Savarkar – Vishwa Samvad Kendra Andhra Pradesh

సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సరికావు: ఉద్ధవ్‌
ముంబయి: సావర్కర్‌ అంటే తమకు అపార గౌరవం ఉందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. అలాంటి వ్యక్తిపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సావర్కర్‌కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు ఆయనో చిహ్నమని పేర్కొన్నారు. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ళ పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారని అన్నారు. సావర్కర్‌ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారని పేర్కొన్నారు.

బ్రిటీషర్ల నుంచి పింఛన్‌ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేశారంటూ రాహుల్‌ విమర్శలు గుప్పించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. చరిత్రను రాహుల్‌ గాంధీ వక్రీకరిస్తున్నారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్‌ తప్పుబట్టారు. అలాంటి వ్యక్తితో కలిసి కొందరు యాత్రల్లో పాల్గొంటున్నారని శివసేనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాల్‌ థాక్రే ఆశయాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

Source: eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సావర్కర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు సరికావు: ఉద్ధవ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స్వార్థపర శక్తుల లక్ష్యం సావర్కర్‌ కాదు… జాతీయవాదం!
ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌

ఢిల్లీ: వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయనను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అయితే అటువంటి ప్రయత్నాల నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదని, భారతీయ జాతీయవాదం అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

ఉదయ్‌ మహూర్కర్‌, చిరాయు పండిట్‌ రచించిన ‘వీర్‌ సావర్కర్‌`విభజనను నిరోధించగలిగిన వ్యక్తి’ గ్రంథాన్ని ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌తో కలిసి ఆవిష్కరిస్తూ ఆనాటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని హిందూత్వ గురించి వివరించడం అవసరమని సావర్కర్‌ భావించారని మోహన్‌ జీ తెలిపారు.

‘చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మనం పరిస్థితిని చూసినప్పుడు, గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉందని గుర్తుకు వస్తుంది. ఆనాడు అందరూ ఆవిధంగా మాట్లాడి ఉంటే బహుశా విభజన జరిగి ఉండదు,’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

మోహన్‌ భగవత్‌ దివంగత ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త పి.పరమేశ్వరన్‌ను ఉదహరిస్తూ సావర్కర్‌ని అప్రదిష్టపాలు చేసిన తర్వాత అటువంటి శక్తుల తదుపరి లక్ష్యాలు స్వామి దయానంద్‌ సరస్వతి, స్వామి వివేకానంద, యోగి అరవింద్‌ అని తెలిపారు.

వీర్‌ సావర్కర్‌ని అప్రదిష్ట కావించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలను పేర్కొంటూ భగవత్‌, ‘నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదు, భారత జాతీయత. కాబట్టి, అందరూ ఐక్యంగా ఉంటే, చాలామంది తమ ఉనికిని కోల్పోతారు’ అని చెప్పారు.

‘మన మాతృభూమిని ఐక్యంగా ఉంచడం మన బాధ్యత. చివరికి అఖండ భారత్‌ ఏర్పడుతుందని యోగి అరవింద్‌ చెప్పారు. రామ్‌ మనోహర్‌ లోహియా కూడా అఖండ భారత్‌ గురించి కలలు కన్నారు’ అని పేర్కొంటూ హిందూతత్వాన్ని ఐక్యత శక్తిగా డాక్టర్‌ భగవత్‌ స్పష్టం చేశారు. తమ మనుగడకు, దేశ సంపదను దోచుకోవడానికి ‘విభజించి పాలించడం’ అవసరమనే ఆలోచన బ్రిటిష్‌ వారికి ఉందని చెబుతూ ‘సావర్కర్‌ అండమాన్‌ జైలులో పొందిన అనుభవం ఇది’’ అని ఆయన చెప్పారు.

మహాత్మా గాంధీ, సావర్కర్‌ల మధ్య భేదాభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ వారిద్దరూ దేశంకోసం అంకితమైన సైనికులని, ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు ఆందోళన చెందారని గుర్తు చేశారు. దీనిని అర్థం చేసుకోలేనివారు ఇప్పటికి దుష్ప్రచారం సాగిస్తున్నారని భగవత్‌ మండిపడ్డారు. హిందూత్వం భావన ఒకటే అని, అది చివరి వరకు అలాగే ఉంటుందని చెబుతూ భారతదేశంలో నివసించే వారందరి పూర్వీకులు వారి కుల, మతాలకు అతీతంగా ఒకేలా ఉంటారని స్పష్టం చేశారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ హిందువులని, ఇక్కడ హిందూమతం అర్థాన్ని జోడిరచడం చాలా విస్తృతమని ఆయన తెలిపారు.

మైనారిటీ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మోహన్‌ భగవత్‌, మైనారిటీ అనేదేమీ లేదని చెప్పారు. ‘మనం ఒకటే, మనం ఒకే సంస్కృతికి వారసులం… విభిన్న ఆచారాలు, భాషలు ఉన్నప్పటికీ. ఎవ్వరిని సంతుష్టపరచడం అంటూ లేదు. అందరి సంక్షేమం కోరతాము. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయి, అలాగే విధులు కూడా ఉన్నాయి,’ అని భగవత్‌ స్పష్టం చేశారు.

మోహన్‌ భగవత్‌ ఇంకా మాట్లాడుతూ సావర్కర్‌ దేనినీ గుడ్డిగా అంగీకరించలేదని పేర్కొంటూ ‘ఆయన ముస్లింలను ద్వేషించలేదు. ఆయనకు ఉర్దూ కూడా తెలుసు. ప్రజాస్వామ్యంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. సావర్కర్‌ ఆలోచనల ఔదార్యం గురించి తెలియని వారు ఆయనకు అప్రదిష్ట కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి గాంధీజీ అవసరమని సావర్కర్‌ ఒక ప్రకటన ఇచ్చారు’ అని గుర్తు చేశారు.

‘గాంధీజీ ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందారు. అందుకనే దేశానికి సావర్కర్‌ అవసరం అని చెప్పారు. అంబేద్కర్‌, గాంధీజీ అందరూ ఆయనను ప్రశంసించారు. కానీ సంకుచిత ధోరణి గల వ్యక్తులే సావర్కర్‌ గురించి పనికిమాలిన విషయాలు తీసుకువస్తున్నారు’ అంటూ విచారం వ్యక్తం చేసి, ఖండిరచారు.

క్షమాభిక్ష పిటీషన్‌ పెట్టమన్నది గాంధీ

సావర్కర్‌పై చాలా అబద్ధాలు వ్యాపింపచేస్తున్నారని పేర్కొంటూ అతను బ్రిటిష్‌ ప్రభుత్వం ముందు బహుళ క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశాడని పదేపదే ప్రస్తావిస్తున్నారని రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ గుర్తు చేశారు. సావర్కర్‌ తన విడుదల కోసం ఈ పిటిషన్లను దాఖలు చేయలేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ఖైదీకి క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేసే హక్కు ఉంటుంది. క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయమని ఆయనను గాంధీ కోరారని చెప్పారు. గాంధీ సూచన మేరకు ఆయన క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశారని అంటూ మహాత్మా గాంధీ సావర్కర్‌ని విడుదల చేయాలని విజ్ఞప్తి కూడా చేశారని తెలిపారు.

సావర్కర్‌ వాస్తవానికి బానిసత్వం సంకెళ్లను విచ్ఛిన్నం చేయడానికి ప్రజలను ప్రేరేపించారని, మహిళల హక్కులతో సహా అనేక ఇతర సామాజిక సమస్యల మధ్య అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆందోళన చెందారని రాజనాథ్‌ పేర్కొన్నారు. అయితే, దేశ సాంస్కృతిక ఐక్యతలో ఆయన పాత్రను విస్మరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

2003లో సావర్కర్‌ చిత్రాన్ని పార్లమెంటులో ఉంచినప్పుడు చాలా రాజకీయ పార్టీలు బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారినప్పుడు అండమాన్‌, నికోబర్‌ జైలులో ఆయన పేరు మీద ఉన్న ఫలకంను తొలగించారని చెప్పారు. సావర్కర్‌పై కొందరు పెంచుకున్న ద్వేషాన్ని ఇవి తెలుపుతున్నాయని విమర్శించారు.

నాజీ లేదా ఫాసిస్ట్‌గా సావర్కర్‌ను అభివర్ణించడం సరికాదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. నిజం ఏమిటంటే ఆయన హిందుత్వను విశ్వసించారు. అయితే వాస్తవికవాది. ఐక్యతకు సంస్కృతి ఏకరూపత ముఖ్యం అని ఆయన నమ్మారు. సావర్కర్‌ ఒక వ్యక్తి కాదు. ఒక ఆలోచన. ఆయన అనుచరులు రోజురోజుకు దేశంలో పెరుగుతున్నారని రాజనాథ్‌ వివరించారు.

కొత్త పుస్తకంలో, ఉదయ్‌ మహూర్కర్‌, చిరాయు పండిట్‌ పాకిస్తాన్‌ ఏర్పడకుండా నిరోధించడానికి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ విజయవంతం కాని ప్రయత్నం గురించి వివరించారు. సావర్కర్‌పై చేస్తున్న అప్రదిష్ట కలిగించే ఆరోపణలలోని వాస్తవాలను సహితం వారు అందులో బహిర్గతం చేశారు. అటువంటి ఆరోపణల వెనుకనున్న ఉద్దేశ్యాలను వెల్లడిరచారు.

మహూర్కర్‌ తన కొత్త పుస్తకంలో సావర్కర్‌ని ‘భారత దేశ భద్రతకు పితామహుడు’ అని పేర్కొన్నాడు. అతని జాతీయవాద సిద్ధాంతం ‘ఓటు బ్యాంకు రాజకీయాల బలిపీఠం వద్ద త్యాగం చేయబడిరది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వార్థపర శక్తుల లక్ష్యం సావర్కర్‌ కాదు… జాతీయవాదం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీజీలో ఆర్‌ఎస్‌ఎస్‌, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం
కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు గవర్నర్‌ మొహమ్మద్‌ ఖాన్‌ మద్దతు

తిరువనంతపురం: విశ్వవిద్యాలయ స్థాయిలో పవిత్ర భారతావనికి అమూల్యమైన సేవలందించి, బలిదానమైన మహనీయుల చరిత్ర ఎంతో అవసరమని, ఈ పాఠ్యాంశాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపకరిస్తాయని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తూ… కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌కు మద్దతు ఇచ్చారు.

కేరళలోని కన్నూర్‌ విశ్వవిద్యాలయం సిలబస్‌లో సావార్కర్‌, గోల్వాల్కర్‌ రచనలను ప్రవేశపెట్టింది. ఈ చర్యను కొన్ని దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తులు నిరసించారు. దీంతో గవర్నర్‌ స్పందించారు. భిన్నత్వ భారతదేశంలో విద్యార్థులకు విభిన్న సిద్ధాంతాలను బోధించడంలో తప్పు లేదు. విద్యార్థులు నేర్చుకున్న తర్వాత చర్చల్లో పాల్గొనాలని ఆయన అన్నారు. దేశంలో ఉత్తమ విద్యార్థులు, పౌరులను కొంతమంది దేశ వ్యతిరేకులుగా తయారు చేయడం వల్ల పొంతన, సరైన అవగాహన లేని నిరసనలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

భారతదేశం ఎల్లప్పుడూ వైవిధ్యభరితమైన భూమి అని, ప్రాచీన కాలం నుండి ప్రకృతిని అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి అలవాటుపడిరదని మర్చిపోవద్దని గవర్నర్‌ హితవు పలికారు. ఆర్‌ఎస్‌ఎస్‌, అదే సమయంలో సిద్ధాంతకర్తల పుస్తకాలు సమాజంలో గొప్ప ద్వేషాన్ని పెంపొందించలేదా అనే ప్రశ్నకు, ముందు అటువంటి పుస్తకాలను క్షుణ్ణంగా చదవండి… అర్థం చేసుకున్నాక విమర్శించేందుకు తయారుకండని అన్నారు.

విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ సిలబస్‌కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు ఆందోళన పడినప్పటికీ, ఇందులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. కోర్సులలో దేశంలోని విశ్వవిద్యాలయాల ప్రముఖ నాయకులపై వివిధ పుస్తకాలు ఉన్నాయి… సిలబస్‌లో సావర్కర్‌, గోల్వాల్కర్‌ కనిపించడంలో తప్పు లేదు… పుస్తకాల పేర్లతో పాటు వివరణాత్మక వివరణను అందించాల్సి ఉందని వైస్‌ ఛాన్సలర్‌ అన్నారు.

కాగా, సిలబస్‌ అధ్యయనం కోసం ఇద్దరు సభ్యుల కమిటీని నియమించారు. యూనివర్సిటీ వెలుపల నుండి ఇద్దరు వ్యక్తులు దీని కోసం నియామకమయ్యారు. కమిటీ ఐదు రోజుల్లో తన నివేదిక సమర్పించనుంది.

Source: Janmabhumi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీజీలో ఆర్‌ఎస్‌ఎస్‌, సిద్ధాంతకర్తల చరిత్ర అవసరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.