RAMANUJACHARYA – Vishwa Samvad Kendra Andhra Pradesh

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత…..” అని గీతలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఈ భూమిపైన ధర్మానికి గ్లాని ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ ఒక మహాపురుషుడు ఉద్భవించి జాతికి జ్ఞానోపదేశం చేశారు. ఎందరో పుణ్యపురుషులు, ఋషులు, మునులు, వీరులు, పతివ్రతా మూర్తులు, భక్తాగ్రేసరులు జన్మించిన పుణ్యభూమి మన భారతదేశం.

జాతిలో భౌతికవాదం, మూఢత్వం ప్రబలి అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న ప్రతిసారీ ఆ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జాతిలో చేతన నింపడానికి ఈ దేశంలో ఒక మహాపురుషుడుద్భవించాడు. అలాంటి మహానుభావులు, భగవత్స్వరూపులు ముగ్గురు అవతరించిన పుణ్య తిథి ఈరోజు.

ఆదిశంకరాచార్యులు :

వేద వేదాంగాలు అభ్యసించిన గొప్ప పండితుడు, యోగి, సన్యాసి, శాస్త్ర చర్చలలో హేమాహేమీలనే ఖంగు తినిపించిన మేధావి. కాశీలోని గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. ఎదురుగా ఒక ఛండాలుడు, మురికి బట్టలతో ఉన్నవాడు 4 కుక్కలని పట్టుకుని ఎదురొస్తున్నాడు. శిష్యులు “స్వామివారొస్తున్నారు, పక్కకి తప్పుకో”మన్నారు. అయినా వినిపించుకోకుండా ముందుకు వస్తూ ఉంటే సాక్షాత్తూ స్వామి వారే అడ్డు తొలగమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ ఛండాలుడు ” మీరు అడ్డు తొలగమంటున్నది నా దేహాన్నా? నాలోని పరమాత్మనా?” అని ప్రశ్నించాడు. సాక్షాత్తూ పరమశివుడే తన ఎదుట ఉన్నాడని, తనకు జ్ఞానోదయం కలిగించడానికే ఛండాలుని రూపంలో విచ్చేశాడని గ్రహించిన శంకరులు ఛండాలుని రూపంలోని ఆ పరమశివుని స్తుతిస్తూ ఐదు శ్లోకాలతో కూడిన మనీషా పంచకాన్ని పఠించారు. ప్రతి జీవిలోనూ పరమాత్ముడున్నాడని, సాధన ద్వారా ఎవరైనా ఉన్నతత్వాన్ని, ఉత్తమ గతులను పొందవచ్చని, ప్రతి జీవీ ఆ పరమాత్ముని స్వరూపమేనని చెబుతూ ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. “ బ్రహ్మ సత్యం జగన్మిధ్యా, జీవో బ్రహ్మైవ నా పరః” అంటే బ్రహ్మమొక్కటే సత్యమైనది. జగత్తు అసత్యమైనది, అశాశ్వతమైనది. జీవుడే బ్రహ్మ.” అనే తత్వాన్ని బోధించారు.

కేరళ ప్రాంతంలో పూర్ణా నది తీరాన ఉన్న కాలడి అనే గ్రామంలో జన్మించిన మహా పురుషుడు శ్రీ శంకరాచార్యులు. ఛాందస భావనలతో, అజ్ఞానాంధ విశ్వాసములతో మగ్గుతున్న ప్రజల జీవనంలో పరివర్తన తీసుకురావడానికి ఎనిమిదేళ్ల ప్రాయంలో సన్యాస దీక్షను స్వీకరించి గోవింద భగవత్పాదుల వద్ద యోగ విద్యను అభ్యసించారు.

దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలనే భేదాలను తొలగించి జాతీయ సమైక్యతా సూత్రాన్ని చాటుతూ బదరీ, ద్వారక, పూరి, శృంగేరీలలో నాలుగు పీఠాలను స్థాపించారు. ఉపనిషత్తులకు ప్రామాణిక భాష్యాన్ని వ్రాశారు. సర్వ వేదాంత సంగ్రహము, వివేక చూడామణి, ప్రబోధ సుధాకరము వంటి అనేక రచనలు చేశారు.

దేశమంతా అర్ధరహితమైన ఆచార వ్యవహారాల్లో కొట్టుమిట్టాడుతూ, వివిధ శాస్త్రాలు, సిద్ధాంత రాద్ధాంతాలతో ప్రజలందరూ సంఘర్షించుకుంటూ, నైరాశ్యంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ప్రజలలో సమరసతా భావనను, జాతీయ సమైక్యతను రగుల్కొల్పి దేశాన్ని రక్షించిన మహా తపస్వి శ్రీ ఆదిశంకరులు. సాక్షాత్తూ ఆ పరమ శివుడే శంకరునిగా అవతరించాడని నేటికీ భక్తులు భావిస్తారు. తన 32వ ఏట పరమపదం చేరారు ఆ ఆది శంకరులు.

భగవద్రామానుజాచార్యులు :

“న జాతిః కారణం లోకే గుణే కళ్యాణ కారకః” “నీ పుట్టుక కారణంగా, నీ కులం కారణంగా లోకానికి ఏ ప్రయోజనమూ చేకూరదు. నీ గుణగణాల కారణంగానే లోక కళ్యాణం సాధ్యమవుతుంది.” అని స్పష్టంగా బోధించిన మహా పురుషుడు శ్రీ రామానుజాచార్యులు.

“భక్తుడు భగవంతుని దాసుడైతే…. భగవంతుడు భక్తుని దాసుడు. కనుక సంపూర్ణ విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే నీ ప్రభుడై, దాసుడై, స్నేహితుడై, ప్రేమికుడై నీ చెంతకు వస్తాడు” అంటూ విశిష్టాద్వైతాన్ని ప్రబోధించినవారు భగవద్రామానుజులు.

ఎవరికీ చెప్పొద్దని, అలా చెబితే నువ్వు నరకానికి వెళతావని హెచ్చరించి తన గురువు తనకు ఉపదేశించిన అష్టాక్షరీ మంత్రాన్ని గుడి గోపురమెక్కి అందరికీ వినిపించిన మానవతా మూర్తి రామానుజాచార్యులు.

నదీ స్నానం నుంచి తిరిగి వచ్చేటప్పుడు నిమ్న కులస్థుల భుజాలపై చేతులు వేసుకుని రావడం ద్వారా సమరసతను చాటిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు. అంతేకాదు అదేమని ప్రశ్నించిన కొందరు శిష్యులతో ఆ విధంగా రావడం ద్వారా తాను మరింత పవిత్రుడనైనానని చెప్పేవారు. ఆ రోజుల్లో అస్పృశ్యులుగా పరిగణింపబడుతూ ఉండిన ఉపేక్షిత బంధువులను ఆయన “తిరుకులత్తార్” (పవిత్రమైన కులము వారు) అని సంబోధించే వారు.

వైష్ణవ భక్తాగ్రేసరులైన 12 మంది ఆళ్వారుల విరచితమైన పాశురాల సంకలనమైన దివ్య ప్రబంధాన్ని రామానుజులు పరమ ప్రామాణికంగా తీసుకున్నారు. శ్రీరంగంలోని రంగనాయక స్వామి ఆలయ మెట్లపై తన్మయత్వంతో విష్ణు కీర్తనను గానం చేస్తున్న తిరుప్పాన్ ఆళ్వారును స్వామివారి అభిషేకానికి నీళ్లు తీసుకు వెళుతున్న లోక సారంగుడు అనే అర్చకుడు రాయి విసిరి గాయపరచినపుడు గర్భగుడిలోని రంగనాథుని విగ్రహం నుంచి రక్తం స్రవించడం, ఆ ఆళ్వారును భుజాలమీద మోసుకుంటూ తన సన్నిధికి తీసుకురావాల్సిందిగా సాక్షాత్తూ ఆ రంగనాథుడే లోకసారంగుని ఆజ్ఞాపించిన వృత్తాంతాన్ని రామానుజులు పదే పదే తన భక్తులకు వివరిస్తూ ఉండేవారు. దీనిని బట్టి సామాజిక సమరసతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం ఎంతటిదో మనకు అవగతమవుతుంది. అంతేకాదు కర్ణాటకలోని కావేరీ నది ఒడ్డున గల మేల్కొటే తిరునారాయణ మందిరంలోకి దళితులను స్వయంగా తోడ్కొని వెళ్లారు శ్రీ రామానుజులు.

కుల వర్ణ భేదాలకు అతీతంగా భక్తులందరూ ఆనంద పారవశ్యంతో చేసే హరినామ స్మరణ, చెక్క భజనలు, కోలాటం తదితరాలు రామానుజుల వల్లనే ప్రాచుర్యంలోకి వచ్చాయి. అణగారిన వర్గాలలో వైష్ణవ మత ప్రచారం కోసం మాల, మాదిగ దాసరులను తయారుచేసి వారిని ధర్మ ప్రచారకులుగా, ప్రసారకులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీరామానుజులది. మాల, మాదిగ దాసరుల భక్తి ప్రపత్తులు, త్యాగము, శౌర్య పరాక్రమాలు అనేక కావ్యాలలో ప్రస్తుతింపబడ్డాయి కూడా.

హైందవ సమాజంలో సమత, సమరసతా సాధనకై శ్రీ రామానుజుల కృషి అనన్య సామాన్యమైనది. హైందవ ధర్మో ద్ధరణకు, హైందవ సమాజంలో నెలకొన్న అంతరాలను అంతరింపజేయడానికి అహరహమూ తపించిన యతిరాజు భగవద్రామానుజులు తన 120 ఏట కైవల్యాన్ని పొందారు.

సంత్ సూరదాస్ :

16వ శతాబ్దంలో భక్తి యుగ కాలంలో జీవించిన సంత్ సూరదాసు శ్రీకృష్ణుని బాల్య క్రీడలను, ప్రేమ లీలలను, భక్తి తత్వంతో పరవశించి వర్ణిస్తూ గానం చేసేవాడు. అంథుడైన ఈయన ఆ స్వామిని మనోనేత్రంతో దర్శించి బృందావనంలో కూర్చుని ప్రతిరోజూ ఒక నూతన భజన గీతాన్ని ఆలపించేవాడు. “నర్ అపనీ కరనీకరే నరసీ నారాయణ హోయ్” అంటే “తన కర్తవ్యాన్ని నిర్వహించిన మానవుడు మాధవుడవుతాడు” అంటూ మానవజాతికి కర్తవ్యోపదేశం చేశాడు సూరదాసు. భక్తికి, భగవత్సాక్షాత్కారానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు.

ముగింపు :

జీవుల మధ్య అంతరాలకు తావు లేదని ఎవరూ అధికులు కానీ, అధములు కానీ కాదని, చరాచర సృష్టిలోని సకల జీవరాశి ఆ పరమాత్మ స్వరూపమని చాటిన వారు ఒకరైతే, భగవద్భక్తికి, కృపకు, సాక్షాత్కారానికి భక్తి ఒక్కటే మార్గమని, భక్తులెవరైనా భగవంతుని దృష్టిలో సమానులేనని, భగవత్ కృపకు అర్హులేనని, జన్మతో, జాతితో ఎవరూ గొప్పవారు కాదని చాటిన వారు మరొకరు. భక్తికి, తాత్విక చింతనకు, పాండిత్యానికి వైకల్యం అడ్డుకాదని, మనోనేత్రంతో భగవంతుణ్ణి దర్శించవచ్చని చాటిన వారు ఇంకొకరు.

భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత సాధ్యమవుతుందని ఈ ముగ్గురి జీవిత వృత్తాంతాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ముగ్గురి జయంతి అయిన ఈ పుణ్య తిధిలో వారి జీవిత గాథలు మనకందించిన స్ఫూర్తితో సామాజిక సద్భావన, సమరసతా సాధనలో మరో ముందడుగు వేద్దాం. భారత్ మాతాకీ జయ్.

MAY 6 శంకర జయంతి మరియు సంత్ సూరదాస్ జయంతి, MAY7 భగవద్రామానుజుల జయంతి.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భక్తి ద్వారానే సామాజిక సద్భావన, సమరసత appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీపెరంబదూర్‌లో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు
కాంచీపురం: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో మూడు వేల ఏళ్ళ‌ పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్‌ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన‌ట్టు చరిత్ర చెబుతోంది.

చిత్తిరై నెల తిరువాదిరై నక్షత్రం రోజున 1,017వ సంవత్సరం రామానుజాచార్యుల వారు జన్మించారు. ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన శ్రీపెరుంబుదూర్‌లో ఆదికేశవ పెరుమాళ్‌ను పెద్దాయన అని, రామానుజర్‌ను చిన్నాయన అని భక్తులు పిలుచుకోవడం ఆనవాయితీ.

ఈ ఏడాది రామానుజాచార్యుల అవతార బ్రహ్మోత్సవాలు పదిరోజులుగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో జరిగే వేడుకల్లో ప్రధానాంశం ఆదికేశవ పెరుమాళ్‌కు పది రోజుల ఉత్సవం, రామానుజర్‌కు పది రోజులు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. గత నెల 16వ తేది ధ్వజారోహణంతో చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదికేశవ పెరుమాళ్‌కు సింహ వాహనం, గరుడ సేవ, గజ వాహనం, అశ్వ వాహనం, రథోత్సవం చొప్పున పదిరోజుల ఉత్సవాలు గత నెల 25న ముగిశాయి. అనంతరం రామానుజుల వారి 1005వ అవతార బ్రహ్మోత్సవాలు 26 నుంచి ప్రారంభమయ్యాయి. 9వ రోజైన బుధవారం రామానుజుల రథోత్సవం కోలాహలంగా జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీపెరంబదూర్‌లో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భాగ్య‌న‌గ‌రం: వివక్షలకు తావులేని సమ సమాజ నిర్మాణంలో రామానుజుని ఆదర్శాలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని గౌరవ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వారి ఆదర్శాలను యువత అర్థం చేసుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

హైదరాబాద్ ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఉప రాష్ట్రపతి శనివారం సాయంత్రం సందర్శించారు. 1000 సంవత్సరాల క్రితమే అంటరానితనం, వివక్షలకు తావులేని సమాజాన్ని ఆకాంక్షించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన భగవద్రామానుజుల వారు ఆధ్యాత్మికవేత్తగానే గాక, సామాజిక సంస్కరణాభిలాషిగా సమాజంపై చెరగని ముద్ర వేశారని ఆయన కొనియాడారు.

భగవంతుడు అందరివాడు అంటూ శ్రీ రామానుజుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం ప్రపంచానికి నూతన మార్గంలో దిశానిర్దేశం చేసిందన్న ఉప రాష్ట్రపతి, అలాంటి మహనీయుని అతిపెద్ద విగ్రహాన్ని ముచ్చింతల్ లో నెలకొల్పడం వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడమే గాక, వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందజేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమాజానికి దిశానిర్దేశం.. రామానుజుని ఆదర్శాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకమని చెబుతూ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మతామూర్తి రామానుజ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం ప్రవచన మండపంలో భక్తులనుద్దేశించి ప్రసంగీస్తూ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రతిమను దూరం నుంచి చూస్తే ఆత్మకు శాంతి చేకూరుస్తుందని చెప్పారు.

రామానుజాచార్యుడి సమతామూర్తిని దర్శించుకున్న తర్వాత తనలో చైతన్యం పెరిగిందని తెలిపారు. అనేక యుగాల వరకు సనాతన ధర్మ పరిరక్షణకు ఈ రామానుజాచార్యుడి విగ్రహం ప్రేరణ ఇస్తుందని చెబుతూ సనాతన ధర్మంలో జీవుడే సత్యం అన్నది వ్యక్తమవుతుందని పేర్కొన్నారు.

రామాయణ, భారత కాలాలనుంచి నుంచి ఇప్పటివరకు సనాతన ధర్మం ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుందని, సనాతన ధర్మం యాత్ర ఆగిపోదని అమిత్ షా స్పష్టం చేశారు. పైగా, ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందుకు సాగుతున్న చిన్నజీయర్ స్వామికి ఆయన అభినందనలు తెలిపారు.

“నేను జన్మతా వైష్ణవుడిని. ఇంతమంది ఆచార్యులు, సాధు సంతవులు ముందు విశిష్టాద్వైతం గురించి మాట్లడలేను. రామానుజాచార్యుడు గురువు ఆదేశాలను ధిక్కరించి ఆయన బోధించిన అష్టాక్షరి మంత్రాన్ని ప్రజలందరికి వినిపించారు. ఆలయం శిఖరంపైకి ఎక్కి అష్టాక్షరి మంత్రాన్ని సాధారణ ప్రజలకు వినిపించారు” అని పేర్కొన్నారు.

రామానుజాచార్యుడు మధ్యే మార్గం విశిష్టాద్వైతాన్ని సూచిస్తూ.. దేశంలో ఐక్యతను సాధించేందుకు కృషిచేశారని అమిత్ షా కొనియాడారు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉందని రామానుజాచార్యుడి బోధనలు చేశారని అంటూ రామానుజాచార్యుడు రాసిన శ్రీ భాష్యం, వేదాంత సంగ్రహం సహం తొమ్మిది గ్రంథాలు అత్యంత ఆదరణ పొందాయని గుర్తు చేశారు.

ఈ గ్రంథాలు దేశంలోని చాలా గ్రంథాలయాలల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని అంటూ సర్వస్వం భగవంతునికి సమర్పించిన వారికే మోక్షం పొందే హక్కు ఉంటుందని రామానుజాచార్యుడు బోధించారని చెప్పారు. వినమ్రత, సంస్కరణ కోసం చేసే విప్లవం ఇవి రెండు కలిస్తేనే ఉద్ధ‌రణ ప్రక్రియ ఆవిష్కారమవుతుందని తెలిపారు.

దేవాలయాలు, గృహాల్లో పూజ చేయడానికి రామానుజాచార్యుడు విధి విధానాలను నిర్దేశన చేశారని అమిత్‌ షా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షాకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్‌ చేరుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రామానుజాచార్యుని సందేశం స్ఫూర్తిదాయకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

భాగ్య‌న‌గ‌రం: రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ని దివ్యక్షేత్రంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితమివ్వడంతో పాటు 120 కిలోల స్వర్ణ శ్రీమూర్తికి ప్రధాని పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చినజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారని ఆ యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలనే అభిలాషను వ్యక్తం చేశారు. రామానుజాచార్యుల బోధనల్లో ఒకవైపు జ్ఞాన సముపార్జనకు మార్గాలున్నాయనీ.. మరోవైపు భక్తి మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలిపారనీ ప్రధాని చెప్పారు. సన్యాసాన్ని స్వీకరించి సిద్ధి పొందడానికి ఒక పరంపరను సృష్టించిన మహానుభావుడు రామానుజాచార్యుడని తెలిపారు. దేశ ఏకతకు రామానుజాచార్యులు స్ఫూర్తి ఎంతో అవసరమని చెబుతూ సమాజంలో అంతరాలను రామానుజాచార్య వెయ్యేళ్ల క్రితమే తొలగించారని గుర్తు చేసారు.

అందరినీ సమానంగా చూశారని, అనాడే ఆయన ఆదర్శాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని ప్రధాని పేర్కొన్నారు. రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారని, మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారని మోదీ చెప్పారు. రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని ప్రధాని వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రపంచానికి దారి చూపే రామానుజాచార్యుల బోధనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ
చిన జీయర్‌ స్వామి వెల్లడి

భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు చినజీయర్‌ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేయనున్నారు.

‘సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు, ముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమానత్వానికి రామానుజచార్యుల వారు వెయ్యేళ్లపాటు ప్రతీకగా నిలిచారు. ఆయన బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజేప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశాం’ అని చినజీయర్‌ స్వామి తెలిపారు.

కాగా, కూర్చుని ఉన్న పొజిషన్‌లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా సమతా మూర్తి రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్‌లో అతిపెద్ద విగ్రహంగా థాయ్‌ లాండ్‌లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్‌ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాలనూ ఇందులో నిర్మిస్తున్నారు.

Source: Ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సహస్రాబ్ది వేడుకలకు స‌న్నాహాలు
ప‌లువురికి ఆహ్వానాలు

భాగ్య‌న‌గ‌రం: భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని ఆధ్మాత్మిక కేంద్రం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవిని భగవత్ రామానుజాచార్యుల ఆహ్వానించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఆహ్వాన పత్రం అందించారు.

వ‌చ్చే రెండోతేదీ నుంచి 14 వరకు భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయిదోతేదీన‌ ప్రధాని నరేంద్రమోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల ముగింపు రోజైన 14న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరుకానున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మై హోం గ్రూప్‌ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావులు ఈ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానించనున్నారు.

అటు ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం శరవేగంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహస్రాబ్ది ఉత్సవాలు దగ్గరపడుతుండడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఉత్సవాల ప్రారంభానికి ఇంకా 15 రోజులే సమయముంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సహస్రాబ్ది వేడుకలకు స‌న్నాహాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.