#Rashtriya Swayamsewak Sangh – Vishwa Samvad Kendra Andhra Pradesh

అసామాన్య వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోళ్వల్కర్‌
అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్‌తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకూ, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది.  – పూజ్యశ్రీ గురూజీ

శ్రీ గురూజీ (మాధవ సదాశివ గోళ్వల్కర్‌) రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వితీయ‌ సర్ సంఘచాలకులు. భారతదేశ ఐకమత్యం, అఖండతను సంరక్షించటానికి; హిందూధర్మరక్షణకు, హిందూ సమాజ ఏకాత్మతకు, సమరసతా నిర్మాణానికి తన సంపూర్ణ జీవితాన్ని సమర్పించినవారు.

భారతీయ సాంస్కృతిక జీవనానికి వ్యతిరేకమైన విదేశీ సిద్ధాంతాలు జాతీయ భావనలను వ్యతిరేకిస్తూ, స్వైర విహారం చేస్తున్న సమయములో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచిన మహనీయులు. భారత జాతీయత, సంస్కృతి-పరంపరల ఆధారంగా భారత జాతిలో నవచైతన్యాన్ని నింపి, జాతికి యోగ్యమైన దిశను చూపి, నడిపించిన వీరయోధులు శ్రీ గురూజీ.

సామాన్య కుటుంబం – అసామాన్య వ్యక్తిత్వం

శ్రీ గురూజీ మాఘ బహుళ ఏకాదశి, 1827 శక సంవత్సరం (19 ఫిబ్రవరి 1906) నాడు సదాశివరావు, లక్ష్మీబాయి దంపతులకు నాగపూరులో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మాధవ్‌. శ్రీకృష్ణుడివలె మాధవ్‌ కూడా తమ తల్లిదండ్రులకు 8వ సంతానం. సామాన్య మధ్యతరగతి కుటుంబమైనా తల్లిదండ్రులు ధర్మనిష్ఠాపరాయణులు. తండ్రి శ్రీ సదాశివరావు పోస్టల్‌ విభాగంలో పనిచేసి, తదనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. తల్లి శ్రీమతి లక్ష్మీబాయి (తాయీజీ) మమతామూర్తి.

మాధవ్‌ ఎంతో తెలివైన విద్యార్థి. తల్లిపట్ల ఎంతో ఆప్యాయత, గౌరవం కలవారు. కాని తన వాక్చాతుర్యముతో తల్లిని ఎప్పుడూ ఆటపట్టించేవారు. ఒకసారి బాల మాధవ్ ‌కి బాగా జ్వరం వచ్చింది. తల్లి చూసి – మందు ఇచ్చి “మాధవ్‌ – పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. మందు తీసుకున్న తర్వాత బయటకు వెళ్లరాదు. ఎందుకంటే మీ సంఘము వాళ్ళను నమ్మలేము” అన్నారు. తల్లి బయటికి వెళ్ళగానే, మాధవ్‌ లేచి, ‘పద.. ఫలానా వారికి దెబ్బ తగిలి గాయమయిందట, చూసి వద్దాం’ అని తన స్నేహితుడితో అనగానే, స్నేహితుడు, ‘మాధవ్‌.. ఇప్పుడే అమ్మ, బయటికి వెళ్ళవద్దని చెప్పారు కదా?’ అంటాడు. మాధవ్‌ ‘అరె.. అమ్మతో నేను చెప్తానులే పద’ అని బయల్దేరి ఒక గంట తరువాత తిరిగి వచ్చాడు. రాగానే మందు వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తల్లి గమనించి ”మాధవ్‌.. నేను చెప్పిన మాట నీవు వినడములేదుగా’ అన్నారు.

వెంటనే మాధవ్‌ ‘అమ్మా అంతా నీవు చెప్పినట్టే చేశాను. మందు వేసుకున్న తర్వాత నీవు నన్ను బయటికి వెళ్ళవద్దు అన్నావు. అలానే చేశాను. బయటికి వెళ్లి తిరిగి వచ్చాను. ఇప్పుడే మందు వేసుకొని పడుకున్నాను. నీ మాట పాటించాను గదమ్మా?’ అన్నారు. ‘సరేలే.. నీవు చేయదలచుకున్నదే చేయి, నాకే పాఠం నేర్పుతున్నావు’ అంటూ అమ్మ నవ్వేసింది. అందరూ నవ్వారు.

శ్రీ గురూజీ సర్ సంఘచాలక్ ‌గా బాధ్యత తీసుకుని, దేశమంతటా పర్యటన చేస్తున్న సమయంలో, నాగపూర్‌లో ఉంటే తమ ఇంటిలోనే మధ్యాహ్నం భోజనం చేసేవారు. ఒకసారి శ్రీ గురూజీ, మరో ముగ్గురు కార్యకర్తలు భోజనం చేస్తున్నారు. తల్లిగారు వడ్డన చేస్తున్నారు. ఒక కార్యకర్తకు గురూజీ తల్లిగారు చపాతీలు వడ్డించారు. రెండవసారి చపాతీ వడ్డించగానే, ఆ కార్యకర్త ‘అమ్మా! ఇక చాలు’ అన్నారు. చాలు అన్న తర్వాత అమ్మ మరో రెండు చపాతీలు వడ్డించారు. వెంటనే ఆ కార్యకర్త ‘చాలు అన్నాను కదా అమ్మా’ అన్నారు. ‘అవును బాబూ, ‘చాలు’ అన్న తర్వాత ఇంకో రెండు చపాతీలు వడ్డించాలి అని మా అమ్మ చెప్పింది’ అని ఆమె అన్నారు.

తర్వాత ఆమె శ్రీ గురూజీకి (తన కుమారుడికి) నెయ్యి వడ్డిస్తున్నారు. ఒక చంచా, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు చంచాలు వడ్డిస్తూ ‘ఏరా! మధు.. నెయ్యి వడ్డిస్తూంటే, చాలు అనవేమిటి?..’ అన్నారు. ‘నెయ్యి వడ్డిస్తుంటే ‘చాలు’ అనగూడదని మా నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడే చెప్పారు’ అన్నారు శ్రీ గురూజీ తల్లితో. అదీ శ్రీ గురూజీలోని సరళత్వమూ నిర్మలత్వము, సర్ సంఘచాలక్‌ అయిన తర్వాత కూడా.

సాధకులు శ్రీ గురూజీ

బెంగాలులోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని సారగాచి ఆశ్రమం పూజ్య శ్రీ అఖండానంద స్వామి కేంద్రం. పూజ్య అఖండానంద మహా తపస్సంపన్నులు, విముక్త ఆత్మ, శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యులు, స్వామి వివేకానందకు సహాధ్యాయి. 1912 నుండి 1937 సంవత్సరములో సమాధి స్థితి పొందేవరకు స్వామి అఖండానంద సారగాచీలోని ఆశ్రమం కేంద్రంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు సేవచేస్తూ సాధన చేసేవారు. శ్రీ గురూజీలో ఆధ్యాత్మిక దృష్టి అధికంగా ఉండేది. నాగపూరు రామకృష్ణ మిషన్‌ స్వామీజీ సహకారంతో శ్రీ గురూజీ సారగాచి ఆశ్రమం చేరారు. దాదాపు 4 మాసాలపాటు శ్రీ గురూజీ ఆ ఆశ్రమములో స్వామి అఖండానంద శిష్యరికంలో గడిపారు. అయితే అవి అత్యంత పరిణామకారకమైన రోజులు. భగవాన్‌ శ్రీ రామకృష్ణ శతజయంతి, దీపావళి, దుర్గాపూజ, కాళీపూజ, శారదామాత జయంతి, తర్వాత స్వామి వివేకానంద జయంతి – అలా ఒక ఉత్సవం తర్వాత ఇంకొక ఉత్సవం వచ్చేవి. ఉమాశంకరుల వివాహంలో ఒకరి తర్వాత మరొక దేవత వచ్చినట్లుగా!

కఠోర సాధన

ఆశ్రమములో సూచనలను శ్రీ గురూజీ గోళ్వల్కర్‌ తప్పక అనుసరించేవారు. గోళ్వల్కర్‌ ఆశ్రమం చేరేనాటికి ఎమ్‌.ఎస్‌.సి. ఉత్తీర్ణులై, న్యాయశాస్త్ర పట్టభద్రులైన యువకులు. తన సామాను భాందాత్‌ గదిలో ఉంచి, ఆశ్రమ పద్ధతులను గమనించే ప్రయత్నం ప్రారంభించారు. చాలా దూరం నుండి ప్రయాణం చేసి రావటంతో అలసట కారణంగా ఆయనకు మొదటి రోజు రాత్రి బాగా నిద్రపట్టింది.

రోజు మాదిరిగానే ఉదయం 4 గంటలకే స్వామి అఖండానంద నిద్ర లేచి, ‘గోళ్వల్కర్‌ ఎక్కడ?’ అని అడిగారు. ‘పడుకున్నారు’ అని రఘువీర అనే ఆశ్రమవాసి చెప్పగానే, ‘ఇంత నిద్రపోయేవాడితో పని ఏమవుతుంది?’ అన్నారు. ఆశ్రమంలో ప్రతి ఒక్కరి నడవడికపై ఆఖండానంద దృష్టి ఉండేది. ఆశ్రమ వాసులందరికీ ఆయన పనిని కేటాయించేవారు. సోమరితనాన్ని సహించేవారు కాదు. స్వామీజీ చేసిన సూచనను రఘువీర గోళ్వల్కర్ ‌కు అందించారు. మొదటి రోజే ఇలా జరిగిందే అని గోళ్వల్కర్ ‌కి ఎంతో బాధ, పశ్చాత్తాపం కలిగింది. ‘ఇంకెన్నడూ ఇలా జరగనివ్వను’ అన్నారు.

కొద్దిరోజులలో కాళీపూజ, అశ్వినీ అమావాస్య రానే వచ్చాయి. పూజా సామగ్రి తోమి కడిగి పెట్టడం, ఆశ్రమ పరిసరాలు ఊడ్చి, శుభ్రం చేయడం వంటి పనులు విభూతి చైతన్యకు, గోళ్వల్కర్ ‌కు స్వామీజీ అప్పచెప్పారు. వీటిని వారిద్దరూ ఎంతో శ్రద్ధగా చేసేవారు .

ప్రతి దినమూ రాత్రి హారతి తర్వాత స్వామి అఖండానంద గది ముందు సత్సంగం జరిగేది. స్వామీజీ ప్రవచనముండేది. ఒకనాడు సత్సంగంలో శ్రీ స్వామీజీ ఇలా అన్నారు ‘పూజ కొరకు చేసే పనులన్నీ పూజలో భాగమే. పూజామందిరంలో ఊడ్చడం, తడిగుడ్డతో నేల తుడవడం, పాత్రలు తోమి కడగడం, పూలు, పండ్లు అలంకరించటం వంటి పనులన్నీ ఆరాధనా భావంతోనే చేయాలి. పనిచేస్తూ మంత్రం జపించటం, భగవంతుని స్మరించటం జరుగుతూ ఉండాలి’. ఇవన్నీ నా కొరకే చెప్తున్నారని భావించి గోళ్వల్కర్‌ ఎంతో తృప్తి చెందారు.

4 రోజుల తర్వాత స్వామీజీ విభూతితో ‘ఎలా ఉన్నాడా వకీలు’ అని అడిగారు. ‘చాలా బాగున్నారు, తనను తాను మరచిపోయి పనిచేస్తున్నారు. పాత్ర సామాగ్రి అంతా తళతళ మెరిసిపోతోంది. ఎంతో శ్రద్ధగా తోముతుంటారు, నేను అంత శ్రద్ధగా చేయగలనా? అని మనస్సుకు సందేహం కలుగుతుంటుంది’ అన్నారు శ్రీ విభూతి.

ఆఖండానంద కూడా అదే గమనించారు. ఒకరోజు గోళ్వల్కర్ ‌ని పిలిచి ‘చూడూ! నా శరీరం నిరంతరం క్షీణిస్తోంది. నీవు క్షీణిస్తున్న ఈ శరీరానికి కూడా సేవ చేయాలి’ అన్నారు. గోళ్వల్కర్‌ మనస్సు ఆనందంతో పరవశించిపోయింది. ‘ఇది నా పూర్వజన్మ సుకృతమే కదా!’ అనుకున్నారు.

తనువు, మనస్సు పూర్తిగా అర్పించి సేవ ప్రారంభించారు గోళ్వల్కర్‌. ఆచార్యులు తమ శిష్యులను నిరంతరం పరీక్షిస్తూనే ప్రతి క్షణమూ శిష్యుల శ్రద్ధను, సేవాతత్పరతను గమనిస్తూనే ఉంటారట.

ఒకనాడు సేవచేస్తున్నపుడు, కాలుజారి, గోళ్వల్కర్‌ చేతులలో ఉన్న ఒక పాత్ర పగిలిపోయింది. ఆ పాత్ర స్వామీజీకి చాలా ఇష్టమైనది. వెంటనే స్వామీజీ అంటారు ”జాగ్రత్త. తొందరపడొద్దు. అది ఎంతో విలువైన పాత్ర. నీకేమీ దెబ్బతగలలేదు కదా?’ అన్నారు. ఆ మాటలలో ఉపదేశమూ, ప్రేమతో గూడిన పరామర్శ, ఆశ్రమ సంపత్తి నష్టపోయిన బాధ ఉంది.

మరోసారి – వస్తువులున్న గదిలోకి తొందరతో వెళ్తూంటే గోళ్వల్కర్‌ కాలుకు దెబ్బ తగిలి, రక్తం కారింది. స్వామీజీ సానుభూతి చూపుతూనే ‘దారి చూసి నడవాలి కదా! మన దోషం (తప్పులు) ముందు చూసుకోవాలి’ అన్నారు. ఈ మాటలు కొంచెం కఠినంగా కూడా పలికారు స్మామీజీ. అయితే గోళ్వల్కర్‌ స్వామీజీ సంకేతాన్ని అర్థం చేసుకున్నారు.

సాధనా మార్గము అంత సులభమైనది కాదు. ‘ఎంతో కఠినమైనది’ అంటారు ఉపనిషత్‌ మహర్షులు. ఇంతలో నాగపూర్‌ నుంచి గోల్వల్కర్‌కి ఉత్తరం వచ్చింది. ‘నాగపూర్‌ వదిలి వెళ్ళినట్లు తెలవగానే, తల్లి అనారోగ్యంతో మంచం పట్టిందని, లేవలేక పోతోంది’ అనేది ఉత్తరం సారాంశం. స్వామీజీకి విషయం చెప్పగానే ‘ఇదంతా మాయాబంధం, మాయలో దుఃఖమూ ఉంటుంది’ అన్నారు. ఇది వినగానే సాధకునకు దిశ లభించింది. గోళ్వల్కర్‌ పూర్తిగా సేవలో నిమగ్నమైనారు.

గోళ్వల్కర్‌ దీక్ష పొందడానికై ఎదురు చూస్తున్నారు. ఒకరోజు గోళ్వల్కర్‌ ధైర్యం చేసి ‘స్వామీజీ.. నా మీద మీ అనుగ్రహం ఎప్పుడు?’ అన్నారు. ఆత్మీయతతో స్వామీజీ ‘తప్పకుండా, ఇంకా 10, 12 రోజుల తర్వాత’ అన్నారు. గోళ్వల్కర్ ‌కి ఎంతో తృప్తి కలిగింది. గోళ్వల్కర్‌ స్వామీజీకి రాత్రి 12 గంటల వరకు సేవచేసి, పడుకొని, తిరిగి రెండున్నర గంటలకే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, 4 గంటలకు స్వామీజీ లేచే సమయానికి సిద్ధంగా ఉండేవారు. ఈ సాధన పరీక్షలో విజయాన్ని పొందాలని గోళ్వల్కర్‌ కోరిక. “స్వామీజీ నన్ను పిలిచి ‘చూడు గోళ్వల్కర్‌.. బయట నుంచి వచ్చినవారందరూ వెళ్ళిపోతారు. నీకు, జగదీశ్‌, రోబిన్‌లకు దీక్ష ఇస్తాను’ అన్నారు.” అప్పుడు నేను ఎంతో మనశ్శాంతిని, అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను అంటారు గోళ్వల్కర్‌.

ఇలా సాధన సాగుతూండగా, 1937 వ సంవత్సరము సంక్రాంతి రానే వచ్చింది. 12 జనవరి మంగళవారము నాడు సేవచేస్తున్న సమయంలో స్వామీజీ గోళ్వల్కర్ ‌తో ‘రేపు నీకు దీక్ష ఇచ్చే రోజు, ఈ రోజు ఉపవాసము చేయి’ అన్నారు.

గోళ్వల్కర్‌ ఆపాదమస్తకమూ పులకించిపోయారు. 13 జనవరి మకర సంక్రాంతి కల్యాణకారక ఉత్తరాయణ ప్రథమ దినము – సరిగ్గా ముహూర్త సమయానికి – గోళ్వల్కర్‌ గురుదేవుల ముందు ఆశీనులయ్యారు. శాస్త్ర ప్రకారము దీక్ష యిచ్చారు స్వామీజీ. దీక్ష పొందిన తర్వాత గోళ్వల్కర్‌ ఇలా అనుకున్నారు – ‘ఈ దినం నా జీవితంలో పరమోన్నతమైనది. సువర్ణాక్షరాలతో లిఖించదగినది. యుగయుగాల, అనేక లక్షల జన్మల సంచిత సౌభాగ్యము నేడు నా మీద ప్రసరించింది. ఒక దివ్యమైన ఆనందానుభూతిని, శబ్దాలకందని తృప్తిని పొందాను. గురుదేవుల దృష్టి, ప్రేమ, వారి సమగ్ర ప్రభావం, వారు నా మీద చూపిన అపారమైన కృప నేనెన్నడూ మరువలేను. నా ప్రతి అంగము కంపించిపోయింది. నాలో పూర్తి పరివర్తనను గమనించాను. ఒక క్షణం ముందుకి, ఇప్పటికీ నా జీవితం ఎంతో మారింది’.

24 జనవరి నాడు స్వామీజీ గోళ్వల్కర్ ‌ని అకస్మాత్తుగా పిలిచారు. తన ముందు కూర్చోమన్నారు. స్వామీజీ అన్నారు ‘నీకు శుభం కలుగు గాక. నీకు ఆత్మ దర్శనము కలుగుగాక. నేను నా గురు మహారాజ్ ‌ని ప్రార్థిస్తున్నాను.. నాలో ఉన్న మంచినంతా నీకు ధారపోస్తున్నాను.. నా తపస్సంతా నీకు ప్రసరింపజేస్తున్నాను. నీలో ఉన్న చెడు అంతా నాలో చేరిపోనివ్వు, నాకే రకమైన సుఖము అక్కర్లేదు. దుఃఖమే కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి ఎప్పుడూ మరచిపోకుండా ఉండే విధంగా, నాకు దుఃఖాన్ని కలుగచేయమని కోరుతున్నాను. చూడు ! మన కోసం భగవంతుడు ఎన్ని కష్టాలను సహించాడో! శ్రీకృష్ణుడు జన్మించాడా ! ఒక్కసారి కూడా కన్నతల్లి పాలు త్రాగలేదు. తల్లిని వదిలి, బృందావనం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా సుఖం లేదు. ఎప్పుడూ రాక్షసులతో పోరాటాలే. ఆయన పడిన కష్టాలు చూస్తే, మన కష్టాలు లెక్కలోకే రావు, అందుకని నీ చెడు అంతా నాకు ఇచ్చివేయి, నాలో ఉన్న మంచి అంతా నీవు తీసుకొని వెళ్ళు, నీకివే నా ఆశీస్సులు. నేటి సంధ్యా సమయం గుర్తుంచుకో వెళ్ళు. నీకంతా మేలే జరుగుతుంది’ అన్నారు. ఇంతకంటే మించిన ఆశీస్సులు ఇంకేముంటాయి. ఆధ్యాత్మిక శక్తుల సాధన ఇదే కదా. తన కఠోరమైన సాధన ద్వారా గోళ్వల్కర్‌ తన జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తిని సంపాదించారు.

ఆశ్రమం నుండి సమాజం కోసం

పూజ్య స్వామి అఖండానంద శరీరం శాంతించిన తర్వాత, శ్రీ గురూజీ గోళ్వల్కర్‌ నేరుగా నాగపూర్‌ వచ్చేశారు. సంఘ కార్యమునకు, తనను తాను సమర్పించుకున్నారు.

అఖండ భ్రమణం

సర్ సంఘచాలక్ ‌గా పూజ్య శ్రీ గురూజీ 33 సంవత్సరముల పాటు పనిచేశారు. 66 సార్లు దేశం నలుమూలలా పర్యటన చేశారు. మాతృభూమి పట్ల భక్తిని, శ్రద్ధను జాగృతం చేస్తూ జాతీయ భావనను, జాతి యావత్తులో నింపారు.

సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్‌జీ, పరమపదించగానే, సంఘం ఎలా నడుస్తుందో..? అని ఎందరో చింతించిన వేళ, పూజ్య శ్రీ గురూజీ అత్యంత సమర్థవంతంగా సంఘ కార్యాన్ని స్వీకరించి, దేశం నలుమూలలా విస్తరింపజేశారు.

స్వతంత్రం సిద్ధించిన వేళ

ఒకవైపు దేశానికి స్వతంత్రం రావడం, మరోవైపు దేశవిభజన – భారతదేశ చరిత్రలో విచిత్రమైన, సన్నివేశం, అత్యంత బాధాకరమైన పరిస్థితి.

ఆనాటి లాహోర్, నేటి పాకిస్తాన్‌ ప్రాంతంలో ఆఖరి నిమిషం వరకూ పర్యటిస్తూ హిందూ సమాజ మనోబలాన్ని కాపాడిన ధీశాలి శ్రీ గురూజీ. ఆఖరి హిందువు కూడా సురక్షితంగా వచ్చేవరకు, అందరినీ స్వతంత్ర భారత భూమిలో చేర్చేవరకూ, వచ్చినవారందరికీ, నివాసము, భోజనాదులు, సరియైన వ్యవస్థను ఏర్పాటు చేయించినవారు శ్రీ గురూజీ.

అమృతసర్‌లో శ్రీ గురూజీ పర్యటనలో న్యాయమూర్తి రామలాల్‌జీ, పెద్దలు మోహన్ ‌చంద్‌ మహాజన్‌ కలసి – ‘మేము శరణార్థులుగా వచ్చాము’ అని చెప్పగానే, శ్రీ గురూజీ ‘మీరు శరణార్థులుకారు, సంపూర్ణ భారతదేశంలో మీ అందరికీ సమానమైన అధికారముంది’ అన్నారు. మన దేశంలో మన వారెవరైనా శరణార్థులు ఎలా అవుతారు?’ అన్నారు. భారతదేశమంతా ఒక్కటే, భారతీయులందరూ ఈ ఏకాత్మ రాష్ట్రము (జాతి) యొక్క సంతానమే. ఇదీ శ్రీ గురూజీ సాక్షాత్కారము.

దేశ సమైక్యత, సమగ్రతల రక్షణలో

స్వాతంత్య్రం వచ్చిన తొలి దినాలలో కాశ్మీరు విలీనం సమస్యగా మారింది. కాశ్మీరులో ముస్లిం మెజారిటీ, ఆంగ్లేయుల ప్రభావంలో ఉన్న కాశ్మీరు ప్రధానమంత్రి రామచంద్రకాక్‌ కుతంత్రము, కాశ్మీరును పాకిస్థాన్‌లో విలీనం చేయడానికై మౌంట్ ‌బాటెన్‌ కుట్ర, కాశ్మీరు రాజును కాశ్మీరు నుండి బయటకు పంపించాలని షేక్‌ అబ్దుల్లా, కాశ్మీర్ రాజు హరిసింగ్ ‌కు వ్యతిరేకంగా ఉద్యమము, షేక్‌ అబ్దుల్లాను సమర్థిస్తూ ప్రధానమంత్రి నెహ్రూగారి వ్యవహారం వల్ల కాశ్మీరు రాజు కాశ్మీర్ ‌ను భారత్‌లో విలీనం చేయడానికి సంకోచిస్తున్న సమయమది.

చివరికి 1947 అక్టోబరు 17న పూజ్యశ్రీ గురూజీ శ్రీనగర్‌ వెళ్ళటం, 18న రాజమహల్ ‌కి వెళ్ళటం, రాజు, రాణి శ్రీ గురూజీని స్వాగతించటం, ప్రశాంత వాతావరణంలో చర్చ జరగడం, శ్రీ గురూజీకి వీడ్కోలు చెప్తూ కశ్మీర్‌ రాజు ‘మీ సలహాలను నేను తప్పకుండా యోగ్యమైన రీతిలో ఆలోచిస్తా’ అనడం చకచకా జరిగిపోయాయి.

శ్రీ గురూజీ ఢిల్లీకి తిరిగి వచ్చి, సర్దార్ ‌పటేల్‌ గారిని కలసి కాశ్మీరు రాజా వారి సుముఖతను, చర్చా విశేషాలను తెలిపారు. ఆ తర్వాత సర్దార్‌ పటేల్‌ సమర్థవంతమైన ప్రయత్నం వలన కాశ్మీరు భారతదేశంలో విలీనమైంది.

జాతీయ ఏకాత్మతే వారి దృష్టి

1950-57 లో దేశమంతటా అశాంతి, ప్రాంతీయ వాదం, భాషాభిమానం మొదలైన ఉద్యమాలు చెలరేగుతున్నాయి. జాతి యువతను కుదిపివేస్తున్న వేళ.

ముంబాయి ప్రాంత విభజన తర్వాత రాజకీయ పార్టీలు తమ తమ స్వార్ధానికి పరిస్థితిని ఉపయోగించుకునే కుటిల ప్రయత్నాలు చేస్తున్న సమయం. ప్రతాప్ ‌గఢ్ ‌లో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూగారి ద్వారా చేయించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ యోజన చేసింది.

ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి ప్రధాని రాకూడదని ‘దారి తప్పిన దేశభక్తుడు శివాజీ’ అని నెహ్రూగారు అంతకుముందు విమర్శించారని, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఇరు ప్రక్కలవారి స్వార్థపూరిత ప్రయత్నం వలన జాతీయ భావనకు దెబ్బతగులుతున్నదని గమనించి, పూజ్య గురూజీ పవిత్రమైన జాతీయ భావన కాపాడటానికి ఒక ప్రకటన చేశారు.

‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహావిష్కరణ సందర్భంలో పెద్దఎత్తున వ్యతిరేక ప్రదర్శన చేయాలనే సంయుక్త మహారాష్ట్ర సమితి వారి తీర్మానం నాకు ఆశ్చర్యమూ, ఎంతో బాధ కలిగినది. ఇది ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, పరస్పర వ్యతిరేక భావన కల సంస్థలన్నీ కలసి కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించే దృష్టి కలిగినది. అయితే ఇది కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రదర్శన అయినప్పటికీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ ‌కి అవమానము కలిగించే ప్రదర్శన అవుతుందనీ, జాతీయ మహాపురుషుడి గౌరవమునకు భంగము కలుగచేస్తుందని ప్రదర్శనకారులు గ్రహించలేకపోతున్నారు. పండిత నెహ్రూ గారిచే విగ్రహావిష్కరణ చేయించి ‘కాంగ్రెస్‌ మహారాష్ట్ర వ్యతిరేకి’ అనే ముద్రను చెఱపి, మహారాష్ట్రలో కోల్పోయిన పరపతిని సంపాదించే దురుద్దేశ్యం కాంగ్రెస్ ‌కు ఉన్న మాట కూడా వాస్తవమే. ఇరుపక్షాలూ స్వార్థబుద్ధితోనే ప్రవర్తిస్తున్నాయి. వ్యతిరేక ప్రదర్శనలున్నా మానివేసి, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతముగా జరగనివ్వడమే అందరి బాధ్యత అని నేను భావిస్తున్నాను. ఒకనాడు విమర్శించినప్పటికీ, చివరికి పండిత నెహ్రూగారు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ గొప్పతనాన్ని గుర్తించి, వారిపట్ల భక్తిని, శ్రద్ధను ప్రకటించే సన్నివేశం రావడమంటేనే శివాజీ మహారాజ్‌ జీవితం ఎంత ఉదాత్తమైనదో అర్థమౌతుంది. నెహ్రూగారు దేశ ప్రధాని, ఆలస్యంగానైనా సరే ఈ జాతీయ మహాపురుషుని జాతీయ మాధ్యమంగా గుర్తించవలసి వచ్చినది. అందువలన దేశవాసులందరినీ, విశేషించి మహారాష్ట్ర సోదర, సోదరీమణులందరినీ తమ వివేక బుద్ధిని జాగృతం చేసి, ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయుటలో పూర్తిగా సహకరించాలని మనవి చేస్తున్నాను’ అన్నారు.

ఫలితంగా ఏ రకమైన వ్యతిరేక ప్రదర్శన లేకుండా, విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రాంతీయ, రాజకీయ స్వార్థంపై పవిత్రమైన జాతీయ భావకు కలిగిన విజయమది.

1948లో గాంధీ హత్య నింద, అనవసరంగా సంఘముపై మోపి, పూజ్యశ్రీ గురూజీని జైలులో నిర్బంధించి, సామాన్య మానవ విలువలు కూడా పాటించకుండా సంఘ స్వయంసేవకులపై అత్యాచారం జరిపించి, సంఘాన్ని సమూలంగా నాశనము చేయాలని ప్రధాని నెహ్రూగారు చేసిన ప్రయత్నము లోకవిదితమే. అయినా పూజ్య శ్రీ గురూజీ నిష్కళంక జాతీయ శక్తి, శ్రేష్ఠమైన మానవ విలువలను ఆచరించి చూపారు.

1949లో కేంద్ర ప్రభుత్వం నియుక్తి చేసిన ఆత్మచరణ్‌ ఐఎఎస్‌ కమీషను ఎర్రకోటలో విచారణ జరిపించి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి, గాంధీజీ హత్యకు ఏ రకమైన సంబంధము లేదని తీర్పునివ్వడం అందరికీ తెలిసినదే.

ధర్మము – సరియైన రీతిలో సంరక్షణ – దిశ

1958లో పూజనీయ శ్రీ చిన్మయానందజీ పాలఘాట్‌, కేరళలో గీతా జ్ఞానయజ్ఞము నిర్వహిస్తున్నారు. దాదాపు 3,000 మంది స్త్రీ పురుషులు పాల్గొన్నారు. అక్కడే ఉన్న శ్రీ గురూజీ, పూజ్య చిన్మయానంద దర్శనానికి వెళ్ళారు. శ్రీయుతులు కృష్ణశాస్త్రిగారనే వేదపండితులు శ్రీ గురూజీని కలసి ‘గురూజీ మీరు ధర్మవేత్తలు. బ్రాహ్మణులు కానివారు వేదములు, శాస్త్రములు చదవచ్చా, ప్రబోధన చేయవచ్చా?’ అని ప్రశ్నించారు.

శ్రీ గురూజీకి విషయం అర్థమైంది. ఇలా అన్నారు ”మహాశయా! నేను ధర్మవేత్తను కాదు. మీరడిగిన ప్రశ్నే అనేకసార్లు నా మనస్సులో కూడా తలెత్తుతూ ఉంటుంది. ”గాయత్రి మంత్ర ద్రష్ట జన్మతః బ్రాహ్మణులేనా, రామాయణం మనకందించిన మహర్షి వాల్మీకి బ్రాహ్మణులా? శ్రీమద్భగవద్గీతను చెప్పినవారు, విన్నవారు ఇద్దరూ కూడా బ్రాహ్మణులా? ఉపనిషత్తుల విషయంలో కూడా ఇలాంటి ప్రశ్న వస్తుంటుంది. సమస్య జటిలమైనది. మీలాంటి పెద్దలకే సమాధానము ఇవ్వగల అర్హత ఉంది”. అంతే. చర్చ ఆగిపోయింది. పండితులు వారు వ్రాసిన ‘శతభూషణ’ అనే మహాగ్రంథాన్ని శ్రీ గురూజీకి బహుకరించి వెళ్ళిపోయారు.

అస్పృశ్యత అధర్మమని: అంటరానితనం వేదవిరుద్ధమని: పెద్ద కులము, చిన్నకులము అనే భేదభావన శాస్త్ర విరుద్ధమని; హిందువులందరూ రక్త సంబంధీకులని; ఏకాత్మత, దాని ఆచరణయే హిందుత్వమని మనసా వాచా కర్మణా నమ్మిన శ్రీ గురూజీ ప్రయత్నము వలన 1969లో ఉడిపిలో విశ్వహిందూపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో ధార్మిక ఆచార్యులు, శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ, సిఖ్‌ గురువులందరూ ఏక కంఠముతో పలికి నూతన స్మృతిని జాతికందించిన సంగతి లోకవిదితమే. ఉడిపి సమ్మేళనం తర్వాత పూజ్యశ్రీ గురూజీ సంఘ ప్రచారకులు, ఉడిపి సభలను నిర్వహణకర్త అయిన సూర్యనారాయణరావుగారికి (ఈ మధ్యనే కీర్తిశేషులయ్యారు) ఇలా ఉత్తరం వ్రాశారు – “అస్పృశ్యత, అంటరానితనం అనేవి.. సవర్ణులుగా పిలువబడే హిందువులలో మేము పెద్ద కులంలో జన్మించామనే అహంకార భావన.. వీటిని పెద్దరాయిని క్రేన్‌తో తొలగించినట్లుగా సులభంగా తొలగించలేము. కావలసింది మానసిక పరివర్తన. ఆచార్యులైతే నూతన స్మృతినిచ్చారు. కాని ఈ సందేశం లక్షలాది గ్రామాలకు, నగరాలకు, ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకూ, ప్రతి గుండెకు అందజేయవలసిన బాధ్యత కార్యకర్తలది”.

ఈ బాధ్యత సమాజాన్ని ప్రేమిస్తూ, జాతీయ పునర్నిర్మాణంలో పాల్గొనే కార్యకర్తలందరిపై నేటికీ ఉన్నది.

సంపూర్ణ సమాజంలో సర్వాంగాల వికాసం

బీజ రూపంలో పూజనీయ డాక్టర్‌జీ ‘సంపూర్ణ హిందూ సమాజ సంఘటన’ కార్యాన్ని ప్రారంభించి, విజయవంతం చేసి 1940లో వెళ్ళిపోయారు. శ్రీ గురూజీ దానిని కొనసాగించారు. సంఘము స్వయంసేవకులను తయారుచేస్తుంది. హిందూ సమాజాన్ని సంఘటితం (ఐక్యం) చేస్తుంది. స్వయంసేవకులు సమాజంలో జాతిని ప్రేమించే వ్యక్తులతో కలసి, సమూహంగా ఏర్పడి – జాతి సర్వాంగీణ వికాసానికి తోడ్పడుతున్నారు. పూజ్యశ్రీ గురూజీ తమ తపశ్శక్తితో, నిరంతర కృషితో, దూరదృష్టితో, నిశిత పరిశీలనతో, సమగ్రమైన యోజనతో యోగ్యమైన కార్యకర్తలను జాతీయ జీవనంలో పనిచేయడానికి పంపించారు. మార్గదర్శనం చేశారు.

నేడు ఫలితములను అందరూ చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. విద్యారంగంలో, ధార్మిక, కార్మిక క్షేత్రంలో, వ్యవసాయ రంగంలో, జనజాతి – కొండ కోనల ప్రజలలో, సేవాక్షేత్రంలో, సాంస్కృతిక రంగంలో నేడు మౌలికమైన మార్పు తెస్తూ, జాతిని సంఘటితం చేస్తూ, జాతి సమగ్ర వికాసం కోసం స్వయంసేవకులే కాక, జాతీయభావన కలిగిన వ్యక్తులు, సమూహాలన్నీ పనిచేస్తూ విజయపథంలో ముందుకెళుతున్న సంగతిని గమనిస్తూనే ఉన్నాం.

– వడ్ల భాగయ్య

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారతీయ కార్యకరిణి సభ్యులు)

(జాగృతి సౌజన్యంతో )

పూజ్య గురూజీ  గోళ్వాల్కర్ పుణ్య తిథి నేడు…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసామాన్య వ్యక్తిత్వం శ్రీ గురూజీ గోళ్వల్కర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కీడుచేసే ‘రాత‌’ల‌పై ప‌రువు న‌ష్టం దావా!
పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో సంఘ్‌ గురించి అభ్యంతరకర వివ‌ర‌ణ‌

ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చ‌యిత‌పై కోర్టును ఆశ్ర‌యించిన కార్య‌క‌ర్త‌

ముంబై: త‌మ పుస్త‌కాలు, ర‌చ‌న‌ల‌తో స‌మాజాన్ని ఉత్తేజ‌ప‌ర‌చాల్సిన ప్ర‌చుర‌ణ‌క‌ర్త‌, ర‌చయిత‌లు పెడ‌తోవ ప‌డుతూ స‌మాజానికి కీడు చేసే రాత‌ల‌కు పూనుకొంటున్నారు. శేత్ ప్రకాష్‌న్ ఆర్ట్స్ (ముంబయి విశ్వవిద్యాలయం) మొదటి సంవత్సరం పొలిటికల్ సైన్స్ (సెమిస్టర్-1) పుస్తకంలో ప్రముఖ స్వ‌చ్ఛంద సంస్థ‌ రాష్ట్రీయ స్వయం సేవక‌ సంఘ్(ఆర్‌.ఎస్‌.ఎస‌) గురించి త‌ప్ప‌డు స‌మాచారాన్ని రాశారు. నిజానికి సంఘ్.. ప్ర‌జ‌ల‌కు ఆప‌ద వ‌స్తే క్ష‌ణాల్లో త‌న ప‌క‌డ్బందీ వ్యూహంతో సాయం చేసేందుకు వాలిపోతుంది. అటువంటి సేవా సంస్థ‌పై బుర‌ద జ‌ల్ల‌డం న్యాయం కాద‌ని ఆవేద‌న చెందిన ఓ కార్య‌క‌ర్త కోర్టును ఆశ్ర‌యించారు. మ‌హారాష్ట్ర‌లోని ఘట్కోపర్ విభాగ్ స‌హ కార్య‌వాహ ఆనంద్ కదమ్ వారికి లీగ‌ల్ నోటీసు పంపించారు. ఈ మేర‌కు ఆనంద్ మాట్లాడుతూ అడ్వ‌కేట్ ప్ర‌కాష్ సల్సింగిక‌ర్ ద్వారా ఈ నెల 30వ తేదీన నోటీసు పంపాన‌ని తెలిపారు.

పొలిటికల్ సైన్స్ సెమిస్టర్-1లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. పేజీ నం. 164 – లో సంఘ్ మిలిటెంట్‌తో పోల్చుతూ రాశారు. అయితే, మతపరమైన అల్లర్లకు తామేమీ బాధ్యులం కాదని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.

పుస్తక రచయితలు మహేష్ భగవత్, మోనికా వర్మ, ప్రశాంత్ కేల్కర్, పుస్తక ప్రచురణకర్త, షెథ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసు పంపారు.

Source: VSK Bharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కీడుచేసే ‘రాత‌’ల‌పై ప‌రువు న‌ష్టం దావా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Pseudo intellectuals obscured true history – famous author Ratan Sharda
The English book “CONFLICT RESOLUTION – THE RSS WAY”written by renowned author and analyst Dr. Ratan Sharda launch event was held at the Siddhartha Auditorium in Vijayawada.

The event was jointly organized by the Sahithi Sudha Foundation and Samalochana and it was attended by book author Dr. Ratan Sharda, eminent author Dr. Duggaraju Srinivasa Rao and retired IAS Sri Dasari Srinivasulu.

Author Dr. Ratan Sharda said that past governments, intellectuals, media, all of them have deliberately and strategically obscured the truths of our history and today there is a need to uncover and analyze those hidden truths with evidence and present them to the people. He gave details of the many attacks on Hindus in Kashmir and in different parts of the country, on different occasions.

He said that such historical truths were deliberately hidden by intellectuals, media and governments and many facts are now known to the people through the efforts of nationalist writers like him. “There is a need for more extensive research, observation and study in this direction and more historians, thinkers and writers should try in that direction.” he continued…

He said that the nationalists, especially nationalist scholars and writers, should have an in-depth study of local historical developments and it is the responsibility of nationalists, especially nationalist scholars and writers, to expose the conspiracies of those who had been influencing history and literature for decades on various topics.

Author Dr. Ratan Sharda

Preview of RSS :

He said that the RSS was constantly analyzing the developments and changes in the country, sensing the impending dangers and explaining the consequences that would ensue in the form of its resolutions to constantly alert and awaken the governments and the society. He lamented that unfortunately the governments and the media did not give much importance and publicity to RSS’S resolutions in our country.

Sri Dasari Srinivasulu, who unveiled the book, said … Ratan Sharda’s writings are very inspiring and Dr. Ratan Sharda is appreciated for collecting valuable information and presenting it in the form of books. “Actually Ratan Sharda studied textile technology. But he wrote books on history, social issues, science and technology. This is really a miracle.” Sri Srinivasulu praised Dr. Ratan Sharda.

Retired IAS Sri Dasari Srinivasulu

Leading author Dr Duggaraju Srinivasa Rao later said that Dr Ratan Sharda had done extensive research on the Rashtriya Swayamsevak Sangh (RSS), a leading social organization, and had published several books on RSS based on his deep study. He said that out of the total 12, 13 books published by Shri Sharda, 7 books were written on RSS, which shows how deeply he studied RSS.

Dr. Duggaraju Srinivasa Rao

RSS Andhra Pradesh State Executive Member Shri Bhupathiraju Srinivasa raju, RSS Vijayawada Mahanagar Sanghchalak Shri Krishnaprasad, Vishwa Hindu Parishad Leader Shri PVS Naidu, Deputy Transport Commissioner Shri Prasad Rao, BJP Leaders Shri Satyamoorthy, Mrs. Sadineni Yamini Sharma, Shri Lanka Dinkar, Shri Chigurupati Naresh honored Author Ratan Sharda.

About the author:

Dr. Ratan Sharda, author of “CONFLICT RESOLUTION – THE RSS WAY” is a Mumbai resident. After completing his post-graduation in Textile Technology, Shri Sharda done the research on the birth, presidency, achievements and the succession of RSS, the sequence and system of SarSanghchalaks of RSS. Submitted a thesis on it, earned doctorate. Has authored several books, including RSS 360, RSS EVOLUTION FROM AN ORGANISATION TO A MOVEMENT, SANGH & SWARAJ. Continuing research, study, and writing on a variety of topics.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Pseudo intellectuals obscured true history – famous author Ratan Sharda appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కుహనా మేథావులు నిజమైన చరిత్రను మరుగుపరచారు – ప్రముఖ రచయిత రతన్ శార్దా
విజయవాడలోని సిద్దార్థ ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, విశ్లేషకులు డాక్టర్ రతన్ శార్దా రచించిన “CONFLICT RESOLUTION – THE RSS WAY” అనే ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.  సాహితీ సుధ ఫౌండేషన్, సమాలోచనల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ రతన్ శార్దా, ప్రముఖ రచయిత డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు, రిటైర్డ్ IAS శ్రీ దాసరి శ్రీనివాసులు గార్లు పాల్గొన్నారు.

గ్రంధకర్త డాక్టర్ రతన్ శార్దా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, మేథావులు, పత్రికలు అన్నీ, అందరూ మన చరిత్రలోని సత్యాలను ఉద్దేశ్యపూర్వకంగా, వ్యూహాత్మకంగా మరుగుపరచారని, నేడు ఆ మరుగునపడ్డ సత్యాలను ఆధారసహితంగా వెలికితీసి, విశ్లేషించి ప్రజలకు అందించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాశ్మీర్లోనూ మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో, వివిధ సందర్భాలలో హిందువులపై జరిగిన అనేక దాడుల వివరాలను తెలియజేశారు. ఇలాంటి చారిత్రిక సత్యాలను మేథావులు, మీడియా, ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగానే ఇన్నాళ్ళూ దాచాయని, తనలాంటి జాతీయవాద రచయితల కృషితో అనేక వాస్తవాలు ఈనాడు ప్రజలకు తెలుస్తున్నాయని అన్నారు. ఈ దిశలో మరింత విస్తృతమైన పరోశోధన, పరిశీలన, అధ్యయనం సాగించవలసిన అవసరం ఉన్నదని, మరింతమంది చరిత్ర పరిశోధకులు, చింతకులు, రచయితలు ఆ దిశగా ప్రయత్నించాలని, ముఖ్యంగా ఎక్కడికక్కడ స్థానిక చారిత్రిక పరిణామాలపై లోతైన అధ్యయనం జరగాలని, దశాబ్దాలుగా వివిధ అంశాలపై తమకు తోచిన రీతిలో కథనాలల్లుతూ, చరిత్రను, సాహిత్యాన్ని ప్రభావితం చేస్తూ వచ్చినవారి కుట్రలను వెలికితీసి ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత జాతీయవాదులు, ముఖ్యంగా జాతీయవాద అధ్యయనకారులు, రచయితలపై ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

రచయిత డాక్టర్ రతన్ శార్దా

ఆరెస్సెస్ ముందుచూపు :

దేశంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, రానున్న ప్రమాదాలను పసిగడుతూ, జరుగవలసిన పరిణామాలను వివరిస్తూ RSS ఎప్పటికప్పుడు తన తీర్మానాల రూపంలో ప్రభుత్వాలని, సమాజాన్ని హెచ్చరించే, జాగృతం చేసే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నదని ఆయన వెల్లడించారు. దురదృష్ట వశాత్తూ దేశంలోని ప్రభుత్వాలు, మీడియా వాటికి అంత ప్రాముఖ్యతను, ప్రచారాన్ని కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ… రతన్ శార్దా గారి రచనలు ఎంతో ప్రేరణదాయకంగా ఉంటాయని, ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి పుస్తకాల రూపంలో అందిస్తున్న డాక్టర్ రతన్ శార్దా అభినందనీయులని పేర్కొన్నారు. నిజానికి రతన్ శార్దా గారు చదివింది టెక్స్ టైల్ టెక్నాలజీ అయినా ఆయన చరిత్ర, సామాజిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలను తీసుకుని పుస్తక రచన చేయడం విశేషమని శ్రీ శ్రీనివాసులు ప్రశంసించారు.

రిటైర్డ్ IAS శ్రీ దాసరి శ్రీనివాసులు

అనంతరం ప్రముఖ రచయిత డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ రతన్ శార్దా గారు ప్రముఖ సామాజిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై విస్తృతమైన పరిశోధన చేశారని, వాటి ఆధారంగా RSS పై పలు పుస్తకాలను వెలువరించారని తెలిపారు. శ్రీ శార్దా గారు వెలువరించిన మొత్తం 12, 13 గ్రంధాలలో 7 పుస్తకాలు RSS పై రచించినవే కావడం గమనార్హమని, దీనిని బట్టే ఆయన RSS పై ఎంత లోతైన అధ్యయనం చేశారో అవగతమవుతుందని ఆయన తెలిపారు.

డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు

ఆరెస్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు, ఆరెస్సెస్ విజయవాడ మహానగర్ సంఘచాలక్ శ్రీ కృష్ణప్రసాద్, విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీ PVS నాయుడు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శ్రీ ప్రసాదరావు, బీజేపీ నాయకులు శ్రీ సత్యమూర్తి, శ్రీమతి సాదినేని యామిని శర్మ, శ్రీ లంక దినకర్, శ్రీ చిగురుపాటి నరేశ్ లు రచయిత శ్రీ రతన్ శార్దా గారిని సన్మానించారు.

రచయిత గురించి :

“CONFLICT RESOLUTION – THE RSS WAY” గ్రంధ రచయిత డాక్టర్ రతన్ శార్దా గారు ముంబై నివాసి. టెక్స్ టైల్ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీ శార్దా RSS పుట్టుక, ప్రస్థానం, విజయాలు, సర్ సంఘచాలకుల పరంపర వంటి అంశాలను పరిశోధనకు స్వీకరించి, దానిపై థీసిస్ సమర్పించి, డాక్టరేట్ సాధించారు. RSS 360, RSS EVOLUTION FROM AN ORGANISATION TO A MOVEMENT, SANGH & SWARAJ వంటి పలు పుస్తకాలను వెలువరించారు. వివిధ అంశాలపై నిరంతర పరిశోధన, అధ్యయనం, రచన కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కుహనా మేథావులు నిజమైన చరిత్రను మరుగుపరచారు – ప్రముఖ రచయిత రతన్ శార్దా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు
ఆర్‌ఎస్ఎస్‌ కర్ణాటక ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌

బెంగ‌ళూరు: కాంగ్రెస్‌ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్‌ ముఖ్య నాయకుడు డాక్ట‌ర్ కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ తెలిపారు. విశ్వహిందూ పరిషత్‌ మంగళూరులో ఆదివారం చేపట్టిన కొరగజ్జన క్షేత్ర పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొంటూ బ్రిటీషు పతాకం దేశమంతటా ఉండేదని, అంతకంటే ముందు ఆకుపచ్చ పతాకం ఉండేదని పేర్కొన్నారు. మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం జాతీయ పథకంను నిర్ణయించారని చెబుతూ, అయినా తాను జాతీయ పతాకంను గౌరవిస్తానని స్పష్టం చేశారు. అదే విధంగా వందేమాతరంను కాదని జనగనమనను జాతీయ గీతంగా నిర్ణయించారని ప్రభాకర్ భట్ గుర్తు చేశారు.

రాజ్యసభ, లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ సాధ్యమైతే పతాకం మార్పు జరగవచ్చని ఆయన చెప్పారు. పతాకాన్ని మార్పు చేసేందుకు సాధ్యం కాలేదని చెప్పలేమని తెలిపారు. ఇదే తరహాలో కొనసాగితే హిందూ సమాజం ఒక్కటి కానుందని స్పష్టం చేశారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపింది కొంతమాత్రమే…

కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో చూపింది కొంతమాత్రమే అని తెలిపారు.“అందరినీ చంపాలని ఖురాన్, బైబిల్ బోధిస్తున్నాయి. ఈ విషయాలన్నీ ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో చిత్రీకరించారు” అని భ‌ట్ చెప్పారు.

“ప్రజలు మనుస్మృతి గురించి మాట్లాడుతున్నారు. అందులో ఎవరికైనా తప్పు అనిపిస్తే ఎత్తి చూపాలి. మనకు అలాంటి స్వేచ్ఛ ఉంది. పాత కాలంలో హిజాబ్ వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. కితాబ్ వైపు వెళ్దాం. అందరూ ఐక్యంగా చదువుకోవాలి” అని హితవు చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న హిజాబ్ వివాదం ఒక రకమైన జిహాద్ అని ఆయన ఆరోపించారు. కితాబ్ కంటే హిజాబ్‌ను ఎంచుకోవడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. సానియా మీర్జా, రచయిత్రి సారా అబూబకర్ వంటి మహిళలు వ్యతిరేకించినప్పుడు కొంతమంది ముస్లిం అమ్మాయిలు తరగతి గదులలో హిజాబ్ ధరించాలని పట్టుబట్టడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి నిరసనగా ఇటీవల ముస్లిం వ్యాపారులు దుకాణాలను మూసివేయడం మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య అని మండిప‌డ్డారు. అలాంటి చర్య దేశద్రోహానికి సమానం అని స్పష్టం చేశారు.

6 నుండి 10 తరగతులలో భగవద్గీతను బోధించాలనే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని భట్ ప్రశంసించారు. భగవద్గీత చదివిన వారెవరూ ఇతరులకు చెడుచేయరని ప్రభాకర్ భట్ స్పష్టం చేశారు. దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ పిల్లలకు రామాయణ, మహాభారత గ్రంథాల గురించి నేర్పాలని ఆయన సూచించారు. తద్వారా సమాజానికే మంచిదని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“ది కాశ్మీర్ ఫైల్స్” థియేటర్లలో RSS ప్రార్థన చేస్తున్న ప్రేక్షకులు
“ది కాశ్మీర్ ఫైల్స్” చలన చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే.90లలో కాశ్మీర్లో హిందువులపై ముస్లిములు, పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు జరిపిన దారుణ మారణ హోమానికి దృశ్య రూపమే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చలన చిత్రం.

‘ది కాశ్మీర్ ఫైల్స్’ చలనచిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లు “భారత్ మాతాకీ జై” నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కొన్ని రాజకీయ పార్టీలు హిందువులకు చేసిన ద్రోహాన్ని తెలుసుకుని రగిలిపోతున్నారు. ఈ చలనచిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లలో “భారత్ మాతాకీ జై” నినాదాల తోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రార్థన కూడా చేస్తూండడం గమనార్హం.

https://vskandhra.org/wp-content/uploads/2022/03/AVVARU.mp4

దేశంలోని పలు రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు దశాబ్దాలుగా తొక్కిపెట్టిన అనేక వాస్తవాలను ఈ చలన చిత్రం కళ్లకు కట్టింది. నిజాలను నిర్భయంగా తెరకెక్కించిన చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిపై ప్రశంశలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మీడియా ఈ చలన చిత్రానికి పెద్దగా ప్రాచుర్యం కల్పించకపోయినా…. సోషల్ మీడియాలో ఈ చలన చిత్రానికి లభించిన మద్దతు, ప్రచారం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు. ఈ చలనచిత్రం ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లు “భారత్ మాతాకీ జై” నినాదాలతో హోరెత్తుతున్నాయి. అలాగే పలు థియేటర్లలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రార్థన కూడా చేస్తూ ఉండడం గమనార్హం. మూడు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో హిందువులపై జరిగిన ఊచకోతకు దృశ్య రూపంగా మలచిన ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు భారమైన గుండెలతో థియేటర్లను వీడుతున్నారు. ఈ చిత్రం అన్ని భారతీయ భాషలలోకి అనువదింపబడి, విస్తృతంగా ప్రదర్శింపబడాలని వారందరూ ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “ది కాశ్మీర్ ఫైల్స్” థియేటర్లలో RSS ప్రార్థన చేస్తున్న ప్రేక్షకులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్ స్వయం సమృద్ధి సాధించాలంటే… దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలి – ఆర్ ఎస్ ఎస్
* అఖిల భారతీయ ప్రతినిధి సభలలో తీర్మానం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిలభారతీయ ప్రతినిధిసభలు ఈ ఏడాది గుజరాత్ లోని కర్ణావతిలో జరుగుతున్నాయి. మార్చ్ 11 నుంచి జరుగుతున్న ఈ సభలు నేటితో ముగియనున్నాయి. ఈ సభలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఎప్పట్లాగే RSS  స్వయం సమృద్ధ భారత నిర్మాణానికి దేశంలోని యువతకు, వివిధ వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన అవసరమున్నదని పేర్కొంటూ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మాన పాఠాన్ని యదాతథంగా చూద్దాం….

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

అఖిల భారతీయ ప్రతినిధి సభ, కర్ణావతి, గుజరాత్

యుగాబ్ది 5123, 11-13 మార్చ్, 2022

తీర్మానం

భారత్ లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులను, విస్తారమైన మానవ శక్తిని, స్వాభావికమైన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని మన యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తే వ్యవసాయం, తయారీ మరియు సేవా రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధించటానికి, భారత ఆర్థిక వ్యవస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. మన ప్రజల జీవన స్థితిగతులపైన, ఉపాధి అవకాశాలపైన కోవిడ్ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సమాజంలోని కొన్ని వర్గాలు కొత్త అవకాశాలను దొరకబుచ్చుకుని విశేష ప్రయోజనాలు పొందిన సంగతి కూడా మనకు తెలుసు. ఉపాధి విషయంలో ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించటానికి, ఉద్యోగ అవకాశాల కల్పనలో యావత్ భారతీయ సమాజం క్రియాశీల పాత్ర పోషించాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) నొక్కి చెబుతోంది.

మానవ కేంద్రిత, శ్రమ ఆధారిత, పర్యావరణ అనుకూల, వికేంద్రీకృత, ఫలితాలను అందరికీ సమానంగా పంపిణీ చేసే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, సూక్ష్మ స్థాయి, చిన్న తరహా మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెంపొందించే భారతీయ ఆర్థిక నమూనాకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతినిధి సభ అభిప్రాయపడింది. గ్రామీణ ఉపాధిని, అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని, మహిళలకు ఉపాధిని మరియు ఆర్థిక వ్యవస్థలో వారందరి భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మన సామాజిక పరిస్థితులకు తగినట్లుగా కొత్త సాంకేతికతలను, చేతి వృత్తులను, నైపుణ్యాలను స్వీకరించే ప్రయత్నాలు అత్యంత ఆవశ్యకం.

పైన పేర్కొన్న మార్గాల ఆధారంగా దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ అనేక విజయవంతమైన ఉపాధి కల్పన నమూనాలు అందుబాటులో ఉండటం గమనార్హం. వారు స్థానిక ప్రత్యేకతలు, ప్రతిభ మరియు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అటువంటి అనేక ప్రదేశాలలో విలువ ఆధారిత ఉత్పత్తులు, సహకార రంగం, స్థానిక ఉత్పత్తుల ప్రత్యక్ష మార్కెటింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి మొదలైన రంగాలలో వాటి వ్యవస్థాపకులు, నిర్వాహకులు, వ్యాపారులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, స్వయం సహాయక బృందాలు మరియు స్వచ్ఛంద సంస్థలు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. దాంతో హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్, గృహ ఉత్పత్తులు మరియు కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తోంది. వారి అనుభవాలతో అవసరమైన చోట వాటి పునఃస్థాపనకు వేగంగా ప్రయత్నించాలి. కొన్ని విద్య మరియు పారిశ్రామిక సంస్థలు గణనీయమైన రీతిలో ఉపాధి కల్పనకు తోడ్పడ్డాయి. పేద, బడుగు, బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించిన అన్ని రకాల విజయగాథలను ప్రతినిధి సభ అభినందిస్తోంది. సమాజంలో ‘స్వదేశీ మరియు స్వావలంబన’ స్ఫూర్తిని పెంపొందించే ప్రయత్నాలు, పై కార్యక్రమాలకు సరైన ప్రేరణనిస్తాయి.

అధిక ఉపాధి అవకాశాలను కలిగి ఉన్న మన ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడం అవసరం. ఇది దిగుమతులపై మనం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రజలకు,ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా వారు వివిధ సంస్థలను, పరిశ్రమలను స్థాపించడాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించాలి. తద్వారా వారు ఉద్యోగాలను మాత్రమే కోరుకునే మనస్తత్వం నుండి బయటపడవచ్చు. మహిళలు, గ్రామీణ ప్రజలు మరియు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలలో కూడా ఇలాంటి వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యావేత్తలు, పరిశ్రమలు, కుల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్చంద సంస్థలు మరియు ఇతర సంస్థలు ఈ దిశగా సమర్థవంతమైన భాగస్వామ్యాన్ని కలిగి వుండాలి. అందుకోసం ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు మరియు ఇతర ప్రయత్నాలు వీటికి తోడుగా సాగడం అత్యంత అవసరం.

ప్రపంచ ఆర్థిక మరియు సాంకేతిక స్థితిగతులు వేగంగా మారుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి మనం వినూత్న మార్గాలను అన్వేషించాల్సిన అవసరమున్నదని ప్రతినిధి సభ అభిప్రాయపడుతోంది. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతి అవకాశాల ఆధారంగా ఉపాధి అవకాశాలు మరియు వ్యవస్థాపకత అవకాశాలను మనం తీవ్రంగా అన్వేషించాలి. ఉద్యోగంలో చేరటానికి ముందు, అనంతరం మానవశక్తి శిక్షణ, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ‌లు మరియు గ్రీన్ టెక్నాలజీ వెంచర్‌లకు ప్రేరణ మొదలైన వాటిలో మనం నిమగ్నమవ్వాలి.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్థిరమైన, సమగ్రమైన అభివృద్ధిని సాధించడానికి, ఉపాధి కల్పనకు భారత కేంద్రీకృత నమూనాలపై పని చేయాలని ప్రతినిధి సభ ప్రజలకు పిలుపునిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ తన సముచిత స్థానాన్ని తిరిగి పొందేలా వివిధ రకాల ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే మొత్తం ప్రయత్నాన్ని ప్రోత్సహించేలా శాశ్వతమైన మన భారతీయ విలువల ఆధారంగా ఆరోగ్యకరమైన పని సంస్కృతిని నెలకొల్పాలని అఖిల భారతీయ ప్రతినిధి సభ సమాజంలోని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్ స్వయం సమృద్ధి సాధించాలంటే… దేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలి – ఆర్ ఎస్ ఎస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌
క‌ర్ణావ‌తి: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వ‌ర్యంలో దేశ వ్యాప్తంగా నిత్యం జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై నాలుగేళ్ళ‌లో ల‌క్ష మందికిపైగా యువ‌త ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరార‌ని సంఘ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే వెల్లడించారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరండి’ ద్వారా సంఘ్‌లో చేరాలనే ఆకాంక్షను వారంతా వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

2017 నుంచి 2021 మధ్య కాలంలో 20 నుంచి 35 ఏళ్ళ‌ మధ్య వయస్సు గల యువకులు లక్ష నుంచి 1.25 లక్షల మంది వరకు ఆ విధంగా ఈ సంస్థ కార్యకలాపాలలో చేరార‌ని, రోజువారీ శాఖ కార్యక్రమాలకు హాజరవుతున్న వారిలో 61 శాతం మంది విద్యార్థులే ఉంటున్నారని చెప్పారు. గుజరాత్‌లోని కర్ణావతిలో శుక్రవారం ప్రారంభమైన సంఘ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఆయన వార్షిక నివేదికను సమర్పించారు.

తొలుత స‌ర్‌ సంఘచాలక్ డాక్ట‌ర్‌ మోహన్ భాగవత్‌తో కలిసి భారతమాత చిత్రప‌టానికి పూలమాల వేసి, సమావేశాలను లాంఛనంగా ప్రారంభించారు. రెండేళ్ళ‌లో కొవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ, 2020తో పోలిస్తే దేశంలో 98.6 శాతం కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వార్షిక నివేదికలో తెలిపారు.

6,506 ఖండ్‌లు..

సమావేశాలు ప్రారంభం కాగానే సహా సర్ కార్యవాహ మన్మోహన్‌జీ వైద్య మీడియా సమావేశంలో నివేదిక వివరాలను తెలిపారు. వార్షిక నివేదికలో సప్తహిక్ మిలన్ (వారంవారీ సమావేశం) సంఖ్య కూడా పెరిగిందని, రోజువారీ శాఖలలో 39 శాతం వ్యవసాయి స్వయం సేవకులు హాజరవుతున్నారని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్య దృక్కోణంలో, దేశంలో 6506 బ్లాక్‌లు(ఖండ్) ఉన్నాయ‌ని, వాటిలో 84 శాతం ఖండ్‌లలో సంఘ ప‌నిచేస్తోంద‌న్నార‌న్నారు.

2,303 పట్టణ ప్రాంతాలలో శాఖ‌లు..

59,000 మండలాల్లో, దాదాపు 41 శాతం మండలాలో భౌతిక శాఖల రూపంలో సంఘ కార్యం జరుగుతున్నద‌ని, 2303 పట్టణ ప్రాంతాలలో 94 శాతం చోట్ల శాఖ పనులు జరుగుతున్నాయ‌ని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తెలిపారు. అన్ని మండలాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూలై మధ్య మధ్యలో 104 చోట్ల సంఘ్ శిక్షా వర్గాలు (ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరాలు) ఉంటాయని, ఒక్కో వర్గానికి సగటున 300 మంది ఉంటారని ఆయన వివరించారు.

క‌రోనా కాలంలో స‌మాజంతో క‌లిసి విస్తృత సేవ‌లు

కరోనా కాలంలో, స్వ‌యం సేవ‌కులు సమాజంతో కలిసి సేవా కార్యాన్ని చురుకుగా అందించారని దత్తాత్రేయ తెలిపారు. మ‌హమ్మారి మొదటి రోజు నుండి 5.50 లక్షల మంది స్వయం సేవకులు సేవా కార్యాన్ని ప్రారంభించారు. మఠాలు, దేవాలయాలు, గురుద్వారాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు సేవా కార్యానికి తరలి వచ్చిన ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం. ఇది మేల్కొన్న దేశానికి సంకేతం అని దత్తాత్రేయ వివరించారు.

సంఘ్‌లో కుటుంబ ప్రబోధన్(కుటుంబ అవగాహన), గౌ-సంవర్ధన్(ఆవుల పోషణ), గ్రామీణ వికాస్(గ్రామీణాభివృద్ధి) కార్యక్రమాలు విశేషంగా కొనసాగుతున్నాయని చెబుతూ స్వయంసేవకులను సంఘ్ కార్యానికి ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశం ప్రారంభంలో, గత సంవత్సరం మరణించిన ప్రముఖులు భారతరత్న లతా మంగేష్కర్, సిసిఎస్ జనరల్ బిపిన్ రావత్, బాబాసాహెబ్ పురందరే, రాహుల్ బజాజ్, పండిట్ బిర్జు మహారాజ్ , పి. శ్రీనివాస రామానుజాచార్య స్వామిల‌కు ఘ‌న నివాళులు అర్పించారు. మీడియా సమావేశంలో అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్, సహ ప్రచార్ ప్రముఖ్ నరేంద్ర కుమార్, అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నాలుగేళ్ళ‌లో ల‌క్ష మంది యువ‌త ఆర్‌.ఎస్‌.ఎస్‌లో చేరిక‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన
బోటు ప్రయాణంలో ఉన్న కొందరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ దైనందిన కార్యక్రమం శాఖా సమయం కావడంతో ఆ బోటులోనే అందరూ కలిసి ఆర్ ఎస్ ఎస్ ప్రార్ధన చేసిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భేడ్ ద్వారకలో చోటు చేసుకుంది.

ఈనెల 11 వ తారీకు నుంచి 13వ తారీకు వరకు గుజరాత్లోని అహ్మదాబాదులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభలు జరుగనున్నాయి. ఈ సభలకు వెళ్ళవలసిన ప్రతినిధులు కొందరు నెల్లూరు నుంచి బయల్దేరారు. వారితో పాటు విహారయాత్ర నిమిత్తం వారి కుటుంబ సభ్యులు కూడా బయలుదేరారు. వారి విహారయాత్రలో భాగంగా వారు భేడ్ ద్వారకలో ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆర్ ఎస్ ఎస్ లో జరిగే దైనందిన కార్యక్రమం ‘శాఖ’ సమయం అయింది. వెంటనే ఆ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ పడవలోనే ప్రార్థన చేశారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల ఈ తరహా నిబద్ధత తరచుగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ నిబద్ధతే వారిని ఇన్నేళ్ళుగా విలక్షణంగా నిలిపింది.

https://vskandhra.org/wp-content/uploads/2022/03/BHED-DWARAKA.mp4

రెండేళ్లుగా పరిమిత సంఖ్యలో ప్రతినిధి సభలు….

ప్రతి ఏటా మార్చి నెలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసిన సుమారు 1500 మంది ప్రతినిధులతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ జరుగుతుంది. అయితే కోవిడ్ కారణంగా 2020,21 లలో కేవలం 500 మందితోనే ఈ సమావేశాలు జరిగాయి. మిగిలిన వారందరూ వారి వారి కేంద్రాల నుంచే వర్చువల్ గా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ భయం తగ్గడంతో ఈ ఏడాది అందరి ప్రతినిధులతో సమావేశం ప్రత్యక్షంగా జరుగనున్నది. ఈ సమావేశాల్లోనే ప్రతి ఏడాది ఆర్ ఎస్ ఎస్ కొన్ని తీర్మానాలను చేస్తుంది. వాటికి అనుగుణంగా తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ఆ దిశగా కార్యకర్తలకు ఈ సమావేశాలలో పెద్దలు మార్గదర్శనం చేస్తారు. అందుకు అనుగుణంగానే వారి వార్షిక యోజన, కార్యక్రమాలు ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బోటులో వెళుతూ కూడా లేటు చేయకుండా ఆరెస్సెస్ ప్రార్థన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీ వెంకయ్య నాయుడి చేతులమీదుగా “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పుస్తకావిష్కరణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో జిల్లా ప్రచారక్, విభాగ్ ప్రచారక్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సేవా ప్రముఖ్…. ఇలా వివిధ స్థాయిలలో పనిచేసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యంలో ఎందరో కార్యకర్తలకి ప్రేరణగా నిలిచిన స్వర్గీయ శ్రీ సోమేపల్లి సోమయ్య గారి జీవిత చరిత్ర “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పేరుతో నవయుగ భారతి ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురితమైంది.

ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ సభ మార్చి 26 శనివారం సాయంత్రం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాలయాల ప్రాంగణంలోని సర్దార్ పటేల్ హాల్ లో జరుగనున్నది. ఆ సభలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరింపబడుతుంది. శ్రీ వెంకయ్య నాయుడికి స్వర్గీయ సోమయ్య గారితో ఆత్మీయ అనుబంధం ఉన్నది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో తన ప్రస్థానం, రాజకీయాలలో తాను సాధించిన ప్రగతికి స్వర్గీయ సోమయ్య, స్వర్గీయ భోగాది దుర్గాప్రసాద్ వంటి మహోన్నత, ఆదర్శనీయ కార్యకర్తల సాంగత్యము, వారి నుంచి లభించిన ప్రేరణ, వారందించిన ఉత్తమ సంస్కారాలే కారణమని ఆయన తరచూ చెబుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సంఘ, భాజపా, వాటి అనుబంధ సంస్థల ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

స్వర్గీయ శ్రీ సోమేపల్లి సోమయ్య గారి గురించి సంక్షిప్తంగా..…

సోమయ్యగారి స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని చీమకుర్తికి సమీపంలోగల పల్లామిల్లి గ్రామం. 1927లో సోమేపల్లి వెంకమ్మ, ఆది నారాయణ దంపతులకు జన్మించారు. వారిది చాలా పేద కుటుంబం కావడం చేత బ్రతుకు తెరువు కోసం తల్లిదండ్రులు స్వగ్రామం విడిచిపెట్టి గుంటూరు జిల్లాలోని తెనాలికి వచ్చి చిన్న కట్టెల దుకాణం పెట్టుకొని జీవిస్తూ అక్కడే స్థిరపడ్డారు.

శ్రీ సోమయ్య గారు గణితంలో దిట్ట. 1942 లో సంఘ పరిచయమైంది. 1944లో వారు ప్రథమవర్ష సంఘ శిక్షావర్గ పూర్తి చేశారు. ప్రముఖ వారపత్రిక జాగృతి ప్రారంభంలో శ్రీ సోమయ్య ప్రధాన భూమిక పోషించారు. 1950 లో నెల్లూరు జిల్లాకు ప్రచారక్ గా వెళ్ళారు. 1959లో ప్రాంత ప్రచారక్ గా నియుక్తులయ్యారు. ఎమెర్జెన్సీ సంక్షోభ సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో శ్రీ సోమయ్య సంఘాన్ని సమర్థవంతంగా నడిపించారు. కార్యకర్తలను ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారు. సంఘపనిలో వారికేవైనా సమస్యలెదురయితే చిటికెలో పరిష్కారం చెప్పేవారు.1989 నుంచి వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా (దక్షిణ, ఆగ్నేయ క్షేత్రాలు) రాష్ట్రాల సేవాప్రముఖ్ గా నియుక్తులయ్యారు.

1995 జులై 25 ఉదయం న్యూస్ పేపరు కొనడానికై కేరళలోని ఆల్వాయ్ స్టేషన్ లో రైలు దిగిన సోమయ్య గారు తిరిగి అప్పటికే కదిలిన రైలెక్కే క్రమంలో కాలు జారి రైలు క్రింద పడి ప్రాణాలు విడిచారు. ఎందరో స్వయం సేవకులను తీర్చిదిద్దిన కుశల సంఘటనా నిర్మాత శ్రీ సోమయ్య గారు. అపారమైన మేధా సంపత్తి తో పాటు విశిష్టమైన వ్యవహార శైలి వారి సొత్తు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీ వెంకయ్య నాయుడి చేతులమీదుగా “స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య” పుస్తకావిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.