Thirumala Srivari temple – Vishwa Samvad Kendra Andhra Pradesh

తిరుమలలో ఘనంగా శ్రీ భాష్యకారోత్సవం
తిరుప‌తి: తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 26న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి. 6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 5న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రామానుజాచార్యులవారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సాధారణంగా భాష్యకారుల సన్నిధిలో భగవద్‌ రామానుజాచార్యులకు కాషాయ వస్త్రం అలంకరిస్తారు. తెల్లని వస్త్రం అలంకరించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రీవైష్ణవాచార్యులైన శ్రీరామానుజులవారు ఈ రోజున శ్రీరంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటకలోని మేల్కొటెకి వెళ్లారు. ఇందుకు శ్రీరామానుజులవారి అనుయాయులైన శ్రీ కూరత్తాళ్వార్‌ సహకారం అందించారు.

ఆ తరువాత మేల్కొటెలో 14 ఏళ్ళ‌పాటు శ్రీ రామానుజులు ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో 6వ రోజు తెల్లని వస్త్రాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అన్ని వైష్ణవాలయాల్లో శ్రీరామానుజులవారికి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమలలో ఘనంగా శ్రీ భాష్యకారోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాయలచెరువు కథనాన్ని శ్రీవారి ఆలయం ఫోటోతో ప్రచురించిన ఆంగ్ల పత్రిక
ఖండించిన తితిదే

తిరుప‌తి: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన విడుద‌ల చేసింది. ఈ కథనానికి, ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ఫొటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్‌ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదని, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉందని టీటీడీ స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాయలచెరువు కథనాన్ని శ్రీవారి ఆలయం ఫోటోతో ప్రచురించిన ఆంగ్ల పత్రిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.