#Republic Day celebrations – Vishwa Samvad Kendra Andhra Pradesh

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు అందరికీ తెలుసన్నారు.

ప్రపంచం సుస్థిరంగా ఉండేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత దేశం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సహకార వృద్ధిని సాధించగలమని తెలిపారు. దీనివల్ల భారత్, రష్యాలలోని స్నేహపూర్వక ప్రజల మౌలిక ప్రయోజనాలు నెరవేరుతాయనడంలో సందేహం లేదని తెలిపారు.

The post సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే?
స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా ఏటా నిర్వహిస్తుంటారు. అసలు రాజ్యాంగాన్ని ఏవిధంగా రూపకల్పన చేశారు? ఎంత మంది దీనికోసం కష్టపడ్డారు.. ఎన్ని రోజులు పట్టింటి వంటి అంశాలు చాలా మందికి తెలియదు. ఆయా విశేషాలను తెలియజేసేలా గణతంత్ర దినోత్సవం సందర్బంగా వీఎస్‌కే ప్రత్యేక కథనం..

రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు తొలి అడుగు..

రాజ్యాంగాన్ని రూపొందించేందుకు తొలుత రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఏర్పాటైన వ్యవస్థ. బ్రిటిష్ పార్లమెంటు నుంచి అధికార మార్పిడి కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించాలని భావించారు. దానికోసమే రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. ఈ పరిషత్తు సభ్యులను ఆనాటి ప్రొవిన్షియల్ అసెంబ్లీలు దామాషా ప్రాతిపదికన బదలాయింపు ఓటు పద్ధతి ద్వారా ఎన్నుకున్నాయి. అదే మన దేశపు మొట్టమొదటి పార్లమెంటు.. రాజ్యాంగ పరిషత్ తొలి ఛైర్మన్ గా రాజేంద్రప్రసాద్ ను ఎన్నుకున్నారు. పరిషత్ మొట్టమొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఆ సమావేశం జరిగిన కాన్స్టిట్యూషన్ హాలు ఇప్పుడు పార్లమెంటులో సెంట్రల్ హాల్ అనే పేరుతో ప్రాచుర్యంలో ఉంది. ఆ సమావేశానికి హాజరై, తమ వివరాలు సమర్పించిన వారు 207 మంది. డిసెంబర్ 1947 నాటికి పరిషత్తులో 299 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 229 మంది 12 భారతీయ ప్రోవిన్సుల నుంచి ఎన్నికైన వాళ్ళు, మిగతా 70 మంది ఆనాటి రాజ సంస్థానాలు నామినేట్ చేసిన అభ్యర్థులు. ఆ అసెంబ్లీలో 15 మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. ఏదైనా అంశంలో సభ్యులు ఏవైనా సవరణలు ప్రతిపాదించాలంటే ముందుగా రాతపూర్వకంగా పరిషత్ చైర్మన్ కి అందజేయాలి. ఆ అంశంపై చర్చలు సుదీర్ఘంగా జరిగేవి. పరిషత్తు సుమారు మూడేళ్ళపాటు మనుగడలో ఉంది. 1947లో దేశానికి స్వాత్రంత్య్రం వచ్చాక మొదటి పార్లమెంటు సమావేశాలు జరిగేవరకూ పరిషత్తు ఉనికి కొనసాగింది. పరిషత్ సభ్యుల ఎన్నిక సాధారణ వయోజనుల ప్రాతిపదికన జరగలేదు. ముస్లింలు, సిక్కులకు మైనారిటీల పేరిట ప్రత్యేక ప్రాతినిథ్యం లభించింది. పరిషత్ ఏర్పాటును అడ్డుకోడానికి తీవ్రంగా ప్రయత్నించిన ముస్లిం లీగ్ ను పరిషత్తును బహిష్కరించింది. మరోవైపు పరిషత్‌ సభ్యులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వారే. అప్పటికీ ఆ ఒక్క పార్టీయే ఎక్కువగా ఉండేది. కానీ వైవిధ్యమైన భావజాలాలకు చోటు ఉండేది. సంప్రదాయిక పారిశ్రామికవేత్తల నుంచి తీవ్రవాద మార్క్సిస్టుల నుంచి హిందూ పునరుజ్జీవవాదుల వరకూ అన్నిరకాల భావజాలాల వారూ పరిషత్తులో ఉన్నారు. ఇక చివరికి పరిషత్తులో మొత్తం సభ్యులు 389 మంది. వారిలో 292 మంది రాష్ట్రాల ప్రతినిథులు, 93 మంది రాజ సంస్థానాల ప్రతినిథులు, మిగతా నలుగురూ ఢిల్లీ, అజ్మేర్ మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్తాన్ అనే నాలుగు చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ ల ప్రతినిథులు ఉండేవారు. రాజ్యాంగ పరిషత్ అవిభక్త భారతదేశం కోసం ఏర్పాటైంది. ఆ పరిషత్తు 1946 డిసెంబర్ 9న మొదటిసారి సమావేశమైంది. మలి సమావేశం 1947 ఆగస్టు 14న జరిగింది. అప్పటికి అది సార్వభౌమ సంస్థగా, భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు అధికారానికి వారసురాలిగా గుర్తింపు పొందింది. దేశ విభజన ఫలితంగా, మౌంట్ బాటన్ ప్రణాళిక ప్రకారం 1947 జూన్ 3న పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్ ప్రత్యేకంగా ఏర్పాటయింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించాలన్న లక్ష్యాన్ని రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల్లో సాధించింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది. దీని రూపకల్పన సమయంలో 395 అధికరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్ళతో ఉండేది. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 448 అధికరణాలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. నేటివరకూ మన రాజ్యాంగానికి 101 సవరణలు జరిగాయి. 1947 ఆగస్టు 14 నాటి అజెండాలో మొదటి అంశం ‘వందేమాతరం’ గీతం మొదటి చరణం పాడడం, అందరూ లేచి నిలబడి వినడం. వందేమాతర గీతపు తొలి చరణాన్ని శ్రీమతి సుచేతా కృపలానీ పాడారు. పరిషత్ అధ్యక్షుడు తన ప్రసంగాన్ని హిందుస్తానీ భాషలో వెలువరించారు. ఆ ప్రసంగం పూర్తి పాఠం హిందుస్తానీ ఎడిషన్ లో ప్రచురితమయింది.

రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న మహిళ – హంసా మెహతా

హంసా మెహతా భారతదేశపు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్. ముంబయిలోని ఎస్.ఎన్.డి.టి విశ్వవిద్యాలయానికి రెండేళ్ళపాటు వైస్ ఛాన్సలర్ గా పని చేశారు. ఈమె చేసిన సేవలు అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతిగాంచాయి. మహిళల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి సబ్ కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. రాజ్యాంగ పరిషత్తులో హంసా మెహతా 1946 నుంచి 1949 వరకూ మూడేళ్ళ పాటు పనిచేశారు. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్ స్టిట్యూషనల్ కమిటీ, సలహా సంఘాల్లో ఆమె సభ్యురాలుగా పనిచేశారు. 1947 ఆగస్టు 15 అర్థరాత్రి తర్వాత ‘భారత మహిళలు’ అందరి తరఫునా పరిషత్తుకు భారత జాతీయ పతాకాన్ని అందించే అరుదైన గౌరవం హంసా మెహతాకు దక్కింది. స్వతంత్ర భారతదేశంలో ఎగిరిన మొట్టమొదటి జెండా అదే కావడం విశేషం. ఆమె గొప్ప విద్యావేత్త, రచయిత్రి, స్త్రీవాది, సంస్కరణవాదిగా పేరు గడించారు. విద్యావేత్తగా ఆమె బాలబాలికల చదువు కోసం పోరాడారు. హోంసైన్సెస్ కి విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశం హోదా కల్పించారు. సమాజ సేవ అంశంపై ఏకంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూలే ప్రారంభించారు.

హంసా మెహతా సూచనలు ఇవే..

”రాజ్యాంగంలో ఎక్కడా మైనారిటీలను నిర్వచించలేదని.. మన ముందరి పాలకులు ఇచ్చిన నిర్వచనాన్నే మనం ఆమోదించాము. కానీ వాళ్ళు ప్రజలను ‘విభజించి పాలించాల’న్నతమ విధానానికి అనుగుణంగా మతపరమైన మైనారిటీలను పుట్టించారు. ఆ విధానం ఈ దేశాన్ని విభజించి రెండు ముక్కలు చేసింది. ఈ దేశాన్ని మరిన్నిముక్కలు చేయడం మనకెంతమాత్రం వద్దు. అసలు మైనారిటీలకు ఏం కావాలి? వాళ్ళ ఆకాంక్షలేమిటి? భారత రాజ్యాంగం అందరికీ సమన్యాయం, సమాన స్థాయి, సమాన అవకాశాలు కచ్చితంగా కల్పిస్తోంది. మతపరమైన హక్కులు కూడా కల్పించింది. మైనారిటీలకు ఇంతకంటె ఏం కావాలి? వారికి అధిక ప్రాధాన్యత కావాలా, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. వాళ్ళు విశేషాధికారాలు కావాలని అడగలేరు. అయితే దీని నుంచి కేవలం షెడ్యూల్డు కులాల వారికి మాత్రం మినహాయింపు ఇవ్వవచ్చునని నా ఉద్దేశం” అని హంసా మోహతా తెలిపారు. సభ దృష్టికి ఆమె మరో అంశాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఒకే పౌర స్మృతి ఉండడం ఎంతో అవసరమని.. అయితే ఆ పౌరస్మృతి భారత దేశంలోని అన్ని పురోగామి చట్టాల కంటె గొప్పగానో, కనీసం వాటితో సమానంగానైనా ఉండాలని సూచించారు.

భారత రాజ్యాంగంపై హిందూ ముద్రలు..

భారత రాజ్యాంగంలోని ప్రతీ భాగంలోనూ పొందుపరిచిన చిత్రాలకు వాటి సొంతమైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. కేంద్రం, దాని పరిధిని చర్చించే మొదటి భాగం మొహెంజొదారో ముద్రతో మొదలవుతుంది. ఆ ముద్ర మీది ఎద్దు చిహ్నం భారతదేశంలో సంప్రదాయికంగా జరిగే గోపూజను ప్రతిబింబిస్తుంది. పౌరసత్వానికి సంబంధించిన రెండో భాగం వైదిక సంప్రదాయమైన యజ్ఞంతో ప్రారంభమవుతుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించిన మూడో భాగం లంకా విజయాన్ని చూపే చిత్రంతో మొదలవుతుంది. చెడుమీద ఎప్పటికైనా మంచే గెలుస్తుందన్న సంకేతమది. ఇక నాలుగో భాగం ఆదేశ సూత్రాలను వివరిస్తుంది. ఆ భాగం శ్రీకృష్ణ భగవానుడి గీతాబోధనకు చెందిన చిత్రంతో మొదలవుతుంది. ఇక ఐదవ భాగం బుద్ధుడు స్థాపించిన సంఘానికి సంబంధించిన చిత్రంతో ప్రారంభమవుతుంది. రాష్ట్రాలకు సంబంధించిన ఆరవ భాగంలో మహావీర తీర్థంకరుడి బొమ్మ ఉంది. అలాగే పన్నెండవ భాగంలో నటరాజ మూర్తి దర్శనమిస్తాడు. భారత రాజ్యాంగపు తాత్వికత నేపథ్యంలో భారతీయ సంస్కృతి వారసత్వాలతో ఈ చిత్రాలకు ఉన్న బంధం ఎవరూ కాదనలేనిది.

స్వాతంత్య్ర సమరానికి సంబంధించిన సమకాలీన మహానేతల చిత్రాలు రెండే రెండు మాత్రమే రాజ్యాంగంలో పొందుపరిచారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీవి రెండు చిత్రాలున్నాయి. ఒకటి దండి యాత్రను చూపేది కాగా రెండోది నౌఖాలీ సందర్శనకు సంబంధించినది. మరో చిత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది. (భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నేతాజీ బోస్, ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ పాత్రను తెలిపే చిత్రమది). ఇద్దరు వివాదాస్పద ముస్లిములు అక్బర్, టిప్పు సుల్తాన్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగం మూలప్రతిలోని చేతిరాత ప్రేమ్ బిహారీ నారాయణ్ రయీజ్దా రాత. నందలాల్ బోస్ వంటి చిత్రకారులు చిత్రాలకు రూపకల్పన చేశారు.

The post అతి పెద్ద రాజ్యాంగం భారత్‌ సొంతం.. అది ఎలా సాధ్యమైందంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర భారత దేశ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలోని అనేక మతాలు, భాషలు భారత్​ను ఐకమత్యంగా ఉంచడానికే కృషి చేశాయని, విభజనకు కాదని అన్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి గణతంత్ర వేడుకలను ఉద్దేశించి ప్రజలకు సందేశం ఇచ్చారు. తొలుత పౌరులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము.. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను కొనియాడారు. పేద, నిరక్షరాస్య దేశాన్ని.. ఆత్మవిశ్వాసంతో కూడిన దేశంగా మార్చడంలో వారి ఆదర్శాలు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

“భారతదేశ ప్రయాణం చాలా దేశాలకు స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రతి పౌరుడు భారతదేశ ప్రయాణాన్ని చూసి గర్విస్తాడు. ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా పేరు గడించిన భారత్.. ఆధునిక గణతంత్ర దేశంగా విజయవంతమైంది. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి నేతృత్వం వహించిన డా. బీఆర్ అంబేడ్కర్​కు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మనం గుర్తుంచుకోవాలి. విదేశీ పాలనలో పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలు వెంటాడినా.. భారతీయుల స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సరికొత్త ఆశలతో, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాం.”

అని ముర్ము పేర్కొన్నారు.

కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ గొప్పగా పుంజుకుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాయని అన్నారు. ‘కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థలోని చాలా రంగాలు కుదుపునకు గురయ్యాయి. సమయానుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. వాతావరణ మార్పులు వంటి అతిపెద్ద సమస్యలను పరిష్కరించే వీలున్న జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా మార్చేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకోవడం దీని వల్ల సాధ్యపడుతుంది’ అని ముర్ము పేర్కొన్నారు.

The post గణతంత్ర భారత దేశ ప్రయాణం ఎన్నో దేశాలకు స్ఫూర్తిదాయకం – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి?
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ’నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం దరఖాస్తు కూడా చేయలేదని సమాచారం. కోనసీమలో జరిగే ‘ప్రభల తీర్థం’ థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సిద్ధం చేస్తోంది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ శకటం ఉంది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించడమే ప్రభల తీర్థం. అందుల్లో జగ్గన్నతోటలో జరిగే వేడుకలు మరింత ప్రత్యేకమైనవని కళాకారులు తెలిపారు. మరోవైపు భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్య మాదక ద్రవ్యాలు… వాటిపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరోకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం కల్పించింది.

The post నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌!
ఈ నెల 26న దేశం మొత్తం 73వ గణతంత్ర వేడుకలకు సమాయత్తం అవుతున్న వేళ సిక్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రవాద సంస్థ ఆదివారం బాంబు బెదిరింపులకు పాల్పడింది. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఎవరూ బయటకు రావద్దు, ఆ రోజు ఢిల్లీలో మేము ఆర్‌డీఎక్స్‌ బాంబుల ద్వారా విధ్వంసం సృష్టించబోతున్నాం. ఎవరి ఇళ్లలో వారు ఉంటే సురక్షితంగా ఉంటారు. లేదంటే మీకే ప్రమాదం. ఆ రోజు ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేసిన వారికి రూ.4 కోట్ల బహుమతి ఇస్తాం.’’ అంటూ ఆ సంస్థ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియోను విడుదల చే శాడు. దీనిపై వినీత్‌ జిందాల్‌ అనే న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. అమెరికాలో 2009లో న్యాయవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నున్‌ ఏర్పాటు చేసిన ఎస్‌ఎఫ్‌జే సంస్థ పంజాబ్‌ను భారత్‌ నుంచి వేరుచేసి ప్రత్యేక దేశం (ఖలిస్థాన్‌)గా ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌లో మొదటిసారిగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన గరుడ ప్రత్యేక బలగాలు కర్తవ్య పథ్‌లో కవాతు నిర్వహించనున్నాయి.

The post ఎర్రకోటపై ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తే 4 కోట్ల బహుమతి.. ఎస్‌ఎఫ్‌జే బహిరంగ ప్రకటనపై అలెర్ట్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక
దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరుకు చెందిన నృత్యపాఠశాల విద్యార్థినులు భరతనాట్యాన్ని ప్రదర్శించనున్నారు. కోయంబత్తూరు సమీపం పోత్తనూరులోని నృత్యశిక్షణ పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో నృత్య ప్రదర్శనకు ఎంపికయ్యారు. నాలుగు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ ప్రదర్శించి ఎంపికయ్యారని ఆ నృత్యశిక్షణ పాఠశాల నిర్వాహకులు మీనాక్షిసాగర్‌ తెలిపారు. మొదట తమ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఢిల్లీలోని రిపబ్లిక్‌డే సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణ కమిటీ పరిశీలనకు పంపామని, ఆ తర్వాత తంజావూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎంపికయ్యారని, చివరగా ఢిల్లీలో జరిగిన నాలుగో విడత పోటీల్లోను ఎంపికై రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రదర్శనకు అర్హత సాధించారని ఆమె వివరించారు. ఈ పదిమందిలో అయిదుగురు ఉద్యోగం చేస్తున్నారని, నలుగురు చదువుతున్నారని, ఒక యువతి తమ సంస్థలో శిక్షణ పొందుతోందని ఆమె తెలిపారు. తమ సంస్థకు చెందిన విద్యార్థినులు రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనడం తనకెంతో గర్వకారణంగా ఆనందంగాను ఉందని ఆమె పేర్కొన్నారు.

The post రిపబ్లిక్‌డే వేడుకల్లో కోయంబత్తూరు విద్యార్థినుల భరతనాట్య ప్రదర్శనకు ఎంపిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం!
గణతంత్ర వేడుకల సందర్భంగా దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, మసీదులు, చర్చిలు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలల వద్ద భద్రతా బలగాలు అధిక సంఖ్యలో మోహరించాయి. ఇందులో భాగంగా చెన్నై, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు ఐదంచెల భద్రత కల్పించారు. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ భద్రత ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నెల 24, 25, 26వ తేదీల్లో మాత్రం ఏడంచెల భద్రత అమలు చేయనున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. ఈ కారణంగా విదేశాలకు వెళ్ళే ప్రయాణికులు మూడున్నర గంటలు, స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాల్సిందేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా, ద్రవపదార్థాలు, ఊరగాయలు, హల్వా, జామ్‌, నూనె వంటివి ప్రయాణికులు తమ వెంట తీసుకురాకుండా నిషేధం విధించారు. పొరపాటున వాటిని తీసుకెళ్ళినా భద్రతా సిబ్బంది మాత్రం లోనికి అనుమతించరు. ప్రస్తుతం విమానాశ్రయాలో మూడు నుంచి ఏడు అంచెల భద్రత అమలు చేస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు, ఇక్కడకు వచ్చివెళ్ళే ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, విమాన ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా చెక్‌ చేస్తున్నారు. విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్నింటిని కూడా అమర్చి, కంట్రోల్‌ రూం నిశితంగా పరిశీలిస్తున్నారు.

The post గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం.. విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం
భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం ఆన్‌లైన్ ద్వారానే ఆహ్వానాలు పంపనున్నట్టు వెల్లడించింది.

ఈ-గవర్నెన్స్‌లో భాగంగా రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవాలకు సంబంధించిన పరేడ్‌ తిలకించే ప్రముఖులకు ఈ-ఆహ్వానాలను అందించడానికి రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ పోర్టల్ (www.aamantran.mod.gov.in)ని ప్రారంభించారు. ఈ వేడుకలను చూసేందుకు వచ్చే సాధారణ ప్రజలకు సైతం టిక్కెట్లను ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో విక్రయించనున్నారు.

ఇప్పటి వరకు రిపబ్లిక్ డే పరేడ్ లేదా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చూడాలనుకునేవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయించేవారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో నివసించే ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రజలు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునేవారు. సుదూర ప్రాంత ప్రజలు టికెట్ల కోసం రెండు వారాల ముందుగానే ఢిల్లీ చేరుకుని కొనుక్కునే పరిస్థితి గతంలో ఉండేది. దీన్ని నివారించేందుకు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కొని, పరేడ్ వీక్షించేందుకు ఢిల్లీ చేరుకునే అవకాశాన్ని ఇకపై కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ డిజిటల్ పోర్టల్ ద్వారా నేరుగా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేసింది.

సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసే సదుపాయంతోపాటు ప్రముఖులకు, వారి అతిథులకు ఆన్‌లైన్ పాస్‌లను జారీ చేసే సదుపాయాన్ని సైతం పోర్టల్ ద్వారా అందించనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ.. ఈ-పోర్టల్ అనేది ‘డిజిటల్ ఇండియా’ ప్రక్రియలో మరో మైలురాయి అని, సులభ, సమర్థవంతమైన, ఆర్థిక, పర్యావరణ అనుకూల పాలనను ప్రోత్సహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ-గవర్నెన్స్ లో భాగంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు.

ప్రతి పౌరుడికి జీవన సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘డిజిటల్ ఇండియా’, ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ నినాదాలతో ప్రభుత్వాన్ని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని ఈ పోర్టల్ సులభతరం చేస్తుందని, ప్రింటింగ్‌లో ఉపయోగించే పెద్ద మొత్తంలో కాగితాన్ని ఆదా చేస్తుందని రక్షణ శాఖ మంత్రి ప్రశంసించారు. పోర్టల్ వేడుకలను మరింత సురక్షితంగా మారుస్తుందని ఆయన అన్నారు.

The post గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన
గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు

న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా డ్రోన్లు, లేజర్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో తయారు చేసిన వెయ్యి డ్రోన్లతో అభ్యాసాలు చేస్తున్నారు. డ్రోన్లు, లేజర్ షోల విద్యుత్ కాంతులతో పలు ఆకృతులను రూపొందించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా డ్రోన్, లేజర్ ప్రదర్శన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.