SARDAR PATEL – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్
నేడు జయంతి సందర్భంగా…

రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ ప్రజల మధ్యకు వెళ్లడం ప్రారంభించి, స్వాతంత్ర పోరాటంలో అగ్రశ్రేణి నేతగా ఎదిగి, స్వతంత్ర భారతావనిలో మొదటి హోమ్ మంత్రిగా రాచరిక రాష్ట్రాలను విలీనం చేయడం ద్వారా ఆధునిక భారత దేశ సమగ్రత సారథిగా చరిత్ర సృష్టించారు సర్దార్ పటేల్.

`సర్దార్’గా దేశ ప్రజలు ప్రేమతో పిలుచుకునే వల్లభాయ్ ఝవేర్‌భాయ్ పటేల్ (అక్టోబర్ 31, 1875 – డిసెంబర్ 15, 1950), భారత దేశ సమైక్యతను కాపాడటంలో 1871లో అనేక జర్మన్ రాష్ట్రాలను ఏకం చేసిన ఒట్టో వాన్ బిస్మార్క్‌తో పోలుస్తుంటారు. భారతదేశంలో సర్దార్ పటేల్ మొత్తం 562 రాచరిక రాష్ట్రాలను ఏకీకృతం కావించారు.

విధిలేని పరిస్థితులలో భారత్ ను వదిలి వెళ్ళవలసి రావడంతో తొలుత హిందూ- ముస్లిం విబేధాలు సృష్టించి, మతం ఆధారంగా దేశాన్ని రెండు ముక్కలు చేసిన బ్రిటిష్ పాలకులు జూన్ 3 నాటి ప్రణాళిక ప్రకారం, 565 కంటే ఎక్కువగా ఉన్న రాచరిక రాష్ట్రాలకు భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వాతంత్ర్యం ఎంచుకునే అవకాశం కల్పించారు.

ఈ ప్రాంతాలు భారత్ లో విలీనం కావడానికి అంగీకరించని పక్షంలో దేశంలో మూడో వంతు భూభాగం విడిగా ఉండిపోయి దేశమే ఛిన్నాభిన్నం కాగలదని భారత జాతీయ వాదులు అందరూ ఆందోళన చెందారు. ఈ ప్రాంతాలను భారత్‌లో విలీనం కావించి, దేశ సమైక్యతను కాపాడే బాధ్యతను ఆ సమయంలో ఉపప్రధానిగా ఉన్న పటేల్‌కు అప్పగించారు.

గాంధీ పటేల్‌తో, “రాష్ట్రాల సమస్య చాలా క్లిష్టంగా ఉంది, మీరు మాత్రమే దాన్ని పరిష్కరించగలరు” అని చెప్పారు. పటేల్‌ను ఆచరణాత్మక చతురతతో, చిత్తశుద్ధితో, ధృడ సంకల్పం గల రాజనీతిజ్ఞుడిగా అందరూ పరిగణించేవారు. భారతదేశ విభజనపై తనతో కలిసి పనిచేసిన సీనియర్ అధికారి విపి మీనన్‌ను రాష్ట్రాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శిగా తనకు కుడి భుజంగా పనిచేయమని పటేల్ కోరారు.

ఆగస్టు 6, 1947న, పటేల్ ఆయా సంస్థానాధీశ్వరులతో సంప్రదింపులు ప్రారంభించారు. వారిని తన ఇంటికి విందు సమావేశాలకు ఆహ్వానిస్తూ సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశాల్లో, వారిలో దేశ భక్తిని ప్రేరేపిస్తూ, వారి ప్రయోజనాలకు – జాతీయ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం లేదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

దేశ స్వాతంత్య్ర భాగస్వాములై ప్రజల భవిష్యత్‌ గురించి పట్టించుకునే బాధ్యతాయుతమైన పాలకులుగా వ్యవహరించాలని హితవు చెప్పారు. ముఖ్యంగా స్థానిక ప్రజల నుండి వారి పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో భారత రిపబ్లిక్ నుండి స్వతంత్రంగా మనుగడ సాగించడం అసాధ్యమని 565 మంది సంస్థానాధీశ్వరులు గ్రహించేటట్లు చేశారు.

వారి వారసుల కోసం రాజభరణాలు ఏర్పాటు చేయడంతో సహా సానుకూలమైన పలు నిబంధనలను ప్రతిపాదించారు. దేశభక్తితో వ్యవహరించమని పాలకులను ప్రోత్సహిస్తూనే సొంతంగా పాలనా సాగించలేరనే హెచ్చరికలు చేస్తూ, విలీన పత్రంపై సంతకాలు చేయడానికి ఆగస్టు 15, 1947 తుది గడువుగా స్పష్టం చేశారు.

పటేల్ వత్తిడితో జునాగఢ్ విలీనం

ఈ సమాలోచనలు ఫలితంగా కేవలం మూడు ప్రాంతాలు మాత్రమే భారత్‌లో విలీనం పట్ల విముఖత వ్యక్తం చేశాయి. మిగిలిన వారందరూ విలీన పత్రాలపై సంతకాలు చేశారు. జమ్మూ కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మాత్రమే పటేల్ ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం చేయలేదు.

తన సొంత ప్రాంతమైన గుజరాత్‌లోని జునాగఢ్ పటేల్‌కు చాలా ముఖ్యమైనది. పైగా, ఈ కతియావార్ జిల్లాలో అత్యంత సంపన్నమైన, 11వ శతాబ్దంలో గజనీ మొహమ్మద్ దోపిడీకి గురైన సోమనాథ్ దేవాలయం ఉంది. అందులోని విగ్రహాలను ధ్వంసం చేసి, అందులో గల అత్యంత విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు.

సర్ షా నవాజ్ భుట్టో ఒత్తిడితో నవాబు పాకిస్తాన్‌లో చేరాడు. అయితే ఇది పాకిస్తాన్‌కు చాలా దూరంలో ఉంది. దాని జనాభాలో 80 శాతం మంది హిందువులు. పాకిస్తాన్ చేరికను రద్దు చేసి, భారత్‌లో చేరాలని పటేల్ వత్తిడి చేయడంతో చివరకు విలీనం కాక తప్పలేదు

ఈ విషయమై పటేల్ తన ధృడ సంకల్పాన్ని ప్రదర్శించడం కోసం జునాగఢ్‌లోని మూడు సంస్థానాలను ఆక్రమించడానికి సైన్యాన్ని పంపాడు. విస్తృత నిరసనలు, పౌర ప్రభుత్వం లేదా ఆర్జీ హుకుమత్ ఏర్పడిన తరువాత, భుట్టో, నవాబ్ ఇద్దరూ కరాచీకి పారిపోయారు. పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం, పోలీసు విభాగాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.

తర్వాత నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భారత్‌తో విలీనానికి 99.5 శాతం ఓట్లు వచ్చాయి. జునాగఢ్‌లోని బహౌద్దీన్ కళాశాలలో బహౌద్దీన్ కళాశాలలో చేసిన ప్రసంగంలో, పటేల్ హైదరాబాద్‌ తన తదుపరి లక్ష్యంగా ప్రకటించారు. కశ్మీర్ కంటే హైదరాబాద్ భారత్‌కు అత్యంత కీలకమైనదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ విముక్తికై సైన్యం

అప్రమత్తం కానీ పక్షంలో హైదరాబాద్ ను కూడా జునాగఢ్ మాదిరిగా పటేల్ విలీనం చేసుకుంటారని గ్రహించిన పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకొందామంటూ వచ్చింది. జునాగఢ్‌లో వ్యవహరించిన విధంగా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్ విషయం తేల్చడానికి ఒప్పుకొంటే హైదరాబాద్ విషయంలో తలదూర్చమనే సంకేతం ఇచ్చింది.

హైదరాబాదు రాచరిక రాష్ట్రాలలో అతిపెద్దది. ఇది ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలోని కొన్ని భాగాలతో ఉంది. దాని పాలకుడు, నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం అయినప్పటికీ 80 శాతంకు పైగా ప్రజలు హిందువులు. నిజాం స్వాతంత్య్ర రాజ్యంగా కొనసాగించడమొ లేదా పాకిస్తాన్‌తో విలీనాన్ని కోరుకున్నాడు.

నిజాంకు విధేయులైన ముస్లిం శక్తులు, ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు, భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడాలని నిజాంపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో హిందువులపై విస్తృతంగా దాడులు సాగించారు. యుద్ధాన్ని నివారించడానికి లార్డ్ మౌంట్‌బాటన్ తెగించి చేసిన ప్రయత్నాల కారణంగా యథాస్థితి ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, నిజాం ఒప్పందాలను తిరస్కరించాడు.

1948 సెప్టెంబరులో పటేల్ క్యాబినెట్ సమావేశాలలో భారతదేశం ఇక నిజాంతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దానితో ప్రధాని నెహ్రూ, గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి రాజీ పడి సైనిక చర్యకు ఒప్పుకోవలసి వచ్చింది. వ్యూహాత్మకంగా, నెహ్రూ ఐరోపాలో పర్యటిస్తున్నప్పుడు హైదరాబాద్‌పై దండయాత్ర చేయవలసిందిగా పటేల్ భారత సైన్యాన్ని ఆదేశించాడు.

ఈ చర్యను ఆపరేషన్ పోలోగా పిలిచారు. వేలాది మంది రజాకార్ బలగాలు హతమయ్యాయి. హైదరాబాద్ సురక్షితంగా భారత్‌లో విలీనమైంది. హైదరాబాద్‌ను భారతదేశం నడి బొడ్డున ఓ స్వతంత్ర దేశంగా కొనసాగడానికి అనుమతిస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ పడిపోతుందని, అప్పుడు దాని పరిధిలోని హిందువులు లేదా ముస్లింలు సురక్షితంగా ఉండరని పటేల్ పట్టుబట్టారు.

కశ్మీర్ కాపాడే ప్రయత్నం

సెప్టెంబరు 1947లో కశ్మీర్‌పై పాకిస్తాన్ దండయాత్ర ప్రారంభమైనప్పుడు, పటేల్ వెంటనే కశ్మీర్‌లోకి సైన్యాన్ని పంపాలనుకున్నాడు. కానీ, కశ్మీర్‌ను మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీన పరచేవరకు వేచి చూడాలని నెహ్రూ, మౌంట్‌బాటన్‌లు వత్తిడి తెచ్చారు.

అయితే, శ్రీనగర్, బారాముల్లా పాస్‌లను సురక్షితంగా ఉంచడానికి భారతదేశ సైనిక కార్యకలాపాలను పటేల్ పర్యవేక్షించారు. దళాలు ఆక్రమణదారుల నుండి చాలా భూభాగాలను తిరిగి పొందాయి. పటేల్, రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్‌తో కలిసి మొత్తం సైనిక ప్రయత్నాన్ని నిర్వహించారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సైనికులను కశ్మీర్‌కు తరలించడానికి, శ్రీనగర్ నుండి పఠాన్‌కోట్‌ను కలిపే ఒక ప్రధాన సైనిక రహదారిని ఆరు నెలల్లో నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం ఉండేందుకు ఏమాత్రం ఒప్పుకోవద్దని నెహ్రూకు పటేల్ స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక వ్యవహారంలో విదేశీ జోక్యాన్ని కోరుకోలేమని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లను విడుదల చేయడం పట్ల పటేల్ తీవ్ర వ్యతిరేకత తెలిపారు. పాకిస్తాన్‌ ఆ మొత్తాన్ని కశ్మీర్‌లో భారత్‌పై యుద్ధం చేయడానికి ఖర్చు పెడుతోందని హెచ్చరించారు.

ఈ విషయంలో కేంద్ర మంత్రి వర్గం పటేల్ అభిప్రాయాన్ని ఆమోదించినప్పటికీ, మతపరమైన హింస చెలరేగుతుందని అంటూ గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షకు దిగడంతో ఆ మొత్తం విడుదల చేయక తప్పలేదు.

శరణార్ధుల సమస్య

1949లో తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలలోకి ప్రవేశించిన హిందూ శరణార్థుల సంఖ్య 800,000కి చేరుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. అనేక సందర్భాల్లో శరణార్థులను పాకిస్తాన్ అధికారులు బెదిరింపులు, హింసాయుత చర్యలతో బలవంతంగా తరిమికొట్టారు. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనమని నెహ్రూ పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్‌ను ఆహ్వానించారు.

అతనిపై విరక్తి ఉన్నప్పటికీ, పటేల్ అయిష్టంగానే ఖాన్‌ను కలుసుకుని ఈ విషయం గురించి చర్చించారు. రెండు దేశాల్లోనూ మైనారిటీ కమిషన్‌లను రూపొందించి, భారతదేశం, పాకిస్తాన్‌లు పరస్పరం మైనారిటీలను రక్షించుకోవడానికి నిబద్ధతతో కట్టుబడి ఉండేలా ఒప్పందంపై సంతకం చేయాలనే నెహ్రూ ప్రణాళికను పటేల్ తీవ్రంగా విమర్శించారు.

ఈ విషయమై నెహ్రు వైఖరికి నిరసనగా బెంగాల్‌కు చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, కె సి నియోగి కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. నెహ్రూ పాకిస్తాన్‌ను బుజ్జగిస్తున్నారని పశ్చిమ బెంగాల్‌లో తీవ్రంగా విమర్శించారు. అయితే, ఆ ఒప్పందం ప్రమాదంలో పడడంతో పటేల్ నెహ్రూకు అండగా నిలిచారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ
కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రధాని మాట్లాడుతూ… అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు.

‘భారత్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో కూడిన, వినయపూర్వకమైన వైఖరితో అందరినీ కలుపుకునే తత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాలకే ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు’ అని ప్రధాని పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్ నేడు అవతరిస్తోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్ కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు.

రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్ షా

దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్ పటేల్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ ను ఏకం చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమైక్య భారత రూపశిల్పి సర్దార్ పటేల్
1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రానే వచ్చింది. నుడిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశపు తొలి ప్రధాన మంత్రి అయ్యారు. సర్దార్ పటేల్ ఉప ప్రధాని అయ్యారు. దేశీయాంగ వ్యవహారాలు, సమాచార ప్రసారశాఖ, స్వదేశ సంస్థానాల మంత్రిత్వశాఖలు ఆయన అధీనంలోకి వచ్చాయి.

అప్పట్లో భారతదేశంలో 600 పైగా సంస్థానాలు వుండేవి. వాటిలో కొన్నింటిని మినహాయిస్తే తక్కినవన్నీ చిన్నచిన్న సంస్థానాలే. వాటిని పాలిస్తున్న మహారాజులు, నవాబుల్లో కొందరు మాత్రం వివేకవంతులుగా, దేశభక్తులుగా వుండేవారు. కానీ ఎక్కువ మంది ధనమదం, అధికారమదం తలకెక్కినవారు. బ్రిటిష్ వారు భారత దేశం వదలి వెళ్ళిపోతే తాము స్వతంత్ర ప్రభువులం కావచ్చని వారు కలలు కంటుండేవారు. స్వతంత్ర భారత ప్రభుత్వం తమను కూడా స్వతంత్ర ప్రభువులుగా గుర్తించి సమాన ప్రతిపత్తి ఇవ్వాలని వారు వాదిం చారు. వారిలో కొందరైతే ఐక్యరాజ్యసమితికి తమ ప్రతినిధులను పంపాలని కూడా ఆలోచించారు.

నిజానికి ఈ సంస్థానాలన్నీ స్వతంత్ర భారతంలో భాగంగా చేరకపోతే చాలా సమస్యలు తలెత్తి వుండేవి. ఆ సంస్థానాల గుండా రైళ్ళు నడపాలంటే భారతదేశం వారి అనుమతి పొందవలసి వచ్చేది. ఆ రాజ్యాల గుండా అంతర్ రాజ్య నదులు ప్రవహిస్తూవుంటే ఆ నీటిని వాడుకునేందుకు కూడా వారి అనుమతి కావలసిందే. ఆనకట్టలు కట్టాలన్నా వారి అనుమతి పొందాలి. భారతదేశానికి ఏదైనా దేశంతో యుద్ధం వస్తే ఈ 600 సంస్థానాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో? వారు ఎవరిని సమర్ధిస్తారో? దీనికి జవాబు చెప్పటం అసాధ్యం. వాటిలో ఒక సంస్థానమైన కాశ్మీర్ వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు.దాని ఫలితంగానే కాశ్మీర్లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్థాన్ ఆక్రమణలోనే వుంది. ఇప్పటికీ అది భారతదేశానికి ఒక తలనొప్పిగా మిగిలి పోయింది. ఆ సంస్థానాల సమస్యను సత్వరమే పరిష్క రించివుండకపోతే కాశ్మీర్ వంటివే మరెన్నో సమస్యలు మనను ప్రస్తుతం పీడిస్తూ వుండేవి.

“మనం కలిసివుంటే ఈ దేశాన్ని త్వరలోనే సమృద్ధం చేయగలం. రండి, మాతో కలవండి. మాతో సహకరించండి” అంటూ స్వాతంత్ర్యం రాక మునుపే సర్దార్ ఆయా సంస్థానాధీశులకు పిలుపునిచ్చారు. “ఆగస్టు 15లోగా మాతో కలవకపోతే ఆ తరువాత పరిస్థితి మరోవిధంగా వుంటుంది. ఇప్పుడు మీరు పొందుతున్న ఆదరణ, రాయితీలు ఆ తరువాత మీరు పొందలేకపోవచ్చు” అంటూ వారికి హెచ్చరిక కూడా చేశారు. పటేల్ చాలా మంది సంస్థానాధీశులను కలిసి వారితో చర్చలు జరిపారు. ఫలితంగా దేశభక్తి

గల సంస్థానాధీశులు పలువురు భారత యూనియన్లో చేరారు.

ఉక్కు మనిషి

అయితే జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాధీశులు మాత్రం పాకిస్థాన్ లో కలవటానికి రహస్యంగా కుట్రలు ప్రారంభించారు. పాకిస్థాన్ పనిపట్టటానికి బ్రిగేడియర్ గురు దయాళ్ సింహ నాయకత్వాన ఒక సైనిక దళాన్ని పటేల్ జునాగఢ్ సరిహద్దు వద్దకు పంపించారు. భారతదేశంలో కలవాలని కోరుకున్న జునాగఢ్ సంస్థాన పౌరులు తమ పాలకుడి మీద తిరుగుబాటు చేసి ప్రజా ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. ప్రజలను మోసగించాలని ప్రయత్నిం చిన నవాబు చివరకు పారిపోయాడు. 1947 నవంబరు 12 నాడు పటేల్ జునాగఢ్ చేరారు. హైదరాబాద్ నిజాం నవాబు వివేకవంతంగా ప్రవర్తించకపోతే ఆయనకు కూడా జునాగఢ్ నవాబుకు పట్టినగతే పడుతుందని పటేల్ ఆనాడు జునాగఢ్ లో చేసిన ప్రసంగంలో హెచ్చరించారు.

అయితే హైదరాబాదు నవాబు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు. ఆయన పాకిస్థాన్ కు లక్షలాది రూపాయలు పంపించాడు. నిజాం అనుచరుల్లో ఒకడైన ఖాసిం రజ్వీ అనేవాడు హిందువులను వేధించసాగాడు. వాడు రజాకార్ల ముఠా నాయకుడు. హిందువులను హైదరాబాద్ సంస్థానం నుంచి తరిమివేయాలని వారు ప్రయత్నించారు. వారు చేసే ఘోరాలకు అంతే లేకుండా పోయింది. వారు బయట నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తెచ్చుకోవాలని కూడా ప్రయత్నించారు.

సర్దార్ పటేల్ చివరకు జనరల్ చౌధురి నాయకత్వంలో ‘పోలీస్ చర్య’ తీసుకోవటానికి హైదరాబాదుకు సైనిక దళాలను పంపారు. అయిదు రోజుల్లోనే నిజాం నవాబు గతిలేక దాసోహమన్నాడు. ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కు పారిపోయాడు. అంతటితో రజాకార్ల దుశ్చర్యలకు తెరపడి హైదరాబాద్ లో శాంతి నెలకొన్నది. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ తన దృఢమైన నిర్ణయంతో భారత వ్యతిరేక కుతంత్రాలన్నింటినేఎ అణచివేశారు.

కాశ్మీరులో కూడా అలాంటి సమస్యే తల ఎత్తింది. కాశ్మీరు మహారాజు, ఆ సంస్థానపు శాసనసభ తమ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే నిర్ణయించడం జరిగింది. కానీ కాశ్మీరులోని అయిదింట రెండు వంతుల భూభాగాన్ని పాకిస్థాన్ సైన్యం బలప్రయోగంతో ఆక్రమించుకున్నది. కాశ్మీరు సమస్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధీనంలో వున్నందున ఆ విషయంలో పటేల్ ఏమీ చెయ్యలేకపోయారు. సర్దార్ పటేల్ కనుక అప్పుడు అంత చొరవ తీసుకుని ఉండకపోతే నేటి సమైక్య భారతం సాకారమై ఉండేది కాదు. ముక్కలు ముక్కలుగా వివిధ రాజ్యాలు పరస్పర కలహాలతో, ప్రాంత, భాషా భేదాలతో కొట్టుకు చస్తూ దేశం నిత్య రావణ కాష్టంగా రగులుతూ ఉండేది. అంతెందుకు? అసలు ఆ పరిస్థితిని కనీసం ఊహించనైనా సాధ్యం కాదు. బహుశా భారతదేశమే ఉండేది కూడా కాదేమో. కేవలం సర్దార్ పటేల్ చొరవ, ధైర్య సాహసాలు, వ్యవహార దక్షత అన్నిటికీ మించి ఆయనకు ఈ మాతృభూమి పట్ల ఉన్న భక్తి, దేశ అఖండత పట్ల ఉన్న ఆకాంక్ష, వారి అకుంఠిత దీక్షల ద్వారానే ఆ మహత్కార్యం సాధ్యమైంది.

దేశభక్తుల పుట్టిల్లు

సర్దార్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నదియాద్ పట్టణంలో జన్మించారు. తల్లి లాడ్ బాయి, తండ్రి ఝువేర్ భాయ్. పటేల్ జీ తండ్రి ఝువేర్ భాయ్ కూడా గొప్ప దేశభక్తుడు. 1857 స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న ధీరుడు. ఇక అన్నగారు విఠల్ భాయి కూడా పేరుమోసిన దేశభక్తుడు. భారత శాసన మండలి చైర్మన్ గా కూడా పనిచేసినవాడు.

భీతిలేని బాలుడు

సర్దార్ పటేల్ బాలుడిగా వుండగా చేతిమీద ఒక వ్రణం(కురుపు) లేచింది. ఆ గ్రామంలోని నాటువైద్యుడు కాల్చిన ఇనుముతో వ్రణాలను కాల్చి నయం చేస్తుండేవాడు. వల్లభ్ కూడా ఆయన దగ్గరకు వెళ్ళాడు. ఇనుప చువ్వను ఎర్రగా కాల్చారు. అయితే లేత వయసులో వున్న పిల్లవాడిని చూసి ఆ నాటు వైద్యుడు కాల్చడానికి తటపటాయించసాగాడు.

“ఇంకా ఎందుకు ఆగావు? ఇనుప చువ్వ చల్లారిపోతుంది. తొందరగా పుండుమీద అంటించు” అన్నాడు వల్లభ్.

ఆ మనిషికి మరింత భయంవేసింది. ఎర్రగా మండుతున్న ఇనుప చువ్వను తానే లాక్కుని తన పుండును కాల్చుకున్నాడు. వల్లభ్ భాయ్ మొఖాన బాధ ఛాయలే కనిపించలేదు. అతని ధైర్యాన్ని చూసి పెద్దలు, పిన్నలు అందరూ అబ్బురపడుతూ ఉండేవారు. అన్యాయం మీద తిరగబడ్డం అతని సహజ లక్షణం.

సాధనతో సమున్నత స్థానానికి

వల్లభాయి ప్రాధమిక విద్యాభ్యాసం కరంసాద్లో జరిగింది. తరువాత పెట్లాడ్ లోని స్కూలులో చేరాడు. రెండు సంవత్సరాల తరువాత నాదియాడ్ పట్టణంలోని హైస్కూల్లో చేరాడు.

పెట్లాడ్ లో వుండే రోజుల్లో వల్లభాయి స్వయంగా వంటచేసుకునేవాడు. ప్రతివారం తనకు కావలసిన వంట దినుసులు వేరే గ్రామంలో వున్న తమ ఇంటి నుండి తెచ్చుకుంటూ ఆ మొత్తం దూరం నడచివస్తుండేవాడు. రైలులో వెళ్లే వీలైతే వుంది కాని టిక్కెట్టు కొనటానికి అతనివద్ద డబ్బులుండేవి కావు.

బారిస్టరు కావాలన్నదే వల్లభాయి మనోరథం. ఈ కోరిక నెరవేరాలంటే తను ఇంగ్లండులో చదువు సాగించాలి. కాని తన కుటుంబం కటిక పేదరికంలో మగ్గుతున్నది. భారతదేశంలోనైనా కాలేజిలో చేరటానికి తగినంత డబ్బులేదు తనకు. ఆ రోజుల్లో అభ్యర్థులు ప్రైవేటుగా చదివి లా పరీక్షకు కూర్చునే వీలుండేది. వల్లభాయి అన్న విఠల్ భాయి కూడా లాయరే. ఆయన పరీక్షకు కూర్చునే ముందు కోచింగ్ క్లాసులకు హాజరైనాడు. వల్లభాయి మాత్రం కోచింగ్ క్లాసులకు కూడా హాజరు కాలేదు. తనకు తెలిసిన ఒక లాయరునడిగి పుస్తకాలు అరుపు తెచ్చుకొని ఇంటివద్దనే చదివాడు. అప్పుడప్పుడు న్యాయ స్థానాలకు వెళ్లి గమనించేవాడు. అవి ఇచ్చే తీర్పులను అధ్యయనం చేసేవాడు. లాయర్ల వాద ప్రతివాదాలను శ్రద్ధగా ఆలకించేవాడు. మొత్తానికి వల్లభాయి పరీక్ష పాసయినాడు.

న్యాయవాద వృత్తి ప్రారంభించటానికి కావలసిన సౌకర్యాలేవీ వల్లభాయికి బొత్తిగా లేవు. స్నేహితుల దగ్గర అప్పుచేసి గోధ్రా అనే పట్టణంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ గదిలో రెండు కుర్చీలు వేశాడు. క్రింద కూర్చొనగోరే వారికోసం చాపలు పరిచాడు. అనతికాలంలోనే ఈ చురుకైన యువకుడి దగ్గరకు క్లయింట్లు ఆకర్షితులై రావటం ప్రారంభించారు. ఏ కేసు తీసుకున్నా వల్లభాయి దానిని ఆసాంతం అధ్యయనం చేసేవాడు.

కొద్దిరోజుల్లోనే చాలా మంచి లాయరుగా వల్లభాయి పేరుతెచ్చుకున్నాడు. అప్పటికే వివాహం చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు కూతురు మణి బెన్, కొడుకు దయాభాయి. వల్లభాయి భార్య అస్వస్థురాలు కావటంతో ఆమెను చికిత్స కోసం ముంబైకి పంపాడు.

ఒక రోజు వల్లభాయి కోర్టులొ చాలా ముఖ్యమైన ఒక కేసు కోసం హాజరవుతున్నాడు. ఏకాగ్రచిత్తంతో న్యాయమూర్తి ఎదుట కేసు వాదిస్తున్నాడు. ఆయన అలా నాదిస్తూ వుండగానే ఒక అర్జంటు టెలిగ్రాం ఆయన చేతికి ఇచ్చారు. అందులోని విషయం ఏమిటో ఒక్కసారి చూసి, మడతపెట్టి జేబులో పెట్టుకొని మళ్లీ తన వాదన కొనసాగించాడు. ఆ టెలిగ్రాంలో ఆయన భార్య మరణించినట్లు వార్త వుంది! ఆయన తన ఉపన్యాసం దాకా ఆ పూర్తి చేసి కూర్చునే దాకా ఆ సంగతి ఆయన దగ్గరవున్నవారికి కూడా తెలియలేదు. భార్య మరణించిన నాటికి వల్లభాయిపటేల్ వయసు ముప్ఫై మూడేండ్లు. ఆయన మళ్ళీ వివాహం చేసుకోదలచలేదు.

సర్దార్ పటేల్ అన్నగారు విఠల్ భాయి ఇంగ్లండు వెళ్లి బారిస్టరు చదువు పూర్తి చేసి వచ్చారు. ఆయన తిరిగి వచ్చిన మీదట వల్లభాయి ఇంగ్లండ్ వెళ్ళాడు. అక్కడ ఏకాగ్ర భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేశాడు. అక్కడి ఆడంబర జీవితపు తళుకు బెళుకులు, భోగవిలాసాలు చూసి మోహితుడు కాలేదు. ఆయన వసతి భవనానికి గ్రంథాలయం పదకొండు మైళ్ళ దూరంలో వుండేది. ప్రతి ఉదయం గ్రంథాలయానికి నడచివెళ్లి సాయంకాలానికి మళ్లీ నడచి వచ్చేవాడు. బారిష్టర్ ఎట్ లా పరీక్ష ప్రథమ శ్రేణిలో పాసైనాడు. భారతదేశానికి తిరిగి రాగానే అహ్మదాబాద్ లో బారిష్టర్ ప్రాక్టీసు ప్రారంభించాడు. రోజు రోజుకు ఆయన కీర్తి, ప్రభావం పెరుగుతూ వచ్చాయి. ఆ రోజుల్లోనే ఆయన నెలకు ఎనిమిది నుంచి పదివేల రూపాయలు సంపాదించేవాడు.

ప్రజా ఉద్యమాలు

రాజకీయాల పట్ల, స్వాతంత్ర్యోద్యమం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వల్లభాయ్ గాంధీజీ పరిచయంతో, ప్రభావంతో స్వాతంత్ర్యోద్యమ నాయకుడయ్యాడు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బ తిని ఇబ్బందులు పడుతున్న రైతులను పన్నులు చెల్లించమని వేధిస్తున్న ఆంగ్లేయ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా గాంధీజీ సూచనతో గుజరాత్ వ్యాప్తంగా ఒక రైతు ఉద్యమాన్ని నడిపారు వల్లభాయ్.

సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా వేలాది రూపాయలను తెచ్చి పెడుతున్న బారిస్టరు వృత్తిని త్యజించారు. పిల్లలను దేశభక్తులుగా తీర్చిదిద్దే విద్యను అందించటానికి ఆయన గుజరాత్ విద్యా పీఠాన్ని స్థాపించారు.

1923 లో నాగపూర్ లో ప్రభుత్వ కార్యాలయాలున్న ఏ రోడ్డులోనూ త్రివర్ణ పతాకాలను ఎగురవేయకూడదని ఆంగ్లేయ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందుకు ప్రతిగా మూడున్నరేళ్ళ పాటు ఒక గొప్ప ప్రజా ఉద్యమాన్ని నడిపారు పటేల్ జీ. చివరికి బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

గుజరాత్ రైతులు వరదలతో నష్టపోయి, కరువుతో తీవ్ర ఇక్కట్లపాలై బాధలు పడుతున్నప్పుడు రైతుల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వమే వారిని కష్ట సమయంలో ఆదుకోవాలని ఆయన ఆంగ్లేయ ప్రభుత్వంతో వాదించారు. ప్రభుత్వం అందుకు తల ఒగ్గి గుజరాత్ రైతులకు 1.5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా అనేక సహాయ కార్యకరమాలకు ఆ డబ్బును సమర్ధంగా వినియోగించి తాను అసమాన పోరాట దక్షుడనే కాక అద్భుత కార్య కుశలుడనని చాటారు వల్లభాయ్.

బార్దోలి రైతులకు మద్దతుగా జరిగిన అతి పెద్ద ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేసి ఆంగ్లేయ ప్రభుత్వం మెడలు వంచిన వల్లభాయ్ పటేల్ ని ఆరోజు నుంచి ప్రజలు ‘సర్దార్ పటేల్’ అని ప్రేమగా పిలుచుకోవడం ప్రారంభమయ్యింది.

ముక్కు సూటి మనిషి

1937లో అన్ని ప్రాంతాల శాసన సభలకు ఎన్నికలు జరిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు పటేల్ ఛైర్మన్ గా వున్నాడు. ఆయన నాయకత్వంలో ‘ కాంగ్రెసు ఎనిమిది ప్రాంతాలలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని మంత్రివర్గాలు ఏర్పరచింది. వాటన్నిటి కళ్ళాలు పటేల్ జీ చేతుల్లోనే వున్నాయి. ఏ మంత్రి అయినా తప్పుచేస్తే సర్దార్ వారిని నిస్సంకోచంగా నిలదీసేవారు.

అప్పట్లో ముస్లింలీగ్ ఏవేవో చిక్కు సమస్యలు సృష్టిస్తూ స్వాతంత్య్ర సాధన మరింత కష్టతరమయేట్లు చేసింది. భారతదేశ స్వాతంత్య్రానికి అడ్డు పడుతున్న వాళ్ళందరితోనూ మేము పోరాడుతాం” అని ప్రకటించారు సర్దార్ పటేల్.

దూరదృష్టి

సర్దార్ పటేల్ ఎంతో దూరదృష్టి గల వ్యక్తి. 1962లో చైనా తన సైన్యాన్ని భారత సరిహద్దుల మీదకు పంపగా వారి దెబ్బకు భారతదేశం దిమ్మెరపోయింది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన సన్నివేశమిది. అయితే ఇది జరగటానికి చాలాకాలం క్రిందటనే 1950 నవంబరు 7వ తేదీన జవహర్లాల్ నెహ్రూకు పటేల్ ఒక ఉత్తరం వ్రాస్తూ చైనాను విశ్వసించటానికి వీలులేదని తెలియజేశారు. “చైనా ప్రభుత్వం తాము శాంతి కాముకులమని చెప్పుకుంటూ మోసగించాలని చూస్తున్నది. ఇకనుండి మనదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన పథకాలు తయారు చేసేటప్పుడు కమ్యూనిస్టు చైనా దురాలోచనలను మనం గుర్తుంచుకుని తీరాలి” అని వ్రాశారు.

తరువాత అయిదు వారాలకు 1950 డిసెంబరు 15 నాటి ఉదయం ముంబైలో ఆయన కాలధర్మం చెందారు. ఆయన మరణించిన పన్నెండు సంవత్స రాలకు భారతదేశంపై చైనా దాడి చేసింది.

బార్డోలీ సేనాధిపతి, గుజరాత్ సింహం, భారతదేశపు ఉక్కుమనిషి దేశ స్వాతంత్య్ర సమరాంగణపు సర్దార్, భారత సమైక్యతా సౌధ మహాశిల్పి. వజ్ర సంకల్పుడైన వల్లభాయి పటేల్ని మనం కోల్పోయాం. అప్పటికి ఆయన వయసు డెబ్బై అయిదు. నవభారత రూపశిల్పి ఆయన. ధైర్యానికి, ప్రేరణకు తరగని గని ఆయన.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమైక్య భారత రూపశిల్పి సర్దార్ పటేల్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడలో ఘనంగా మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు
విజయవాడలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు  హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ వాల్మీకి,  సర్దార్ వల్లభాయ్ పటేల్ ల జయంతి   కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో  పాల్గొన్న పెద్దలు వాల్మీకి, భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చిత్రపటాలకు  పుష్పమాలలను సమర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అడవులలో దారి దోపిడీ దొంగగా జీవిస్తూ ఉండిన వాల్మీకి  నిషాద పక్షి విషాదాన్ని చూచి విచలితుడై  రామాయణ మహాకావ్యాన్ని రచించాడని, యుగాలు ఎన్ని గడిచినా రామాయణ మహా కావ్యం ప్రజల హృదయాలలో ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుందని, సమస్త మానవాళికి జీవన విలువలను, జీవన ఆదర్శాలను బోధిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే 550 పైగా ఉన్న స్వతంత్ర సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడంలో  కీలక భూమిక పోషించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరోదాత్తత, పట్టుదల, ఆత్మస్థైర్యం, దేశభక్తి ఎన్ని తరాలు గడిచినా భారతీయులందరికీ ఆదర్శనీయము,  ఆచరణీయము అని వక్తలు ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక సభ్యులు శ్రీ కే రాము, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి శ్రీ టి. కోదండరామయ్య, నగర బిజెపి నాయకులు ఆర్ముగం, ఏబీవీపీ కార్యకర్తలు శ్రీ సుబ్బరాజు, శేషు, సత్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడలో ఘనంగా మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామ దాన భేద దండోపాయాలతో దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్
‘సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు.  అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట యోధునిలా నిలబడ్డారు. ఉక్కు మనిషి  సర్దార్ పటేల్ లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావలసిన చతురత మరో పార్శ్వం. వాటితోనే ఆయన  500 పైగా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను ఏకీకృతం చేశారు.

భారత రాజ్యాంగంలోని మొదటి అధిరకరణం ప్రకారం, ‘ఇండియా అంటే భారత్ , రాష్ట్రాల యూనియన్”. బ్రిటిష్  వలస రాజ్య పతనం తరువాత రాజకీయంగా దేశ ఐక్యతను సాధించడంలో సర్దార్ పటేల్ ను మించిన వారు ఎవరు లేరు అని అనవచ్చు.

1947లో స్వాతంత్రానికి పూర్వం దేశంలోని 48 శాతం భూభాగం, 28 శాతం జనాభాతో 555 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియాలో భాగం కాదు. దాంతో పాటు అక్కడి నివసించే ప్రజల మీద బ్రిటిష్ వారికి ఎలాంటి అజమాయిషీ ఉండేది కాదు. కానీ, నిజానికి ఆవి బ్రిటిష్ రాజ్యానికి లోబడి ఉండేవి.

ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్, 1947, ప్రకారం భారత దేశంలోని సంస్థానాలు బ్రిటిష సార్వభౌమాధికారం నుండి విముక్తి పొందినవి. దాని కారణంగా సంస్థానాదిపతులకు భారత్ దేశంతో లేదా పాకిస్తాన్ తో కలవడం, లేదా సర్వ స్వతంత్రంగా ఉండే అవకాశం కల్పించబడింది.  ఒక విధంగా ఈ సంస్థానాదిపతులందరినీ  బ్రిటిష్ సామ్రాజ్యానికి సామంతులుగానే పిలువవచ్చు. 1857 లో జరిగిన “తిరుగుబాటు” సమయంలో చాల సంస్థానాలు బ్రిటిష్ వారికే సహకరించాయి.  భయంకరమైన ప్రళయంలో తాము కొట్టుకుపోకుండా ఈ సంస్థానాలే కాపాడాయని  స్వయంగా లార్డ్ కానింగ్ అంగీకరించాడు.

జూన్ 27, 1947 లో కొత్తగా ఏర్పడిన సంస్థానాల పాలనా విభాగానికి సర్దార్ పటేల్ మంత్రిగా నియమించబడినారు. వారికి తోడుగా సెక్రటరీ వి పి మీనన్ కి సంస్థానాధిపతులతో చర్చించే బాద్యతను అప్పగించారు. వారిద్దరూ కలిసి ఒక విలీన పత్రాన్ని రూపొందించారు. దాని అనుగుణంగా సంస్థానాధిపతులు వారి దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార, వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేస్తున్నట్టు అంగీకారిస్తూ సంతకాలు చేశారు.

భారత యూనియన్ లో విలీనం అయ్యేట్లుగా పటేల్ ఎల్లప్పుడూ సంస్థానదిపతులలో దేశభక్తిని మేల్కొల్పేవాడు. విలీనానికి విరుద్ధంగా వ్యవహరిస్తే సంస్థానంలో అరాచకత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించేవారు.  భారత దేశంలో విలీనం అయిన అట్టి సంస్థానాల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున కొంత రాజ భరణాన్ని ఇవ్వడం అనే నూతన విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.

సంస్థానాలతో విలీన పత్రాలపై ఒప్పందం గురించి జరిగిన చర్చలు ఉత్కంఠభరితంగా సాగినవి. వ్యవహార నీతికి సంబంధించిన అన్ని ప్రయోగాలూ ఉపయోగించడం జరిగింది. దేశ ఐక్యతను సాధించే క్రమంలో రాజ్యాంగ పరమైన చర్చలు, ప్రయోజనాలు, దేశభక్తిని తట్టి లేపడం, హెచ్చరికలు, ఆఖరికి సైనిక బలాల ప్రయోగం లాంటివి కూడా జరిగినవి.

నిజాం పాలనలోని హైదరాబాద్ – ఆపరేషన్ పోలో

గోవాలోని పోర్చుగీస్, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ సంస్థానం ఆయుధాలు సమకూర్చుకోవడం లాంటివి, మత కల్లోలాలు సృష్టించడం పరిస్థితిలు విషమ స్థాయికి చేరడం ఆందోళన కలిగించిన అంశాలు. పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండటానికి హైదరాబాద్ నిజాం మొగ్గు చూపడం, పాకిస్తాన్ సహకారంతో హైదరాబాద్ ఆయుధ సంపత్తిని పెంచుకొనే ప్రయత్నాలు భారత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. హైదరాబాద్ సంస్థానం, భారత మధ్య విలీన చర్చల సమయంలో విలీనంపై సర్దార్ పటేల్ మాటలు  “స్వతంత్ర హైదరాబాద్ అంటే భారత్  హృదయంలో పుండులాంటిది. దాన్ని శాస్త్ర చికిత్స ద్వారానే నిర్మూలించాలి”. బల ప్రయోగం నిర్ణయం అయిన తరువాత దానికి ఆపరేషన్ పోలో గా నామకరణం చేశారు. సెప్టెంబర్ 13 నుండి 18 వరకు అంటే కేవలం 5 రోజుల్లో యుద్ధం ముగిసినప్పటికీ అది ఎంతో కీలకమైనది. దానికి  కారణం శక్తివంతమైన హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడమే.

VSK TELANGANA సౌజన్యంతో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సామ దాన భేద దండోపాయాలతో దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.