#RUSSIA UKRAIN WAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌
ఉక్రెయిన్ ‌పై సైనిక చర్య నేపథ్యంలో ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. ముఖ్యంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ నేపథ్యంలోనే భారత్ ‌కు చౌక ధరకు ముడిచమురును విక్రయించేందుకు ముందుకొచ్చిన రష్యా… తాజాగా మరింత డిస్కౌంట్ ‌ను ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటికే రష్యా నుంచి 30లక్షల బ్యారెళ్ల ముడి చమురును డిస్కౌంట్ ‌లో కొనుగోలు చేసేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ ‌ను మరింతగా ఆకర్షించి ఎగుమతులు పెంచుకోవాలని రష్యా భావిస్తోంది. ఇందుకోసం బ్యారెల్‌ ధరపై 35 డాలర్ల వరకు డిస్కౌంట్ ‌ను ప్రకటించింది. యుద్ధానికి ముందున్న ధరకే ఉరాల్‌ క్రూడ్ ‌ను విక్రయిస్తామని రష్యా ఆఫర్‌ ఇచ్చిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది 15 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకునేలా రష్యా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు రూబుల్‌-రూపాయి చెల్లింపు విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ, ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీస్‌ లవ్రోవ్‌.. కేంద్రంతో జరిపే చర్చల్లో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

కాగా.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న వేళ.. ఈ డిస్కౌంట్‌ ఆఫర్ ‌కు భారత్‌ అంగీకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు మీడియా కథనాలు రాసుకొచ్చాయి.

మరోవైపు ఈ చమురు దిగుమతుల విషయంలో భారత్ ‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. రష్యా నుంచి భారత్‌ డిస్కౌంట్ ‌లో చమురు కొనుగోలు చేయడం తాము విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. భారత్‌ దీనిపై చూపుతున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలని అమెరికా సూచించింది.

– ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముడిచమురుపై మరింత డిస్కౌంట్‌ – భారత్ ‌కు రష్యా ఆఫర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నిరసించిన భారత్…
* రష్యాకు వ్యతిరేకంగా ఓటేసిన భారతీయ న్యాయమూర్తి…

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారతీయ జడ్జి సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్​పై దండయాత్రకు వ్యతిరేకంగా ఐసీజే తీర్పు చెప్పగా.. భారత్​ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ అందులో భాగమయ్యారు. సైనిక చర్యను నిలిపివేయాలని ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన 15 మంది న్యాయమూర్తుల్లో.. 13మంది రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు పిటిషన్​ను వ్యతిరేకించారు. ఉక్రెయిన్ ఫిర్యాదును తోసిపుచ్చిన వారిలో రష్యా న్యాయమూర్తి, ఐసీజే ఉపాధ్యక్షుడు కిరిల్ గెవోర్జియన్, చైనా న్యాయమూర్తి షూ హాన్​కిన్​ ఉన్నారు.

తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే ఆదేశాలిచ్చింది. 1948 జెనోసైడ్‌ కన్వెన్షన్‌ను రష్యా ఉల్లంఘించిందని పేర్కొంది. ఫిబ్రవరి 24న రష్యా సమాఖ్య ప్రారంభించిన సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్పిచ్చింది. ఈ తీర్పును అమెరికా స్వాగతించింది. రష్యా వెంటనే సైనిక చర్య నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐసేజీ తీర్పు స్పష్టంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నిరసించిన భారత్… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా
* రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా

రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వస్తున్న వార్తలపై తాజాగా అమెరికా స్పందించింది. ఈ విషయంలో భారత్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని పేర్కొంది.

ఉక్రెయిన్ ‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యాపై అమెరికా సహా ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆ దేశం నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు చేసుకోరాదని అగ్రరాజ్యం నిర్ణయించింది. అయితే ఈ ఆంక్షలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా.. తమ దేశం నుంచి ముడి చమురును భారత్ ‌కు డిస్కౌంట్‌లో అమ్మాలని అనుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌ కూడా సిద్ధంగా ఉందనే కథనాలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్‌కు రష్యా ఆఫర్ ‌పై వైట్‌ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ ‌సాకీని విలేకరులు ప్రశ్నించారు. దీనికి సాకీ స్పందిస్తూ.. ”భారత్… రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేయడం…. ఆంక్షలను ఉల్లంఘించినట్లు కాదు. అయితే అలాంటి చర్య చేపడితే చరిత్ర పుస్తకాల్లో మీరు (భారత్‌ను ఉద్దేశిస్తూ) ఏ వైపున ఉంటారనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ విషయంలో భారత్‌ ముందుకెళ్తే తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే అని అనుకోవాల్సి వస్తుంది. రష్యా నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారంటే.. ఉక్రెయిన్ ‌పై దండయాత్రను కూడా సమర్థిస్తున్నట్లే.” అని స్పష్టం చేశారు.

యుద్ధాన్ని ఖండిస్తున్నాం… కానీ రష్యాతో మా సత్సంబంధాలు కొనసాగుతాయి – భారత్

ఉక్రెయిన్ ‌పై రష్యా దండయాత్రను తాము సమర్థించడం లేదని మన దేశం‌ ప్రకటించింది. ఈ విషయంలో ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతోంది. అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకొచ్చిన తీర్మానాలకు మాత్రం భారత్‌ దూరంగా ఉంటూ వస్తోంది. రష్యా నుంచి భారత్‌ సైనిక పరికరాలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ తటస్థ వైఖరి పాటిస్తున్నట్లు బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే చాలా సార్లు అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ ఆంక్షలు ఉల్లంఘించినట్లు కాదు – అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి…
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్ ‌స్కీ పలుమార్లు నాటోను అభ్యర్థించినా.. అందుకు నాటో సుముఖత చూపించలేదు. కాగా ఈ అంశంపై జెలెన్ ‌స్కీ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. రష్యాను నిలువరించే విషయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితర యూరోపియన్ నాయకులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ‌లో మాట్లాడారు. తమ దేశానికి మరింత సాయమందించాలని కోరారు.

నో – ఫ్లై జోన్ ‌ను అమలు చేయడానికి నిరాకరించినందుకుగానూ నాటో విషయంలో జెలెన్ ‌స్కీ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో అత్యంత బలమైన కూటమి నాటో. కానీ ఈ కూటమిలోని కొంతమంది సభ్యులు రష్యా దూకుడుతో హిప్నటైజ్ అయ్యారు’ అని విమర్శించారు. నో ఫ్లై జోన్ ‌గా ప్రకటించకపోవడం.. ఒకరకంగా రష్యన్ సైన్యానికి ఉక్రెయిన్‌లోని శాంతియుత నగరాలపై బాంబు దాడులకు అనుమతి కల్పించడమేనని ఆవేదన చెందారు. ‘వాస్తవమే. ఉక్రెయిన్.. నాటో సభ్యత్వ దేశం కాదు. అందులో చేరలేమనీ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ‌ను రక్షించేందుకు నాటో భద్రతాపరమైన హామీలు ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం తమ దేశ ప్రజలు నాటో కూటమి కంటే అంతర్జాతీయ భాగస్వాముల మద్దతుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని జెలెన్ ‌స్కీ పేర్కొన్నారు. రష్యా సరిహద్దులోని ఇతర దేశాలు నాటోను మినహాయించి తమ స్వతంత్ర రక్షణ సామర్థ్యాల గురించి ఆలోచించాలని కోరారు. బ్రిటన్‌, ఇతర దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు సరిపోవడం లేదని, ఫలితంగా రష్యా నుంచి స్వాధీనం చేసుకున్న పరికరాలు, పాత సోవియట్ కాలం నాటి కిట్‌లను వినియోగించాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. రష్యాపై పూర్తిస్థాయి వాణిజ్య ఆంక్షలు కూడా విధించాలని ఈ సందర్భంగా జెలెన్ ‌స్కీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

– ఈనాడు సౌజన్యంతో….

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాటో తీరుపై జెలెన్‌స్కీ అసంతృప్తి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తగ్గేదే లేదంటున్న పుతిన్
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, EU లు రష్యా నుంచి ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. తాజాగా అమెరికాకు పుతిన్ రివర్స్ కౌంటరిచ్చారు. US ప్రెసిడెంట్ జో బైడెన్, హిల్లరీ క్లింటన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో సహా మొత్తం 12 మంది అగ్రనేతలు రష్యాలో ప్రవేశించకుండా పుతిన్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు మంగళవారం రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిల్లీ తదితరులు ఆ లిస్టులో ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తగ్గేదే లేదంటున్న పుతిన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించండి… మరోసారి భారత్ కు ఉక్రెయిన్ విజ్ఞప్తి
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులను కట్టడి చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ…. ​ మరోసారి భారత్ మద్దతు కోరారు. రష్యాతో భారత్ కు ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా తమ దేశంపై చేస్తున్న దాడులను ఆపమని పుతిన్ సర్కారును భారత్ కోరాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. భారత్​ సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు.

“ఈ యుద్ధానికి ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకమని రష్యా మిత్ర దేశాలన్నీ పుతిన్ కు విజ్ఞప్తి చేయాలి. ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ యుద్ధం ఇలా కొనసాగితే పంటలు పండించలేము. ఇది అంతర్జాతీయంగా కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి.. ఇవన్నీ పరిగణించి ఈ యుద్ధాన్ని ఆపేయడమే మంచిది” అని కులేబా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించండి… మరోసారి భారత్ కు ఉక్రెయిన్ విజ్ఞప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ నుండి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జయహో’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు
ఉక్రెయిన్ నుండి పలు దేశాల విద్యార్థులు బయట పడడానికి కష్టాలు పడుతూ ఉన్నారు. భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ గంగ కొన‌సాగుతోంది. ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌తో ఆరు విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. సోమ‌వారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భార‌తీయులు దేశం చేరుకోగా.. ఇప్ప‌టిదాకా ఉక్రెయిన్ నుంచి సుర‌క్షితంగా భార‌త్ చేరుకున్న వారి సంఖ్య 1,396కు చేరుకుంది. కేంద్ర మంత్రివ‌ర్గంలోని న‌లుగురు మంత్రులు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు చేరుకుంటున్నారు.

పాకిస్తాన్‌ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ లో ఉన్నారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పాకిస్తానీ విద్యార్థులను పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి పాక్ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. తమ వాహనంపై తమ జాతీయ జెండాను ప్రదర్శిస్తే భారతీయులకు ఎటువంటి హాని జరగదని రష్యన్లు హామీ ఇవ్వడంతో పాక్ విద్యార్థులు ఈ పని చేస్తున్నారు. ట్విట్టర్‌లో విస్తృతంగా ప్రసారం అవుతోంది ఈ వీడియో. పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను ఉపయోగిస్తున్నారని పాకిస్తానీ న్యూస్ యాంకర్‌ చెప్పారు.

Pakistani student using indian flag to come out of ukraine… Thats power of our india and Modiji… Watch till the end.#indianstudentsinukraine #nuclearwar pic.twitter.com/dBVp4Dj4xe

— Jay (@PoojaraJaydeep) February 28, 2022

పాక్ కు సంబంధించిన వార్తలను ఎక్కువగా నివేదించే ‘హిందుస్థాన్ స్పెషల్’ అనే యూట్యూబ్ ఛానెల్ కూడా ఫిబ్రవరి 27న ఒక వీడియోను షేర్ చేసింది. ఇందులో ఉక్రెయిన్‌లోని పాకిస్తానీ విద్యార్థులు భారత జెండాను పట్టుకున్నారని వెల్లడించాడు. మరో దేశంలోకి వెళ్లేందుకు, ఉక్రెయిన్ సరిహద్దుకు సురక్షితంగా చేరుకోడానికి ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ నుండి బయటపడడానికి ‘భారత్ మాతాకీ జయహో’ నినాదాలు చేస్తున్న పాక్ విద్యార్థులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బేలారస్ లో ఉక్రెయిన్, రష్యా చర్చలు
బేలారస్ వేదికగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగనున్న చర్చలపై ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇవాళ ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్ – బెలారసియన్ సరిహద్దు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చల్లో భాగంగా ఉక్రేయిన్ ప్రతినిది బృదం- రష్యన్ ప్రతినిదుల బృదం సమావేశమవుతారు. అయితే షరతులు లేకుండా చర్చలకు సిద్దంగా ఉన్నామని ఉక్రెయిన్ చెబుతుండగా.. మరో వైపు షరతులకు లోబడి చర్చలకు రావాలని రష్యా చెబుతోంది. యూరోపియిన్ యూనియన్ లో చేరవద్దని రష్యా షరతు పెడుతుండగా.. యూరోపియన్ యూనియన్ లో చేర్చోకోవాలని ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చర్చలకు సిద్ధమంటూనే భీకరంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చలు ఫలిస్తాయా లేదో…. అసలు ఏం జరగబోతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బేలారస్ లో ఉక్రెయిన్, రష్యా చర్చలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు…
* విద్యార్థుల తరలింపును మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సాహసోపేత నిర్ణయం

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్​ సరిహద్దు దేశాలకు పంపించనుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాధిత్య సింథియా, కిరెణ్ రిజిజు, వీకే సింగ్ ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

ఉక్రెయిన్లోని పరిణామాలపై ఆదివారం కూడా ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటివరకు ఐదు విమానాల్లో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించారు అధికారులు. తాజాగా ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు భారత్ కు వచ్చారు. ఇంకా దాదాపు 16వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లనున్న కేంద్రమంత్రులు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం
ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు.

ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే కారణం. ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీకి తెలీదా? తన శక్తి సామర్ధ్యాలేవిటో, తాను కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యా శక్తిసామర్థ్యాలేవిటో ఆయనకు తెలీదా? తనపై తనకు అతి విశ్వాసమా? నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశా? ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది?

నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఫక్తు రాజకీయవేత్త కాదు. ఆయన ఒక సినిమా నటుడు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమెడియన్. ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా? రాజకీయాలలో, దేశ పాలనలో, ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, గతాన్ని పరిశీలించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎందరితోనో, ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అవగానా రాహిత్యమో, అతి విశ్వాసమో, వారిపై వల్లమాలిన అభిమానమో తెలీదుగానీ ఏమాత్రం పాలనానుభావం లేని సినీ పరిశ్రమకు చెందిన వారినే ఆయన తన సలహాదారులుగా, మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు.

అందునా ఉక్రెయిన్, శక్తిమంతమైన ఈయూ, రష్యాల మధ్యన ఉన్నది. ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరియైన విదేశాంగ విధానం. ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా? ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అణకువగా మసలుకుంటేనే కదా? లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా? ఇది సహజమైన జీవన నియమమే కదా? మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?

సరే పోనీ… ఎవరి బలాన్నో నమ్ముకుని ఈయన హద్దులు మరచి రంకెలు వేశాడనుకుందాం…. మరి వారెవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా? అండగా నిలిచి ఆదుకున్నారా? ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతలి వాడు కూడాఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా?

నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే. అమెరికా కూడా పైపైన పటాటోపం ప్రదర్శించడం మినహా ఎప్పుడూ ఎక్కడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన పాపాన పోలేదు. సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను, ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది. వియత్నాం, సిరియా, లిబియా, ఇరాక్ లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది. ఇక ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేసిన నిర్వాకం మనందరికీ తెలిసిందే. ఏడు సముద్రాలు ఈది ఏటి కాలువలో మునిగిన చందాన దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్థాన్లో తిష్ట వేసుకు కూర్చుని చివరికి ఆ తాలిబన్ల చేతికే ఆఫ్ఘన్ ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు. మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్ స్కీ ఆశలు పెట్టుకుని ఉంటే… అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా అయుధాలందిస్తానన్నా ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే? అందుకోడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే లేరే?

ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్, జర్మనీలతో సహా ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయ్. అయినా ఆ హెచ్చరికలన్నిటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కున చేర్చే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణం అయ్యింది.

ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనో, మెక్సికోలోనో పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా? ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు, భద్రత, సంక్షేమమే కదా ప్రధానం? ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది. తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.

అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహరించిన తీరే అత్యంత అవగాహనా రహితమైనది, బాధ్యతారహితమైనది, విచారకరమైనది. జెలెన్ స్కీ తలచుకుంటే…. యుద్ధం జరుగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకూ ఉండింది. చర్చలు జరిపే అవకాశం ఉండింది. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చెయ్యలేదు. సినిమాల్లోలా హీరోయిజం ప్రదర్శించాలని, ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింపజేసుకోవాలని భావించాడో ఏమిటో తెలీదు. ఇంత చేస్తాం, అంత చేస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరుగకపోను కదా? అది కూడా ఓసారి చర్చలకు సిద్దమనీ, మరోసారి కాదనీ ఇలా పూటకోమాట మాట్లాడుతున్నారు.

తెలివైన రాజకీయవేత్త ఎవరూ ఇలా ప్రవర్తించరు. ఈయూలోనో, రష్యాలోనో చేరే విషయమై మేం మరో పదేళ్ళ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుండేవారు. అసలు విషయం ఏంటంటే….. ఇంతకముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి, ఈయూలో కలుద్దామనుకుంటున్న ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి, తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెఱ్ఱి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేశాడు. ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటుగా, ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే…. దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో, గ్రామరో, హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీ లేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన. ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు, ఓర్పు, పట్టువిడుపు ఉన్నవాడు, పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగినవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు. వ్యక్తిగతమైన భేషజానికో, ప్రతిష్ఠకో ప్రాకులాడి దేశ రక్షణను, ప్రయోజనాలను ఫణంగా పెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు, ఎక్కడ నెగ్గాలో…. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పథంలో నడుపగలుగుతాడు.

ప్రజలు కూడా సినీ, క్రీడా గ్లామర్ కో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో, మతానికో ప్రాధాన్యం ఇవ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి, ఆలోచించి తమ నేతను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది. అలా కాని పక్షంలో ప్రజాస్వామ్యమే ఏ దేశానికైనా వినాశ హేతువవుతుంది.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.