RAFAEL – Vishwa Samvad Kendra Andhra Pradesh

2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా
భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్ పరేడ్‌(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్‌ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్‌ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు పక్షాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో చైనా బలగాల మోహరింపుపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.

భారత ప్రభుత్వం 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.59 వేల కోట్లు. కొనుగోలు చేసిన మొత్తం రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 2022, ఏప్రిల్‌ నాటికి వాయుసేనకు అప్పగిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఫిబ్రవరిలో తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 2022 నాటికి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు – ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆర్కేయస్‌ బదౌరియా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రఫెల్ రాకతో చైనా గుండెల్లో గుబులు
చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్ ‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వీటి రాకతో చైనా ఆందోళనకు గురవుతోంది. రఫెల్ రాకతో చైనా ఆందోళన చెందడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి కూడా స్పష్టంచేశారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్‌ పేర్కొన్నారు.

‘ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనికాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమౌతాయనే అశిస్తున్నాం. కానీ, ఒకవేళ కొత్త పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైనన్ని బలగాలను రంగంలోకి దించాం’ అని భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సరిహద్దు ప్రాంతంలో చైనా, బలగాలను తగ్గించుకున్నప్పటికీ, ఇతర చర్యల ద్వారా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా J-20 యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. వాటికి అనుగుణంగానే భారత్‌ కూడా వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతూ ఉన్నదన్నారు. ఈ సందర్భంగా రఫేల్‌ రాక చైనాలో ఆందోళనకు కారణమయ్యిందా? అనే ప్రశ్నకు భారత వైమానిక దళాధిపతి ఖచ్చితంగా అవుననే సమాధానమిచ్చారు.

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ రఫేల్‌ యుద్ధవిమానాల సంఖ్య భారత్‌లో 11కి చేరింది. మొత్తం 36 రఫేల్‌ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దఫాలో ఐదు, తర్వాత మూడు, మరో దఫాలో మూడు చేరుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 11 రఫేల్‌ విమానాలను భారత్ ‌కు అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రఫెల్ రాకతో చైనా గుండెల్లో గుబులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మన రఫేల్‌ల సమీపంలో క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌ : దాడి యత్నమా?
ఫ్రాన్స్‌ నుంచి రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన రఫేల్‌ విమానాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ దాఫ్రా విమానాశ్రయానికి చేరుకొన్నాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్‌ బేస్‌పై క్షిపణి దాడిని వెల్లడించే అత్యవసర సైరన్‌ మోగింది. అదే సమయంలో ఖతర్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్‌ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఇరాన్‌ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్‌ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్‌ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్లు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వెల్లడించారు. కాగా “రఫెల్ విమానాలపై ఇరాన్ దాడికి యత్నించిందా?” అని కూడా కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.

భారత్ చేరుకున్న రఫెల్ విమానాలు :

మొత్తానికి ప్రతిష్ఠాత్మకమైన రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా దిగాయి. అబుదాబి అల్‌ దఫ్రా వైమానిక స్థావరం నుంచి ఐదు రఫేల్‌ విమానాలు భారత్‌కు వచ్చాయి. 17వ వైమానిక స్క్వాడ్రన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఆగస్టు రెండో విడత భారత్‌కు మరికొన్ని రఫేల్‌ యుద్ధ విమానాలు రానున్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో రఫేల్‌కు స్థానముంది. అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా రక్షణశాఖ పరిగణిస్తోంది. ఏవియానిక్స్‌, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన రఫేల్‌ విమానం దక్షిణ ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన విమానం కావడం విశేషం.

ఇది నవశకానికి నాంది : రక్షణ మంత్రి

రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లు భారత్‌కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు సురక్షితంగా చేరాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ జెట్‌ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విమానాలు అందజేసిన ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి రాజ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. డసాల్ట్‌ ఏవియేషన్‌, ఫ్రెంచ్‌ కంపెనీలు సమయానికి విమానాలు చేరవేశాయని అభినందించారు.

ఈ విమానాలు మంచి పనితీరు కలిగి ఉన్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు. అలాగే, దానిలోని ఆయుధాలు, రాడార్లు, ఇతర సెన్సార్లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవన్నారు. ఈ ఫైటర్‌జెట్‌ల రాకతో దేశానికి ఎదురయ్యే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు దేశీయ వైమానిక సామర్థ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. భారత వైమానిక దళం అవసరాలను పూర్తిగా తీర్చేందుకే వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ జెట్‌ల కొనుగోళ్లపై వచ్చిన నిరాధార ఆరోపణలపై ఇప్పటికే సమాధానం చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ మేరకు రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్‌ అయిన వీడియోను ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మన రఫేల్‌ల సమీపంలో క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌ : దాడి యత్నమా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ నుంచి నేడు రఫెల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫెల్ యుద్ద విమానాలు రానున్నాయి. ఫ్రాన్స్‌లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఇవి భారత్‌కు బయలుదేరాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గం.లకు టేకాఫ్‌ అయిన యుద్ధ విమానాలు .. బుధవారం అంబాలా వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. మార్గ మధ్యంలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద ఆగనున్నాయి. తొలిదశ 5 విమానాలలో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు వైమానికాధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఫ్రాన్స్ నుంచి భారత్ కు బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.