TALIBAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం!
సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగాలని, సమాజం నిర్మాణ మవ్వాలని వారు కోరుకుంటున్నారు. మహిళల బాగోగులను చూసేందుకు మహిళలనే నియమించాలని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆఫ్ఘనిస్థాన్ ప్రజారోగ్య శాఖ తాత్కాలిక ఉప మంత్రి మహమ్మద్ హసన్ ఘియాసీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… అత్యున్నత స్థాయి నుంచి తమ మంత్రిత్వ శాఖకు కొన్ని ఆదేశాలు వచ్చాయన్నారు. షరియా చట్టానికి అనుగుణంగా విధానాలను రూపొందించాలని ఆ ఆదేశాలు పేర్కొన్నట్లు తెలిపారు. మహిళలకు మహిళా వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని, పురుష రోగులకు పురుష వైద్యులు, నర్సులే చికిత్స చేయాలని తాము ప్రతిపాదించామన్నారు. ఈ ప్రతిపాదనలను తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదాకు పంపించామని చెప్పారు. ఈ నిబంధనలు ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో అమలవుతున్నాయన్నారు. అయితే అర్హులైన మహిళా వైద్యులు అందుబాటులో లేనిపక్షంలో మహిళా రోగికి పురుష వైద్యుడు చికిత్స చేయవచ్చునని చెప్పారు.

ఇక మరోవైపు.. ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్య వ్యవస్థ ప్రస్తుతం ఒడుదొడుకుల్లో ఉంది. ఒక వైపు ఆర్థిక సంక్షోభం, ఆకలి బాధలు పెరిగాయి. మరోవైపు రోగులు పెరిగినప్పటికీ, అర్హులైన వైద్య నిపుణులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. స్త్రీ వైద్య నిపుణులు మాత్రమే కాకుండా పురుష వైద్య నిపుణుల కొరత కూడా అక్కడ ఉంది.

తాలిబన్ల తీరులో వైరుద్ధ్యాలు..

తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల విద్యపై కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. అదే సమయంలో పురుషాధిక్యతగల వైద్య, విద్యా రంగంలోకి మహిళలను పెద్దఎత్తున తీసుకొస్తామంటోంది. ఇది పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బాలికలను ప్రాథమికోన్నత పాఠశాలలకు దూరం చేసింది. అనేక వృత్తుల నుంచి మహిళలను తొలగించింది. విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్, జర్నలిజం, ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో చేరేందుకు మహిళలకు అవకాశం లేకుండా చేసింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వైద్య రంగంలో శిక్షణ పొందే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మహిళలు వైద్యులుగా అర్హత సాధించినప్పటికీ, ప్రయాణించేటప్పుడు పురుషుడు తోడుగా ఉండాలనే నిబంధన వీరు ప్రాక్టీస్ చేయడం కోసం వెళ్లేటప్పుడు వీరికి ఇబ్బందికరంగా మారవచ్చు. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం… ప్రస్తుతం నర్సింగ్, రేడియాలజీ, ఇతర విభాగాల్లో ఈ సెమిస్టర్‌లో 46 శాతం మహిళలు ఉన్నారు. 2020 నాటితో పోల్చితే ఈ సెమిస్టర్లో మహిళల సంఖ్య కాస్త పెరిగింది.

విదేశీ సహాయం…

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రసూతి మరణాలరేటు ప్రపంచంలో అత్యధికంగా ఉంది. పోషకాహార లోపం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం జరిగి, పిల్లలు పుడుతున్నారు. కొందరు గర్భిణులు గర్భధారణ సంబంధిత సమస్యలతో బాధపడటం కూడా దీనికి మరొక కారణం. దేశంలోని ఆరోగ్య వ్యవస్థ అత్యధికంగా విదేశీ సహాయంపైనే ఆధారపడుతోంది. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి బిలియన్ల డాలర్ల విదేశీ సహాయం అందడం లేదు, దీంతో ఈ రంగం కుప్పకూలిపోయే స్థితికి చేరుకుంటోంది. ఈ దశలో రెడ్ క్రాస్, ఐక్యరాజ్య సమితి ముందుకొచ్చి గత ఏడాది వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు జీతాలు చెల్లించాయి. అయినప్పటికీ, కొన్ని ఆసుపత్రులు మూతపడ్డాయి. పెద్దసంఖ్యలో డాక్టర్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. యుద్ధం ముగిసిన తర్వాత రోగుల సంఖ్య పెరుగుతోంది.

సమీప భవిష్యత్తులో ఇదీ పరిస్థితి…

మహిళలకు, పురుషులకు వేర్వేరుగా సమాన స్థాయిలో ఆరోగ్య వ్యవస్థలను సృష్టించాలని తాలిబన్లు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది ఆచరణ సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. చాలా దేశాల్లో మాదిరిగానే ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా తల్లీబిడ్డలకు ఆరోగ్య, వైద్య సేవలను అందించేవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇతర మెడికల్ స్పెషలిస్టుల్లో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. దీనివల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరు సంవత్సరాల క్రితం వివరించింది. మహిళలకు వైద్య విద్యావకాశాలను విస్తరిస్తామని తాలిబన్లు చెప్తున్నప్పటికీ, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, వాటిని పొందడానికి ఇతర విధానాలు వారికి ఆటంకంగా నిలుస్తున్నాయి.

The post మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు.

దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం కాబుల్‌లోని దౌత్య కార్యాలయం బయట ఈ పేలుడు జరిగింది. కాబుల్‌లోని దారుల్‌మాన్‌ రోడ్డులోని ఈ కార్యాలయం వద్ద వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఒక వ్యక్తి బాంబును శరీరానికి ధరించి వచ్చి పేల్చుకొన్నట్లు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో ఇద్దరు దౌత్య సిబ్బంది కూడా చనిపోగా.. మరో దౌత్యసిబ్బంది, సెక్యూరిటీ గార్డు గాయపడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లో దౌత్య కార్యాలయం నిర్వహిస్తున్న అతికొద్ది దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ దాడిపై తాలిబన్లు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు దాడికి బాధ్యత తీసుకోవడానికి ఏ సంస్థా ముందుకు రాలేదు. అమెరికన్లు ఆఫ్ఘన్‌ గడ్డపై నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ దాడులు చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యాల్లో తాలిబన్లే ఎక్కువగా ఉంటున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు!
కాబుల్‌: అమెరికా డ్రోన్‌ దాడిలో అల్‌ఖైదా నేత అల్‌ జవహరీ మరణంపై అఫ్గాన్‌లోని తాలిబన్లు తొలిసారి స్పందించారు. అల్‌ఖైదా నేత హతమైన రెండ్రోజుల తర్వాత ఓ ప్రకటన చేశారు. జవహరీ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రభుత్వానికి, తాలిబన్‌ నేతలకు అక్కడేం జరిగిందో ఏమాత్రం తెలీదని దోహాలో తాలిబన్ల ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. దీనిపై నాయకత్వం సైతం సమావేశమవుతోందని, వివరాలు త్వరలోనే బయటపెడతామన్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘తెలీదు.. విచారణ జరుపుతాం.. తెలుసుకుంటాం’.. జవహారీ మరణంపై తాలిబన్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి!
కాబూల్‌: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయి. పేదరికం, ఆకలి కేకల ఆ దేశంలో నిత్యకృత్యం అయ్యాయి.

తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్‌ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్‌ హక్మల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్ళు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్‌ అండ్‌ రిపోర్టర్‌గా పనిచేశాడని తెలిపారు. అయితే, ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాడు యాంకర్.. నేడు వీధి వ్యాపారి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ
కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ట్వీట్ చేశారు.

‘‘ఆఫ్ఘనిస్తాన్‌లో గతేడాది ఆగస్టు 15 తర్వాత భద్రతా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో భారతీయ అధికారులందరినీ వెనక్కి తీసుకురావాలని నిర్ణయించాం. అయితే, అక్కడి స్థానిక సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించారు. సరైన రీతిలో నిర్వహణ, దౌత్య కార్యాలయ ప్రాంగణాలపట్ల జాగ్రత్త వహించారు” అని తెలిపారు.

“భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య చరిత్రాత్మక బంధాలపై భారతీయ అధికారులు చర్చలు జరిపారు. అఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారత్‌కు దీర్ఘకాల, చరిత్రాత్మక బంధాలు ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్ వైఖరి గతం మాదిరిగానే కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.

చర్చల్లో భాగంగా తాలిబన్ సీనియర్ సభ్యులతో బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. అఫ్ఘనిస్తాన్‌లో నిలిచిపోయిన భారత ప్రాజెక్టులను పునరుద్ధ‌రించాలని కోరుకుంటున్నామని తెలిపాడు. దౌత్యబంధాలు తిరిగి క్రియాశీలకం చేయాలని, అఫ్ఘాన్‌కు దౌత్య సేవలను అందివ్వాలని ఆకాంక్షించాడు.

ముఖ్యంగా విద్యార్థులు, రోగులను భారత్ దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. వాణిజ్య బంధాలను కూడా సంపూర్ణంగా పునరుద్ధరించాలని కోరాడు. అయితే, భారతీయ ప్రాజెక్టులు నిలిచిపోయిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నట్టు తాలిబన్ ప్రతినిధులకు అరిందమ్ బాగ్చి తెలిపారు.

మానవతాదృక్పథంతో అఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా అధికారులు వారికి గుర్తుచేశారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్ర్కమించిన తర్వాత ఆల్ ఇండియా మిషన్ స్టాఫ్ కూడా అక్కడి నుంచి వచ్చేసిన విషయం తెలిసిందే.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాలిబన్ల మరో తలతిక్క నిబంధన!
కాబూల్‌: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్‌ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే, అఫ్గన్‌లో మాత్రం తాలిబన్‌ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని వార్తలు చదవాలని తాజాగా నిబంధన తీసుకొచ్చింది.

అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్‌లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్‌ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరొకటి బయటపడింది.

గతంలో తాలిబన్‌ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్‌ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్‌కు వెళ్ళే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది.

మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్‌ మంత్రి అఖిఫ్‌ మహజార్‌ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడు అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాలిబన్ల మరో తలతిక్క నిబంధన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం
కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. కుందుజ్ ప్రావిన్స్ లోని ఓ మసీదు బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రవాదులు దాడులు చేశారు.

ఈ దాడిలో 33 మంది మరణించారు. 43 మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో పిల్లలు కూడా ఉన్నారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘాతుకాన్ని తాము ఖండిస్తున్నామని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ఆఫ్ఘనిస్థాన్‌లోని షియా, సూఫీ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది ఐసిస్. ఇప్పుడు దాడి జరిగిన మసీదు కూడా సూఫీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతానికి చెందినది. మసీదులో శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 2:30 గంటలకు పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే.. ప్రత్యేక మతపరమైన ఆచారం అయిన జికర్‌ను ఆచరిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. పేలుడు ధాటికి మసీదుకు ఒకవైపు పూర్తిగా ధ్వంసమైంది. “ప్రస్తుతం మా వద్ద పేలుడు గురించి లేదా ప్రాణనష్టం గురించి ఎటువంటి వివరాలు లేవు” అని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఒబైదుల్లా అబేది చెప్పారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాళ్ళే లక్ష్యంగా మసీదులో పేలుళ్ళు.. 33 మంది దుర్మరణం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌కు తాలిబాన్లతో ‘సరిహద్దు’ స‌మ‌స్య‌!
న్యూఢిల్లీ: భారతీయ నిపుణులు, అధికారిక ఛానెల్‌లు హెచ్చరించినది నిజమైంది. తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో… సరిహద్దు-చారిత్రక డ్యురాండ్ రేఖకు కంచె వేయడానికి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఇరువైపులా నివసిస్తున్న పాష్తూన్‌లను విభజించే హక్కు పాకిస్తాన్‌కు లేదని పేర్కొంది.

పాకిస్తాన్-ఆఫ్ఘాన్ సరిహద్దు… బ్రిటన్ వలసరాజ్యాల కాలం నాటి డ్యూరాండ్ రేఖ వెంట నడుస్తుంది. ఇది పాకిస్తాన్ ప్రభుత్వం, అధికారులు, తాలిబాన్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.

ఆదివారం పాకిస్తాన్ తాలిబాన్, తెహ్రీక్-ఇ-తాలిబాన్-పాకిస్తాన్ (టిటిపి) దాడిలో ఐదుగురు పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న‌ ఖుర్రం జిల్లాలోని వాయువ్య సరిహద్దు పోస్ట్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ లోపల జ‌రిగింది.

కొద్దిసేపటి క్రితం, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మాట్లాడుతూ తాలిబాన్లు పాకిస్తాన్ ఆందోళనలను పరిష్కరించలేకపోతే, అల్-ఖైదా, ఇతర సమూహాలతో సంబంధాలు తెంచుకుంటామన్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేని ప‌రిస్థితుల్లో వారి వాగ్దానాన్నివిశ్వ‌సించ‌లేమ‌న్నారు.

సరిహద్దు విషయంలో అమెరికా మద్దతుగల ఆఫ్ఘన్ ప్రభుత్వంతో పాకిస్తాన్‌కు పాత రికార్డు ఉంది. దీనిని ఆఫ్ఘనిస్తాన్ ఎన్నడూ అధికారికంగా అంగీకరించలేదు. కొంతకాలంగా, పాకిస్తాన్ అధికారులు తాలిబాన్ ‘పాకిస్తాన్ ప్రయోజనాలకుస అనుకూలంగా ఉంటుంద‌ని, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించడాన్ని అనుమతించరని విశ్వసించారు. కానీ అలా కనిపించడం లేదు.

సీమాంతర ఉగ్రవాద దాడులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పాకిస్థాన్ 2014లో పోరస్ సరిహద్దులో ఫెన్సింగ్ వేయడం ప్రారంభించింది. సరిహద్దులో 90 శాతానికి పైగా కంచె వేసిందని, అయితే, ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోకి ప్రవేశించి దాడులు చేయగలిగారని, వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడలేదని నివేదికలు స్ప‌ష్టం చేస్తున్నాయి.

కనీసం మూడు వేర్వేరు సంఘటనలలో, తాలిబ్ యోధులు ఫెన్సింగ్‌ను బద్దలు కొట్టడం, సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనికులను బెదిరించడం కనిపించిందని ఒక నివేదిక పేర్కొంది.

డిసెంబర్ 19, 2021 నాటి ఒక వీడియో, నంగర్‌హార్‌లోని ఒక తాలిబ్ కమాండర్ పాకిస్తాన్ సైనికులతో ఇలా చెప్పాడు… ‘మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, నేను ఇక్కడ మీతో పోరాడతాను. మీతో పోరాడటం మాకు సంతోషంగా ఉంటుంది’ గతేడాది డిసెంబరు 30న నైరుతి ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు తాలిబాన్లతో ‘సరిహద్దు’ స‌మ‌స్య‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ దేశంపై దాడి చేసిన మొఘ‌లులును పొగిడిన న‌సీరుద్దీన్ షా!
న్యూఢిల్లీ: సుపంప‌న్న‌మైన హిందూ దేశంపై దాడి చేసి, సంప‌దను దోచుకుని, ఇక్క‌డి సంస్కృతి వినాశ‌నానికి తీవ్రంగా ప్ర‌య‌త్నించిన మొఘ‌లులును న‌టుడు న‌సీరుద్దీన్ షా పొగిడాడు. నిన్న‌(డిసెంబ‌ర్ 29) ఒక‌ ప్రచార వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా భారతదేశంలో మొఘల్‌లు శరణార్థులని, నేడు దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఉందని అన్నారు.

“మొఘలుల దురాగతాలు అని పిలవబడేవి ఎప్పటికప్పుడు హైలైట్ చేయబడుతున్నాయి… మొఘలులు దేశానికి దోహదపడిన వ్యక్తులని మనం మర్చిపోతున్నాము.. వారు దేశంలో శాశ్వత స్మారక చిహ్నాలను విడిచిపెట్టిన వ్యక్తులు, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం సంప్రదాయాన్ని విడిచిపెట్టారు. మొఘలులు ఇక్కడికి వచ్చి తమ మాతృభూమిగా మార్చుకున్నారు. మీకు నచ్చితే వారిని శరణార్థులు అని పిలవవచ్చు” అని షా అన్నారు.

షా వ్యాఖ్య‌ల‌పై పలువురు నిరసన వ్యక్తం చేశారు. సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ మొఘలులు ఆక్రమణదారులని, వారి వ‌ల్ల భారతీయ నాగరికతకు పెను నష్టం వాటిల్లిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. “మొఘలులు చాలా వరకు హిందూ నాగరికత, మతం, జనాభా, సంస్కృతి మొదలైనవాటిని నాశనం చేసిన అనాగరిక ఆక్రమణదారులు. పాక్, భారతదేశం ఎదుర్కొంటున్న అనేక ఇతర సమస్యల సృష్టికి వారే మూల కారణం. మీరు వారిని సెటిలర్లు లేదా శరణార్థులు అని పిలుస్తారా? సిగ్గుపడాలి #నసీరుద్దీన్‌షా”… అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. రాజకీయ వ్యాఖ్యాత స్మితా దేశ్‌ముఖ్ మొఘల్‌లపై నసీరుద్దీన్ షాకు విచిత్రమైన వ్యామోహం ఉందన్నారు.

మైనారిటీల మనసుల్లో భయాందోళనలు సృష్టించేందుకు పాలక యంత్రాంగం వేరే వ‌ర్గాల మద్దతుతో దేశంలో ఉద్దేశపూర్వకంగా మసీదులు, చర్చిలను కూల్చివేశారని షా ఆరోపించారు. షాకు వివాదాలు కొత్త కాదు. వాస్తవానికి, గత కొన్నేళ్లుగా అతను మీడియాలో నిరాధారమైన ఆరోప‌ణ‌లు చేయ‌డంపై దృష్టి పెట్టాడు. అంతేకాదు.. ఆయా సంద‌ర్భాల్లో ప్రముఖ నటులు రాజేష్ ఖన్నా, అనుపమ్ ఖేర్‌ల‌ను కూడా విమ‌ర్శించాడు.

ఈ ఏడాది ఆగస్టులో కాబూల్‌ను తాలిబాన్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, నసీరుద్దీన్ షా భారతీయ ముస్లింలు తాలిబాన్‌కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. తాలిబాన్లను విమర్శించినందుకు ఇస్లాంవాదులు ఆయనను తీవ్రంగా విమర్శించారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ దేశంపై దాడి చేసిన మొఘ‌లులును పొగిడిన న‌సీరుద్దీన్ షా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహిళల రక్షణకు తాలిబన్ల కీలక నిర్ణయం
అంతర్జాతీయ ఒత్తిళ్లతో బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం

కాబూల్‌: వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ తాలిబన్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురుషులు, మహిళలు సమానమని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ పేర్కొన్నారు. తాలిబన్‌ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అంతర్జాతీయ ఒత్తిడి వల్లే మహిళల విషయంలో తాలిబన్‌ ఉదార వైఖరి ప్రదర్శించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే, తాజా ఉత్తర్వుల్లో కనీస వివాహ వయసును పేర్కొనలేదు.

గతంలో ఇది 16 ఏళ్లుగా ఉండేది. ఆఫ్గాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణం. ఆడపిల్లల్ని అమ్ముకోవడం, అప్పు కింద చెల్లించడం, సంధి కోసం పణంగా పెట్టడం వంటివి సంప్రదాయంగా చలామణి అవుతున్నాయి. గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అలాగే భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహిళల రక్షణకు తాలిబన్ల కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.