POK – Vishwa Samvad Kendra Andhra Pradesh

పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి గతంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది…
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విషయంలో 1971లో భారత్‌-పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కంగ్రా జిల్లాలోని బదోలిలో అమరవీరుల కుటుంబాల సంత్కరించుకునే కార్యక్రమం వేదికగా పీవోకేపై మాట్లాడారు రాజ్‌నాథ్. ‘1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకొని స్వర్ణోత్సవ వేడుకలను ఇటీవలే ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యుద్ధం చరిత్రలో గుర్తుండిపోతుంది. ఇది ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదు, మానవత్వం కోసం పోరాడి ప్రత్యర్థిపై విజయం సాధించాం. కానీ, ఒకింత బాధగా కూడా ఉంది. పీవోకే అంశంలో అప్పట్లోనే నిర్ణయం తీసుకోవాల్సింది.’ అని పేర్కొన్నారు రాజ్‌నాథ్‌. అనంతరం హమిర్‌పుర్‌ జిల్లాలోని నదౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాలుపంచుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి గతంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు
క‌శ్మీర్‌: పవర్ కట్‌లు, సర్‌చార్జీలపై నిరసన వ్యక్తంచేస్తూ ధర్నా చేపడదామని కశ్మీరీ జాతీయవాద పార్టీలు జులై 25న పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

విద్యుత్ బిల్లులలో కొన్ని పన్నులను అదనంగా కలిపి తమ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని, విద్యుత్ కోతలు కూడా పెరిగాయని నిరసనకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఇక్కడి వారికి ఎలాంటి ప్రయోజనాలూ దక్కడం లేదని నిరసనకారులు అంటున్నారు.

ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. హింసాత్మక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ తర్వాత 20 మందిని అరెస్టు చేశారు.

ఆందోళనకారులను అరెస్టు చేయడంతో నిరసనలు మరింత హింసాత్మకంగా మారాయి. లాయర్లు, వ్యాపారులు, రవాణా సంఘాలు, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నిరసనకారులకు మద్దతు ప్రకటించాయి.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని ప్రజల భవిష్యత్‌పై ఆందోళనే ఈ నిరసనలకు మూలమనే విశ్లేషణలు వస్తున్నాయి.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు రాజ్యాంగానికి సవరణ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి.

2018లో ఆర్థిక, పరిపాలన అంశాల్లో ముజఫరాబాద్‌కు పాకిస్తాన్ స్వయంప్రతిపత్తి ఇచ్చింది. అంతకుమందు ‘‘ఆజాద్ జమ్మూకశ్మీర్ కౌన్సిల్’’ నియంత్రణలో ఈ ప్రాంతం ఉండేది. ఈ కౌన్సిల్‌కు పాకిస్తాన్ ప్రధాన మంత్రే అధిపతి. పన్నుల సేకరణ, పర్యటకం, సహజ వనరులు తరదితర విభాగాలపై పరిపాలనా ఆధిపత్యం ఈ కౌన్సిల్‌కు ఉండేది.

అయితే, 2018లో తీసుకొచ్చిన మార్పులను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇక్కడి కశ్మీరీలు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌లో పాకిస్తాన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనధికారిక బంకర్లు నిర్మిస్తున్న చైనా
* పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా చైనా నిర్మాణాలు… హెచ్చరించిన భారత్

భారత్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదో రకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్‌ ఆర్మీ కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్ ‌(పీఓకే), బలోచిస్థాన్‌, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్ ‌(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్‌ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్‌ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది.

నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్ ‌గా పిలుస్తారు. కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్‌, బలోచిస్థాన్‌ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రాణికోట్‌, నవాబ్‌షా, ఖుజ్దార్‌ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.

అయితే.. పాకిస్థాన్‌ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్‌ ప్రాజెక్ట్‌ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్‌ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్‌ ద్వారా సింకియాంగ్ ‌ను గ్వాదర్ పోర్ట్ ‌తో అనుసంధానించాలని భావించారు. అయితే అది అక్కడికి చాలా దూరంలో ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అనధికారిక బంకర్లు నిర్మిస్తున్న చైనా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా
జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని భద్రతాదళాలు సమర్ధంగా అణచివేస్తున్నాయి. అయితే, సరిహద్దు రేఖ వెంబడి పేలుడు పదార్థాలు మనదేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రాడార్ల కళ్లుగప్పి, డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు దేశంలోకి చేరుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో స్థానిక పోలీసులు, పారా మిలిటరీ దళాలు, ఆర్మీ కలిసి పలువురు తీవ్రవాదుల్ని అంతమొందించినప్పటికీ, లష్కర్-ఇ-తయిబా, జైష్-ఇ-మొహమ్మద్ గ్రూప్‌లకు చెందిన తీవ్రవాదులు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పేలుడు పదార్థాలు సరిహద్దు దాటి రాకూడదంటే, యాంటీ డ్రోన్ ఎక్విప్‌మెంట్ సైన్యానికి అవసరం. అమిత్ షా వీటన్నింటిపై చర్చిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, శ్రీనగర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు వైమానిక స్థావరాలను తిరిగి తెరిచింది. కోట్లి మరియు రావల్ ‌కోట్‌లోని ఎయిర్ ‌బేస్‌లు, నియంత్రణ రేఖకు (ఎల్‌ఓసి) దగ్గరగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) లో ఉన్నాయి రెండూ. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి మూతపడి ఉన్నాయి. ఈ రెండు ఎయిర్ ‌బేస్‌లు శ్రీనగర్ ‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మెరుపు దాడి చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో చాలా కాలంగా వినియోగంలో లేని రెండు ఎయిర్ ‌బేస్ ‌లను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తిరిగి తెరిచినట్లు సమాచారం.

ఎల్‌ఓసి కి దగ్గరగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సౌకర్యాల పునః ప్రారంభం గురించి భారత సైన్యం దగ్గర కూడా సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. బలూచిస్థాన్‌లోని షమ్సీలో స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం పాక్ పావులు కదుపుతోంది. సింధులోని జాకబాబాద్‌లోని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరం సమీపంలో ఒక కొత్త ఆర్మీ కంటోన్మెంట్ నిర్మాణం చేయడం, ఉద్రిక్తతలకు కారణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పాక్ ఆర్మీ 23వ డివిజన్‌లో భాగమైన 3 POK బ్రిగేడ్ ప్రాంతంలో కోట్లీ ఎయిర్ బేస్ ఉన్నది. ఇటీవల వందకు పైగా వాయు రక్షణ దళాలను ఇక్కడకు తరలించారు. రావల్ ‌కోట్ ఎయిర్ బేస్, పాక్‌ ఆర్మీ 12 డివిజన్ ‌కు చెందిన 2 POK బ్రిగేడ్ కిందకు ఇది వస్తుంది. నాలుగేళ్ల కిందట మూసివేసిన ఈ ఎయిర్ బేస్ ‌ను పీఏఎఫ్‌ తిరిగి తెరిచింది. ఎఫ్‌-16 యుద్ధ విమానాలను స్వల్ప సంఖ్యలో మోహరించింది. బలూచిస్థాన్‌లోని షమ్సీ ఎయిర్‌ బేస్ ‌ను పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (పీఏఎఫ్‌) బలోపేతం చేస్తున్నది. సింధులోని జాకబాబాద్‌ పీఏఎఫ్‌ స్థావరం సమీపంలో కొత్త సైనిక కంటోన్‌మెంట్ ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ చర్యలు ఈ ప్రాంతంలో అశాంతిని రాజేయడంతోపాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోట్లీ ఎయిర్-బేస్ కు వందకు పైగా వాయు రక్షణ దళాలు తరలించబడ్డాయి.

Source : Nationalist Hub.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీనగర్ కు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్
ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్‌ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యాధిపతి జనరల్‌ భజ్వా, అత్యంత సన్నిహితులైన కమాండర్లకు బాధ్యతలను అప్పగించారు. పీవోకేలో పట్టు పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక పరంగా ఎంతో ఖర్చు చేస్తున్న పాకిస్థాన్‌.. అక్కడి ప్రజల బాగోగుల్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భారత్‌ను నిలువరించడమే ధ్యేయంగా పాక్‌ సైన్యం నిరంతరం అక్కడ పనిచేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర వాద శిబిరాలను సైతం నిర్వహిస్తోంది. అభివృద్ధి ఊసే ఎరుగని అక్కడి ప్రజలకు ఇది ఏమాత్రం రుచించడంలేదు. ప్రతి శుక్రవారం ఆ ప్రాంతంలో ప్రజలు ప్రార్థనల తర్వాత పాకిస్థాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. పాకిస్థాన్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటారు. దీంతో వారిని ఎదుర్కోవడం పాక్‌ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో పీవోకే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ముందుగా అక్కడి ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పాక్‌ సైన్యాధిపతి జనరల్‌ భజ్వాతో కలిసి ప్రణాళికలు రచించారు. పీవోకే ప్రజలను బుజ్జగించాలని, వారిని పాక్‌కు మిత్రులుగా మార్చాలనేది వారి ప్రణాళిక. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. పాక్‌ ప్రధాని ప్రణాళిక ప్రకారం ఇప్పుడు పీవోకేలో నీలమ్‌ వ్యాలీ, లీపా వ్యాలీ, ముజఫరాబాద్‌, మురీద్‌కే, కోట్లీ, రావల్‌కోట్‌ తదితర ప్రాంతాల్లో ఆ దేశ సైన్యం ప్రత్యేక మిషన్‌ చేపట్టింది.

ఈ మిషన్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సైనికులు వెళ్తున్నారు. పాకిస్థాన్‌ పట్ల అక్కడి జనంలో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం పాక్‌ వ్యతిరేక నిరసనలు చేయొద్దని నచ్చజెబుతున్నారు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో 33,498 మందికి నెలకు రూ.1546 చొప్పున సాయాన్ని పాకిస్థాన్‌ ప్రభుత్వం అందిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పీవోకే ప్రజల్ని బుజ్జగించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు అనుకూలంగా పీవోకే ప్రజలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీవోకేలో భారీ కుట్రకు తెరదీసిన పాక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం
చలికాలం తీవ్రం కాకముందే భారత్‌లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్‌ సైన్యం చేస్తున్న దుష్ట ప్రయత్నాలకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని అనుమానిత ఉగ్రవాద శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తూ, పొరుగు దేశానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. దిల్లీలోని ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఒకపక్క జమ్మూ-కశ్మీర్‌లో కల్లోలం రేపడం, యువతకు ఆయుధాలు అందించడం వంటివి చేస్తూనే.. మరోపక్క తన ప్రమేయం ఎక్కడా బయటపడకుండా చూసుకునేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని తెలిపాయి. తన భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఎత్తులు వేస్తోందని సంబంధిత అధికారులు చెప్పారు. కొన్ని వారాలుగా పాక్‌ సైన్యం.. నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోందని వివరించారు. ఇదంతా జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు మార్గం సుగమం చేయడానికేనని తెలిపారు. ఈ ఏడాది పాక్‌ కాల్పుల్లో 21 మంది పౌరులు చనిపోయారని చెప్పారు. గత ఏడాది 18 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ”ఉగ్రవాదం విషయంలో తన ఆదేశాలను ఉల్లంఘిస్తే వినాశనం తప్పదన్న సందేశాన్ని భారత సరిహద్దు గ్రామాలవారికి అందించేందుకే ఇలాంటి చర్యలకు పాక్‌ పాల్పడుతోంది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిఘా వర్గాల సమాచారం ఆధారంగా భారత సైన్యం ప్రతిదాడులకు దిగుతోందని అధికారులు తెలిపారు. పాక్, విదేశీ ముష్కరులను అంతమొందించడమే వీటి లక్ష్యమని పేర్కొన్నారు.

గత శుక్రవారం ఉత్తర కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి అనేక ప్రాంతాలపై పాక్‌ భారీగా కాల్పులకు దిగడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది, పలువురు పౌరులు చనిపోయారు. దీనికి ప్రతిగా ట్యాంకు విధ్వంసక క్షిపణులు, శతఘ్నులతో భారత సైనికులు జరిపిన దాడిలో 8 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. 12 మంది గాయపడ్డారు. గత ఏడాది పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడి చేసినప్పటి నుంచి ముష్కర శిక్షణ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను పాక్‌ ఏర్పాటు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గురువారం నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కాల్పులకు దిగడం కానీ, తాము ప్రతిచర్యకు పూనుకోవడం కానీ జరగలేదని భారత సైన్యం వివరణ ఇచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద స్థావరాలపై గురి చూసి దెబ్బ కొడుతున్న భారత సైన్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

POK లో భారత్ వాతావరణ సూచనలు
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆధిపత్యం సాధించే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట పీవోకే ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ సూచనలు జారీ చేయనుంది. గతంలో పలు కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో ఐఎండీ వాతావరణ సూచనలు నిలిపివేసింది.

తాజాగా పాక్‌ ఆధీనంలో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్తాన్‌, ముజఫరాబాద్‌లలో మే 5 తేదీ నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని ప్రాంతీయ వాతావరణ విభాగం (ఆర్‌ఎండీ) ఆధ్వర్యంలో వాతావరణ మార్పులకు సంబంధించి సూచనలు జారీ చేయనున్నట్లు ఆర్‌ఎండీ హెడ్ కుల్‌దీప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇదే విషయాన్ని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్ ఎమ్.మహపాత్ర స్పష్టం చేస్తూ, ఆ ప్రాంతాలను జమ్మూ-కశ్మీర్‌ సబ్‌ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నట్లు తెలిపారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, గిల్గిట్‌-బాల్టిస్తాన్‌లు తమ దేశంలో భాగమని, వాటిని ఎప్పటికీ తమ నుంచి వేరుచేయలేరని ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఇదే విషయాన్ని పాక్‌కు స్పష్టం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం పాక్‌ ఆక్రమిత ప్రాంతాల్లో కూడా వాతారణ సూచనలు చేయాలని ఐఎండీకి సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post POK లో భారత్ వాతావరణ సూచనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ‘గిల్గిట్‌ బాల్టిస్థాన్‌’ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్‌)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా పాక్‌కు స్పష్టం చేసింది.

గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లో వచ్చే సెప్టెంబరులో సాధారణ ఎన్నికలు నిర్వహించుకునేందుకు పాక్‌ కోర్టు గతవారం అనుమతినిచ్చింది. ఈ మేరకు 2018 నాటి ఆదేశాల్లో సవరణలకు మార్గం సుగమం చేసింది. అలాగే అక్కడ ప్రస్తుతానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో స్పందించిన భారత విదేశాంగ శాఖ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎలాంటి మార్పులను భారత్‌ సహించబోదని తేల్చి చెప్పింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌తో పాటు గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతాలు చట్టబద్ధంగా పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని గుర్తుచేసింది.

పాకిస్థాన్‌ ప్రభుత్వానికి గానీ, అక్కడి న్యాయవ్యవస్థకు గానీ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో జోక్యం చేసుకునే అర్హత, అధికారం లేవని భారత్‌ తేల్చి చెప్పింది. ఈ ప్రాంతంలో భౌతిక మార్పులకు తరచూ యత్నిస్తున్న పాక్‌ చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాంతంపై భారత ప్రభుత్వ వైఖరి 1994లో పార్లమెంటు చేసిన తీర్మానం ద్వారా తెలియజేశామని గుర్తుచేసింది. ఆక్రమిత కశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించుకున్న విషయాన్ని, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రజల స్వేచ్ఛను హరిస్తున్న విషయాల్ని పాక్‌ ప్రభుత్వం తాజా చర్యలతో కప్పిపుచ్చలేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.