WUHAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్
వుహాన్‌: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వుహాన్‌ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకు ఉంటాయని, పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పుట్టిన వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వూహాన్ ల్యాబే కరోనా జన్మస్థానం – అమెరికన్ రిపబ్లికన్లు
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టినట్లు రుజువైందని అమెరికాకు చెందిన రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా నిఘా సంస్థలు మాత్రం ఇంకా తుది అభిప్రాయానికి రాలేదు. వుహాన్ ల్యాబ్‌పై వస్తున్న ఆరోపణలను చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది.

కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లోనే ఆవిర్భవించిందనే ఆరోపణలకు బలం చేకూరేలా మరో నివేదిక బయటకు వచ్చింది. చైనా పరిశోధన కేంద్రం నుంచే ఈ మహమ్మారి పుట్టినట్లు అమెరికాలోని రిపబ్లికన్‌ ప్రతినిధి మైకేల్‌ మెక్‌కాల్‌ ఆరోపించారు. కరోనా వైరస్‌ మానవులకు సోకేలా వుహాన్ ల్యాబ్‌లో జన్యుపరమైన మార్పులు చేశారని, ఆ సంగతిని చైనా దాచిపెట్టిందని ఆరోపించారు. ఇందుకు తగిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వుహాన్‌ ల్యాబ్‌ వద్ద పటిష్ఠమైన భద్రతా చర్యలు లేవని, ప్రమాదకర వ్యర్థ్యాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసే వ్యవస్థ కూడా సరిగా లేదని పేర్కొన్నారు.

కోవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మంది మరణించారంటూ మెక్‌కాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సీ ఫుడ్ మార్కెట్‌ ద్వారా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందనే ఓ వాదనను కూడా రిపబ్లికన్లు విడుదల చేసిన నివేదిక ఖండించింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్‌ లీకయ్యిందని.. అది కూడా 2019 సెప్టెంబర్‌ 12వ తేదీకి ముందే జరిగిందని వెల్లడించింది.

కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు ముమ్మరం చేసి 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని.. అమెరికా నిఘా సంస్థలకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకిందా.. లేదంటే వుహాన్‌ ల్యాబ్ నుంచి లీకయ్యిందా అనే దానిపై అమెరికా నిఘా సంస్థలు ఇంకా ఓ తుది అభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్లు బయటపెట్టిన తాజా నివేదిక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాక్స్‌, గబ్బిలాల్లోని వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను ఎవరితో పంచుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వూహాన్ ల్యాబే కరోనా జన్మస్థానం – అమెరికన్ రిపబ్లికన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO
కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ”కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం” అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. వూహాన్‌ ల్యాబ్‌నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని పలు దేశాలు, పరిశోధనలు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ చైనా వాటిని కొట్టిపారేస్తోంది. అసలు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ క్లిప్‌లు కూడా బయటపెట్టడం లేదు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. ‘పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పనిచేయవచ్చు’ అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.

మరోవైపు చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్‌ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయా అంశాలపై మరింత లోతుగా పరిశోధించాలంటే చైనా సహకారం పూర్తిగా ఉండాలి. కానీ, డ్రాగన్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా
ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ.. చైనా కుటిల యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు.

డజనుకుపైగా తొలగింపు..

కరోనా వైరస్‌ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన కరోనావైరస్‌ టెస్ట్‌ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్‌ జెస్సీ బ్లూమ్‌ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లోని సీక్వెన్స్‌ రీడ్‌ ఆర్కైవ్స్‌(SRA) నుంచి వాటిని తొలగిస్తున్నట్లు జెస్సీ బ్లూమ్‌ పేర్కొన్నారు. తొలగించిన వాటిలో ఎక్కువగా వైరస్‌ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే ఉందన్నారు.

కొవిడ్‌ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు జెస్సీ బ్లూమ్‌ తెలిపారు. ఇలా తొలగించడానికి సాంకేతిక కారణాలేమీ కనిపించలేదని.. కేవలం వైరస్‌ పరిణామక్రమంపై అస్పష్టత నెలకొల్పేందుకే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామని స్పష్టం చేశారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని జెస్సీ బ్లూమ్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

మరోసారి దర్యాప్తునకు WHO సిద్ధం..

కొవిడ్‌ మూలాలపై ఇప్పటికే ఓసారి దర్యాప్తు జరిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. వైరస్‌ ఆనవాళ్లపై స్పష్టత ఇవ్వలేదు. వుహాన్‌ ల్యాబ్‌నుంచి లీకయ్యే అవకాశాలు లేవన్న WHO, జంతువుల నుంచి మానవులకు సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే, కొవిడ్‌ మూలాలపై WHO అస్పష్ట నివేదికపై అంతర్జాతీయ నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా చైనాలో పర్యటించి మరోసారి పూర్తి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయ్యిందని చెప్పేందుకు ఆధారాలున్నాయని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా ల్యాబ్‌నుంచి లీక్‌ అయ్యిందనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మూలాలపై మరోసారి దర్యాప్తు చేసేందుకు WHO సన్నద్ధమవుతోంది. ఇందుకు చైనా సహకరించకపోతే అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరి కావాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులీవాన్‌ ఇటీవలే చైనాను హెచ్చరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్
చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా వుహాన్‌లో కరోనా పుట్టుకపై విచారణ జరపాలని కోరింది. కరోనా వైరస్‌ వుహాన్‌ నగరంలోని జంతు విక్రయశాలల నుంచి వ్యాప్తి చెందిందని చైనా వాదిస్తోంది. అయితే అదే నగరంలోని ఒక ప్రయోగశాల నుంచి బయటకు వచ్చిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

డబ్ల్యుహెచ్‌వో విచారణ మొదటి అడుగు మాత్రమే

కొవిడ్‌-19కు సంబంధించి చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌వో) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విచారణ సాగనీయకుండా చైనా అధికార యంత్రాంగం పలు అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు విచారణను ప్రపంచ ఆరోగ్యసంస్థ పూర్తిచేసింది. కానీ నివేదికలో గబ్బిలాల నుంచి వైరస్‌ ప్రబలివుంటుందని వెల్లడించింది. అయితే ల్యాబ్‌లో నుంచి లీక్‌ అనేది వాస్తవదూరంగా ఉండవచ్చని పేర్కొంది. ఈ విచారణ మొదటి అడుగు మాత్రమేనని పూర్తిగా దర్యాప్తు జరిపితే అన్నీ అంశాలు వెలుగులోకి వస్తాయని భారత్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

గుర్తు తెలియని జంతువు నుంచి..

మధ్య చైనాలో ఉన్న వుహాన్‌లో 2019 డిసెంబరులో ఈ వైరస్‌ బయటపడింది.దీన్ని SARS-CoV-2 అని వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సభ్యుల బృందంలోని ఒకరు దీనిపై మాట్లాడుతూ వుహాన్‌లో తమ పరిశోధనల్లో గబ్బిలాల నుంచి ఒక జంతువుకు అనంతరం మానవులకు సోకి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఏ జంతువు నుంచి సోకిందో అంతుచిక్కడం లేదని చెప్పడం గమనార్హం. అయితే వుహాన్‌లో దర్యాప్తు మొదటి దశ మాత్రమేనని అనంతరం పలు దఫాలుగా విచారణ చేపట్టాలని ఆయన చెప్పడంతో చైనా మూలాలపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

దర్యాప్తుకు రాజకీయాలు అడ్డంకిగా మారాయి – WHO

కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

‘సైన్స్‌ను రాజకీయాల నుంచి వేరుచేయమని మేం అడగాలనుకుంటున్నాం. సరైన దారిలో, సానుకూల వాతావరణంలో మనకు అవసరమైన సమాధానాలను కనుగొందాం. ఈ ప్రక్రియను రాజకీయాలు విషతుల్యం చేస్తున్నాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైకేల్‌ ర్యాన్‌ హెచ్చరించారు.

కరోనా మూలాలను అన్వేషించేందుకు సరికొత్త, లోతైన దర్యాప్తు జరపాలంటూ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. సరైన సమాధానం కోసం పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి మూలాలపై నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా?

లేక ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కరోనా వైరస్ నుంచి సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకే అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని చైనా ఆరోపించింది. ఇక ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న విలయం కారణంగా.. 17కోట్లమందికి పైగా వైరస్ బారిన పడగా, 35లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరుకున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా పాపం చైనాదే – కీలక ఆధారాలు సమర్పించిన అమెరికా..
కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు అమెరికా ఉంచింది. కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్‌ 2019లో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. అంతేకాక ఆస్పత్రి బయట గట్టి కాపలా ఉంచింది. అమెరికన్‌ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్‌ తయారు చేశాయి. తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్‌ మేకింగ్‌ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్‌ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ నిర్ణయించింది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్‌ పత్రిక వాషింగ్టన్‌ డీసీ ప్రచురించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా పాపం చైనాదే – కీలక ఆధారాలు సమర్పించిన అమెరికా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో చైనా నిజాలు దాచిపెట్టిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్‌ లి మెగ్‌ యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పని చేస్తున్న ఆమె కరోనా వైరస్‌పై పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఆమె పలు విషయాలు వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

‘నేను న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ వుహాన్‌లోని ఓ ల్యాబ్‌లో తయారైనట్లు గుర్తించాను. ఆ ల్యాబ్‌ పూర్తిగా చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. వైరస్‌కు సంబంధించి నేను హెచ్చరికలు చేసినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదకరమైన వైరస్‌ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయాల్సింది పోయి నా హెచ్చరికలను సైతం నిర్లక్ష్యం చేశారు. ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదు. అది వుహాన్‌లోనే పుట్టిందనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి.

వైరస్‌ విషయంలో గొంతు ఎత్తినందుకు నాపై చైనా అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారు. చైనాలో నాపై దుష్ప్రచారం చేయడంతో పాటు నా సమాచారం మొత్తం డిలీట్‌ చేశారు. ఆ తర్వాత నేను ఆమెరికాకు వెళ్లిపోవాల్సి వచ్చింది’ అని యాన్‌ ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వుహాన్‌లోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ మాత్రం ఆమె ఆరోపణలు కొట్టిపారేశారు. చైనా అధికారులు సైతం ఈ వీడియోపై ఇంత వరకూ స్పందించకపోవడం గమనార్హం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వూహాన్ ల్యాబ్‌ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇప్పటికీ సందిగ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. అసలు వుహాన్‌ ల్యాబ్‌లోనే దీన్ని తయారు చేశారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ముందస్తు బృందం చేపట్టిన దర్యాప్తు తాజాగా పూర్తైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

దర్యాప్తులో భాగంగా వైరస్‌కు కేంద్రబిందువుగా భావిస్తోన్న వుహన్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలతో ఈ బృందం విస్తృతంగా చర్చించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎపిడెమియోలాజికల్‌ నివేదికలు, బయెలాజికల్‌, జెనెటిక్‌ విశ్లేషణలు, అక్కడి మార్కెట్లలోని జంతు ఆరోగ్య పరిశోధనల గురించి చైనా శాస్త్రవేత్తలతో చర్చించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి క్రిష్టయన్‌ లిండ్‌మియర్‌ విలేకరులకు వెల్లడించారు. అంతేకాకుండా పూర్తి సమాచారాన్ని ఈ బృందం సేకరించిందని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు తుది ఫలితాలు మాత్రం డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించలేదు.

ప్రాథమిక దర్యాప్తు పూర్తికావడంతో అంతర్జాతీయ నిపుణులతో పూర్తి స్థాయి దర్యాప్తు, పరిశోధన చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. అసలు జంతువుల నుంచి కొవిడ్‌19 మహమ్మారి మానవుల్లోకి ఎలా ప్రవేశించింది? తదితర అంశాలపై పరిశోధన ఈ పూర్తి స్థాయి నిపుణుల బృందం దర్యాప్తు చేయనుంది. ఈ దర్యాప్తు బృందంలో ఏయే నిపుణులు ఉండాలనే విషయంపై ఇప్పటికే ముసాయిదాను రూపొందించారు. అయితే, ఈ దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం తెలియరాలేదు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో ఈ వైరస్‌కు అసలు కారణం చైనానే అని పలుదేశాలు విమర్శించాయి. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఏకంగా ప్రపంచ ఆరోగ్యసంస్థపైనే విమర్శలు గుప్పించింది. చివరకు ఒత్తిడి పెరగడంతో దర్యాప్తు జరిపేందుకు డబ్ల్యూహెచ్‌ఓ అంగీకరించింది. వైరస్‌ మూలాలను శోధించేందుకు మూడు వారాల క్రితం ఇద్దరు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల ముందస్తు దర్యాప్తు బృందం చైనాకు వెళ్లింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వూహాన్ ల్యాబ్‌ శాస్త్రవేత్తలను ప్రశ్నించిన WHO బృందం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని అక్కడి అధికారులు వెల్లడించారు. వీటిలో 31కేసులు లక్షణాలు లేకుండానే గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని నిపుణుల సూచనలతో దాదాపు కోటి మంది జనాభాగల వుహాన్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగానే తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. వీటిలో ఎక్కువగా లక్షణాలు కనిపించడం లేదు. వుహాన్‌ కాకుండా గాంగ్‌డాంగ్‌, షాంఘై ప్రావిన్సుల్లో కూడా తాజాగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. అయితే వీటిలో కొన్ని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వల్లే సోకినట్లు తేలగా.. మరికొన్ని మాత్రం స్థానికంగానే వ్యాపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తంమీద బయటకు లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువగా బయటపడుతున్నాయని వెల్లడించారు. అత్యధికంగా వుహాన్‌లో లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వూహాన్ లో విజృంభిస్తున్న కరోనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.