Tirupati – Vishwa Samvad Kendra Andhra Pradesh

వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. వీరంతా శ్రీవారి దర్శనార్థం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి పంపమని కోరగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని భద్రతా సిబ్బంది తెలిపారు. ముందుగా లేఖ ద్వారా తెలియజేసినా ఇలా చేస్తారా అంటూ వారు అక్కడే కాసేపు నిరసన తెలిపారు. అనంతరం శ్రీనివాస మంగాపురంలో విలేకరులతో మాట్లాడారు.

విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని మండిపడ్డారు. అలాగైతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని స్పష్టం చేశారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్ళి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వ్యాపార కేంద్రంలా టీటీడీ.. 30 మంది పీఠాధిపతుల నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీటీడీలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు
తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానంలో పొరుగు సేవల విధానంలో సెక్యూరిటీ గార్డుల కొరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలు, విద్యాసంస్థలు ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం.. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ ఈ ప్రక్రియ చేపట్టింది. నెలకు రూ. 11వేలు జీతానికి 102 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ నియామకం చేపట్టింది. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చేపట్టిన నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు 5 వేల మందికిపైగా యువకులు తరలివచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీటీడీలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, తితిదే ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీనివాస దీక్షితులు చెప్పారు. స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీకృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్టు వివరించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
తిరుప‌తి: కొండంత జనం.. శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి దర్శనానికి భక్తులు అధికంగా వస్తున్నారు. తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి మాసం ముడో వారం కావడంతో జనాలు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ సర్వ దర్శన క్యూలైన్లలో కొన్ని మార్పులు చేసింది. తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా నారాయణ గిరి షెడ్లలోకి భక్తులు ప్రవేశించేలా క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. గతంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లు, నారాయణ గిరి షెడ్లల్లో భక్తులు నిండితే ఏటిసి, ఎస్.ఎం.సి, లేపాక్షి, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, ఇల వెంకమాంబ అన్న సత్రాల వరకు క్యూ లైన్ ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం టీటీడీ చేయించేది. ఇప్పుడు సర్వ దర్శన భక్తులను ఔటర్ రింగ్ రోడ్డు కొత్తగా క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులను వైకుంఠ కాంప్లెక్స్​లోకి అనుమతిస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి స్నపనం కోసం విదేశీ ఫ‌లాలు!
తిరుప‌తి: దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, అలానే ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి, అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి స్నపనం కోసం విదేశీ ఫ‌లాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
తిరుప‌తి: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా సోమవారం రాత్రి అర్చకులు.. వైఖానస ఆగమోక్తంగా మంగళవాద్యాల నడుమ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో అంకురార్పణ క్రతువును నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య.. ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నేడు పెద్ద శేష వాహనంపై ఊరేగనున్న శ్రీవారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ
తిరుప‌తి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవి పూజ అనంతరం మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మృత్సంగ్రహణ యాత్ర తర్వాత మట్టిలో నవధాన్యాలను ఆరోహింపజేస్తారు. దీన్నే అంకురార్పణగా పేర్కొంటారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రం అంకురార్పణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారనున్న భారత్
తిరుపతి: ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు, వ్యవస్థాపకులకు చేయూత ఇవ్వడం ద్వారా లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రానిక్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేసేందుకు, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లు దిశా నిర్దేశం చేస్తున్నాయని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారనున్న భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో కళారూపాల ప్రదర్శన
పాండిచ్చేరితోపాటు 7 రాష్ట్రాల నుండి క‌ళాకారులు రాక‌

మొత్తం 88 క‌ళాబృందాలు

జాన‌ప‌ద క‌ళారూపాల‌కు పెద్ద‌పీట‌

తిరుప‌తి: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూప‌మైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఈ క‌ళారూపాలు భ‌క్తుల‌కు క‌నువిందు చేయ‌నున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుండి కళాకారులు వాహ‌న‌సేవ‌ల్లో పాల్గొన‌నున్నారు. వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో విశిష్ట‌త‌ను తెలిపేందుకు ప్ర‌ముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాల నిర్వ‌హ‌ణకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు కళాకారులు విచ్చేయ‌నున్నారు. ఆయా రాష్ట్రాల క‌ళాకారులు స్థానిక జాన‌ప‌ద క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

వాహ‌న సేవ‌ల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ నుండి 50, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 24, అన్న‌మాచార్య ప్రాజెక్టు నుండి 14 క‌లిపి మొత్తం 88 క‌ళాబృందాలు పాల్గొన‌నున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో క‌ళాకారులు పాల్గొంటారు. వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్ర‌ద‌ర్శిస్తాయి. క‌ర్ణాట‌క నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లుకునిత‌, పూజకునిత, సోమనకునిత, క‌మ‌స‌ల‌ కళారూపాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు.

త‌మిళ‌నాడు నుండి 12 బృందాలు రానున్నాయి. వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం ప్ర‌ద‌ర్శిస్తారు. మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక‌ బృందం, కేరళ నుండి ఒక‌ బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Source: TTDNews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో కళారూపాల ప్రదర్శన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం
తిరుప‌తి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేష‌న్‌, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కరకంబాడి నుంచి లీలామహల్ సర్కిల్ వరకు నిర్మిస్తున్న అప్రోచ్ మార్గాన్ని సెప్టెంబర్ 25వ తేదీకి పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రామానుజ‌ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ మార్గాన్నినవంబర్ 30వ తేదీకి పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి శ్రీనివాస‌ సేతు నిర్మాణం మొత్తం పూర్తి కావాలని ఆయన చెప్పారు.

ఇందుకు టీటీడీ నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని జాప్యం లేకుండా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్మాణ ప‌నుల్లో జాప్యం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌, ఆఫ్కాన్ అధికారులతో ప్రతివారం సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ నెల చివ‌రివారంలో మ‌రోసారి స‌మీక్ష జ‌రుపుతాన‌ని ఈవో చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.