#SUPREME COURT – Vishwa Samvad Kendra Andhra Pradesh

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!
భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు ఇటీవల లేఖ రాశారు. ఈ విధంగా న్యాయమూర్తులను నియమించడం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఇది ప్రమాదకరమని, న్యాయ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులు అభిప్రాయపడ్డారు. మరోవైపు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం నడుస్తున్న కొలీజియం వ్యవస్థను కొనసాగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తోంది.

కొలీజియం వ్యవస్థ అంటే?

దేశంలో 1993వ సంవత్సరం నుంచి న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం విధానం అమల్లో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఈ వ్యవస్థలో భాగంగా ఉంటారు. వీరు పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించిన విషయాలను చూస్తారు. వీరు కొన్ని పేర్లు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. వారు వాటిని పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే లిస్టులో ఉన్న పేర్లను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినా.. రెండో సారి కొలీజియం అవే పేర్లను ప్రతిపాదిస్తే మాత్రం వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆమోదించాల్సిందే. న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత రాష్ట్రపతికి ఆ లిస్టు పంపుతారు. ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగంలో ఎలాంటి మార్గదర్శకాలు లేవు.

తెరపైకి వస్తున్న నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్..

కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా 2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొలీజియం వ్యవస్థను తొలగించి న్యాయమూర్తులను నియమించేందుకు ఈ కమిషన్ను ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని ఈ కమిషన్ నేరుగా పెంచుతుంది. ఇందులో సీజేఐ నేతృత్వంలోని ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నామినేట్‌ చేయవచ్చు. ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్లో ఒకరిని సీజేఐ, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా నియమిస్తారు. అదే సమయంలో రెండో నామినేటెడ్ సభ్యుడు ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ కమ్యూనిటీ లేదా మహిళలు ఉంటారు. ఈక్రమంలో 2015లో సుప్రీంకోర్టు ఎన్‌జేఏసీ చట్టవిరుద్ధమని ప్రకటించి.. కొలీజియం వ్యవస్థను తీసుకొచ్చింది.

కొలీజియం వ్యవస్థను రద్దు చేయవచ్చా?

కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పార్లమెంటు, లోక్ సభ, రాజ్యసభ ఉభయ సభల్లో జరిగే ఓటింగ్ లో కేంద్ర ప్రభుత్వానికి మూడింట రెండొంతుల ఎంపీల మెజారిటీ రావాలి. దీంతోపాటు ఈ సవరణకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదని చెప్పవచ్చు.

The post కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహిళలకూ గుర్తింపు ఇవ్వాలి.. వారిని వస్తువులతో పోల్చడం తప్పు – సుప్రీం కోర్టు
మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామాన్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం తర్వాత గుర్తింపు మారిపోదని తెలిపింది. సిక్కిం రాష్ట్రానికి చెందని పురుషులను పెళ్లి చేసుకునే సిక్కిం మహిళలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26ఏఏఏ) ప్రకారం మినహాయింపు వర్తించబోదని చెప్తున్న నిబంధన వివక్షాపూరితమైనదని తీర్పు చెప్పింది. ఈ నిబంధనను రద్దు చేసింది.

కేవలం సిక్కిమేతర పురుషుడిని పెళ్లి చేసుకున్నందుకు సిక్కిం మహిళను వేరుగా చూడటం పూర్తిగా వివక్షాపూరితమని తెలిపింది. మహిళ అంటే ఇంట్లో వాడుకునే సామాను కాదని, ఆమెకు తనదైన గుర్తింపు ఉందని, వివాహం వల్ల ఆ గుర్తింపు రద్దు కాబోదని పేర్కొంది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

2008 ఏప్రిల్ 1 తర్వాత సిక్కిం యేతర మహిళను పెళ్లి చేసుకున్న సిక్కిం పురుషులు ఈ మినహాయింపును పొందేందుకు అర్హతను కోల్పోవడం లేదనే విషయాన్ని ధర్మాసనం గమనించింది.

సిక్కిం 1975 ఏప్రిల్ 26న భారత దేశంలో విలీనం అయింది. ఈ తేదీనాటికి సిక్కింలో నివసిస్తున్న భారతీయ మూలాలుగలవారికి కూడా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(26ఏఏఏ) ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే సిక్కిం జనాభాలో దాదాపు 95 శాతం మందికి ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నమాట.

సిక్కిం సబ్జెక్ట్స్ సర్టిఫికేట్ కలిగియున్నవారికి లేదా వారి వారసులు సిక్కిం పౌరసత్వ సవరణ ఉత్తర్వు, 1989 ప్రకారం భారత పౌరులుగా మారినపుడు మాత్రమే గతంలో ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఈ రెండు వర్గాల్లోకి భూటియా లెప్చాస్, షెర్పాస్, నేపాలీస్ వస్తారు. సిక్కిం జనాభాలో వీరు 94.6 శాతం మంది ఉంటారు. భారత దేశంలో సిక్కిం విలీనమైన తేదీ నాటికి సిక్కింలో నివసిస్తున్నవారు కోర్టును ఆశ్రయించారు. వీరు రాష్ట్ర జనాభాలో 1 శాతం మాత్రమే ఉన్నారు.

The post మహిళలకూ గుర్తింపు ఇవ్వాలి.. వారిని వస్తువులతో పోల్చడం తప్పు – సుప్రీం కోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు
కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాలను పంచుతూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఇచ్చిన స్టేను ఎత్తివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన అప్లికేషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను కొనసాగించింది. శుక్రవారం నుంచి తామిద్దరం ఒకే ధర్మాసనంలో కూర్చోబోవడం లేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు.

దాంతో ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికే కేసును నివేదించాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తామని న్యాయవాదులు ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. తామిద్దరితో కూడిన ధర్మాసనానికే కేసును అప్పగిస్తే కర్ణాటక దరఖాస్తునే కాకుండా ప్రధాన కేసును కూడా పరిష్కరిస్తామని చెప్పింది. ప్రధాన కేసులో కూడా వాదనలు వినిపించడానికి సిద్ధం కావాలని న్యాయవాదులకు సూచించింది. నీటి లెక్కల్లో డిపెండబిలిటీ మీద అభ్యంతరాలు ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఆంధ్రప్రదేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా స్పందిస్తూ… అదొక్కటే సమస్య అని తెలిపారు. నీటి లభ్యతపై మూడు రకాల డిపెండబిలిటీలతో తీర్పు ఇచ్చారని, దాని వల్ల ఏపీకి తీరని నష్టం జరగనుందని చెప్పారు.

చెన్నైకి నీరిచ్చిన దయగల ఆంధ్ర

చెన్నైకి తాగునీటి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు…. చెన్నైకి తాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జలాలు ఇచ్చి దయ చూపించిందని జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ ప్రశంసించారు. తాగునీటి కోసం చెన్నై కృష్ణా జలాలపై ఆధారపడుతోందన్నారు. చెన్నైకి విడుదల చేస్తున్న 15 టీఎంసీల నీటిలో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు కూడా ఉన్నాయని న్యాయవాదులు చెప్పగా, ‘‘నేను 3 రాష్ట్రాల నుంచి నీళ్లు తీసుకున్నానన్నమాట’’ అని తమిళనాడుకే చెందిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ చమత్కరించారు

The post కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తాం – సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తోపాటు సభ్యులుగా ఉన్న జస్టిస్‌ బి.ఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎ.ఎస్‌. బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యంలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించగా, జస్టిస్ బి.వి. నాగరత్న మాత్రం వ్యతిరేకిస్తూ ప్రత్యేక తీర్పు వెలువరించారు. దీంతో 4-1 మెజారిటీతో న్యాయమూర్తుల ఆమోదముద్ర పడినట్లయ్యింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై తమ తీర్పును మెజార్టీ న్యాయమూర్తుల తరపున జస్టిస్ గవాయి చదివి వినిపించారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం నోట్ల రద్దుకు ఆర్బీఐ కేంద్ర మండలి సిఫార్సు చేయాలి తప్పితే కేంద్ర ప్రభుత్వమే ముందుగా ప్రతిపాదించడానికి వీల్లేదన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందన్న కారణంతో నిర్ణయాన్ని తప్పుబట్టలేని తెలియజేశారు. ఇలాంటి నిర్ణయాలను అత్యంత గోప్యంగా, వేగంగా తీసుకోవాలని.. ఒకవేళ విషయం బయటకు పొక్కితే.. తలెత్తే పరిణామాలు ఊహించడమూ కష్టమేనని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విషయాలను రహస్యంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఉందని తెలిపింది.

కేంద్రానికి నోట్లు రద్దు చేసే అధికారం ఉంది..

ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం ఏ నోట్లనైనా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలలుగా సంప్రదింపులు జరిగాయని.. నల్లధనం, ఉగ్రనిధులు వంటివాటిని నిర్మూలించేందుకు ఒక హేతుబద్ధమైన ఆలోచన ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నట్లు ధర్మాసనం తెలియజేసింది. ఇక్కడ లక్ష్యాలు చేరుకున్నారా లేదా అన్నది అప్రస్తుతం అని చెప్పింది. పెద్దనోట్ల రద్దు నోటిపికేషన్లో ఎలాంటి లోపాలూ లేవు. నోట్లను రద్దుచేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదు. పాతనోట్ల మార్చి డికి ఇచ్చిన 52 రోజుల సమయం సహేతుకం కాదని చెప్పలేం అని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు. గతంలో రెండు సందర్భాల్లో పెద్దనోట్ల రద్దును చట్టం ద్వారా చేసినంతమాత్రాన కేంద్రానికి ఈ అధికారం లేదని చెప్పలేమని స్పష్టం చేశారు. చివరికి పిటిషనర్ల వాదనను ధర్మాసనం తిరస్కరిస్తోందని ప్రకటించారు.

జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు ఇలా..

పెద్దనోట్ల రద్దు చాలా పెద్ద విషయమని ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెలువరించకూడదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఆ నిర్ణయం సదుద్దేశంతో బాగా ఆలోచించి తీసుకున్నదే అయినప్పటికీ దాన్ని చట్టబద్ధంగా, న్యాయప్రాతిపదికగా చేయాలి తప్పితే, ఉద్దేశాల ఆధారంగా కాదని 120 పేజీల తీర్పులో అభిప్రాయపడ్డారు. “ఒక నిర్దిష్టమైన సిరీస్ నోట్లను రద్దు చేయడంతో పోలిస్తే మొత్తం పెద్దనోట్లను రద్దు చేయాలనుకోవడం చాలా సీరియస్ అంశం. దాన్ని చట్టం ద్వారానే చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. గోప్యత ఇమిడిఉంటే ఆర్డినెన్స్ ద్వారానైనా చేయాల్సిందని.. నోట్ల రద్దును కేంద్రమే కోరుకున్నట్లు ఆర్బీఐ రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఆర్బీఐ స్వతంత్రంగా ఆలోచించలేదని స్పష్టమవుతోంది. మొత్తం కసరత్తును 24 గంటల్లో పూర్తిచేశారు. పార్లమెంటు ద్వారా చేయాల్సిన పనిని ఒక్క నోటిఫికేషన్తో చేశారు” అని తప్పుబట్టారు. ఆ నోటిఫికేషన్ శాసనవిరుద్ధమైనదని చెప్పారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)లో పేర్కొన్న ‘ఎనీ సీరీస్’కు అర్థం అన్ని నోట్లను రద్దుచేసే అధికారం కాదన్నారు. ఆ సెక్షన్ నిర్దిష్టమైన సీరీస్ కరెన్సీ నోట్ల రద్దు గురించి మాత్రమే చెబుతోంది తప్పితే మొత్తం నోట్ల గురించి కాదని పేర్కొ న్నారు. నోట్లరద్దు ప్రతిపాదన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నుంచి మాత్రమే రావాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి ఇప్పటికే ఆరేళ్లు పూర్తయినందున ఇప్పుడు యథాపూర్వ స్థితిని తీసుకురాలేమనీ, కొత్తగా ఉపశమనం కలిగించలేమని పేర్కొన్నారు. ‘రద్దు చేసిన నోట్లలో 98 శాతాన్ని బ్యాంకుల ద్వారా తిరిగి మార్చుకున్నట్లు రికార్డయిందని.. కొత్తగా రూ.2,000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ చర్య ద్వారా ఆశించిన ఫలితం రాలేదని స్పష్టమవుతోంది’ అని జస్టిస్ నాగరత్న చెప్పారు. అయితే.. ఆ ప్రయత్నం వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం మాత్రం అభినందనీయమన్నారు.

The post పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సుప్రీంకోర్టులో శనివారం ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటూ సుప్రీం కోర్టు ఇ-ఇనిషియేటివ్‌ (వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌, జస్టిస్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్టు, ఎస్‌3వాస్‌ వెబ్‌సైట్‌లు)లను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని క్రమం తప్పకుండా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ సభలోని మహిళల త్యాగాల గురించి చర్చ చాలా అరుదుగా ఉంటుందని, కనుక వారి గురించి యువతకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాజ్యాంగ అసెంబ్లీలో 15 మంది మహిళలు ఉన్నారు. వారిలో వెనుకబడిన సమాజానికి చెందిన దాక్షాయణి వేలాయుధన్‌ కూడా ఉన్నారని ప్రధాని చెప్పారు.

ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొంటూ ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు గానీ.. మన ప్రాథమిక విధులే మనకు మొదటి ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశానికి రాజ్యాంగమే అతిపెద్ద బలం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులు ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. దోషుల రెమిషన్‌ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లీడ్‌ చేయలేదని, దీంతో ప్రభుత్వం కేసులో భాగస్వామ్యం కాలేకపోయిందని అందులో పేర్కొంది.

శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి సున్నిత కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపింది. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారని, దేశ మాజీ ప్రధానిని హత్య చేసిన కేసులో వారు దోషులుగా తేలారని గుర్తు చేసింది.

నిందితుల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పు న్యాయాన్ని దుర్వినియోగం చేసేలా ఉందని కేంద్రం తన పిటిషన్⁭లో పేర్కొంది. మొత్తం ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందినవారని పేర్కొంటూ మాజీ ప్రధానిని హత్య చేసి ఉగ్రవాదులుగా ముద్ర పడిన వారికి క్షమాభిక్ష పెట్టడం అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తుందని, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

దోషుల విడుదలపై వాదనలు వినిపించేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని కేంద్రం స్పష్టం చేసింది. 1991లో జరిగిన రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం గతవారం 11న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దోషులు 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, ఈ కాలంలో వారు సత్ప్రవర్తనతో మెలిగారని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది. కాగా, సుప్రీం తీర్పును కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. మాజీ ప్రధాని హత్యకు పాల్పడిన దోషులను విడుదల చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది, తాజాగా కేంద్రం కూడా కోర్టు తీర్పుపై స్పందించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజీవ్‌ హంతకుల విడుదలపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతమార్పిడులపై సుప్రీం మండిపాటు!
న్యూఢిల్లీ: దేశంలో బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మండిపడింది. బలవంతపు మతమార్పిడి తీవ్రమైన విషయమని… దేశభద్రతను ప్రభావితం చేస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిస్థితి క్లిష్టంగా మారకముందే.. బలవంతపు మతమార్పిళ్ళును నిలిపివేయాలని కేంద్రానికి సూచించింది. ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. దేశంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని లాయర్‌ ఆశ్విని కుమార్‌ పిటిషన్‌ వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతమార్పిడులపై సుప్రీం మండిపాటు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు మే 17న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది మే 17న ఇచ్చిన ఉత్తర్వులకు రేపటితో (నవంబర్ 12) గడువు ముగియనున్న దృష్ట్యా హిందూ సంఘాలు మరోసారి కోర్టుని ఆశ్రయించాయి.

శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భద్రతను పొడగించాలని హిందూ భక్తుల తరఫున హాజరైన అడ్వకేట్ విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది.

Source: Nijmtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు… సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను సమర్ధించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యు.యు.లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్​, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది.

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్​ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యాజ్యాన్ని ‘జనహిత్ అభియాన్’ అనే సంస్థ 2019లో దాఖలు చేసింది. 103వ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటితో పాటు సుమారు 40 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు… సమర్థించిన సుప్రీంకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు
న్యూఢిల్లీ: 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్ష విధిస్తూ తనకు విధించిన తీర్పును పునఃసమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్‌ఇటి) ఉగ్రవాది మహ్మద్‌ ఆరిఫ్‌ అలియాస్‌ అష్ఫాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆరిఫ్‌ చేసిన విజ్ఞప్తిని అంగీకరించామని ప్రధాన న్యాయమూర్తి ఉదరు ఉమేష్‌ లలిత్‌, జస్టిస్‌ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘ఎలక్ట్రానిక్‌ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న విజ్ఞప్తిని అంగీకరించాం. అతని నేరం రుజువైంది. ఈ కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేము ధ్రువీకరిస్తున్నాం. రివ్యూ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.

2000 డిసెంబరు 22న ఎర్రకోటలో ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో అక్కడ కాపలా విధుల్లో ఉన్న ఇద్దరు సైనికాధికారులు, మరో పౌరుడు మరణించారు. ఈ కేసులో మహమ్మద్‌ అరీఫ్‌ సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి.

కోర్టు అతనికి ఉరిశిక్ష విధించగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆ పిటిషన్‌ను తిరస్కరించి శిక్షను ఖరారు చేసింది.

కింది కోర్టు 2005లో మరణ శిక్ష విధించగా, తర్వాత 2007లో ఢిల్లీ హైకోర్టు సహితం ఆ శిక్షను ఖరారు చేసింది. 2011లో సుప్రీం కోర్ట్ ఆ శిక్షను ఖరారు చేసినా, 2014లో శిక్ష అమలు కాకుండా స్టే ఇచ్చింది. 2000 నుండి అతను తీహార్ జైలులోనే ఉన్నాడు. అతనిది పాకిస్తాన్‌లో అబ్బోటాబాద్‌. అతను పాకిస్తాన్‌ నుండి భారత్‌కు వచ్చి, ఓ స్థానిక యువతి రెహ్మాన్ యూసఫ్ ఫారూఖీని వివాహం చేసుకున్నాడు. అతని విద్రోహ కార్యకలాపాల పట్ల పూర్తి పరిజ్ఞానం గల ఆమెను కూడా అరెస్ట్ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.