#SRISAILA DEVASTANAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఓ ప్రకటనలో తెలిపారు.

The post శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ  appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు సిద్దం!
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మల్లన్న లడ్డూలు సిద్ధం కానున్నాయి. ఈ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో ఇష్టం.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది తరలిరానుండడంతో అందుకు సరిపడా లడ్డూలు తయారుచేసేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఇల కైలాసానికి తరలిరానున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దర్శనం చేసుకున్న తర్వాత మల్లన్న ప్రసాదాలు తీసుకునేందుకు భక్తులు మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో వారికి కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. మొత్తం 30 లక్షల లడ్డూలు సిద్ధం చేసేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు శివదీక్ష భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుండడంతో రోజుకు లక్ష నుంచి లక్షన్నర లడ్డూల అమ్మకాలు సాగుతాయని అంచనా వేస్తున్నారు. 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 2 లక్షల నుంచి 5 లక్షల లడ్డూలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని పోటులో లడ్డూ తయారీకి కావాల్సిన పొయ్యిలు, వంట సామగ్రి సిద్ధం చేస్తున్నారు. తయారైన వాటిని లడ్డూ విక్రయశాల వద్ద నిల్వచేయనున్నారు.

The post శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలకు 30 లక్షల లడ్డూలు సిద్దం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు
శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 11వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.. అదే రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. 12న భృంగివాహనసేవ, 13న హంసవాహనసేవ, 14న మయూరవాహన సేవ, 15న రావణ వాహన సేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజవాహనసేవ, 18న నందివాహనసేవ… అదే రోజు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, 12 గంటలకు స్వామి అమ్మవార్లకు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 19న రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం, 20న పూర్ణాహుతి, ధ్వజావరోహణ కార్యక్రమాలు, 21న అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష..

శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ సూచించారు. ఈమేరకు మంగళవారం దేవస్థానం సీసీ కంట్రోల్‌ రూమ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్‌.లవన్న, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ శ్రీశైలం, సున్నిపెంటలోని వైద్యశాలల్లో 24 గంటలు సేవలందించేలా వైద్యులను నియమించాలని.. రద్దీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్ర మార్గంలో ఒక అంబులెన్సు ఏర్పాటు చేయాలన్నారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ నుంచి 650 బస్సులు

ఏపీలోని వివిధ జిల్లాల నుంచి 650 బస్సులు, తెలంగాణ నుంచి 180 ప్రత్యేక బస్సు సర్వీసులను శ్రీశైలానికి నడపాలని అధికారులు భావిస్తున్నారు. భారీ వాహనాలను అటవీ మార్గంలో అనుమతించకుండా.. ప్రకాశం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలలో విస్తృత ప్రచారం చేయాలని రవాణా శాఖ అధికారులను, ట్రాఫిక్‌ డీఎస్పీలను కలెక్టర్‌ ఆదేశించారు. శ్రీశైలాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లా స్థాయి అధికారులను ఇన్‌చార్జులుగా నియమించినట్లు చెప్పారు. ఉత్సవాలకు ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. డ్రోన్‌ కెమెరాలతో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్య తలెత్తకుండా అదనంగా టవర్లను ఏర్పాటు చేయాలని ఈవోకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించాలన్నారు. అన్ని జోన్లకు నిరంతరం విద్యుత్తు ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు.

సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు: ఈవో

స్వామి, అమ్మవార్ల దర్శనం సులభంగా చేసుకునేందుకు భక్తులకు నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వీఐపీల ప్రొటోకాల్‌తో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. : ఎస్పీ

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. పార్కింగ్‌ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలు నిలిచే అవకాశం ఉందన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షిస్తామని, పోలీస్‌ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని కోరారు.

The post శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి… కారణం ఇదే!
శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది. నవంబర్ నెలలో లడ్డూ తయారీ సరుకుల రేట్లలో రూ. 42 లక్షల వ్యత్యాసం ఉన్నట్లు గమనించామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కాంట్రాక్టర్ లడ్డూ తయారీ సరుకులు సెకండ్ క్వాలిటీ దేవస్దానానికి సరఫరా చేస్తున్నారని, మార్కెట్ రేట్లకంటే అధికంగా దేవస్దానానికి సరుకులు ఇస్తున్నారని తమ అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు. లడ్డూ తయారీ అధిక రేట్ల సరుకుల విషయమై దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రస్తుతం దేవస్దానానికి లడ్డూ తయారీ సరుకులు ఇస్తున్న కాంట్రాక్టు రద్దు చేయాలని గత నెలలో జరిగిన ట్రస్ట్ బోర్డు మీటింగ్‌లో బోర్డు ఆమోదం తెలిపిందని చక్రపాణిరెడ్డి తెలిపారు. కానీ ఇంతవరకు కాంట్రాక్టు రద్దు కాలేదన్నారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రాలేదని, అందుకే కాంట్రాక్టు రద్దు చేయలేదని ఈవో లవన్న చెప్పారన్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని స్పష్టంగా కనబడుతోందన్నారు. ఫిబ్రవరి, మార్చి రెండు నెలలకు పోల్చి చూసుకుంటే కనీసం కోటి రూపాయలు తేడా వచ్చే అవకాశం ఉందని చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు.

The post శ్రీశైలం క్షేత్రంలో భారీ అవినీతి… కారణం ఇదే! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఈ నెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానములో మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయని ఆ ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా కనులపండువగా జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. వారికి దారి మధ్యలో మంచినీరు, ఆహారం, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై కూడా వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఆలయ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఈ నెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.