TRIPLE TALAQ – Vishwa Samvad Kendra Andhra Pradesh

భార్య బ‌రువు పెరిగింద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌!
ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌ మేరఠ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు లిసాడిగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తన కుటుంబంతో కలిసి పోలీసులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

‘ట్రిపుల్ తలాక్ కోసం నా భర్త విడాకుల నోటీసులు పంపాడు. నోటీసులు అందగానే భర్తతో మాట్లాడాను. దానికి ఆయన చెప్పిన సమాదానం నన్ను షాక్​కు గురిచేసింది. నేను లావు అయ్యానని అందుకే.. విడాకులు ఇస్తున్నానని తెలిపాడు. నాకు పోలీసులే న్యాయం చేయాలి. నాకు ఎనిమిదేళ్ళ క్రితం సల్మాన్​తో వివాహమైంది. ఏడేళ్ళ‌ కుమారుడు కూడా ఉన్నాడు. నెల క్రితం భర్త సల్మాన్ నన్ను ఇంటి నుంచి గెంటేశాడు’ అని బాధితురాలు పేర్కొంది. కాగా, ట్రిపుల్ తలాక్ కేసు తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలిపారు. అలాంటి ఫిర్యాదులు ఏమైనా వస్తే మాత్రం కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భార్య బ‌రువు పెరిగింద‌ని ట్రిపుల్ త‌లాక్ చెప్పిన భ‌ర్త‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాతపూర్వకంగా కూడా తలాక్‌ చెల్లదు
అమ‌రావ‌తి: నోటి మాటగా మూడుసార్లు తలాక్‌ చెప్పడం ఇస్లాం చట్ట నిబంధనలకు విరుద్ధమైనప్పుడు, తలాక్‌నామా రూపంలో లిఖితపూర్వకంగా రాసుకున్నా కూడా చెల్లదని, వివాహం రద్దు కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.

ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలని తెలిపింది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్‌ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు.

తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్‌ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు.

పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్‌బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్‌ సైదా అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్‌బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది.

దీనిని సవాలు చేస్తూ గౌస్‌బీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్‌బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో పంపి వివాహం రద్దయినట్టు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాతపూర్వకంగా కూడా తలాక్‌ చెల్లదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’!
ల‌క్నో: ఉత్తర‌ప్రదేశ్​ గోండా జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురాలేదని భార్యపై బంధువులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ తర్వాత బాధితురాలికి ‘త్రిపుల్ తలాక్​’ చెప్పి విడాకులు తీసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లఖ్​నవూకు చెందిన నిందితుడు మహమ్మద్ అద్నాన్‌కు కొన్నేళ్ళ కింద‌ట బాధితురాలితో వివాహమైంది. అదనపు కట్నం కోసం తరచుగా ఆమెను వేధించేవాడు. తీవ్రంగా కొట్టేవాడు. కొన్ని రోజుల నుంచి అద్నాన్ పెడుతున్న హింసలు తట్టుకోలేక.. బాధితురాలు తన పుట్టింట్లో ఉంటోంది. అద్నాన్, అతని బంధువులు మంగళవారం బాధితురాలి కన్నవారింటికి వెళ్ళారు.

ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించినా.. ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించాడు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు నిందితుడు అద్నాన్​ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతడి​ బంధువుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

క‌ర్ణాట‌క‌లో త్రిపుల్ తలాక్

అదనపు వరకట్నం తీసుకురాలేదని అపార్ట్​మెంట్ లిఫ్ట్​లో భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ భర్త. అనంతరం భార్యను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులోని సుద్దుగుంటెపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

బాధితురాలికి మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి​తో కొన్నాళ్ళ కింద‌ట వివాహం జరిగింది. అతడికి రూ.30 లక్షల కట్నం ఇచ్చారు. అయినా అది చాలదన్నట్టు అదనపు కట్నం కోసం అక్రమ్ తన భార్యను నిత్యం వేధించేవాడు. రంజాన్ పండగ సందర్భంగా రూ.10 లక్షలు తీసుకురమ్మని బాధితురాల్ని డిమాండ్ చేశాడు. పుట్టింటికి వెళ్ళిన ఆమెను కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిచాడు. బాధితురాలు డబ్బులు తీసుకురాకపోవడం వల్ల లిఫ్ట్​లోనే ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు.

The post కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత ‘త్రిపుల్ తలాక్​’! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆమెకు భరణం చెల్లించాలి : ట్రిపుల్ తలాక్ బాధితురాలు, పిటిషనర్ అటియా సబ్రీకి అనుకూలంగా సహారన్పూర్ కోర్టు తీర్పు
సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసులో పిటిషనర్లలో ఒకరైన అటియా సబ్రీ శనివారం సహారన్పూర్ కోర్టులో తన భర్తపై భరణం కోసం చేసిన పోరులో విజయం సాధించారు.

ఆమెకు నెలవారీ నిర్వహణగా నెలకు 21000 రూపాయలు చెల్లించాలని కోర్టు ఆమె భర్తని ఆదేశించింది.దానికి తోడుఈ కేసు సుమారు ఐదేళ్లుగా కొనసాగుతున్నందున బకాయిగా ఆమెకు 13.4 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.

మొహమ్మద్ వాజిద్ అలీ మార్చి 2012 లో సబ్రిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2013 లో ఒక ఆడపిల్ల పుట్టింది. 2014 లో సబ్రికి మరో అమ్మాయి పుట్టింది.దాంతో ఆమెకు సమస్యలు ప్రారంభమయ్యాయ్.

మగ పిల్లలను కననందుకు అలీ, అతని కుటుంబం ఆమెను వేధించడం ప్రారంభించారు.వారు అదనపు కట్నం కూడా డిమాండ్ చేయడం ప్రారంభించారు. అప్పటినుండి ఆమెపై శారీరక,మానసిక హింస కొనసాగింది.

2015 నవంబర్‌ ట్రిపుల్ తలాక్ ద్వారా అలీ ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. దాంతో సబ్రి ప్రపంచం తలక్రిందులైపోయింది. ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టారు. దాంతో ఆమె “ట్రిపుల్ తలాక్” అనే మధ్యయుగపు మూఢ ఆచారానికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

3: 2 మెజారిటీతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో,సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ ను “రాజ్యాంగ విరుద్ధం”, “ఏకపక్షం” మరియు “ఇస్లాంలో భాగం కాదు” అని పేర్కొన్న సంగతి తెలిసిందే.

తన భర్త నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆమె సహారన్పూర్ కోర్టు మెట్లెక్కగా కోర్టు శనివారం ఆమెకు అనుకూలంగా తీర్పిచ్చింది.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆమెకు భరణం చెల్లించాలి : ట్రిపుల్ తలాక్ బాధితురాలు, పిటిషనర్ అటియా సబ్రీకి అనుకూలంగా సహారన్పూర్ కోర్టు తీర్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.