Vaddi Vijayasarathy – Vishwa Samvad Kendra Andhra Pradesh

తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం
“ఆంగ్లేయుల ఏలుబడి – అంతులేని దోపిడి” పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో వ‌క్త‌లు

నంద్యాల: స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కాలేజ్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల సందర్భంగా “ఆంగ్లేయులు ఏలుబడి – అంతులేని దోపిడి” పుస్తక పరిచయం కార్యక్రమం సోమ‌వారం విజ్ఞాన దాయకంగా జరిగింది. శ్రీ రామకృష్ణ సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన కొలువుదీరిన సభ ఆహుతులతో కళకళలాడింది.

డాక్టర్ వడ్డి విజయసారథి, ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు ఆంగ్లేయులు ఎన్ని విధాల మన దేశాన్ని దోచుకున్నారో వివరించారు. ఇదే విష‌యం “ఆంగ్లేయులు ఏలుబడి – అంతులేని దోపిడి” ఉంద‌న్నారు. ప్రతి ఒక్కరు ఈ పుస్తకం చదివి మనం గతంలో చేసిన తప్పులను సవరించుకొని ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మన దేశాన్ని నిలపాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ పాత్రికేయుడు జనార్దన్ రెడ్డి సమీక్షిస్తూ పుస్తక రచయిత ఎన్నో పుస్తకాలు మధించి, ఏళ్ళ తరబడి అహోరాత్రులు శ్రమించి క్రోడీకరించి రాసిన ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా నిర్దేశించాలని యూజీసిపై ఒత్తిడి తేవాలని సూచించారు.

గ్రంథ‌ రచయిత డాక్టర్ సారంగపాణి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో చేయనన్ని దారుణాలు బ్రిటిష్ వారు మన దేశంలో చేశారని, ఇది అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రస్తావించాల్సిన అంశం అని తెలిపారు.

మన బంగారం, వెండి దోచుకెళ్ళి ధనవంతులై, బడ్జెట్లో లోటు చూపించి మన సొమ్ము తిరిగి మనకే వడ్డీకి ఇచ్చారని, అతి కిరాతకంగా పన్నులు వసూలు చేశారని, పన్నులు కట్టలేని పేదలను ఆడ, మగా తేడా లేకుండా బలవంతంగా తీసుకెళ్ళి బానిస వ్యాపారం చేశారని తెలిపారు.

1857 తిరుగుబాటు చేసిన వారిలో లక్షకు పైగా చంపగా పారిపోయిన వారిని ఓడ లెక్కించి బానిసలుగా అమ్మేశారని, రబ్బరు పరిశ్రమలో ఒప్పంద కార్మికులుగా పనిచేసేందుకు మగవారిని, వారికోసం వందకి 35 మంది చొప్పున ఆడవారిని బలవంతంగా ఎత్తుకెళ్ళారని వారు మరలా తిరిగి రాలేదని తెలిపారు. జాతీయ స్ఫూర్తినింపడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుందన్న భావనతో పుస్తకాన్ని రచించామన్నారు. అంతర్గత పోరు మాని దేశానికి, ధర్మానికి అసలైన శత్రువులను గుర్తించి ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఐక్యమై పోరాటాని కి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తర్వాత సభికులు అడిగిన పలు ప్రశ్నలకు గ్రంథ రచయిత సమాధానమిచ్చారు. కాల్చినన్ని కాల్చి, ఎత్తుకెళ్ళినవి ఎత్తుకెళ్ళ గా ఇంకా పది లక్షలకు పైగా తాళపత్ర గ్రంథాలు కలిగి ఉన్న గొప్ప దేశం మనది. ఉక్కు పరిశ్రమ, నౌకా నిర్మాణ పరిశ్రమ, అంతరిక్ష విజ్ఞానం, ఆరోగ్య విద్య, కచ్చితమైన కాలగణన లాంటి ఎన్నో అధునాతన విద్యలు మన సొంతమ‌న్నారు. అనంత‌రం సమరసత సేవా ఫౌండేషన్ ప్ర‌తినిధులు డాక్ట‌ర్ సారంగపాణిని ఘనంగా సన్మానించారు. అలాగే, వ‌డ్డి విజయ సారథి, జనార్దన్ రెడ్డిని జాతీయ సాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యులు ఘ‌నంగా స‌త్క‌రించారు.

ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా శ్రోతలు పాల్గొనడం విశేషం. పట్టణ ప్రముఖులు డాక్టర్ సహదేవుడు, వై.ఎన్‌. విష్ణువర్ధన్ రెడ్డి, సుధాకర్, రమేష్ బాబు, డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, సమరసత సేవ ఫౌండేషన్ కార్యకర్తలు రాం ప్రసాద్, చింతలపల్లె వాసు, నరసింహారాజు, శ్రీనివాసులు, రామనరసింహులు, శివప్రసాద్, అన్నెం శ్రీనివాస రెడ్డి, శేష ఫణి , కళాశాల విద్యార్థుల తో పాటు ఎంతో మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు.

ఒక్క కరపత్రం ముద్రించకుండా….

ఈ బృహత్ కార్యక్రమాన్ని సంకల్పించి, సమన్వయ పరిచి, కేవలం సామాజిక మాద్యమాల బలంతోనే ఆడిటోరియం ఆహుతులతో కిటకిటలాడేలా చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన డాక్టర్ ఉదయ్ శంకరికి, పరివార క్షేత్రాల కార్యకర్తలకు మాతృభాషా పరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి డాక్టర్ రామ్మోహన్ శర్మ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. జనగణమన, శాంతిపాఠంతో సభ సుసంపన్నమైనది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తప్పులను దిద్దుకొని, తిరుగులేని శక్తిగా దేశాన్ని నిలుపుదాం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిలో ఉన్నది పొగరా? విగరా?
సీతారామశాస్త్రిని చాలా దగ్గరనుండి చూశాను. అతడి కెంత పొగరో మీకు తెలియదు. నాకు తెలుసు. అంత పొగరున్నవాడు ఇంత జనాదరణ ఎలా పొందగలిగాడు? చదవండి…విగరున్నవాడికే పొగరు ఉంటుంది. అది సహజం. ఆ మాత్రం పొగరు లేకుంటే ఆ ‘విగరు’ (ఇది ఇంగ్లీష్ పదం) రాణించదు. అతడు నా కంటే నాల్గయిదేళ్లు చిన్నవాడు. నాకెప్పుడూ గౌరవలోపం చేయలేదు గాని, సినిమాల్లోకి వెళ్లిన తరవాత అతనితో మాట్లాడేటప్పుడు అతన్ని నేను ‘శాస్త్రి గారూ’ అనేవాడిని.

‘అదేమిటండీ, మీరు నన్ను గారూ అనటమేమిటి?’ అని అనాలి గదా! అనలేదు. తగుదునమ్మా అంటూ ఆ మర్యాదను మౌనంగా స్వీకరించాడు. అప్పుడే అనుకున్నాను. ఇతని పొగరేమీ తగ్గలేదే అని. అసలు అతనికి పొగరు ఎక్కువ అనే భావం ఎప్పడు ఏర్పడిందనుకున్నారు?

1978-79 లో విజయవాడలో ఒక పెద్ద కథా రచయితల సమ్మేళనం జరిగింది. హేమాహేమీలు, చేయి తిరిగినవారూ, పేరు మోసినవారూ వచ్చారు. ఇతడూ వచ్చాడు. బహిరంగసభ లాంటి కార్యక్రమాల్లో మంచి గీతాలను పాడించాలనుకున్నారు నిర్వాహకులు.

ఇతడు పాడదలుచుకున్న పాట, పాడేతీరూ బాగుండటంతో రెండవరోజు ముగింపు సభలో ఇతనితో పాడించా లనుకున్నారు. ఆ సమయం వచ్చేసరికి సభా సంచాలనం చేస్తున్న వ్యక్తి ఇతనికంటే ఓ పదిహేనేళ్లు పెద్దవాడు వేదిక వెనుకకు వచ్చి, “ఆ పాటలుపాడే కుఱ్ఱవాడేడీ?” అని నన్ను అడిగారు.

ఇతడు ఆమాట విని “వయస్సులో మేజర్ని, పోస్టలు డిపార్టుమెంటులో ఉద్యోగినీ అయిన నన్ను కుఱ్ఱవాడని అగౌరవ పరుస్తారా? నేను పాడను”. అని వెళ్లిపోయాడు. అదిగో అప్పట్నించి నేను గట్టిగా గుర్తుపెట్టుకున్నా. ఇతనికి పొగరెక్కువ. మనం జాగ్రత్తగా వ్యవహరించాలి అని.

అసలు అతడికి అంత పొగరు ఎలా వచ్చిందో… అది కూడా కాలక్రమాన నాకు తెలిసింది. వాళ్ల నాన్నగారి గురించి ఒక గొప్ప మంచిపుస్తకం వ్రాసి ఆ అన్నదమ్ములు అచ్చేయించారు. అందులో ఇతడే వ్రాశాడు. ఏదన్నా పనుండి వాళ్ల నాన్నగారు ఇతడిని, ఇతని తమ్ముళ్లనీ పిలిచినా, ఆ పని అయిపోగానే, “పోయి ఆడుకోండి!” అనేవారట!

అంతేకాని “బుద్ధిగా కూర్చొని చదువుకోండర్రా!” అని ఎప్పుడూ అనలేదట! అర్థమైందా, యోగిగారి పెంపకం ఎలా ఉండేదో! ఇంతటి పొగరుబోతు ఒకసారి కష్టపడి నాకు పాదాభివందనం చేశాడు. నేను నిశ్చేష్టుడ నయ్యాను. “ఇదేమిటయ్యా?” అని ధైర్యం తెచ్చుకొని ఏకవచనప్రయోగం చేస్తూ అడిగాను. అతడు చెప్పిన మాటలు చెప్పడానికి ముందు ఆ సందర్భం కొంచెం వివరంగా చెప్పాలి. యోగిగారు కాగితంమీద వ్రాశారో లేదో తెలియదుగాని ‘మావాడి బాగోగులు నువ్వు చూడా’లని సత్యారావు మాస్టారితో అన్నారట. అప్పటి నుండి సత్యారావు గారి పెద్దరికం ఆ అన్నదమ్ముల దగ్గర సాగుతోంది.

ఆ సత్యారావు మాస్టారికి మా ఆఖరి చెల్లెలి నిచ్చాం. ఆ మేస్టారి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, శాస్త్రిగారి కుటుంబ మంతా హాజరయ్యే ప్రయత్నం చేస్తారు. మాస్టారి రెండో కుమారుని వివాహం ముందు నిశ్చయతాంబూలాలు పుచ్చుకొనే కార్యక్రమం విజయవాడలో జరుగుతున్నది. అక్కడ నేను మా పెద్ద చెల్లెలితో మాట్లాడుతూ ఉండగా శాస్త్రిగారు అటు వచ్చారు. నేను మా చెల్లెల్ని పరిచయం చేశాను.

అతడు వంగి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఆమె పాపం పల్లెటూరి మనిషి, కంగారుపడిపోయింది “ఇదేమిటండీ?” అంటూ. అతడు తాపీగా వివరించారు. “మీ చెల్లెలు శ్యామలగారు మాకు వదిన గారు. మా అన్నగారికి, వదినగారికీ పాదాలకు మ్రొక్కి ఆశీస్సులు పొందటం మాకు ఆనవాయితీ. మీరు ఆమెకంటే పెద్దవారు కదా!”. తర్కం బాగానే ఉంది! అనుకున్నాను.

మా కుశల ప్రశ్నలు పూర్తయి సెలవు తీసుకుందా మనుకున్నప్పుడు అతడు మరోసారి వంగి నాకు పాదాభివందనం చేశాడు. ‘ఇదేమిటయ్యా’ అని అడిగితే, “మీరు వారిద్దరికంటే పెద్దకదా!” అని అతని సమాధానం. ఏ మనిషి జీవితమూ సరళరేఖగా ఉండదు. సందర్భాలనుబట్టి, లభించే గురువులను బట్టి, తటస్థపడే స్నేహితులనుబట్టి జీవిత గమనంలోనూ, వ్యవహార శైలిలోనూ మార్పులు వస్తుంటాయి. శాస్త్రిగారిలో మార్పులు రావడానికి ఎందరు కారణమో వారందరూ నాకు తెలియదు. తెలుసుకోవటం సాధ్యం కాదు కూడాను.

కాని ముగ్గురిని ఇక్కడ ప్రస్తావించటం అవసర మనుకొంటున్నాను. మొదటివ్యక్తి అతని ధర్మపత్ని పద్మావతి. వారి ఇంటికి మొదటిసారి వచ్చేవారిని కూడా ఆదరించే స్వభావం ఆమెలో ఉంది. కవిగారితో ఇంటర్వ్యూ ఒక పట్టాన దొరకదు గదా. వచ్చినవారు ఈ లోపల ఏమిచేయాలి? ఆ సమస్య తలెత్తకుండా, వచ్చినవారిని ఆదరిస్తుంది.

ఆ స్వభావం క్రమక్రమంగా శాస్త్రిగారిలోనూ కొంతమార్పు తెచ్చి ఉంటుంది. రెండవవారు శివానందమూర్తి గారు. వారు ఏ విధమైన భేషజమూ చూపకుండా మాట్లాడే పద్ధతి మనల్ని చకితుల్ని చేస్తుంది. వారి ప్రభావం పైకెదుగుతున్న కవిని ‘దిగిరాను, దిగిరాను …’ అంటూ పైకెక్కి కూర్చోబెట్టకుండా, చెట్టు ఎంతగా ఆకాశంలోకి ఎదిగినా, వేళ్లుమాత్రం భూమిలోనే ఉండాలి అని అర్థం చేయించి ఉంటారు. మూడవవ్యక్తి మా బావగారు సత్యారావు మాస్టారు.

శాస్త్రి సోదరులకు నేను నేరుగా తెలిసినవాడినే అయినా, ఇంట్లో మిగిలినవారి ముందు నేను మాస్టారి బావమరిదినే, లేదా శ్యామల గారి అన్నయ్యనే. నా పట్ల వ్యవహారం లోనే గాక సమాజంలోని అనేక మందితో సంబంధాలు నెరపటంలో మాస్టారు శ్రమ తీసుకోవలసి వచ్చేది. శ్రీ శారదా ధామంలో ఒక కార్యక్రమానికి మాస్టారు వెంట ఉండి తీసుకు వచ్చారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామికూడా ఆరోజు కార్యక్రమంలో ఉన్నారు. జాగృతి భవనంలో నిర్వహించ దలిచిన కార్యక్రమానికి మాస్టారిద్వారా మాట్లాడించినా, శాస్త్రిగారు రాలేకపోయారు.

కాగా కర్తవ్య నిర్వహణలో దృఢంగా నిలబడి వర్షంలో తడుస్తూ శాస్త్రిగారు ఉపన్యసించిన సందర్భంలో ఆశ్చర్యపోవటం నావంతు అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాతావరణం కలుషితమౌతున్నవేళ, శ్రీ ఎంవి ఆర్ శాస్త్రి చొరవ తీసుకొని లలితకళా తోరణంలో ఒక కార్యక్రమం ఏర్పరిచారు.

ఆ కార్యక్రమం చూసిన తర్వాత శాస్త్రిలో ఉన్నది ‘విగరే గాని పొగరు కాదు’ అనే అభిప్రాయం కలిగింది నాకు. శాస్త్రిగారి కవిత్వం గురించి ఒక్క మాటచెప్పేసి నా కథనం ముగిస్తాను. దాశరథి, సినారే వంటివారు ముందు కవులుగా ప్రసిద్ధులు. సినిమాలకు పాటలు వ్రాసి సంపాదనాపరు లయ్యారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి, పింగళి నాగేంద్రరావు , వేటూరి వంటివారు సందర్భానికి తగిన పాట కూర్చటంలో చేయి తిరిగినవారు.

సినిమాలవల్ల ప్రఖ్యాతులైనా, సినిమాలతో ముడిపడని సాహిత్య వ్యాసంగం వారికి ఉంది. వారికి భిన్నంగా చిన్నవయస్సులో సినిమారంగంలో అడుగుపెట్టిన కవి సిరివెన్నెల. ఇటువంటివారు అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆరాటంలో పూర్తిగా చెడిపోడానికి, దిగజారిపోడానికీ ఎంతైనా అవకాశముంది.

కాని అతని అదృష్టం, మన అదృష్టం! దిగజారిపోకుండా నిలద్రొక్కుకోవటమేగాక, తెలుగు సినిమా పాటస్థాయిని పెంచటం నిజంగా అభినందించదగిన విషయం. తన మాట వినేవారిని యువతరం వారిని పదిమందిని ఈ పరిశ్రమలో ప్రవేశింపజేయటమూ చిన్న విషయం కాదు.

ఈ రెండు విషయాలలో అతడిని ప్రత్యేకించి అభినందించ వలసి ఉంది. (అయిష్టంగానే అయినా కొందరు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ పాత్రను ఈ సందర్భంలో పేర్కొనటం గమనార్హం.) అతడు సంపాదించుకున్న విశిష్టస్థానం నంది పురస్కారాలకు,ఇంకా ఇతరేతర పురస్కారాలకు, పద్మ పురస్కారాలకు కూడా అతీతమైంది. పాటకు వన్నెతెచ్చిన వ్యక్తిగానేగాక, పద్మశ్రీ పురస్కారానికీ వన్నెతెచ్చిన వ్యక్తిగా కూడా ఇతడు గుర్తుంచుకోబడతాడని నా విశ్వాసం.

(ఫోటో : ‘గుమ్మటాలు’ పుస్తకావిష్కరణ సభలో శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పక్కన పుస్తక రచయిత డా. వడ్డి విజయసారథి, ఎమ్మెల్సీ మాధవ్, చివర ఉన్న సత్యారావు మాస్టారు)

– డా. వడ్డి విజయసారథి

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిలో ఉన్నది పొగరా? విగరా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.