#PM MODI – Vishwa Samvad Kendra Andhra Pradesh

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు.

‘‘భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్‌లో చోటు దక్కించుకున్నాయి’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో వెల్లడించారు.

దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’’ అని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

యుద్ధరంగంలో సోదరులు, గురువులు, బంధు జనులందరినీ చూసి ధనుర్బాణాలు విడిచి చతికిల పడిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ- భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మనుషులు ప్రవర్తించవలసిన తీరు, పారలౌకికాన్ని పొందే తెన్నూ రెండింటినీ శ్రీకృష్ణుడు బోధించాడు.

The post భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్‌ సదస్సు ఇందుకు వేదిక అయ్యింది.  ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.

ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్‌ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు.

వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్‌కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్‌ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా అక్కడే ఉన్నారు.

ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్‌ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్‌ యూనస్‌ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు.

.. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్‌. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు.  దీంతో బిమ్‌స్టెక్‌లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్‌ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశవ్యాప్త ఆందోళనలతో షేక్‌ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్‌కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్‌ నొక్కి చెప్పింది.

The post ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌
వివాదాస్పద వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లు (Waqf Amendment Bill)ను ఆమోదించాయి. దీనిపై తాజాగా ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ఇదో చరిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన.. తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం బిమ్‌స్టెక్‌ సదస్సు నిమిత్తం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దీనిపై ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘వక్ఫ్‌ సవరణ బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం ఓ చరిత్రాత్మక మలుపు. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం మన సమష్టి అన్వేషణలో ఓ కీలక ఘట్టం. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంట్‌ సభ్యులకు కృతజ్ఞతలు. ఇందులో సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్‌ వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయి. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదం లభించడంతో వారి హక్కులకు భద్రత లభించినట్లయ్యింది. ఈ బిల్లుతో ఇప్పుడు సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన, సమ్మిళిత భారత్‌ను కలిసి నిర్మిద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

సుదీర్ఘ చర్చ తర్వాత బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్‌ బిల్లు, ‘ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లు’కు.. గురువారం రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక, రాష్ట్రపతి సంతకం కోసం ఈ బిల్లులను ప్రభుత్వం పంపించనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది. వక్ఫ్‌ బిల్లు పేరును…యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లుగా (ఉమీద్‌-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.

The post వక్ఫ్‌ బిల్లుకు ఆమోదం.. చరిత్రాత్మక మలుపు: ప్రధాని మోదీ పోస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అండమాన్ దీవులకు 21 మంది పరమవీరచక్ర విజేతల పేర్లు!
అండమాన్‌ ద్వీపంలోని 21 దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పరాక్రమ్ దివస్ సందర్భంగా పరమవీర చక్ర విజేతల పేర్లు పెట్టారు. ఈ సందర్బంగా ప్రధాని ప్రసంగిస్తూ.. తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భూమి ఇదే అని గుర్తు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా ప్రారంభించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి 23న పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటారు.

అండమాన్ , నికోబార్ దీవులలోని అతిపెద్ద ద్వీపానికి మొదటి పరమవీర చక్ర విజేత పేరు పెట్టారు. అదేవిధంగా ఇతర ద్వీపాలకు వాటి పరిమాణాన్ని బట్టి పేర్లు పెట్టారు. ఈ పేర్లు పరమవీర్ చక్ర విజేతలు, మేజర్ సోమనాథ్ శర్మ, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పీరు సింగ్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే పేర్లను పెట్టారు.

The post అండమాన్ దీవులకు 21 మంది పరమవీరచక్ర విజేతల పేర్లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు
భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా ఉన్న మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలను మాత్రం తమ దేశం భాగస్వాములుగా చూసిందని చెప్పారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశం దక్షిణాసియా సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం వెళ్లానని, ఇరుదేశాల మధ్య శాంతి, సమన్వయం కోసం పనిచేశానని, ప్రస్తుతంతో పోల్చుకుంటే అప్పట్లో వాతావరణమే బాగుండేదని చెప్పారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాఠాలు నేర్చుకున్నామని, పొరుగు దేశం (భారత్)తో శాంతిని తాను కోరుకుంటున్నానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హినా రబ్బానీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్లో రాజనీతిజ్ఞత కొరవడింది..

”మూడేళ్లలో మనం చేసిందేమిటి? శత్రుత్వం పెంచుకుంటూ వచ్చాం. భౌగోళికతను (జియోగ్రఫీ)ని మనం మార్చలేమనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది దక్షిణాసియా సమస్య కాదు, భారత్-పాకిస్థా్న్ మధ్య ఉన్న సమస్య. భారత్ వైపు నుంచే సమస్య ఉంది. అక్కడ రాజనీతిజ్ఞత కొరవడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత దేశానికి మంచే కావచ్చు, కానీ ఆయనను పాక్ భాగస్వామిగా చూడటం లేదు” అని హినా రబ్బీనీ తన ప్రసంగంలో వివరించారు.

శాంతి కోసం ఆలోచించాలి…

ఎన్నికల కోణంలో ప్రతి విషయాన్ని చూడకుండా శాంతి కోసం ఆలోచించాలని భారత్‌కు హినా రబ్బానీ సూచించారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలని పాక్ కోరుకుంటోందని, భారత్‌తో ఒకప్పుడు అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేసేవారని, అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగేలా ఇప్పుడు కనబడటం లేదని తప్పుపట్టారు. అలాగని పాకిస్థాన్‌లో ఎలాంటి సమస్యలు లేవని తాను చెప్పడం లేదని, అయితే మైనారిటీల రక్షణకు తమ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని, ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టాలను తీసుకువచ్చి మైనారిటీలకు రక్షణ కల్పిసున్నామని చెప్పారు.

The post మోదీని పాక్‌ భాగస్వామిగా చూడలేం – పాక్‌ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వైరల్‌.. ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అందులో ఏముందంటే?
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతిపాలు చేసే కథనాన్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యుమెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది.

డాక్యుమెంటరీలో ఏముందంటే..

బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెబుతూ.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ… 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.

ఈ నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని బాగ్చి అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నారు.

ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.

The post మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వైరల్‌.. ఆగ్రహించిన కేంద్ర ప్రభుత్వం.. అందులో ఏముందంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన
దేశంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఒక క్రీడా ఈవెంట్‌ను ప్రారంభించిన సందర్భరంలో వ్యాఖ్యానించారు. క్రీడాకారులను తమ ఆహారంలో మిల్లెట్‌ను చేర్చుకోవాలని కోరారు. ఒకప్పుడు క్రీడలను కాలయాపన చేసే సాధనంగా భావించేవారని, అందుకే ఆటలు ముఖ్యం కాదనే మనస్తత్వం వేళ్లూనుకున్నదని, ఫలితంగా చాలా మంది ప్రతిభావంతులు క్రీడా మైదానాలకు దూరంగా ఉన్నారని ప్రధాని అన్నారు. అయితే గత ఎనిమిదేళ్లలో దేశం ఈ పాత ఆలోచనను వదిలివేసింది. క్రీడలకు మెరుగైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేశామని, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు, యువకులు క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నారని అన్నారు.

క్రీడాకారులు ఫిట్‌గా ఉండేందుకు యోగాను తమ దైనందిన జీవితంలో చేర్చుకోవాలని సూచించారు. ప్రతి క్రీడాకారుడికి తాను ఫిట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసని మరియు ‘ఫిట్ ఇండియా ఉద్యమం’ ఇందులో తన పాత్రను కలిగి ఉందని అన్నారు. ఫిట్‌నెస్ కోసం, ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను చేర్చుకోవాలని సూచంచారు. అది వారిని ఆరోగ్యవంతంగా చేస్తుందని.. మనస్సును అప్రమత్తంగా ఉంచడంలో సహాయపడుతుందని బస్తీలో ‘సంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23’ రెండవ దశను ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇందులో భాగంగా మొదటి దశ పోటీ డిసెంబర్ 10 నుండి 16, 2022 వరకు నిర్వహించబడింది. బుధవారం ప్రారంభమైన రెండవ దశ జనవరి 28 వరకు కొనసాగుతుంది.

ఆడపిల్లలు క్రీడల్లో బాగా రాణిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. మహిళల అండర్-19, T-20లో షెఫాలీ వర్మ ఒక ఓవర్‌లో ఐదు ఫోర్లు మరియు ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేయడం గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం అన్ని స్థాయిలలో క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి.. ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందని అన్నారు. ప్రస్తుతం దేశంలో 2,500 మందికి పైగా అథ్లెట్లకు ‘ఖేలో ఇండియా’ క్యాంపెయిన్ కింద ప్రతి నెలా రూ.50,000 కంటే ఎక్కువ ఇస్తున్నారని చెప్పారు.

The post క్రీడాకారులు ఫిట్‌నెస్‌ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులు, చర్చిలకు వెళ్లాలని బీజేసీ నాయకులకు ప్రధాని మోదీ సూచన.. ఆయన ఉద్దేశం అదేనా?
ప్రధాని నరేంద్ర మోదీ మైనారిటీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పాటు దిల్లోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మసీదులకు వెళ్లి ముస్లింలను కలుసుకోవాలని.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని బిజెపి నాయకులకు సూచించారు. చర్చిలకు వెళ్లి క్రైస్తవులను కలుసుకోవాలని బిజెపి నాయకులకు ప్రధాని సూచించారు. ముస్లింలు, క్రైస్తవులు ఓట్లు వేసినా, వేయకున్నా … వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని వాళ్ళని నిరంతరం కలుస్తూ ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానమైన సబ్కా సాత్.. సబ్కా వికాస్… నినాదాన్ని మైనారిటీలలో… విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులకు ప్రధాని సూచించారు.

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2024లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని మైనారిటీ ఓట్లపై ఫోకస్ చేయాలని బిజెపి నేతలకు సూచించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి బిజెపికి అధికారం అందించాలని మోడీ తలపోస్తున్నారు. ఉత్తరాది దక్షిణాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బిజెపి గత ఎన్నికల్లో గెలుచుకోలేకపోయిన ఎంపి స్థానాలను ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

గత రెండు పర్యాయాల్లో మైనారిటీల ఓట్లు బిజెపికి పెద్దగా పడలేదు… దీంతో బీజేపీకి, మైనారిటీలకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించడానికి బిజెపి ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది… ఇందుకోసం బిజెపి నాయకులే స్వయంగా మసీదులకు చర్చలకు గురుద్వారాలకు ఇలా వివిధ ప్రార్ధనా స్థలాలకు వెళ్లి మైనారిటీ నాయకులను, మైనారిటీలను పెద్ద ఎత్తున కలుసుకోవడం ద్వారా బిజెపికి మైనారిటీలకు మధ్య ఉన్న దూరాన్ని తొలగించాలని బీజేపీ యత్నిస్తోంది… గ్యాప్ తొలగిపోవడం ద్వారా మైనారిటీలు బిజెపికి దగ్గరవుతారని మోడీ యోచిస్తున్నారు.

మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని ఇప్పటికే బీజేపీ నాయకులకు సూచించారు. మైనారిటీలకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడాలని కమలనాధులకు మోడీ సూచించారు. మోడీ సూచించినట్లుగా బిజెపి నాయకులు మైనారిటీలకు దగ్గర అయితే కమలం పంట పండినట్లేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

The post మసీదులు, చర్చిలకు వెళ్లాలని బీజేసీ నాయకులకు ప్రధాని మోదీ సూచన.. ఆయన ఉద్దేశం అదేనా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!
‘దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి… ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను పూర్తిగా సిద్ధం చేయడమే కాకుండా, అన్ని మతాలు, వర్గాల ప్రజలను కలవాలని, విశ్వవిద్యాలయాలు, చర్చిలను సందర్శించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత దేశపు అత్యుత్తమ శకం రాబోతోందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం అంకితమివ్వాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇది స్వర్ణయుగమని, ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోందని చెబుతూ ఇప్పటికైనా ఏమీ చేయకపోతే చరిత్ర క్షమించదని ప్రధాని హెచ్చరించారు. ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ మనం ప్రతిపక్షంలో ఉన్నామని భావిస్తున్నారని పేర్కొంటూ వారు తమ భాషలో సంయమనంతో కూడిన పదాలను ఉపయోగించాలని ప్రధాని మోదీ హితవు చెప్పారు.

‘‘సమాజంలో ప్రతి వర్గానికి చేరువకండి. ఎన్నికలతో పని లేకుండా బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు వంటి మైనారిటీలకు చేరువ అవ్వాలని.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నించాలి. ఈ పనులను ఓటు బ్యాంకు కోసం చేయకూడదు. అందరి కోసం పని చేయాలన్నదే మన ఉద్దేశం అయి ఉండాలి’’ అని మోదీ చెప్పారు.

ప్రస్తుతం 18-25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు సూచించారు. వారికి చరిత్ర గురించి ఎక్కువగా తెలియదని, అలాగే గత ప్రభుత్వాలు ఏం చేశాయో కూడా వారికి తెలియదని ప్రధాని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించి సుపరిపాలనలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నించాలని బీజేపీ నేతలకు ప్రధాని సూచించారు.

ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తమకు చెప్పారని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవాలని ప్రధాని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

బీజేపీకి పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉందని పేర్కొంటూ కానీ ఆ సభ్యుల సదస్సులు నిర్వహించదని పేర్కొంటూ ప్రతి జిల్లాలో వారి కోసం ఒక సదస్సు ఉండాలని, దాని కోసం పార్టీ కృషి చేయాలని సూచించారు. మన కార్యకర్తలు అతి విశ్వాసంతో ఉండకూడదని ప్రధాని ఈ సందర్భంగా హెచ్చరించారు. లింగ వివక్షను తొలగించడంలో బేటీ బచావో, బేటీ పఢావో ఎలా సహాయపడిందో, అదే విధంగా భూమాత పిలుపును కూడా వినిపించాలని చెప్పారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై బిజెపి ప్రభుత్వంతో కలిసి నడవాలని సూచించారు.

ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు. ‘‘రసాయనాలు, ఎరువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ఇంధన పరివర్తన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా బీజేపీ పని చేయాలి’’ అని మోదీ చెప్పారు. దేశం నలుమూలల నుంచి సుమారు 350 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు.

The post ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌ వీరుల చేతిలోనే భారత్‌ భవిష్యత్తు – ప్రధాని మోదీ
సరికొత్త ‘అగ్నిపథ్’ పథకానికి మార్గనిర్దేశకులు మీరేనని త్రివిధ దళాల తొలి బ్యాచ్‌ అగ్నివీరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి.. అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వారిని సిద్ధంగా ఉంచుతుందని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ సోమవారం అగ్నివీరుల తొలి బ్యాచ్‌నుద్దేశించి మాట్లాడారు. యువ అగ్నివీరులు సాయుధ దళాలను మరింత యువోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శక్తిగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘నవ భారతం నూతన శక్తితో నిండి ఉంది. మన బలగాలను ఆధునికీకరించడంతోపాటు వాటిని ఆత్మనిర్భర్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాల తీరు మారుతుంది. సాంకేతికంగా ముందంజలో ఉండే సైనికులదే సాయుధ దళాల్లో ముఖ్య భూమిక అని మోదీ తెలిపారు. ప్రస్తుత తరానికి ఈ సామర్థ్యం ఉంది. కాబట్టి.. సైన్యంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషిస్తారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా అగ్నివీరుల సామర్థ్యాన్ని కొనియాడుతూ, వారి స్ఫూర్తి.. సాయుధ బలగాల ధైర్యసాహసాలను ప్రతిబింబిస్తోందన్నారు. అగ్నివీరులుగా పొందే అనుభవం జీవితానికి గర్వకారణంగా ఉంటుందని తెలిపారు.

అగ్నిపథ్ పథకం మహిళలకు మరింత సాధికారత కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీరులను చూసేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు. ‘భిన్న ప్రదేశాల్లో విధుల నేపథ్యంలో.. అక్కడి సంస్కృతితో మమేకం కావాలి. సమష్టిగా పని చేయడంతోపాటు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలి’ అని అగ్నివీరులకు సూచించారు. దేశ యువత, అగ్నివీరుల శక్తిసామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో దేశానికి నాయకత్వం అందించనుంది వీరేనని ప్రధాని కొనియాడారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25 వేలకు పైగా అగ్నివీరులు శిక్షణ పొందుతున్నారు.

The post అగ్నిపథ్‌ వీరుల చేతిలోనే భారత్‌ భవిష్యత్తు – ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.