T20 World Cup – Vishwa Samvad Kendra Andhra Pradesh

యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..
లక్నో: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులను ఆగ్రాలో అరెస్ట్‌ చేశారు.

ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు విద్యార్థులపై స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాలేజ్‌ అధికారులు వారిని సస్పెండ్‌ చేశారు. పాక్‌ విజయం అనంతరం సంబరాలు జరుపుకొన్న ఘటనలకు సంబంధించి ఆగ్రా, బరేలి, బదౌన్‌, సీతాపూర్‌ జిల్లాల్లో ఏడుగురిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

పాక్‌కు మద్దతు తెలుపుతూ ఆగ్రాలోని రాజా బల్వంత్‌ సింగ్‌ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులు సంబరాలు జరుపుకొన్నారు. విద్యార్థుల సంబురాలను నిరసిస్తూ కొందరు ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను అరెస్టు చేశామన్నారు.

బరేలీకి చెందిన ఒక వ్యక్తి తన వాట్సాప్‌లో పాక్‌ అనుకూల స్టేటస్‌ను పెట్టడంతోపాటు అనుచిత ప్రవర్తనకు పాల్పడి బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. బరేలీకి చెందిన మరొకరు భారత క్రికెట్‌ జట్టును తిట్టి, తన వాట్సాప్‌ స్టేటస్‌లో పాక్‌ జట్టును ప్రశంసించారని ఆరోపించారు. బరేలీకి చెందిన మూడో వ్యక్తి తన ఫేస్‌బుక్‌ కవర్‌ పిక్చర్‌గా పాకిస్తాన్‌ జెండాను పెట్టుకున్నాడని.. సోషల్‌ మీడియాలో ఇతర పాకిస్తాన్‌ అనుకూల సందేశాలను పోస్ట్‌ చేశాడని ఆరోపించారు. వాట్సాప్‌లో పాక్‌ అనుకూల స్టేటస్‌ పెట్టినందుకు లక్నోకు చెందిన ఒకరిని అరెస్టు చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఘర్షణ!
కశ్మీరీ విద్యార్థులను నిలదీసిన యూపీ, బీహార్‌ విద్యార్థులు

సంగ్రూర్‌: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్‌ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్‌కి చెందిన విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ భాయ్‌ గురుదాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.. కానీ ముఖ్యమైన సమాచారాన్ని అందించలేదు.

ఓ కశ్మీరీ విద్యార్థి మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మ్యాచ్‌ చూస్తున్నాం.. యూపీకి చెందిన విద్యార్థి అడ్డుపడ్డాడు.. మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం.. మే కూడా భారతీయులమే.. మాకు ఏమి జరిగిందో మీరు చూడండి… మేము భారతీయులం కాదా? మోదీ ఏం చెబుతారు?’ అని చెప్పాడని మీడియా సంస్థలో కథనాలు వచ్చాయి. దాడికి సంబంధించిన వీడియోలను విద్యార్థులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ వార్తా సంస్థలు… గొడవలు జరిగాయి, కొట్టుకున్నారు అని చెబుతూ వచ్చారు తప్పితే.. ఎందుకు గొడవ జరిగిందో మాత్రం వెల్లడిరచలేదు. పంజాబ్‌ పోలీసులు ఇచ్చిన నివేదికను మాత్రం ప్రస్తావించలేదు. మ్యాచ్‌ సమయంలో కొందరు కశ్మీరీ విద్యార్థులు పాక్‌కు మద్దతు ఇచ్చారని.. అదే ఘర్షణకు దారితీసిందని పంజాబ్‌ పోలీసుల ప్రకటనలో ఉంది. దీని గురించి మాత్రం ఆ మీడియా సంస్థల్లో చర్చించలేదు. భారత్‌పై పాక్‌ విజయం సాధించిన నేపథ్యంలో కశ్మీరీ విద్యార్థులు పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారని పోలీసులు వెల్ల‌డించారు.

సంగ్రూర్‌కు చెందిన సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘కళాశాలలో దాదాపు 90 మంది కశ్మీరీ విద్యార్థులు ఉంటారు.. యూపీ, బీహార్‌లకు చెందిన 30 మంది విద్యార్థులు ఉన్నారు. కశ్మీరీ విద్యార్థులు హాస్టల్‌లోని రెండు బ్యారక్‌లలో ఉంటారు. మ్యాచ్‌ జరుగుతుండగా పాకిస్తాన్‌ విజయం దిశగా వెళుతున్న సమయంలో కశ్మీరీ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. అంతే కాకుండా, ఆజాదీ నినాదాలు కూడా చేశారు’’ అంటూ తెలిపారు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత, యూపీ, బీహార్‌ విద్యార్థులు కశ్మీరీ విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వారితో గొడవ పడ్డారు. యూపీ, బీహార్‌కు చెందిన విద్యార్థులతో కశ్మీరీ విద్యార్థులు కూడా ఘర్షణకు దిగారు. పోలీసులు, కళాశాల అధికారులు రాత్రికి రాత్రే పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు అని పోలీసు అధికారి తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఘర్షణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.