Tourism – Vishwa Samvad Kendra Andhra Pradesh

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?
ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు. ఈ టూర్ వారణాసిలో ప్రారంభం అవుతుందని.. దాదాపు 51 రోజులపాటు యాత్ర కొనసాగి దిబ్రుగఢ్‌లో టూర్ ముగుస్తుందన్నారు. భారతదేశంలోని అయిదు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ సాగుతుంది. క్రూయిజ్ సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో బంగ్లాదేశ్‌లోనే 1,100 కిలోమీటర్లు కొనసాగుతుంది. 51 రోజుల యాత్రలో 50 పర్యాటక ప్రాంతాలను కవర్‌ చేస్తుంది.

గంగా విలాస్ యాత్రలో మొదటి విడతలో స్విట్జర్లాండ్ పర్యాటకులు ఉంటారు. వీరు ప్రసిద్ధ గంగా హారతిని కూడా చూడొచ్చు. బౌద్ధులు ఆరాధించే సారనాథ్, అస్సాంలోని వైష్ణవ సంస్కృతికి కేంద్రమైన మజులి, సుందర్‌బన్స్, కాజిరంగా జాతీయ ఉద్యానవనం సందర్శించవచ్చు. ఈ క్రూయిజ్‌కు రెండేళ్లకు బుకింగ్స్ ఉన్నాయని నిర్వాహకులు చెబుతుండటం విశేషం.

ఈ టూర్ ప్యాకేజీ ఎంతంటే..

ఒక్కోక్కరికి రూ.12.6 లక్షలు టూర్‌ ప్యాకేజీ వసూలు చేస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన టూర్ మార్చి 1న ముగియనుంది. ఈ క్రూయిజ్‌లో వెళ్లే పర్యాటకులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలను చూడవచ్చు.

కోల్‌కతాకు చెందిన అంటారా సంస్థ లగ్జరీ రివర్ క్రూయిజ్‌ ను ఆపరేట్ చేస్తోంది. ఈ షిప్ ఈ క్రూజర్‌లో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఇందులో 36 మంది పర్యాటకులు వెళ్లొచ్చు. 40 సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది.

The post ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్!
శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ నేపాల్లోని జనకపురితో అనుసంధానం

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్ల‌డి

న్యూఢిల్లీ: శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలు అన్నింటినీ రైలు మార్గంతో అనుసంధానిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి దిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో ఆయన ప్రారంభించారు. రామాయణ యాత్ర పేరుతో 18 రోజులపాటు కొనసాగే ఈ రైలు దేశంలో రాముడితో సంబంధం ఉన్న వివిధ ప్రదేశాలతోపాటు నేపాల్‌లోని జనక్‌పురి వరకు సాగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

పర్యాటక శాఖ రైల్వే శాఖతో కలిసి కృష్ణ సర్క్యూట్‌, బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లకు భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైళ్లను నడపనున్నట్టు తెలిపారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. రామాయణ యాత్రకు రైలును ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు. భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, వారసత్వ సంపదను తెలియజేయడమే భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ప్రారంభం వెనుక ఉన్న ఉద్దేశమని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామాయణం యాత్రపేరుతో రైల్వేలైన్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం!
యాదగిరిగుట్ట: అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రం అంటూ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా రూ.1280 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల డొల్లతనం ఒక్కవానకే బయటపడింది! బుధవారం వేకువజామున ఈదురు గాలులతో కురిసిన భారీ అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది.

లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భాలయం మినహా.. కొండపైన, కొండకింద ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానాలయ ముఖమండపంలోనికి, దర్శన క్యూకాంప్లెక్స్‌, ప్రసాద విక్రయశాలలోకి వరద నీరు చేరింది.

రెండో ఘాట్‌రోడ్‌కు అనుసంధానంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ ఘాట్‌రోడ్డు కుంగిపోయింది. కొండపైన ఆలయ పరిసర ప్రాంతాల్లో నాటిన కొబ్బరి చెట్లు నెలకొరిగాయి. కొండచరియల ప్రాంతాలు, రహదారులు కోతకు గురయ్యాయి. కొండపైన బస్‌బే, కొండకింద తాత్కాలిక బస్టాండ్‌ ప్రాంతాలు వరద నీటితో బురదమయంగా మారాయి.

ప్రధానాలయానికి ఉత్తర దిశలోని లోహపు విద్యుత్‌ స్తంభం విరిగిపడింది. విద్యుత్తు సరఫరాకు సైతం పలుమార్లు అంతరాయం ఏర్పడింది. కొండకింద రింగురోడ్డు రహదారులు వరద నీటితో పూర్తిగా జలమయంగా మారి కుంటలను తలపించాయి. ముఖ్యంగా.. కొండపైన నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచింది. ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపాల్లోకి చేరిన నీటిని ఆలయ సిబ్బంది తొలగించాల్సి వచ్చింది.

ప్రసాద విక్రయశాలలోకి వర్షపు నీరు రావడంతో భక్తులు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వరద నీటిలో వెళ్ళ‌లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రసాదాల తయారీ భవనంపై వరద నీరు నిండిపోయి ట్యాంకును తలపించగా, విష్ణుపుష్కరిణిలోకీ వరద నీరు చేరింది. ఎండవేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు కొండపైన విష్ణుపుష్కరిణి నుంచి శివాలయం వరకూ నిర్మించిన చలువ పందిళ్లు ఈదురుగాలుల తాకిడికి నేలమట్టమయ్యాయి.

ఆలయ నిర్మాణ ప్రణాళికలు, నమూనా డిజైన్లలో లోపాలే ఈ పరిస్థితికి కారణమనే వాదన వినిపిస్తోంది. నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం, ఆ పనులను కూడా నాసిరకంగా చేయడం వల్లనే కొండపైన, కింద వర్షం పడిన ప్రతిసారీ ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు, స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వర్షంతో బయటపడ్డ యాదాద్రి ప‌నుల్లో డొల్లతనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల్లో అభివృద్ధి పనులు
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు. అన్నవరంలో ఆయన మాట్లాడుతూ ‘కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అనుబంధ సంస్థ నేషనల్‌ హైవే లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు ఈ ప్రాజెక్టును అప్పగించింద‌ని తెలిపారు.

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అన్నవరంలో పంపా రిజర్వాయర్‌ మీదుగా రూ.10 కోట్లతో రోప్‌వే, కొండ దిగువన పంపా సరోవరం వద్దనే బోటు షికారు ఏర్పాటు చేసేలా పరిశీలిస్తున్నామ‌ని మాల్‌రెడ్డి చెప్పారు. సుమారు రూ.11.50 కోట్లతో కోరుకొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొండ నుంచి మెట్లమార్గం, పాండవుల కొండకు రెండు రోప్‌వేలు, పట్టిసీమ ఆలయం నుంచి గోదావరి బెర్మ్‌ (పర్యాటక హోటల్‌ దగ్గర) వరకూ రూ.2.50 కోట్లతో మరొకటి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంద‌న్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లా కోటప్పకొండ, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గండికోట, కర్నూలు జిల్లా అహోబిలం, విజయవాడ భవానీ ఐల్యాండ్‌లలో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపేందుకు పరిశీలిస్తున్నామ‌ని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో అభివృద్ధి పనులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి
జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది అకుల్‌ టూరిజం అనే సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్ళారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.

అక్కడ ఓ హోటల్లో బస చేశారు. తర్వాత ఆ టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండాపోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటల్‌ నిర్వాహకులు అడగడంతో అసలు విషయం బయటపడిరది. మనిషికి పది వేల వంతున మొత్తం డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ వారు వీరిని నిర్భందించారు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడారు.

టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, చివరకు మోసం చేశారని పలువురు వివరించారు. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి వెళ్ళగా, హుటాహుటిన చర్యలు తీసుకుని, ఉత్తరాంధ్ర యాత్రికులకు హోటల్‌ నుంచి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు!
సింధు పుష్క‌రాల‌కు తీసుకువెళ్ళిన‌ ట్రావెల్ ఉద్యోగి ప‌రార్‌

డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది

దిక్కుతోచ‌ని స్థితిలో 250 మంది ఉత్త‌రాంధ్ర వాసులు

జ‌మ్మూక‌శ్మీర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉత్త‌రాంధ్ర‌.. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని పాల‌కొండ‌, సోంపేట‌, చీపురుప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల నుంచి జ‌మ్మూక‌శ్మీర్ సింధు న‌ది పుష్క‌రాల‌కు వెళ్ళిన సుమారు 250 మంది యాత్రికులు అక్క‌డి ఓ హోట‌ల్‌లో చిక్కుకున్నారు. వీరంతా ఓ టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్లారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.

అక్కడ ఓ హోటల్లో ఉండగా టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండా పోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటలు నిర్వాహకులు అడగడంతో అసలు విషయం వెలుగుచూసింది. టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, అర్ధాంతరంగా వదిలేశారని యాత్రకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు. కట్రా కాంటినెంట్ హోటల్ యాజ‌మాన్యం మ‌నిషికి ప‌ది వేల రూపాయ‌లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తోంద‌ని యాత్రికులు ల‌బోదిబోమంటున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్మూక‌శ్మీర్‌లో చిక్కుకున్న ఆంధ్రా యాత్రికులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు
ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ సంస్థ దేశంలో ప్రీమియం క్రూజ్‌ లైనర్‌గా ఉంది.

గోవా, డయ్యు, లక్షద్వీప్‌, కోచి, శ్రీలంక తదితర ప్రాంతాలకు వీటిని నడపనుంది. ఈ నెల 18 నుంచి తొలి దశలో ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభిస్తారు. 2022 మే తర్వాత చెన్నైకు క్రూజ్‌ను పంపించి అక్కడి నుంచి శ్రీలంక, కొలంబో, గాలే, ట్రింకోమాలీ, జాఫ్నా తదితర ప్రాంతాలకు పర్యాటక సేవలు అందిస్తామని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.