RAMACHANDRA GUHA – Vishwa Samvad Kendra Andhra Pradesh

చరిత్రకారుడు కాదు చరిత్ర హీనుడు
చరిత్రకారుడు రామచంద్ర గుహ వ్రాసిన వ్యాసం ( ‘మెజారిటీ వాదం అప్పుడూ ఇప్పుడూ’ – డిసెంబర్ 19, ఆంధ్రజ్యోతి) నిండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పై విద్వేషం మినహా విషయం లేదు. గాంధీ చివరి కార్యదర్శి ప్యారేలాల్ వ్రాసుకున్న ఆత్మకథ ‘మహాత్మా గాంధీ ది లాస్ట్ ఫేజ్’ లో కొన్ని వాక్యాలను గుహ ఉదహరించారు. ‘ సంఘ్ ఒక మతతత్వ, ఫాసిస్టు సంస్థ. హిందూ రాజ్ ను ఏర్పాటు చేయడమే దాని ప్రకటిత లక్ష్యం. ముస్లిములందరినీ భారత్ నుంచి పంపించి వేయాలి అనేది దాని నినాదం’ అని ప్యారేలాల్ వ్రాసుకుంటే దాన్ని గాంధీ అభిప్రాయంగా వ్యాసకర్త ఆపాదిస్తూ సంఘ్ పై తన మనసులో ఉన్న విషాన్నంతా వెళ్లగక్కారు. అప్పుడూ – ఇప్పుడూ మెజారిటీ వాదం అంటూ తన పురోగామి ముసుగులోంచి గుసగుసలు వినిపించిన రామచంద్ర గుహ చరిత్రకారుడు కానేకాదు. చరిత్ర హీనుడు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు విద్రోహం తల పెట్టేందుకు గతం తవ్వాడు. దానిని ఒక మత సంస్థగా చిత్రీకరించేందుకు గుహ చేయని ప్రయత్నం లేదు. ముస్లిములను దేశంలో లేకుండా చేసేందుకు ఆర్ ఎస్ ఎస్ సంకల్పించిందని దీర్ఘాలు తీస్తూనే మధ్యయుగాల ఇస్లాం నుంచి ఆ ఎజెండాను సంఘ్ స్వీకరించిందంటూ వ్యాసకర్త వక్రభాష్యాలు చెప్పాడు. దీన్నిబట్టి ఈ చరిత్రకారుడు అయోమయంలో పడి తన ఎజెండాను అమలు చేయలేకపోయాడని అర్థమవుతోంది. ఆర్ ఎస్ ఎస్ సేవా కార్యక్రమాలను గాంధీ బృందం మెచ్చుకుందని వ్రాసిన గుహ వెనువెంటనే గాంధీ వ్యాఖ్య అంటూ ప్యారేలాల్ పుస్తకం నుంచి ఉటంకించడం పూర్తిగా సంఘ్ కు విద్రోహం తలపెట్టే పనిలా కనిపిస్తోంది.

ఆయన వ్యాఖ్యానించినట్టు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మత సంస్థ కాదు. దానిది మెజారిటీ వాదం అంతకన్నా కాదు. భారతదేశ విధానమైన ‘ భిన్నత్వంలో ఏకత్వం’ నే ఆర్ ఎస్ ఎస్ సమర్ధిస్తోంది. అన్ని మతాల వారితోనూ సుహృద్భావ పూర్వకంగా వ్యవహరిస్తూ సమత, మమత పెంచేలా మత సామరస్యానికి పాటుపడడం సంస్థ లక్ష్యం. అన్ని మతాలను కించపరచడాన్ని తప్పుగా భావిస్తుంది. అన్యమత ప్రచారం చేయకూడదనే లక్ష్యానికి సంఘ్ నాటికీ నేటికీ కట్టుబడి ఉంది. జిహాదీలను ప్రోత్సహించరాదనేది ఆర్ ఎస్ ఎస్ బలమైన వాదన. మేధావుల ముసుగు వేసుకొని హిందూ మతాన్ని కాలగర్భంలో కలిపేయాలనే కుట్రల్ని ఎదిరించి పోరాడేది మత సంస్థ అయితే సంఘ్ ముమ్మాటికీ మత సంస్థే. రాజకీయ సంస్థల ప్రోద్భలంతో చాప కింద నీరులాగా విస్తరించిన హిందూ వ్యతిరేక శక్తులపై అది నిత్యం సైద్ధాంతిక పోరాటం చేస్తూనే ఉంటుంది.

మహాత్మా గాంధీ తన నివాసానికి దగ్గరగా ఉన్నా ఆర్ ఎస్ ఎస్ శాఖను 1947లో సందర్శించారు. అక్కడున్న సంఘ్ కార్యకర్తలతో మమేకమై వారి క్రమశిక్షణ, సేవల గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆర్ ఎస్ ఎస్ ఏకతా స్తోత్రాన్ని తన జీవితానికి అన్వయించుకున్నారు. అది చాలా గొప్పదైన, విలువలతో కూడిన స్తోత్రంగా మహాత్ముడు అభివర్ణించారు. సంఘ్ శాఖ సందర్శన, అక్కడ మహాత్ముడి సంభాషణల సారాంశాన్ని ‘ హరిజన్’ పత్రిక 1947 సెప్టెంబర్ 27 సంచికలో ప్రచురించారు. 1947లో సంఘ్ పై గాంధీ అభిప్రాయాలను స్పష్టంగా హరిజన్ పత్రిక ప్రకటిస్తే, అదే ఏడాది గాంధీ చేసిన వ్యాఖ్యలంటూ, వాటిని తాను విన్నానంటూ ఆయన చివరి కార్యదర్శి ప్యారేలాల్ ఆత్మకథలో వ్రాసుకున్న వాటిని ఉటంకించడం ముమ్మాటికి సందేహించదగ్గవి.

ఆర్ ఎస్ ఎస్ శాఖ సందర్శన సందర్భంగా మహాత్మా గాంధీ మాట్లాడుతూ క్రమశిక్షణతో, కులం, మతం వంటి భేదభావాలు చూడకుండా స్వయంసేవకులు నిర్భీతిగా సేవలు అందిస్తారని కొనియాడారు. 1936 లోనూ వార్ధా లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయానికి వెళ్లిన గాంధీజీ, ‘ స్వదేశీ అనేది ఓ మహత్తర ఆలోచన’ అని ప్రస్తుతించారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం, స్వదేశీ ఆలోచనలకు దగ్గరగా నేడు ఆర్ఎస్ఎస్ చేపడుతున్న స్వదేశీ మంచ్ ఉంది. సంఘ్ ప్రార్ధనలు భరతమాత గొప్పతనం, హిందూ సంస్కృతి సంప్రదాయాల పట్ల మరింత గౌరవం పెంచేలా ఉన్నాయని మహాత్ముడు మెచ్చుకున్నారు. సంఘ్ సేవాభావం, దేశం కోసం చేస్తున్న త్యాగాలను బాపూజీ కొనియాడారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఇటువంటి సంస్థలు మాత్రమే దేశ సంక్షేమానికి పాటుపడే బలమైన శక్తులుగా ఎదుగుతాయని అభిప్రాయపడ్డారు. మహాత్ముడి ఆత్మలా సంఘ్ కార్యకలాపాలు కొనసాగేవి. ఆయన చివరి వరకూ సంఘ్ తో సుహృద్భావ స్నేహాన్ని కొనసాగించారు. ఆర్ ఎస్ ఎస్ ఆరంభమైన నాటి నుంచి నిరాఘాటంగా సాగిన కార్యక్రమాలు 1948లో మహాత్మా గాంధీ మరణించిన తర్వాత వారం రోజులు నిలిపివేశారంటే ఆయనకు ఎంత విలువనిచ్చేవారో అర్థం అవుతోంది. మహాత్మా గాంధీ మరణించిన తరువాత సంఘ్ ను కొన్ని నెలలపాటు నిషేధించారు. ఆయన హత్య కేసు విచారణ సందర్భంగా గాడ్సేకి, ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఎటువంటి సంబంధం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాదోపవాదాలు విన్న తర్వాత గాంధీపై గాడ్సే పెంచుకున్న ద్వేషం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అనే అభిప్రాయానికి వచ్చిన న్యాయస్థానం సంఘ్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. మహాత్ముడి ఆశయాల మాదిరిగానే సంఘ్ భారతదేశ ఆత్మగా దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంటుంది.

– వి. జయప్రకాశ్ నారాయణ

(చైర్మన్, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్)

ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చరిత్రకారుడు కాదు చరిత్ర హీనుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.