#Waqf Amendment Bill – Vishwa Samvad Kendra Andhra Pradesh

వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌
వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లు (Waqf Amendment Bill)ను ఆమోదించాయి. దీనిపై తాజాగా ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన.. తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం బిమ్‌స్టెక్‌ సదస్సు నిమిత్తం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘వక్ఫ్‌ సవరణ బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం ఓ చరిత్రాత్మక మలుపు. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం మన సమష్టి అన్వేషణలో ఓ కీలక ఘట్టం. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంట్‌ సభ్యులకు కృతజ్ఞతలు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయి. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంతో వారి హక్కులకు భద్రత లభించినట్లయ్యింది. ఈ బిల్లుతో ఇప్పుడు సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన, సమ్మిళిత భారత్‌ను కలిసి నిర్మిద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

సుదీర్ఘ చర్చ తర్వాత బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు, ‘ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లు’కు.. గురువారం రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్‌ బిల్లు పేరును…యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లుగా (ఉమీద్‌-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.

The post వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్
వక్ఫ్ సవరణ బిల్లు 2024   కేవలం ఒక బిల్లు కాదని, ఉమ్మీద్ Unified Waqf Management Empowerment, Efficiency and Devilopment అని, సాధికారత, సామర్థ్యం అభివృద్ధిని ఉద్దేశించినదని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్  అన్నారు. బిల్లుపై బుధవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, దేశ ప్రజలంతా వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలుసుతున్నారని అన్నారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ భారత్, కేరళ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఆలిండియా సూఫీ కౌన్సిల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ మద్దతు ప్రకటించాయని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలోనే వక్ఫ్ ఏర్పాటైందని, వక్ఫ్ ఏమి చేసినా సరైనదేనని ఆ పార్టీ భావిస్తూ వచ్చిందని, వక్ఫ్ భయాల నుంచి విముక్తి కలిగించేందుకు ఇదే సరైన తరుణమని అన్నారు. వక్ఫ్ ల్యాండ్‌ల్లో అవినితీకి పాల్పడినందు వల్లే వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఈ సవరణ చట్టం చరమగీతం పాడుతుందన్నారు.

ఆ తప్పు మళ్లీ జరగనీయం

మతం ఆధారంగానే 1947లో దేశ విభజన జరిగిందని, మరోసారి మతం పేరుతో దేశ విభజన జరగనీయమని అనురాగ్ ఠాకూర్ అన్నారు. అప్పట్లో దేశవిభజనకు ఒక కుటుంబం, ఒక పార్టీ కారణమైందని విమర్శించారు. ఈ రోజు ‘ల్యాండ్ జీహాద్’ పేరుతో మరోసారి దేశ విభజనను జరగనీయమని అన్నారు. వక్ఫ్ బోర్డు భయాల నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

The post మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజ్యసభ ముందుకు వక్ఫ్‌ బిల్లు.. చర్చ చేపట్టిన ఎంపీలు
సుదీర్ఘ చర్చ తర్వాత లోక్‌సభలో ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు.. ఇప్పుడు రాజ్యసభ ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం ఈ బిల్లు ను ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించారు.

ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ వాడీవేడిగా సాగింది. అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. రాజ్యసభలోనూ దీనిపై చర్చ కోసం 8 గంటలు కేటాయించారు. అవసరమైతే సమయాన్ని పెంచనున్నారు. అనంతరం ఓటింగ్‌ చేపడతారు. ఎగువ సభలోనూ అధికార ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో బిల్లు గట్టెక్కడం లాంఛనమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారనుంది.

వక్ఫ్‌ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈమేరకు 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

The post రాజ్యసభ ముందుకు వక్ఫ్‌ బిల్లు.. చర్చ చేపట్టిన ఎంపీలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.