#restrictions – Vishwa Samvad Kendra Andhra Pradesh

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు
బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్‌ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.

కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.

అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్‌ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు?
లండన్‌: బ్రిటన్‌కు పెరుగుతున్న వలసలను నియంత్రించే ప్రయత్నంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతోసహా అన్ని అవకాశాలను బ్రిటన్‌ ప్రధానిరిషి సునాక్‌ పరిశీలిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీలు చదివే విదేశీ విద్యార్థులపై, వారు డిపెండెంట్లను తీసుకురావడంపై ఆంక్షలు విధించాలని సునాక్‌ యోచిస్తున్నారని డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి తెలిపారు.

అయితే, తక్కువ నాణ్యత కలిగిన డిగ్రీ అంటే ఏమిటనేది ఆయన నిర్వచించలేదు. ఈ ఆంక్షలు ఏమిటి? అన్నదానిపై స్పష్టత లేదు. బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. దీంతో వలసలపై బ్రిటన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే భారతీయులపైనే అధిక ప్రభావం పడే అవకాశం ఉన్నది.

ఈ వారంలో తాజాగా జాతీయ గణాంకాల కార్యాలయం (ఒఎన్‌ఎస్‌) విడుదల చేసిన వలసలు, శరణార్థుల సంఖ్య పట్ల బ్రిటన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. 2021లో బ్రిటన్‌కువచ్చిన వారి సంఖ్య 1,73,000గా వుండగా, ఈ ఏడాది ఒక్కసారిగా 5,04,000కి పెరిగిపోయింది. అంటే 3,31,000మంది పెరిగారు. దీనిపై ఆందోళన చెందుతున్న రిషి సునాక్‌ ప్రభుత్వం.. వలసలను నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నది.

దీనిలో భాగంగా విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం సహా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారిస్తున్నట్టు బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. విదేశీ విద్యార్ధుల సంఖ్యను నియంత్రించడం ద్వారా వలసల సంఖ్యను కుదించడమనేది చాలా సంక్లిష్టమైన సవాలుగా ఉంది. బ్రిటీష్‌ విద్యార్థుల నుంచి తక్కువ ఫీజు తీసుకోవడం వల్ల పోగొట్టుకుంటున్న డబ్బును అంతర్జాతీయ విద్యార్థుల నుంచి వసూలు చేయాలని బ్రిటీష్‌ యూనివర్శిటీలు భావిస్తుంటాయి.

ఇప్పుడు విదేశీ విద్యార్థులపై పరిమితులు విధిస్తే కొన్ని వర్సిటీలు దివాళా తీసే ప్రమాదం కూడా ఉందని బీబీసీ తెలిపింది. వలసదారుల గణాంకాల నుంచి విదేశీ విద్యార్థులను తొలగించాలని ఎన్‌ఐఎస్‌ఏయూ (నేషనల్‌ ఇండియన్‌ స్టూడెంట్స్‌ అండ్‌ అలుమ్ని) అధ్యక్షుడు సనం అరోరా డిమాండ్‌ చేశారు. భారత సంతతికి చెందిన సునాక్‌ అధికారంలోకి రావడం వల్ల భారతీయులకు ప్రయోజనాలు కలుగుతాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో తాజాగా వస్తున్న వార్త భారతీయ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.