#Save Soil – Vishwa Samvad Kendra Andhra Pradesh

టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం టీవీల్లోనే కనిపిస్తోందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలో గత దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద మత ఘర్షణలేవీ జరగలేదని గుర్తు చేశారు. టీవీ స్టూడియోల్లో మాత్రం దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ వాడివేడి చర్చలు జరుగుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చదువుకునేటప్పుడు మతపరమైన పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయని, కానీ గత పదేళ్ళ‌లో అలా జరిగిన సందర్భాలేవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన ‘సేవ్ సాయిల్’ (భూసార పరిరక్షణ) ఉద్యమంలో భాగంగా 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్ల మోటార్ సైకిల్ యాత్రను పూర్తిచేసి సద్గురు ఇటీవలే దేశానికి వచ్చారు.

టీవీ చర్చల్లో అప్పుడప్పుడు మతపరమైన అంశాలపై జోరుగా చర్చలు సాగడం నిజమేనని, కానీ వీధుల్లోకి వచ్చే సరికి అలా జరిగిన సంఘటనలు లేవనే చెప్పాలని సద్గురు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మనం కొంచెం అతి చేస్తామనే తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఏ గ్రామంలోనూ ఇలాంటి అసహనం కానీ, హింస కానీ, మరోటి కానీ లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే, దురదృష్టవశాత్తు అలాంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు జరిగి ఉండొచ్చని చెప్పారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన హింసాత్మక ఘటనలతోపాటు భారత్‌లోని ప్రార్థనా మందిరాల్లో దాడులు పెరుగుతున్నాయంటూ అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు.

“మనం విషయాలను కొంచెం అతిశయోక్తి చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. అవును, కొన్ని సమస్యలు చర్చకు వచ్చాయి. టెలివిజన్ ఛానెల్‌లలో చాలా వేడి ఉంది. మీరు వీధిలో ఎక్కడా చూడలేరు. మీరు ఢిల్లీ మీదుగా నడవండి లేదా దేశంలోని ఏ గ్రామంలోనైనా అలాంటి అసహనం లేదా హింస లేదా మరేదైనా లేదు” అని దేశంలో పెరుగుతున్న మత అసహనం వాదనల గురించి అడిగినప్పుడు సద్గురు స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.