VACCINATION IN INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు అర్హులందరికీ తొలి డోసు అందించగా రెండో డోసు పంపిణీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో గోవా ముందడుగు వేసింది. రాష్ట్రంలో 100 శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ అందించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సాధారణ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.

“రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాకు అర్హులైన వారందరికీ గతేడాది సెప్టెంబర్‌లోనే ఒక డోసు అందించాం. వ్యాక్సిన్‌కు అర్హులైన వారు రాష్ట్రంలో మొత్తం 11.66లక్షల మంది ఉండగా వారందరికీ రెండు డోసుల్లో పంపిణీ చేశాం. అయినప్పటికీ గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తాం. భారీ వర్షాలు, తుపాను సమయంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాక్సినేషన్‌ను కొనసాగించాం. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు” అని గోవా స్టేట్‌ ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేంద్ర బోర్కర్‌ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గోవాలో వంద శాతం వ్యాక్సినేషన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించారు. కరోనా టీకాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, రెండో డోసులూ తీసుకోవడం ముఖ్యమని నొక్కి చెప్పారు. వ్యాధులను, శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దని.. తుదముట్టించేంత వరకూ పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా తగ్గిపోయిందని టీకాను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ఎన్నో దేశాలు ఆందోళన చెందుతున్నాయని, ఆ పరిస్థితి భారత్‌కు రానీయొద్దని కోరారు. దీన్ని మన దేశం భరించే పరిస్థితుల్లో కూడా లేదని పేర్కొన్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ప్రధాని బుధవారం మధ్యాహ్నం వ్యాక్సినేషన్‌ పురోగతిపై 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కేవలం కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొనడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ”అందరి కృషి వల్లే దేశంలో వ్యాక్సినేషన్‌లో పురోగతి సాధ్యమైంది. బిలియన్‌ (100కోట్ల టీకాలు) మైలురాయి చేరుకున్న తర్వాత నిర్లక్ష్యం వహిస్తే కొత్త కష్టాల్లో పడిపోతాం. ఇకముందు కూడా జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ పెంచడానికి నూతన పంథాలో వెళ్లాల్సి ఉంటుంది. 100% వ్యాక్సినేషన్‌ చేసిన రాష్ట్రాల్లోనూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అవి వాటిని అధిగమించి ముందుకెళ్లాయి. కనిపించని శత్రువుతో ఎలా పోరాడాలన్నది ఆశా కార్యకర్తలు నేర్చుకున్నారు. ఇక ముందు జిల్లా, రాష్ట్రం అన్న పదాలను వదిలిపెట్టి గ్రామాలు, వీధుల్లో ఉన్న ఇళ్లను గుర్తించి వ్యాక్సిన్‌ అందించాలి. క్షేత్రస్థాయిలో టీకాలు అందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థుల సేవలనూ వినియోగించుకోండి. పోలీసు, ప్రభుత్వ విభాగాల్లో ఉన్న మహిళల సేవలను వ్యాక్సినేషన్‌ కోసం ఒక వారం పాటు ఉపయోగించుకోవాలి. దాంతో ఫలితాలు వేగంగా మారిపోతాయి. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలను పూర్తిగా తొలగించాలి. ఈ విషయంలో మతపెద్దల సాయం తీసుకోవాలి. వారి సందేశాలను వీడియోల రూపంలో ప్రజలకు చేరవేయాలి. ఇప్పటివరకు ప్రజలను వ్యాక్సినేషన్‌ సెంటర్లకు తీసుకొచ్చి టీకా అందించారు. ఇప్పుడు అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలన్న ఉత్సాహంతో ప్రతి ఇంటినీ చేరుకోవాలి. మీ సహచరులు కొన్ని జిల్లాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేశారు. అదేరీతిలో మీ జిల్లాల్లోనూ చర్యలు చేపట్టండి. ఆదివాసీలు, వనవాసీలకు వ్యాక్సిన్‌ అందించడానికి మరింత శ్రమించాలి. బిర్సా ముండా వంటి ప్రముఖుల జయంతి నాడు ఆదివాసీ ప్రాంతాల్లో ఉత్సవ వాతావరణంలో వ్యాక్సినేషన్‌ నిర్వహించండి. సరళంగా, స్థానిక భాషల్లో అర్థమయ్యేలా ప్రజలకు చెప్పండి. మొదటి డోసులాగే రెండో డోసుకూ ప్రాధాన్యం ఇవ్వాలి. టీకా పట్ల ప్రజల్లో ఆసక్తి తగ్గకుండా చూడాలి. ఈసారి 100కోట్ల డోసులు పూర్తి చేసుకోవడంతో దీపావళి ఉత్సాహం అలుముకొంది. అలాగే కొత్త లక్ష్యాన్ని పూర్తి చేసుకొని క్రిస్మస్‌ను కూడా ఉత్సాహంగా జరుపుకోవాలి. ఇంటింటి తలుపుతట్టి టీకా అందించాలి” అని ప్రధాని జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, భూపేశ్‌ బఘేల్‌ సహా పలువురు సీఎంలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తలుపు తట్టి వ్యాక్సిన్‌ వేయండి – జిల్లా కలెక్టర్లకు ప్రధాని నిర్దేశం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీకాలపై వదంతులతో హాని పేదలకే – కేంద్ర మంత్రి హర్షవర్ధన్
కరోనా వ్యాక్సిన్ ‌పై వదంతులు, అసత్య ప్రచారాల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిపోయిన ప్రజలకే తీవ్ర హాని కలుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ‌పై దుష్ర్పచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైన సందర్భంగా.. వ్యాక్సిన్‌లపై కొందరు చేసే ఉద్దేశపూర్వక చెడు ప్రచారంపై కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది.

‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దేశవ్యాప్తంగా నేటి నుంచి కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ కొనసాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత తొందరగా ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ‌పై అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తిచేసే వారినుంచి ప్రజలను రక్షించుకోవాలన్నారు. లేకుంటే అలాంటి వదంతుల వల్ల సమాజంలో పేద, వెనుకబడిన వర్గాలకు తీవ్రహాని జరుగుతుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

సెకండ్‌ వేవ్ ‌పై విజయం దిశగా..

‘కరోనా వైరస్ ‌పై జరుగుతున్న పోరులో విజయం దిశగా మెల్లగా అడుగులు వేస్తున్నాం. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దు. ఒకవేళ నిర్లక్ష్యంగా వ్యవహరించి తేలికగా తీసుకుంటే, మరోసారి మహమ్మారి ఉద్ధృతి పెరగవచ్చు’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దేశప్రజలను హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం యోగా చేసిన ఆయన.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీకాలపై వదంతులతో హాని పేదలకే – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.