TWITTER INDIA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేడు భారత్‌లో ‘రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి'(ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు సంస్థ వెబ్‌సైట్‌లో ఆయన వివరాలు ఉంచింది. అందులోని ఈమెయిల్ ​ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం, ట్విటర్​ మధ్య తీవ్ర వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ నిబంధనలు పాటించడంలో ట్విటర్‌ విఫలమైందని ఇటీవల దిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్విటర్‌ తీరుపై దిల్లీ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించిన కోర్టు.. ఇంకెంత కాలం పడుతుందని ప్రశ్నించింది. అందుకు ఇటీవలే 8 వారాల గడువు కోరిన ట్విటర్​.. ఆలోపే ఆర్‌జీఓను నియమించింది.

నూతన ఐటీ చట్టం ప్రకారం 50లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యామాలు తప్పనిసరిగా ముగ్గురు అధికారులను (ఆర్‌జీఓ, చీఫ్ కంప్లయన్స్​ ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించుకోవాలి. వారందరూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. కాగా, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విటర్​ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకుగానూ ట్విటర్‌పై కూడా కేసులు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత IT చట్టాలకు తలొగ్గిన ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు
ట్విట్టర్‌ తీరుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు అధికారుల నియామకంలో జాప్యం తగదని హెచ్చరించింది. అధికారుల నియామకానికి ఇంకెంత కాలం పడుతుందని ట్విట్టర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

అధికారుల నియామకంలో జాప్యం వహిస్తే సహించేది లేదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. భారత్ లో ట్విట్టర్ కొనసాగాలంటే అధికారుల నియామకంలో ఆలస్యం ఉండకూడదని పేర్కొంది. అధికారిని నియమించకపోవడం ఖచ్చితంగా చట్ట ధిక్కరణ కింద పరిగణిస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ లో కొనసాగాలంటే భారత్ చట్టాలను గౌరవించి తీరాలి – ట్విట్టర్ కు స్పష్టం చేసిన ఢిల్లీ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి
భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ” కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పాటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయా మాధ్యమాల్లో పోస్టుచేసిన అసభ్యకర సందేశాలను తొలగించడంతో పారదర్శకత దిశగా ముందడుగు పడినట్లయింది” అంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను ఫేస్‌బుక్‌ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్రం మే 26న కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విటర్‌ మాత్రం అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు నిబంధనలు అమలు చేసిన తర్వాత 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 20 లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఇటీవల దాదాపు 60 వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ చెప్పుకొచ్చింది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవేనని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్
ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విట్టర్కు మధ్య వివాదం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

50 లక్షల యూజర్లున్న సోషల్‌మీడియా సంస్థలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలి.. వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్‌ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ
ట్విట్టర్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విటర్‌ ఖాతాను నిలిపివేసింది. తన ట్విటర్‌ ఖాతా గంటపాటు నిలిచిపోయినట్లు స్వయంగా కేంద్రమంత్రి వెల్లడించారు. గత కొంతకాలంగా ట్విటర్‌, కేంద్రం మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘ఫ్రెండ్స్‌.. ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. ట్విటర్‌ దాదాపు గంట పాటు నా ఖాతాను యాక్సిస్‌ చేసుకోనివ్వలేదు. అమెరికా డిజిటల్‌ మిలీనియం కాపీరైట్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పి నా ఖాతాను కొంతసేపు బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత యాక్సిస్‌ను పునరుద్ధరించింది’’ అని రవిశంకర్‌ ప్రసాద్‌ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ట్విటర్‌ చర్యలు నూతన ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఖాతాను యాక్సిస్‌ను నిలిపివేసే ముందు తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.

నేను పోస్ట్‌ చేసిన నా టీవీ ఇంటర్వ్యూ వీడియోలపై గత కొన్నేళ్లుగా ఏ టెలివిజన్‌ ఛానల్‌ గానీ, ఏ యాంకర్‌ గానీ కాపీరైట్‌ ఫిర్యాదులు చేయలేదు. కానీ, ఫిర్యాదులు వచ్చినందువల్లే ఖాతాను నిలిపివేశామని ట్విటర్‌ చెబుతోంది. నిజానికి ట్విటర్‌ ధిక్కార చర్యలపై తాను మాట్లాడినందుకే తన ఖాతాను బ్లాక్‌ చేసి ఉంటార’’ని కేంద్రమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నూతన ఐటీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించేందుకు ట్విటర్‌ ఎందుకు నిరాకరిస్తుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఒకవేళ ట్విటర్‌ ఆ నిబంధనలను అమలు చేస్తే.. తమ ఎజెండాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల ఖాతాలను ఏకపక్షంగా బ్లాక్‌ చేసే అవకాశం ఉండదు కదా..’’ అని ఆయన సామాజిక మాధ్యమ సంస్థకు చురకలంటించారు. ఇంతజరిగినా.. నూతన ఐటీ నిబంధనలపై తాము రాజీపడే ప్రసక్తే లేదని, ఏ సామాజిక మాధ్యమ వేదికైనా రూల్స్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

కేంద్రం, ట్విటర్‌ మధ్య గత కొంతకాలంగా తరచూ వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకురాగా.. ట్విటర్‌ వాటిని అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం.. స్థానిక అధికారులను నియమించడంలో సంస్థ విఫలమవడంతో ట్విటర్‌ మధ్యవర్తి రక్షణ హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్‌లో పలు రాష్ట్రాల్లో క్రిమినల్‌ కేసులు కూడా నమోదవడం గమనార్హం.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నూతన ఐటీ చట్టాలను ఉల్లంఘించిన ట్విట్టర్… కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ఖాతా నిలిపివేత… గంట తరవాత పునరుద్ధరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన ట్విట్టర్‌ ఎండీ
నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్‌లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్‌ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణ నిమిత్తం ట్విటర్‌ ఇండియా హెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరీ నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే, ఇదే సమయంలో మనీశ్.. ముందస్తు బెయిల్‌ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దాడి కేసులో తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన నిన్న కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఇటీవల ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ట్విటర్‌లో వైరల్‌ అయ్యాయి. అయితే, వాస్తవాలను కప్పిపుచ్చి ఆ వీడియోల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ పోస్టులపై ట్విటర్‌, ట్విటర్‌ కమ్యూనికేషన్‌ ఇండియాపై కేసు నమోదు చేశారు. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ గతవారం ట్విటర్‌ ఇండియా ఎండీ మనీశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ”సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. ట్విటర్‌ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది” అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో జులై 24న తాను ఘాజియాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తున్నట్టు మనీశ్‌ గత సోమవారం వెల్లడించారు. అయితే విచారణకు వెళ్లకముందే ఆయన ముందస్తు బెయిల్‌ కోరడం గమనార్హం.

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ‘సురక్షిత ఆశ్రయం'(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్‌ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన ట్విట్టర్‌ ఎండీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ భారత విభాగానికి ఎండీగా ఉన్న మనీషా మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారని.. దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు లోనీ బోర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరణను రికార్డు చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

”సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విటర్‌ను ఉపయోగించుకున్నారు. ట్విటర్‌ సంస్థగానీ, భారత్‌లోని దాని విభాగంగానీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ విద్వేషపూరితమైన సందేశం వైరల్‌గా మారేందుకు ఆస్కారం ఏర్పడింది” అని మహేశ్వరికి పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.

సందేశాన్ని పంపినవారితో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అలాగే ట్విటర్‌ను సైతం ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం గమనార్హం. భారత్‌లో కొత్త డిజిటల్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్‌పై కేసు నమోదవడం ఇదే తొలిసారి.

నూతన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) నిబంధనలు పాటించనందుకు ‘సురక్షిత ఆశ్రయం'(సేఫ్‌ హార్బర్‌) అన్న రక్షణ కవచాన్ని ట్విటర్‌ కోల్పోయింది. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని పలుమార్లు సూచించినా పట్టించుకోకపోవడంతో కేంద్రం ఈ సౌకర్యాన్ని తొలగించింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవ్యతిరేకమైన సమాచారాన్ని పెడితే తృతీయ పక్షం కింద ట్విటర్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం చర్యలు తీసుకొనే వీలు కలుగుతుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు : వారంలోగా వివరణ ఇవ్వండి : ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల నోటీసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం
సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్‌ ఇంకా భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు తుది నోటీసులు జారీ చేసింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల అమలు కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగియడంతో మే 26 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనల కింద చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చి వారం గడిచినా ట్విటర్‌ ఇంకా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని ఆరోపించింది.

ఈ క్రమంలోనే కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నేడు ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే చివరి నోటీసు అని, నిబంధనలు తక్షణమే పాటించకపోతో ట్విటర్‌ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. అప్పుడు సంస్థ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాకు వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ మార్క్‌ను శనివారం కాసేపు తొలగించి మళ్లీ యాడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది గంటలకే ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్‌’ ఇచ్చిన భారత ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్రం హెచ్చరికలతో దిగి వచ్చిన ట్విట్టర్.. వివాదాస్పద ఖాతాలు తొలగింపు.
“మాది సొంత న్యాయవ్యవస్థ. మేము ఎవ్వరికీ తలొగ్గం. భయపడం.” అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న ట్విట్టర్…. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గట్టి హెచ్చరికలతో దిగి వచ్చింది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి మాట్లాడుతూ “అరెస్టుల దాకా తెచ్చుకోవద్దు. ఈ దేశంలో పని చెయ్యాలంటే ఇక్కడి చట్టాలను గౌరవించాల్సిందే.” అని తీవ్ర హెచ్చరికలు జారీ చెయ్యడంతో ట్విట్టర్… కేంద్రం రద్దు చేయమన్న వివాదాస్పద ఖాతాలలో 97 శాతం తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టరే స్వయంగా వెల్లడించడం విశేషం.

కేంద్ర ప్రభుత్వం రద్దు చెయ్యమని చెప్పిన 1435 ఖాతాలలో 1398 మంది ఖాతాలను ట్విట్టర్ రద్దు చేసింది. రద్దు చేయబడిన వాటిలో ఖలీస్తాన్‌కు స్పష్టంగా మద్దతుగా ఉన్న 1178 ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. వీటితో పాటు 257 ఖాతాల్లో ‘మోడీ జెనోసైడ్’ అనే హ్యాష్‌ట్యాగ్ తో ఉన్న 220 ఖాతాలను కూడా రద్దు చేసింది.

నిన్న కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ అధికారులను నేరుగా పిలిపించి అల్టిమేటం జారీ చేసిన తరువాత ట్విట్టర్ ఈ నిర్ణయాలు తీసుకుంది. నిన్న కేంద్ర సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ “ట్విట్టర్ ద్వంద వైఖరిని ఏ మాత్రం సహించేది లేదు. అమెరికాలో క్యాపిటల్ హౌస్ మీద దాడి జరిగితే ట్విట్టర్ పోలీసుల వైపు మొగ్గు చూపింది. అదే ఎర్రకోట మీద దాడి జరిగితే మీరు వేర్పాటువాదుల వైపు మొగ్గు చూపుతోంది. ఈ వైఖరిని ఏ మాత్రం సహించం. మీ కంపెనీ సొంత చట్టలకంటే ఈ దేశ చట్టాలు ముఖ్యం. ఇక్కడ పని చెయ్యాలంటే ఈ దేశ చట్టాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందే.” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మరోవైపు జాతీయవాదులు “బ్యాన్ ట్విట్టర్” అని ట్విట్టర్ లో ప్రచారం చేస్తుండడం. కేంద్ర మంత్రులు స్వదేశీ యాప్ “koo” లో ఖాతాలు తెరిచి అక్కడ నుంచే ట్విట్టర్ కి కౌంటర్ ఇస్తుండంతో ట్విట్టర్ భయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షలాదిమంది ట్విట్టర్ ని వదిలేసి స్వదేశీ “koo” యాప్ ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోవడంతో ఎక్కడ అసలుకే మోసం వస్తుందనే భయంతో ట్విట్టర్ దారికొచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్రం హెచ్చరికలతో దిగి వచ్చిన ట్విట్టర్.. వివాదాస్పద ఖాతాలు తొలగింపు. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇలా అయితే అరెస్టు చెయ్యాల్సి వస్తుంది – ట్విట్టర్ కు కేంద్రం హెచ్చరిక
సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఆందోళనలకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడే ఖాతాలను తొలగించే అంశంలో… ట్విటర్ వ్యవహరిస్తోన్న తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. నకిలీ వార్తలు, హింసను ప్రోత్సహించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మీకు భారత్ ‌లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మీరు వ్యాపారం చేసుకోవడానికి, ఆదాయం పొందడానికి తగినంత స్వేచ్ఛ ఉంది. కానీ మీరు తప్పకుండా భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి. మేం సామాజిక మాధ్యమాలను చాలా గౌరవిస్తాం. ఇవి సామాన్య ప్రజానీకాన్ని శక్తివంతం చేశాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే నకిలీ వార్తలు, హింసను ప్రేరేపించే విధంగా సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవ్‌’ అని పార్లమెంట్‌ వేదికగా ట్విటర్ ‌ను గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన ఫేస్‌బుక్, యూట్యూబ్‌, లింక్డిన్‌ వంటి సంస్థల పేర్లను కూడా ప్రస్తావించారు.

యూఎస్ లో ఒకలా…. భారత్‌లో మరోలా….

బుధవారం ట్విటర్ బ్లాగ్‌ పోస్టు అనంతరం కూడా కేంద్రం నుంచి ఈ తరహా స్పందనే వచ్చింది. భారత్‌లో పనిచేస్తోన్న ఒక వ్యాపార సంస్థగా అది భారత చట్టాలను గౌరవించాలని స్పష్టం చేసింది. సొంత నియమాలు, మార్గదర్శకాలతో సంబంధం లేకుండా వాటిని పాటించాలని తేల్చిచెప్పింది. ‘చట్టబద్ధంగా ఆమోదించిన ఆదేశాలను భారత్‌లో పనిచేస్తోన్న ఏ వ్యాపార సంస్థ అయినా తక్షణమే పాటించాలి. ఆలస్యం చేస్తే…. వాటికి అర్థం లేకుండా పోతుంది’ అని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా క్యాపిటల్‌ హిల్ భవనంపై దాడి జరిగినప్పుడు సామాజిక మాధ్యమ సంస్థ తీరుకు…. ప్రస్తుతం వ్యవహరిస్తోన్న తీరు పూర్తి భిన్నంగా ఉందని, ఇది తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వ్యాఖ్యానించింది. అంతేగాక, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే… ట్విటర్‌ ఉన్నతాధికారులు అరెస్టును ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇలా అయితే అరెస్టు చెయ్యాల్సి వస్తుంది – ట్విట్టర్ కు కేంద్రం హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.