religious – Vishwa Samvad Kendra Andhra Pradesh

గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట!
మత భావజాలాన్ని ఊరు, వాడ తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది పెద్దలు పరోక్షంగా “సంఘ్ పరివార్” పై విమర్శలు గుప్పిస్తున్నారు. బొడ్రాయి పండుగ.. బతుకమ్మ పండుగల పేర్లతో హిందూ మతాన్ని రుద్దుతున్నారని సిపిఐ నిర్వహించిన సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.

ఈనెల ఏడోతేదీన భాగ్యనగర్ లోని మగ్దుమ్ భవన్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పెద్దలందరిని కలిపి సిపిఐ సదస్సు నిర్వహించింది. అందులో పాల్గొన్న ప్రముఖులందరూ మాట్లాడుతూ హిందుత్వంపై విషం కక్కారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ విధానాలపై విమర్శిస్తే తప్పులేదు కానీ, బిజెపిని అడ్డుపెట్టుకొని కమ్యూనిస్టులు అని చెప్పుకునే హిందూ వ్యతిరేకులు భారతీయ సంస్కృతి..హిందూ జీవన విధానంపై ఆక్కసు వెళ్ళగక్కారు. దేశభక్తిని ఎగతాళి చేసేలా మాట్లాడారు.

ఫాసిజం గురించి, కార్పొరేటర్ శక్తుల గురించి, పత్రికలు, టీవీల్లో కార్పొరేట్ ప్రకటనల గురించి మాట్లాడారు. అంతా ఓకే..! కానీ మొత్తంగా సారాంశం చెప్పాల్సింది ఏమిటంటే హిందుత్వాన్ని, భారతీయ జీవన విధానాన్ని తప్పుపడుతూ మాట్లాడడం అనేదాని మీదే మా అభ్యంతరం. నేడు బతుకమ్మ, బొడ్రాయి పండుగలు హిందూ సంస్థలు సృష్టించినవి కాదు. నిర్వాహకులు కూడా బిజెపి వారు కాదు అనే విషయాన్ని మేధావులు విస్మరించారు.

సనాతన హైందవ ధర్మం లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న విషయాన్ని గమనించాలి. నేడు ప్రజల్లో భక్తి, హిందుత్వ భావం పెరిగిపోతుండటంతో తమ ఉనికి కనుమరుగవుతుందేమోనని అందులో పాల్గొన్న వక్తలందరూ గుండెలు బాదుకున్నట్టు కనిపిస్తోంది. దాదాపు 96 ఏళ్ళ కింద‌ట విదేశాల నుంచి ఈ దేశానికి దిగుమతి చేసుకున్న కమ్యూనిస్టు సిద్ధాంతం మొత్తం కూడా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలపై, ఆచార వ్యవహారాలపై దాడులు చేసింది. దౌర్జన్యాలు చేసింది.

“అందితే జుట్టు. అందుకుంటే కాళ్లు” అనే సిద్ధాంతాన్ని అవలంబించింది. భారత ప్రజాస్వామ్యంలో గెలిస్తే రాజ్యాధికారం, ఎన్నికల్లో చేతగాక ఓడిపోతే నిరంకుశం, పాసిజం, అని రకరకాల పేర్లు పెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు. పశ్చిమబెంగాల్ , త్రిపుర లాంటి ప్రాంతాలలో దశాబ్దాల తరబడి పాలన కొనసాగించారు.

కానీ, ఎక్కడైతే పూలు అమ్మినారో, అక్కడే కట్టెలు అమ్మిన పరిస్థితి నేడు ఏర్పడింది. బెంగాల్ , త్రిపుర రాష్ట్రాలలో కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించలేని దుస్థితికి తీసుకువచ్చాయి వారి విధి విధానాలు. కానీ, నేడు సమాజం వాస్తవం గ్రహించింది. హిందుత్వంపై కమ్యూనిస్టు పేరుతో చేస్తున్న దౌర్జన్యాలను గుర్తించింది. అయితే దీన్ని కమ్యూనిస్టులు జీర్ణించుకోవడం లేదు.

అందుకే మేధావుల పేరుతో సదస్సులు నిర్వహించి, తమకు అనుకూలమైన ప్రసార మాధ్యమాల ద్వారా హిందుత్వంపై విషం చిమ్మి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పే విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు పార్టీ పరంగా ఉద్యమాలు చేస్తే మంచిది. కానీ, హిందుత్వాన్ని నాశనం చేయాలని ఏకైక సంకల్పంతో పనిచేయడం అనేది ముమ్మాటికి తప్పు. దాన్ని జనాలు కూడా స్వీకరించలేని పరిస్థితి ఉంది.

ప్రజాపక్షం ఎడిటర్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ వ్యవస్థలను విమర్శించారు. మరి అదే ప్రజాపక్షం నేడు దేశంలోనే కార్పొరేట్ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు దగ్గర మోకరిల్లి మునుగోడు ఎలక్షన్ల దగ్గర బంధం ఏర్పరచుకున్నది నిజాం కాదా..? ప్రజాపక్షం పత్రికకు యాడ్స్ గుమ్మరించుకుంటున్నది వాస్తవం కాదా..? . ఈ విధానాన్ని ఏమనాలో పెద్దలే సమాధానం చెప్పాలి.

గద్దర్ గారు…

సంస్కృతి పేరుతో ఏమీ చేయలేని బిజెపి, ప్రజలను దోపిడీ చేసే సంస్కృతి తీసుకువచ్చి అధికారంలోకి వచ్చిందని ప్రజా గాయకుడిగా పిలుచుకునే గద్దర్ విమర్శించారు. మరి మొన్న పరేడ్ గ్రామంలో జరిగిన బీజేపీ సభ ముందు ఈ విషయం తెలవదా గద్దర్ గారికి. పిలవకుండానే బిజెపి సభలకు వెళ్లి, పిలవకుండానే చిన జీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన గద్దర్ గారు తన పబ్లిసిటీని తాను, తన ఉనికిని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న గద్దర్ గారు ఈ విధంగా మాట్లాడితే ఏమనుకోవాలి?

ప్రజలను ఇంత ఘోరంగా పిచ్చివాళ్లను చేయడంలో ఆంతర్యం ఏమిటి..?

ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు…

మార్క్సిజాన్ని మించిన సత్య సిద్ధాంతం ప్రపంచంలో మరోటి లేదని తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు మరి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వదిలి టిఆర్ఎస్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందో? ఓ ప్రముఖ పత్రిక ఎడిటర్ మాట్లాడుతూ బిజెపి దేశభక్తిని శంకించే ప్రయత్నం చేశారు. అయితే విదేశీ రష్యా, చైనా సిద్ధాంతాన్ని భారతదేశంలో బలవంతంగా రుద్దే నాయకుల దేశభక్తి సర్టిఫికెట్ బిజెపికి అవసరం లేదనిపిస్తోంది.

సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏం తినాలో, ఏం కట్టుకోవాలో బిజెపి అనుమతి తీసుకోవాలా? అని మాట్లాడారు. అయితే మీరు తినే ఆహారం, కట్టుకునే అహర్యంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మేము ముక్కోటి దేవతలకు నిలయంగా భావించి, పూజించే మా గోమాతలను వధించవద్దు అని మాత్రమే చెప్పాము. అది కూడా చట్టపరంగా.!

చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏ రోజూ ప్రవర్తించలేదు. ఇవన్నీ కూడా హిందుత్వానికి , దేశభక్తికి సంబంధించిన అంశాలు. వీటిపై మాట్లాడితే ప్రతి హిందువు స్పందిస్తాడు. కానీ రాజకీయపరంగా భారతీయ జనతా పార్టీ తీసుకునే విధివిధానాలపై ఎవరైనా ఎటువంటి ఉద్యమమైన చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ హక్కు వారికి ఉంటుంది.

కానీ, హిందూ వ్యతిరేక విధానాలే లక్ష్యంగా, హిందుత్వాన్ని నాశనం చేయడమే టార్గెట్ గా పనిచేస్తే హిందువులంతా ఏకమై తిరుగుబాటు చేయక తప్పదు. ప్రత్యేకంగా నేడు బతుకమ్మ.. బొడ్రాయి పండుగ అనేది గ్రామస్థాయిలో బడుగులు, బలహీనవర్గాలు, అణగాని వర్గాలు చేసుకునే పండగ.

దీనిపై కమ్యూనిస్టులకు కన్నుకుట్టినట్టయింది. మేం బతుకమ్మను పూజిస్తే.. బొడ్రాయిని కొలిస్తే కమ్యూనిస్టులు జీర్ణించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఊరువాడ సంఘటితమై సమైక్యంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తుంటే మీకు కడుపు మంట ఎందుకని? విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.

హిందూ సమాజం ఐక్యత కోసం తీసుకువచ్చిన వినాయక ఉత్సవాలు కేవలం క్లాస్ పీపుల్స్ మాత్రమే నిర్వహించుకుంటున్నారు. దీనివల్ల మనకు ఏమాత్రం నష్టం లేదు. కానీ ఈరోజు గ్రామస్థాయిలో ప్రతి పల్లె, ప్రతి గల్లీ, ఊరు వాడ. తండాతో పాటూ దేశ విదేశాలలో గౌరమ్మను పూజిస్తూ, బతుకమ్మను కొలుస్తున్నారు. నవరాత్రులపాటు దుర్గామాతను పూజిస్తున్నారు. మహిళలు.. యువకులు.. పిల్లలు అంతా ఒక్కటై సంబరాలు చేసుకుంటున్నారు.

దీంతో కడుపు మండిన కొంతమంది మేధావులు మత భావజాలాన్ని ఊరూరా తీసుకెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించడం ఏమనాలి..? మా బడుగులు పూజిస్తుంటే.. మా హిందువులు భక్తిశ్రద్ధలు కలిగి ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి ..? అని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది.

భ‌యం… భ‌యం!

అసలు “దేవుడే లేడు.. దేవుడు, పూజ అనేది మూఢనమ్మకాలు” అని చెప్పుకునే మీకు మా దేవుడిని, మా భక్తిని , మా పూజలను చూస్తే భయమెందుకు వేస్తోంది.? సదస్సులు.. సమావేశాలు నిర్వహించి చర్చించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఏది ఏమైనా లక్షల సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్న హిందూ సమాజాన్ని అంతమొదించాలని చూసిన వారే కాలగర్భంలో కలిసిపోయారు.

కానీ, హిందూ సమాజం నేడు ప్రపంచ వ్యాప్తంగా దేదీప్యంగా వెలుగొందుతోంది. దేశాలకు దేశాలే హిందూ జీవన విధానం వైపు మల్లుతున్నాయి. ప్రపంచ దేశాలలో అగ్రగామిగా భావించే అమెరికా, కెనడా లాంటి దేశాలు దీపావళి.. దుర్గా నవరాత్రి మాసాలను హిందూ మాసాలుగా అధికారికంగా ప్రకటిస్తున్నాయి. ఇది చాలదా హిందూ వైభవ ప్రతీకకు తార్కాణం. మరణం లేనిది హైందవ జీవన విధానం.. శాశ్వతమైనది హిందూ సంస్కృతి సంప్రదాయం.

భారత్ మాతాకీ జై…! జైశ్రీరామ్..!!

– పగుడాకుల బాలస్వామి, తెలంగాణ ప్రచార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గ్రామ దేవతలను పూజిస్తుంటే కమ్యూనిస్టులకు కడుపు మంట! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్
న్యూఢిల్లీ: దేశంలో మత అసహనం టీవీల్లోనే కనిపిస్తోందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. నిజానికి దేశంలో గత దశాబ్ద కాలంలో పెద్ద పెద్ద మత ఘర్షణలేవీ జరగలేదని గుర్తు చేశారు. టీవీ స్టూడియోల్లో మాత్రం దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ వాడివేడి చర్చలు జరుగుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చదువుకునేటప్పుడు మతపరమైన పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయని, కానీ గత పదేళ్ళ‌లో అలా జరిగిన సందర్భాలేవీ లేవని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన ‘సేవ్ సాయిల్’ (భూసార పరిరక్షణ) ఉద్యమంలో భాగంగా 27 దేశాల్లో 30 వేల కిలోమీటర్ల మోటార్ సైకిల్ యాత్రను పూర్తిచేసి సద్గురు ఇటీవలే దేశానికి వచ్చారు.

టీవీ చర్చల్లో అప్పుడప్పుడు మతపరమైన అంశాలపై జోరుగా చర్చలు సాగడం నిజమేనని, కానీ వీధుల్లోకి వచ్చే సరికి అలా జరిగిన సంఘటనలు లేవనే చెప్పాలని సద్గురు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మనం కొంచెం అతి చేస్తామనే తాను అనుకుంటున్నట్టు చెప్పారు. ఢిల్లీలోనే కాదు, దేశంలోని ఏ గ్రామంలోనూ ఇలాంటి అసహనం కానీ, హింస కానీ, మరోటి కానీ లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.

అయితే, దురదృష్టవశాత్తు అలాంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు జరిగి ఉండొచ్చని చెప్పారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన హింసాత్మక ఘటనలతోపాటు భారత్‌లోని ప్రార్థనా మందిరాల్లో దాడులు పెరుగుతున్నాయంటూ అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు.

“మనం విషయాలను కొంచెం అతిశయోక్తి చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. అవును, కొన్ని సమస్యలు చర్చకు వచ్చాయి. టెలివిజన్ ఛానెల్‌లలో చాలా వేడి ఉంది. మీరు వీధిలో ఎక్కడా చూడలేరు. మీరు ఢిల్లీ మీదుగా నడవండి లేదా దేశంలోని ఏ గ్రామంలోనైనా అలాంటి అసహనం లేదా హింస లేదా మరేదైనా లేదు” అని దేశంలో పెరుగుతున్న మత అసహనం వాదనల గురించి అడిగినప్పుడు సద్గురు స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీవీలో మాత్రమే కనిపిస్తున్న మత అసహనం: సద్గురు జగ్గీ వాసుదేవ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భద్రతా సంస్థ అదుపులో ఐదుగురు ముస్లింలు!
వీరంతా మోహన్‌ భగవత్‌ ప్రొగ్రాంకు హాజరైన వారే…

మీర‌ట్‌: ప్రఖ్యాత ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలీం సిద్ధిఖీ, అతని నలుగురు సహచరులు, డ్రైవర్‌ని భద్రతా సంస్థ విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. కలీం కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి, మౌలానాకు మద్దతుగా, ఉలామాతో సహా ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులు లిసాడిగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గుమికూడి, గందరగోళాన్ని సృష్టించారు.

ముజఫర్‌నగర్‌లోని ఫులాట్‌ గ్రామానికి చెందిన మౌలానా కలిమ్‌ సిద్ధిఖీ(64) మంగళవారం రాత్రి ఏడు గంటలకు లిసాడిగేట్‌లోని హుమాయునగర్‌లోని మసీదు మషల్లాకు చెందిన ఇమామ్‌ షరీక్‌ నివాసానికి ఒక కార్యక్రమానికి వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు ఇషా ప్రార్థన తరువాత, అతను తన సహచరులతో కలిసి కారులో బయలుదేరాడు. ఈ సమయంలో, కుటుంబం అతనికి కాల్‌ చేసింది. అయితే, అతని మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి, ఉంది. దీంతో మీరట్‌లోని ఇమామ్‌ షరిక్‌కు ఆ కుటుంబం సమాచారం ఇచ్చింది. కుటుంబం, స్నేహితులు వెతకడం ప్రారంభించారు, కానీ దొరకలేదు. దీని తరువాత, లిసాడిగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ప్రజలు గుమికూడారు. అర్ధరాత్రి వరకు గొడవ కొనసాగింది.

ఇస్లామిక్‌ పండితుడు మౌలానా కలీమ్‌ సిద్ధిఖీ అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా భద్రతా సంస్థ అతనిపై నిఘా ఉంచింది. మీరట్‌లో మౌలానా రాక గురించి ఏజెన్సీకి ముందే తెలుసు. అతను తిరిగి వచ్చే సమయంలో ఏజెన్సీ అతడిని పట్టుకోవడానికి కారణం ఇదే. వారిని విచారిస్తున్నారు.

ఫులాట్‌ మౌలానా కలీమ్‌ సిద్ధిఖీ ఇస్లామిక్‌ పండితుల పేరు. అతను ఫులాత్‌ మదరసా జామియా ఇమామ్‌ వలీయుల్లా ఇస్లామియా డైరెక్టర్‌ కూడా. ఈ నెల ఏడోతేదీన ముంబైలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నిర్వహించిన దేశం ఫస్ట్‌ అండ్‌ నేషన్‌ పారామౌంట్‌ కార్యక్రమంలో మౌలానా కలిమ్‌ కూడా పాల్గొన్నారు.

ఏజెన్సీ అనుమానం ఆధారంగా అతని కోసం వెతుకుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి, భద్రతా సంస్థలు లిసాడిగేట్‌లో కాపు కాచివున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకు, మౌలానా తన సహచరులతో మీరట్‌ నుండి ఫూలాట్‌ కోసం బయలుదేరివెళ్తుండడంతో అతను దొరికిపోయాడు.

అనుమానాస్పద కార్యకలాపాలు ఏమిటి?

మౌలానా కలీం ప్రీ మెడికల్‌ టెస్ట్‌లో 57వ ర్యాంక్‌ సాధించాడు. కానీ, ఎంబీబీఎస్‌లో ప్రవేశం తీసుకోలేదు. దేశ, విదేశాలలో మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఫులత్‌తో సహా అనేక ప్రదేశాలలో, అతని పేరు మీద మదరసాలు నడుస్తున్నాయి. మీరట్‌లో ఏ పోలీసు అధికారి కూడా ఈయనపై మాట్లాడడానికి సిద్ధంగా లేరు.

ఇదిలావుంటే, అర్ధరాత్రి వరకు మౌలానాను కనుగొనడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.

క్వారీ అఫిన్‌ ఖాస్మి, క్వారీ షఫీకుర్‌ రహమాన్‌ ఖాస్మి, ముఫ్తీ ఖలీద్‌, మౌలానా సిరాజుద్దీన్‌, ఖారీ అన్వర్‌…. అనేక ఉలేమాలు కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు చూశారు. అదృశ్యమైన మౌలానాస్‌ను కనిపెట్టాలని చేయాలని డిమాండ్‌ చేస్తూ, ప్రజలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

The post భద్రతా సంస్థ అదుపులో ఐదుగురు ముస్లింలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు!
న్యూఢిల్లీ: కోయంబత్తూరులోని ఓ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతలకు పాల్పడడంతో పోలీసులు అరెస్టు చేశారు. హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మత స్మారక కట్టడాలను రక్షించడానికి తమిళనాడుకు చెందిన మత, సాంస్కృతిక సంస్థ హిందూ మున్నాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెయింట్‌ పాల్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పాస్టర్‌ వి.డేవిడ్‌ను కోయంబత్తూర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఆ పాస్టర్‌ మతపరమైన ఉద్రిక్తతను పెంచుతున్నాడని ఫిర్యాదుదారు ఆరోపించాడు. వినాయక చతుర్థి రోజున ప్రార్థన యాత్ర చేయమని ప్రజలను కోరుతూ వినాయక చతుర్థి ఊరేగింపులకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశాడు. నిందితుడిని ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. సెంట్రల్‌ జైలులో ఉంచారు.

బహిరంగ వేడుకలపై ఆంక్షలు పక్షపాత వైఖరే…

హిందూ మున్నాని తమిళనాడు అధ్యక్షుడు కాదేశ్వర సుబ్రమణ్యం మాట్లాడుతూ, ముందుగా అనుకున్నట్టుగానే చతుర్థిని జరుపుకొంటామని, కోవిడ్‌ -19 ని ఉటంకిస్తూ వినాయక చతుర్థి బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిరచారు. పండుగ నిర్వహణ కోసం దైవబలం కోసం తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల ముందు మున్నాని ప్రార్థనలు నిర్వహించినట్టు సుబ్రమణ్యం చెప్పారు. ప్రభుత్వం తన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మున్నాని కార్మికులు తిరుపూర్‌, కోయంబత్తూర్‌ జిల్లాలలో 200 కి పైగా ప్రదేశాలలో దేవాలయాల ముందు ప్రార్థనలు నిర్వహించారు.

తమిళనాడులో వినాయక చతుర్థి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని హిందూ మున్నాని ప్రకటించింది. ‘‘హిందూ మున్నాని ప్రతి సంవత్సరం వలె బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, నిమజ్జనం కోసం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లే ముందు పూజలు చేస్తారు. రండి … ‘‘అని హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి కె.కుట్రాలనాథన్‌ పిలుపునిచ్చారు.

Source: Times NowNews.com

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కోయంబత్తూరులో ‘కరపత్రం పాస్టర్‌’ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.