#Ukraine crisis – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు
డెన్మార్క్‌: ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులను విరమించాలని, యుద్ధం ఆగాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా సంక్షోభానికి పరిష్కారం కనుక్కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఐరోపా పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ డెన్మార్క్‌ చేరుకొని, ఆ దేశ ప్రధాని మెటె ఫ్రెడరిక్సెన్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి ఇద్దరూ చర్చించారు. భారత్‌ తన పలుకుబడిని ఉపయోగించి యుద్ధాన్ని విరమించడానికి రష్యాను ఒప్పించాలని డెన్మార్క్‌ ప్రధాని కోరారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఇరుదేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి. తక్షణమే శత్రుత్వాన్ని విడనాడాలని విజ్ఞప్తి చేశాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పులు విరమించాలి, యుద్ధం ఆగాలి .. మోదీ పిలుపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌!
ప‌రిశీలిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: చమురు, ఇతర వస్తువులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశాన్ని రష్యా భారత్‌కు అందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆఫర్‌ను పరిశీలిస్తోంది. “రష్యా చమురు, ఇతర వస్తువులను భారీ తగ్గింపుతో అందిస్తోంది. ట్యాంకర్, ఇన్సూరెన్స్ కవర్, ఆయిల్ బ్లెండ్స్ వంటి కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. మేము డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకుంటాము, ”అని భారత ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

భారతదేశం 80% చమురు దిగుమతి చేసుకుంటుంది. భారతదేశానికి రష్యా 2 నుండి 3% వరకు అమ్ముతుంది. చమురు ధరలు బాగా పెరగడంతో (40% పెరుగుదల), కేంద్ర ప్రభుత్వం రష్యా నుండి మరింత సేకరించాలని యోచిస్తోంది. ఇది పూర్తయితే, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించడంలో ఈ చర్య సహాయపడుతుంది. చాలా దేశాలు/అంతర్జాతీయ వ్యాపారులు రష్యాపై ఆంక్షల గురించి ఆందోళన చెందుతున్న విష‌యం విదిత‌మే.

రష్యా చమురును సేకరించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారిస్తున్న సమయంలో ప్రపంచ దేశాలు ఏ విధమైన వ్యాఖ్యలు భార‌త్‌పై చేస్తాయో చూడాలి. రాయిటర్స్ కోట్ చేసిన ఇద్దరు అధికారులు తమ పేర్ల‌ను వెల్ల‌డించ‌డానికి ముందుకు రాలేదు. రష్యా భారత్‌కు ఎంత చమురు ఆఫర్‌ చేసిందో, తగ్గింపు శాతం ఏమిటో చెప్పలేదు. రష్యాతో భారతదేశానికి సుదీర్ఘ రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ విషయంలో హింసను అంతం చేయాలని కేంద్రం వివిధ సందర్భాలలో రష్యాకి కోరింది. ఈ దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చౌక‌గా చ‌మురు.. భార‌త్‌కు ర‌ష్యా ఆఫ‌ర్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు
సుమీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన 694 మంది భారత విద్యార్థుల్ని తరలించినట్టు మంగళవారం కేంద్రం వెల్లడించింది. దీనితో యుద్ధం మధ్యలో చిక్కుకున్న భారతీయుల తరలింపులో చివరి గండం గడిచినట్ట‌యింది. సుమీలో చిక్కుకుపోయినవారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగానే వారిని బస్సుల్లో పోల్తావాకు తరలిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ వెల్లడించారు.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నట్టు సమాచారం. ‘నిన్న రాత్రి కంట్రోల్‌ రూమ్‌తో మాట్లాడా. 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో ఉన్నారు. ఈ రోజు వారందరూ పోల్తావాకు బయలుదేరారు’ అని మీడియాకు తెలిపారు. సుమీ యూనివర్శిటీకి చెందిన ఒక విద్యార్థి కూడా ఈ వార్తను ధ్రువీకరించారు. తమ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సలు వచ్చాయని.. తామంతా పోల్తావాకు చేరుకోనున్నామని తెలిపారు.

తమ విజ్ఞప్తిని మన్నించిన రష్యా మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేసిందని, దీంతో సుమీలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా తరలిస్తున్న‌ట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ట్వీట్‌ చేశారు. తీవ్రమైన చలిలో ఆహారం, నీరు తక్కువగా ఉన్నప్పటికీ, తాము 50 కి.మీ ప్రయాణించి రష్యా సరిహద్దుకు చేరుకునేందుకు యత్నిస్తున్నామని కొందరు విద్యార్థులు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నీతిమాలినోళ్ళు!
ల‌క్నో: ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి చేయ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కేంద్ర ప్ర‌భుత్వం.. అక్క‌డి భార‌తీయుల‌ను ర‌క్షించుకోవాల‌ని ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాల‌తో స్వ‌దేశానికి చేరారు. ఇంకా చేరుతున్నారు. నిజానికి ఈ ప‌ని భార‌త దేశానికి ఒక స‌వాల్‌. ప్ర‌పంచంలో ఒక‌టి, రెండు మిన‌హా త‌మ వారిని కాపాడుకోవ‌డంలో మిగ‌తా దేశాలు మిన్న‌కుండిపోయాయి. ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొన్న చొర‌వ‌కు అభినందించాల్సింది పోయి విమ‌ర్శిస్తున్నారు దేశంలోని నీతి లేని వాళ్ళు.

ఉత్తర్ ప్రదేశ్‌లోని హర్దోహికి చెందిన స‌మాజ్‌వాది పార్టీ నాయకుడు మ‌హేంద్ర యాద‌వ్‌ కుమార్తె వైశాలి తన ఇంట్లో నుంచే అంటే, భార‌త‌దేశంలో ఉండి తాను ఉక్రెయిన్‌లో చదువుతున్నానని, తనను భారత్ ఎంబసీ అసలు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్ర‌భుత్వంపై చిందులేసి, అప్ర‌తిష్ఠ‌పాలు చేయ‌డానికి ఏకంగా ఒక వీడియో తయారుచేసి నెట్‌లో వైరల్ చేసింది.

అయితే, అంద‌రూ ఆమెలా దేశ‌ద్రోహులు కాదు క‌దా… దేశ‌భ‌క్తులు ఆ అమ్మాయి ఇక్క‌డే ఉంటుంద‌ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది… పోలీసులు త‌మ డ్యూటీ చేశారు. ఇప్పుడామె క‌ట‌క‌టాలు లెక్కిస్తోంది.

కొస‌మెరుపు..

ఎందుకు చేశావు ఈ పని అంటే తండ్రి చేయమన్నాడని చెప్పింద‌ట‌..

నీతి లేని తండ్రి… నీతి లేని కూతురు!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నీతిమాలినోళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్!
విద్యార్థి హర్‌జోత్ సింగ్‌ను ర‌క్షించిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్

కైవ్: బహుశా మీరు హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ట్రాన్స్‌పోర్టర్ సినిమా (మూడు సినిమాలు) చూసే ఉంటారు. కానీ ట్రాన్స్‌పోర్టర్‌కు తాతలాంటి నిజమైన సినిమా చూపించాడు.. ఉక్రెయిన్ ర‌ణ‌రంగంలో ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.

విషయంలోకి వెళితే… ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో భారతీయ విద్యార్థి హర్‌జోత్ సింగ్‌కు బుల్లెట్ గాయమైన సంగ‌తి విదిత‌మే. అయితే, అక్క‌డి ప‌రిస్థితుల వ‌ల్ల సింగ్‌కు ప్రాధమిక చికిత్స మాత్రమే అందించ‌గలిగారు. విద్యార్థికి ప్రాణాపాయం క‌ల‌గ‌కుండా ఉండాలంటే, కైవ్ పట్టణం నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడోమిర్జ్ బోర్డర్‌కు తరలించాలి. నిజానికి ఇది పెద్ద సాహ‌స‌మే… ఎందుకంటే అది యుద్ధ‌భూమి! ఎటు చూసినా బాంబు దాడులు, హాహాకారాలు.. గాలిలో ఎగురుతున్న మృత‌దేహాలు… అయినా లెక్క‌చేయ‌లేదు… రంగంలోకి దూకాడు… సాహ‌సికుడు, భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ అయిన ఇండియన్ ఎంబసీ కారు డ్రైవర్.

హర్‌జోత్ సింగ్‌ను తీసుకుని బోడమిర్జ్ బోర్డర్‌కు బయలు దేరాడు. దారిలో కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌లను అత్యంత చాక‌చ‌క్యంగా తప్పించుకుని ముందుకు దూసుకుపోయాడు. దారిపొడవునా రోడ్లు బ్లాక్ చేయటం, పెట్రోల్ కొర‌త‌, వీటన్నింకంటే అత్యంత భయంకరమైన రాకెట్ దాడులనుండి తప్పించుకుని, మొత్తానికి హర్‌జోత్ సింగ్‌ను పోలెండ్‌కు చేర్చి, అతని ప్రాణాలు కాపాడాడు.

కైవ్‌ను విడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఫిబ్రవరి 27న హర్జోత్ సింగ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెస్ట్ ఎల్వివ్ నగరానికి క్యాబ్(టాక్సీ) ఎక్కాడు. ఈ క్రమంలో అతడికి నాలుగు బుల్లెట్లు తగిలాయి. కాగా, త్వరలో ఈ డ్రైవ‌ర్‌ను భారత ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. డ్రైవర్ పేరును భారత రాయబార కార్యాలయం వెల్లడించలేదు. శ‌భాష్ డ్రైవ‌ర్‌!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌నోడు… గ్రేట్ ట్రాన్స్‌పోర్టర్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి
ఐరాసలో కోరిన‌ భారత ప్రతినిధి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని భారతీయులతో పాటు అమాయకులైన ఇతర దేశాల పౌరులను సురక్షితంగా, నిరంతరాయంగా తరలించాలని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్​లోని​ పరిస్థితులపై మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్​లకు విన్నవించుకున్నప్పటికీ సుమీలో చిక్కుకున్న తమ విద్యార్థులను తరలించేందుకు సురక్షిత కారిడార్​ ఏర్పాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

దాడులకు తక్షణమే ముగింపు పలకాలని భారత్​ నిరంతరంగా కోరుతోందన్నారు తిరుమూర్తి. ఇరు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ మాట్లాడి.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారని తెలిపారు. ఇరు పక్షాలు చర్చల మార్గానికి తిరిగి రావాలని సూచించినట్టు చెప్పారు.

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయుల కోసం 80 విమానాలకుపైగా నడిపినట్టు వెల్లడించారు. అందుకోసం సహకరించిన ఉక్రెయిన్​, సరిహద్దు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్​ ఇప్పటికే ఉక్రెయిన్​, దాని సరిహద్దు దేశాలకు ఔషధాలు, టెంట్లు, నీటి నిలువ ట్యాంకులు వంటి సామగ్రిని మానవతా సాయం కింద అందించినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విదేశీ విద్యార్థులను తరలించడానికి నిరంతర చర్యలు తీసుకోవాలి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు
పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు

వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం

ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి…

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే దాదాపు 18 వేల మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి చేర్చింది. ఇందుకోసం వాణిజ్య విమానాలతో పాటు భారత నావికాదళం విమానాలను సైతం వినియోగించడంతో పాటు ఈ ఆపరేషన్‌లో సమస్యలు రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపింది.

ఉక్రెయిన్ సిటీల్లో ఉన్న భారత విద్యార్థులు, పౌరులు ఆ దేశ సరిహద్దుకు చేరుకుంటే.. అక్కడి నుంచి పక్కన ఉన్న స్లొవేకియా, హంగేరి, పోలాండ్, రొమేనియా దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు చేరుస్తోంది. అయితే, సరిహద్దులు దాటాక మన పౌరులకు వీసా సహా ఇతర సమస్యలు రాకుండా డాక్యుమెంటేషన్ సాఫీగా సాగేలా దగ్గరుండి కేంద్ర మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలా హంగేరి వెళ్ళిన కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ఇవాళ స్వదేశానికి తిరిగొచ్చారు. ఉక్రెయిన్ నుంచి హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ చేరుకున్న భారతీయుల చివరి బ్యాచ్‌తో స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌‌ ద్వారా వెల్లడించారు.

బుడాపెస్ట్‌ నుంచి మన విద్యార్థుల చివరి బ్యాచ్‌తో ఢిల్లీ చేరుకోవడం సంతోషంగా ఉందంటూ కేంద్ర మంత్రి హర్‌‌దీప్‌ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. హంగేరి నుంచి మొత్తంగా 6,711 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మన యువత స్వదేశానికి చేరుకోవడం ఎంతో ఉపశమనాన్ని ఇవ్వడంతో పాటు తనలో చాలా సంతోషాన్ని నింపిందన్నారాయన.

విద్యార్థులందరిన్నీ స్వదేశానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే విద్యార్థులంతా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలుసుకుంటారని హర్దీప్ పురి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నిలిచిపోయిన ప్రతి ఒక్క భారతీయ విద్యార్థిని వెనక్కి రప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.

సుమీ నగరంలో 700 మంది విద్యార్థులు

సుమీ నగరంలో సుమారు 700 మంది విద్యార్థులు చిక్కుకున్న విషయంపై మాట్లాడుతూ, కొద్ది మంది మాత్రమే మిగిలారని, వారితోనూ, కంట్రోల్ రూమ్‌తోనూ సంప్రదింపులు సాగిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ సైతం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ వెనక్కి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.

విద్యార్థి హర్⁬జోత్ సింగ్ సురక్షితం

ఇలా ఉండగా, ఉక్రెయిన్ దాడుల్లో గాయపడ్డ భారతీయ విద్యార్థి హర్⁬జోత్ సింగ్ సురక్షితంగా ఉన్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం సీ–17లో ఉక్రెయిన్ నుంచి అతడు భారత్⁬కు బయల్దేరాడు. ఇప్పుడు హర్⁬జోత్⁬ సేఫ్⁬గా ఉన్నాడని.. త్వరలోనే అతడు తన కుటుంబీకులతో కలుస్తాడని కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం!
న్యూఢిల్లీ: భార‌త‌దేశంపై నిత్యం విషం చిమ్మే పాకిస్తాన్‌పై.. ఇంకా గ‌ట్టిగా చెప్పాలంటే ప్ర‌పంచంలోని ఏ దేశపైనా భార‌త్‌కు ప‌గ లేద‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. రష్యా సైనిక చర్యల కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఒక భారతీయ విద్యార్థి, కీవ్‌లోని ఒక పాకిస్తానీ విద్యార్థినికి రొమేనియన్ సరిహద్దుకు చేరుకోవడంలో సహాయం చేశాడు. అక్కడ నుంచి ఆమె తన మాతృభూమికి వెళ్ళింది. ఉక్రెయిన్ నుండి ఇటీవలే తిరిగి వచ్చిన అంకిత్ యాదవ్, పాకిస్తాన్ కాన్సులేట్‌కు చేరుకోవడంలో తనకు సహాయం చేశాడని ఆ యువతి తెలిపింది. అక్కడి నుండి ఆమెను స్వగ్రామానికి తరలించారు.

నేనొక్క‌డినే భార‌తీయుడిని…

“ఫిబ్రవరి 24 సాయంత్రం నేను ఆమెను ఒక బంకర్‌లో కలిశాను. ఉక్రేనియన్లతో నిండిన ఆ బంకర్‌లో నేనొక్కడినే భారతీయుడిని. ఆమె మాత్రమే పాకిస్థానీ. భాషా అవరోధం కారణంగా, మేము ఎవరితోనూ మాట్లాడలేక‌పోయాము. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతూ ఉండడంతో మేము నగరం నుండి పారిపోవడానికి ఒక ప్రణాళికను రూపొందించి, ఫిబ్రవరి 26న బయలుదేరాలని అనుకున్నాము. కానీ కర్ఫ్యూ ఉంది. దీంతో మా మొదటి ప్రయత్నంలో మేము విఫలమయ్యాము, ” అని యాదవ్ చెప్పారు.

కీవ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న యాదవ్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన అనుభవాలను వివరించాడు. నిరంతర బాంబు దాడులు, రష్యా సైనిక చర్యల కారణంగా బంకర్ నుండి బయటకు రావడానికి వారిని అనుమతించలేదని చెప్పాడు. ఆ సమయాల్లో ఆహారాన్ని సేకరించడం సమస్యగా అనిపించిందని యాద‌వ్ పేర్కొన్నారు.

ఆహారం లేక‌…

“నాసల్ స్ప్రే తీసుకోవడానికి ఫిబ్రవరి 27న బంకర్ నుండి బయటకు వెళ్ళడానికి నన్ను అనుమతించారు. అప్పుడే నేను నా హాస్టల్‌కు పారిపోయాను. మా ఇద్దరికీ ఆహారం ప‌ట్ట‌కుని తో తిరిగి వచ్చాను” అని యాదవ్ చెప్పారు. “తగినంత ఆహారం లేకపోవడంతో, ఫిబ్రవరి 27 రాత్రి ఉక్రేనియన్లు మాకు అందించిన అన్నం మాత్రమే తిన్నాము. నిద్రపోయాము,” అన్నారాయన.

బంకర్ నుండి పారిపోయాము

“ఫిబ్రవరి 28న కర్ఫ్యూ ఎత్తివేయబడినప్పుడు, మేము బంకర్ నుండి పారిపోయాము.. తమ సామ‌గ్రిని తెచ్చుకోడానికి ఒక దుకాణానికి వెళ్ళాం. ఆపై నగరం విడిచి వెళ్ళ‌డానికి ప్లాన్ చేయడం ప్రారంభించాము” అని యాదవ్ చెప్పారు. “ఆ సమయంలో ఆమెకు పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుండి కాల్ వచ్చింది. ఆమె ఇప్పటికీ తాను కీవ్‌లో ఉన్నానని, పాకిస్తాన్‌కు చెందిన వారెవరూ ఆమెతో లేరని వారికి చెప్పినప్పుడు, ఎంబసీ అధికారులు నన్ను సరిహద్దుకు ఆమెను తీసుకుని వెళ్ళ‌మ‌ని అభ్యర్థించారు” అని యాదవ్ తెలిపారు.

5 కి.మీ. ప్ర‌యాణించిన త‌ర్వాత‌…

రైల్వే స్టేషన్‌కు సుమారు 5 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత, తాము మరికొంత మంది విద్యార్థులను కలిశామని అయితే రద్దీగా ఉండే రైలులో ఎక్కలేకపోయామని తెలిపారు. అలా మొదటి మూడు రైళ్లను కోల్పోయామని యాదవ్ చెప్పారు. “అదృష్టవశాత్తూ, మాకు ఇంకో రైలు వచ్చింది. కానీ ఖాళీ సీట్లు లేవు. మేము నేలపై కూర్చోవలసి వచ్చింది. కొంత స‌మ‌యం తర్వాత మా రైలులో పేలుడు వినిపించింది కూడా. చివరికి రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించి మమ్మల్ని మా గమ్యస్థానానికి తీసుకువెళ్లింది,” యాదవ్ అన్నారు.

పాకిస్తానీ అమ్మాయి రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో వారు టాక్సీని ఏర్పాటు చేశారు. ఇతర పాకిస్తానీ జాతీయులను రొమేనియా సరిహద్దుకు తరలించడానికి బస్సును ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆ యువతి తన సొంత గ్రామానికి చేరుకుంద‌ని యాద‌వ్ వివ‌రించాడు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తానీ విద్యార్థినికి భార‌తీయుడి సాయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది
పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న వారు సరిహద్దులకు చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల ద్వారా భారత్‌కు తీసుకొస్తోంది.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 76 విమానాల్లో 15,920 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ఎన్నెన్ని విమానాలలో ఎంత మందిని భారత్‌కు తీసుకొచ్చామన్నది వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

రొమేనియా నుంచి 31 విమానాలలో 6,680 మందిని, పోలాండ్ నుంచి 13 విమానాలలో 2,822 మందిని, హంగేరి నుంచి 26 విమానాలలో 5,300 మందిని, స్లొవేకియా నుంచి 6 విమానాల్లో 1,118 మందిని భారత్‌కు చేర్చామని ఆయన వివరించారు.

ఆదివారం 11 ప్రత్యేక విమానాల్లో 2,135 మంది భారత పౌరులను ఉక్రెయిన్‌ నుంచి తిరిగి తీసుకువచ్చారు. మొత్తం మీద ఫిబ్రవరి 22 నుండి 66 ప్రత్యేక పౌర విమానాల్లో ఎయిర్‌లిఫ్ట్‌ చేయబడిన భారతీయుల సంఖ్య 13,852 కి చేరుకుంది. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆదివారం మూడు ప్రత్యేక విమానాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 214 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపి(109), తెలంగాణ(105) మంది విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఎఎఫ్‌) 10 సోర్టీల ద్వారా ఆయా దేశాలకు 26 టన్నుల రిలీఫ్‌ లోడ్‌ను తీసుకెళ్లి, 2056 మంది ప్రయాణికులను వెనక్కి తీసుకొచ్చారు. సోమవారం బుడాపెస్ట్‌ (5), సుసెవా (2), బుకారెస్ట్‌ (1) నుండి 1,500 మందికి పైగా భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఎనిమిది ప్రత్యేక విమానాలు రానున్నాయి.

తాజాగా మరోసారి అలెర్ట్ జారీ

కాగా, ఉక్రెయిన్‌లో ఇంకా చిక్కుకుని ఉన్న వారిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ఆదివారం భారత ప్రభుత్వం తాజాగా మరోసారి అలెర్ట్ జారీ చేసింది. తక్షణం అక్కడ ఉన్న భారతీయులు అంతా తమ వివరాలతో ఒక గూగుల్ ఫారం నింపాలని సూచిస్తూ ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.

ఉక్రెయిన్‌లో ఉన్నవ్యక్తి పేరు, వయసు, మెయిల్ ఐడీ, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్‌లో వారు ఉన్న సిటీ పేరు, ప్రస్తుతం ఉన్న లొకేషన్, ఉక్రెయిన్‌లో వాడుతున్న ఫోన్ నంబర్, భారత్‌లో వారికి సంబంధించిన వ్యక్తి ఫోన్ నంబర్, ఇంకా ఆ వ్యక్తితో ఒకే చోట ఎక్కువ మంది ఉంటే వారి సంఖ్యను గూగుల్ ఫామ్‌లో పొందుపరచాలని పేర్కొంది. ఈ వివరాల ఆధారంగా వారిని గుర్తించి స్వదేశానికి తీసుకురానున్నట్టు ఎంబసీ తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

99 దేశాల్లో భారతీయ విద్యార్థులు
భారత విదేశాంగ శాఖ వెల్ల‌డి

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 99 దేశాల్లో మన విద్యార్థులు వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తున్నట్టు… మొత్తంగా అన్ని దేశాల్లో కలిపి 11.33 లక్షల మంది విద్యార్థులున్నట్టు, వారిలో 80-85 శాతం మంది పీజీ విద్యకే వెళ్ళినట్టు విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా చైనా, జర్మనీ, ఉక్రెయిన్‌, ఫిలిప్పీన్స్‌, కిర్గిస్థాన్‌, కజికిస్థాన్‌ దేశాలకు వైద్య విద్య కోసమే వెళ్తున్నారు. ఉక్రెయిన్‌కు వెళ్లిన 18 వేల మందిలో ఎక్కువమంది వైద్య విద్య అభ్యసిస్తున్నట్టు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఎక్కువగా కెనడాలో 2.15 లక్షల మంది, అమెరికాలో 2.12 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 2.19 లక్షల మంది ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ భాగం తమ కుటుంబాలు స్థిరపడిన కారణంగా వెళ్లిన వారేనని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. విదేశీ విద్యకు వెళ్లే వారిలో చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు వచ్చేవారి శాతం అతి స్వల్పమేనని, ఎక్కువ మంది ఆయా దేశాల్లోనే స్థిరపడుతున్నారని వారు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 99 దేశాల్లో భారతీయ విద్యార్థులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.