరంపర, జానపద సంస్కృతి, లోక జీవనాన్ని జాతీయ స్థాయి చర్చల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించే ‘లోక్‌మంథన్ (Lokmanthan) ఐదో ఎడిషన్‌కు జైపూర్ వేదిక కానుంది. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జైపూర్‌లోని జవహర్ కళా కేంద్రంలో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారత కన్వీనర్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జె. నందకుమార్, రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి ఈ వివరాలను వెల్లడించారు.

ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, అయోధ్య శ్రీ హనుమత్ నివాస్ పీఠాధిపతి ఆచార్య మిథిలేశానందినీ శరణ్, ఆర్ఎస్ఎస్ సహ సర్‌కార్యవాహ అరుణ్ కుమార్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గిరిజన కమిషన్ మాజీ ఛైర్మన్ హర్ష్ చౌహాన్ తదితర ప్రముఖులు వక్తలుగా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,000 మందికి పైగా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కానున్నారు.

24 సమాంతర సదస్సులు – అంతర్జాతీయ ప్రాతినిధ్యం

2016లో భోపాల్‌లో మొదలైన లోక్‌మంథన్ ప్రయాణం రాంచీ, గువాహటి, భాగ్యనగర్ (హైదరాబాద్) మీదుగా ఇప్పుడు జైపూర్ చేరుకుందని జె. నందకుమార్ తెలిపారు. కేవలం గ్రామీణ, గిరిజన అంశాలే కాకుండా, దేశ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును అనుసంధానించే మౌలిక భారతీయ సంస్కృతే ‘లోక్’ అని ఆయన అభివర్ణించారు. ఈ సదస్సులో జానపద విద్య, ఆరోగ్యం, విజ్ఞానం, కళలు, భారతీయ క్రీడా దృక్పథం, సంప్రదాయ వాతావరణ అంచనాలు వంటి అంశాలపై 24 సమాంతర సదస్సులు జరగనున్నాయి. ఇందులో క్షేత్రస్థాయి నిపుణులతో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు నేరుగా సంభాషిస్తారు. వీటితో పాటు రోమా (Roma), యజీదీ (Yazidi), లాట్వియా వంటి విదేశీ ప్రాచీన సాంస్కృతిక సమాజాల ప్రతినిధులు కూడా ఈ వేదికపై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

యువతను మూలాలతో అనుసంధానించే వేదిక: దియా కుమారి

లోక్‌మంథన్కు ఆతిథ్యం ఇవ్వడం రాజస్థాన్‌కు గర్వకారణమని ఉపముఖ్యమంత్రి దియా కుమారి పేర్కొన్నారు. ‘మనం భారతీయులం’ (We the People of Bharat) అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సు, పాశ్చాత్య ప్రభావంలో ఉన్న నేటి యువతరాన్ని తిరిగి మన సాంస్కృతిక మూలాలతో అనుసంధానిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమ సందేశాన్ని మారుమూల గ్రామాలకు చేరవేసేందుకు రాష్ట్రంలోని 41 జిల్లాల్లో 8,000 కిలోమీటర్ల మేర మూడు దశల్లో ‘లోక్‌దర్శన్ యాత్ర’ నిర్వహించామని, దీని ద్వారా స్థానిక కళాకారులకు, మహిళలకు, యువతకు వేదిక కల్పించామని తెలిపారు. “లోకం నుంచి లోక చైతన్యం, లోక చైతన్యం నుంచి లోక శక్తి, ఆ శక్తి నుంచి రాష్ట్ర శక్తి” అనే మంత్రాన్ని సాకారం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.

The post జైపూర్‌లో డిసెంబర్ 4 నుంచి ‘లోక్ మంథన్ ’ ఐదో ఎడిషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.