UNGUTURU – Vishwa Samvad Kendra Andhra Pradesh

భూమి తల్లిని కాపాడుకుందాం – శ్రీ భాగయ్య
రసాయనాలు వాడకుండా భారతీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని, అదే మనల్ని పోషిస్తున్న భూమి తల్లి పట్ల మనం చూపే కృతజ్ఞత అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు శ్రీ భాగయ్య అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులో జరిగిన భూ సుపోషణ్ అభియాన్ కార్యక్రమంలో శ్రీ భాగయ్య పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అయిదవ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ సుదర్శన్ జీ ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి హితకరమైన భారతీయ పద్ధతిలోనే వ్యవసాయం జరగాలని ఆకాంక్షించే వారని ఈ సందర్భంగా శ్రీ భాగయ్య గుర్తు చేసుకున్నారు.

ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాలలో శ్రీ పాలేకర్, శ్రీ సుభాష్ శర్మ వంటి వారెందరో విశేషమైన కృషి సలుపుతున్నారని ఆయన అన్నారు. పేర్లు ఏవైనా పర్యావరణానికి నష్టం కలిగించని శ్రేష్ఠమైన విధానాన్ని అనుసరించడం అత్యావశ్యకమని ఆయన పేర్కొన్నారు. మన తాత ముత్తాతల కాలం నుంచీ అనుసరిస్తూ వస్తున్న వ్యవసాయ విధానాలకు తోడు నూతన సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని, మన పురాతన విధానాలతో వాటిని జోడించి వ్యవసాయాన్ని చేయవలసిన అవసరమున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే అదే సమయంలో సాంకేతికత అంటే ఎరువుల వాడకం కాదన్న విషయాన్ని కూడా మరువరాదని ఆయన హెచ్చరించారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా రైతులు గత 200 సంవత్సరాల క్రితం నుంచే ఎన్నో అధునాతన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేసే వారని, దేశంలోని మిగతా రైతులు కూడా అదే విధంగా భూమికి, పర్యావరణానికి నష్టం కలిగించని అధునాతన వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని ఆయన సూచించారు.

అధిక దిగుబడినిచ్చే, పుష్టికరమైన, రసాయన రహితమైన, నాణ్యమైన విత్తనాలను నిరంతరం కాపాడుకుంటూ ఉండాలని వారు తెలిపారు. ఈమధ్య గుజరాత్ లో కొందరు రైతులు సుమారు 1800 రకాల విత్తనాలను ప్రదర్శించారని, ఇలాంటి ప్రదర్శనలు మిగిలిన రైతులకు కూడా ఎంతో ప్రేరణ దాయకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు.

‘ఈ భూమి మన తల్లి, మనమంతా ఆమె సంతానం’ అని అనాదిగా నమ్మిన జాతి మనది అని, మనకు కావలసిన ఆహారాన్ని, నీటిని, ఆవాసాన్ని ఇచ్చి, మనల్ని తల్లిలా పోషిస్తున్న భూమాతను సారవంతం చేసుకోవడం ద్వారా మనం ఆ తల్లి ఋణాన్ని తీర్చుకున్న వారమవుతామని, కనుక భూసారాన్ని సంరక్షించుకోవడమే మనం ఆ భూమాతకు ఇచ్చే బహుమతని శ్రీ భాగయ్య వివరించారు.

అనంతరం ఉంగుటూరులోని వ్యవసాయ క్షేత్ర, గోశాల నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న శ్రీ రామకృష్ణ రాజును శ్రీ భాగయ్య ఘనంగా సన్మానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భూమి తల్లిని కాపాడుకుందాం – శ్రీ భాగయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.