WHO & CHINA – Vishwa Samvad Kendra Andhra Pradesh

WHO చైనా చేతిలో కీలుబొమ్మ – WHO చీఫ్ కు ట్రంప్ లేఖ
డిసెంబరు 2019లోనే కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు విశ్వసనీయమైన సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. వుహాన్‌ నగరం నుంచే ఈ ఆధారాలు అందినప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఆ సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించుకోవడంలో విఫలమైందని చెప్పుకొచ్చారు. చైనా అధికారిక సమాచారానికి, క్షేత్ర స్థాయి నివేదికలకు వ్యత్యాసం ఉన్నప్పటికీ సంస్థ మిన్నకుండిపోయిందని ఆరోపించారు. ఇలా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌కు ట్రంప్‌ సోమవారం ఓ లేఖ రాశారు.

తైవాన్‌ ఆధారాల్ని పట్టించుకోలేదు..

డిసెంబరు 30, 2019 నాటికి వుహాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓకు తెలిసిందని ట్రంప్‌ లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తైవాన్‌ ప్రభుత్వం సైతం నివేదించిందన్నారు. అయినా.. రాజకీయపరమైన కారణాలతో సంస్థ ప్రపంచ దేశాలతో ఆ కీలక సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదని ఆరోపించారు. ప్రపంచానికి తెలిసిన తర్వాత కూడా అంతర్జాతీయ వైద్య నిపుణుల్ని చైనాలోకి అనుమతించేలా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమైందన్నారు.

చైనాకు దూరమైతేనే..

ఈ సందర్భంగా సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌పై ట్రంప్‌ నేరుగా విమర్శలు గుప్పించారు. ఆయన వ్యవహార శైలివల్లే నేడు ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందని ఆరోపించారు. చైనాతో అంటకాగడం ఆపి స్వతంత్రంగా వ్యవహరిస్తేనే సంస్థకు మేలైన బాటలు పడతాయని చెప్పుకొచ్చారు.

నిధుల్ని శాశ్వతంగా ఆపేస్తాం..

రానున్న 30 రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ తన విధానాలను మెరుగుపరచుకోకపోతే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వాతంగా ఆపేస్తానని హెచ్చరించారు. అలాగే, సంస్థలో అమెరికా సభ్యత్వంపై పునరాలోచించుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓను ట్రంప్‌ చైనా కీలుబొమ్మగా అభివర్ణించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post WHO చైనా చేతిలో కీలుబొమ్మ – WHO చీఫ్ కు ట్రంప్ లేఖ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.