#Waqf Act – Vishwa Samvad Kendra Andhra Pradesh

బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలపై బంగ్లాదేశ్‌కు చెందిన ఒక అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడానికి బదులు బంగ్లా తమ దేశంలోని మైనార్టీల హక్కులను కాపాడటంపై దృష్టి సారించాలని విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ హితవు పలికారు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈవిధంగా బదులిచ్చారు.

బెంగాల్‌లోని పరిస్థితులపై బంగ్లాదేశ్‌ ప్రెస్‌ సెక్రటరీ షఫీకుల్‌ ఆలం ఇటీవల మాట్లాడారు. భారత్‌లోని మైనారిటీలను రక్షించేందుకు అక్కడి కేంద్రంతో పాటు పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపైన తాజాగా జైస్వాల్‌ స్పందిస్తూ.. ‘పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఘటనలకు సంబంధించి బంగ్లా అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వారి వ్యాఖ్యలు అర్థరహితమైనవి. ఆ దేశంలోని మైనారిటీలపై జరుగుతున్న హింస గురించి భారత్‌ తన ఆందోళనను తెలుపుతోంది. ఈక్రమంలో వారు తిరిగి మాపై ఇలాంటి నిందలు వేయడం మానుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బదులు వారు తమ సొంత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడటంపై దృష్టిసారిస్తే మంచిది’ అని పేర్కొన్నారు.

వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈక్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలుచేయబోమని పునరుద్ఘాటించారు. అయితే ఈ హింసలో ఉగ్రసంస్థల హస్తం ఉందని, వారే యువకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడేలా చేస్తున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

The post బెంగాల్‌లో ఆందోళనలపై బంగ్లా వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంభాల్ దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు.. వెలుగులోకి సంచలన విషయాలు
దేశంలో వక్ఫ్ భూముల అక్రమణల వేరే చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ఈ భూములపై చాలా సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సంభాల్ జిల్లాలోని చందౌసి వద్ద ఉన్న ఒక దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల సంభాల్ జిల్లాలోని జానెటా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న దాదా మౌజ్మియా షా దర్గా, వక్ఫ్ భూమి గురించి అక్రమ ఆక్రమణ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ భూమిపై షాహిద్ మియాన్ అనే వ్యక్తి అనధికారంగా ప్రవేశించి, అక్కడ వైద్య క్లినిక్ నిర్వహిస్తున్నాడని ఫిర్యాదుదారు జావేద్ తెలిపారు. 2019 నుంచి ఈ భూమి “ముతవల్లి” లేకుండా ఖాళీగా ఉందని, అక్కడ జరిగే వార్షిక ఉర్స్ పండుగ నుంచి ఆదాయం పొందుతున్నారనే విషయాలు వెల్లడయ్యాయి.

2019 నుంచి మార్పులు

సంభాల్ జిల్లా తహసీల్దార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ ఈ అంశంపై వివరణ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఈ భూమి వక్ఫ్ భూమిగా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. అక్కడి నుంచి జరిగే ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు దర్యాప్తు దృష్టిలో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా, ఈ భూమి వక్ఫ్ భూమిగా ఎందుకు క్లెయిమ్ చేయబడిందనేది కీలక ప్రశ్నగా మారింది. ఏప్రిల్ 3, 2019 నుంచి వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. అందులో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణ, అన్యాయ వాడకంపై కఠిన చర్యలు తీసుకోవడం అనేది ఈ చట్టం లక్ష్యం. ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత, వక్ఫ్ భూములపై వచ్చే ప్రతి ఫిర్యాదు తీసుకుని, సంబంధిత పత్రాలను పరిశీలించి, సమగ్ర దర్యాప్తు చేపట్టడం ప్రారంభమైంది.

కీలక అంశాలు

ఫిర్యాదు చేసిన జావేద్ ప్రకారం, వక్ఫ్ భూమిపై అక్రమంగా వైద్య క్లినిక్ నిర్వహించబడుతున్నప్పుడు, అది అనేక ప్రశ్నలను వెలుగులోకి తెస్తుంది. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు, షాహిద్ మియాన్ దగ్గర నుంచి అవసరమైన పత్రాలు సమర్పించాలని అధికారులు కోరారు. ఈ పత్రాలను పరిశీలించడంతో తరువాతి చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ విషయం దర్యాప్తు సమయంలో మరింత క్లారిటీ ఇచ్చేందుకు, భూమి గత లావాదేవీలు, అక్కడ జరిగే ఆర్థిక కార్యకలాపాలు వంటి అంశాలపై కసరత్తు చేయనున్నారు.

ఇతర ప్రాంతాల్లో కూడా..

వక్ఫ్ భూములపై జరిగిన అక్రమ ఆక్రమణలు, సమాజంలో తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఇది ముస్లిం సమాజానికి సంబంధించిన ఆస్తి కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కాకుండా, సామాజిక సేవల కోసం కూడా ఉపయోగపడాలి. కానీ, ఈ ఆక్రమణల వల్ల, నిజమైన వారికి ఈ భూములు అందుబాటులోకి రావడం లేదు. ఈ క్రమంలో వక్ఫ్ భూముల విషయంలో సమాజంలో అవగాహన పెంచడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

The post సంభాల్ దర్గా వక్ఫ్ భూమి ఆక్రమణపై దర్యాప్తు.. వెలుగులోకి సంచలన విషయాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్‌
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి.. రోడ్లను దిగ్భందించారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు. హింసాత్మక చర్యలు నెలకొంటున్న నేపథ్యంలో ముర్షిదాబాద్ జిల్లాలో పలు నిషేధాజ్ఞలు విధించామని.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వదంతులను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఘర్షణ సమయంలో ఆందోళనకారులపై జరిపిన కాల్పుల్లో గాయపడిన 10మంది పోలీసులు.. ఓ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

వక్ఫ్‌ చట్టం ఈనెల 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్‌ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. మైనారిటీలు, వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం కలిసి ఉండేవని.. తర్వాతే విభజన జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడే ఉండిపోయిన మైనారిటీలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని.. తాను ఉన్నంతకాలం వారిని, వారి ఆస్తులను రక్షిస్తానని అన్నారు.

పరిస్థితిని అదుపుచేయడంలో మమత ప్రభుత్వం విఫలం: భాజపా

పరిస్థితిని అదుపు చేయడంలో మమత ప్రభుత్వం విఫలమయ్యిందని భాజపా విమర్శలు గుప్పించింది. దీనిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమయితే కేంద్రం సహాయం తీసుకోవాలని సూచించింది. ఇది నిరసన చర్యగా కనిపించట్లేదని.. సమాజంలోని ఇతర వర్గాలలో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి దుష్టశక్తులు చేస్తున్న ప్రయత్నాలని మండిపడింది.

The post బెంగాల్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.