PRADHAN MANTRI UJJWALA YOJANA – Vishwa Samvad Kendra Andhra Pradesh

పేదల జీవితాలు మార్చనున్న ఉజ్వల 2.0… ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ప్రధాని…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించడం కోసం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉజ్వల స్కీమ్ ‌ను 2016లో ప్రారంభించింది. దాదాపు ఐదు కోట్ల బీపీఎల్‌ కుటుంబాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం 2018లో పథకాన్ని మరో ఏడు వర్గాలకు వర్తింపజేస్తూ ఈ లక్ష్యాన్ని ఎనిమిది కోట్లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి ఏడు నెలల ముందుగానే అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అధిగమించింది.

కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ‌లో పీఎంయూవై పథకం కింద అదనంగా కోటి గ్యాస్‌ కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. తొలి దశలో ఎల్‌పీజీ అందుకోలేకపోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా.. ఉజ్వల స్కీమ్ ‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస పత్రాలు అవసరం కాగా.. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్ ‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనున్నట్లు కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ అదనపు గ్యాస్ కనెక్షన్లను మొదటి దశ కింద కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పేదల జీవితాలు మార్చనున్న ఉజ్వల 2.0… ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ప్రధాని… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.