PM MODI DIWALI CELEBRATIONS WITH SOLDIERS – Vishwa Samvad Kendra Andhra Pradesh

హద్దు దాటితే బుద్ధి చెబుతాం – పాక్, చైనాలకు ప్రధాని మోడీ హెచ్చరిక
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సరిహద్దు జవాన్లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి పండగ జరుపుకొన్నారు. దీపావళి రోజు శనివారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ చేరుకున్న ప్రధాని అక్కడి లోంగేవాలా పోస్ట్ లో సరిహద్దు జవాన్లను కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, చైనాకు ప్రధాని మోడీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని హెచ్చరించారు.

విస్తరణవాద శక్తులకు గట్టిగా బదులిస్తాం…..

‘ఈ రోజు యావత్‌ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోంది. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్‌ గౌరవిస్తుంది. అయితే మన సహనాన్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్‌ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్‌ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది’ అని మోడీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని కొనియాడారు.

మీతో ఉంటేనే నాకు పండగ

‘ప్రతి భారతీయుడి దీపావళి శుభాకాంక్షలను నేను తీసుకొచ్చాను. మీరు(జవాన్లు) మంచు పర్వతాల్లో ఉన్నా.. ఎడారుల్లో ఉన్నా మిమ్మల్ని కలిస్తేనే నా దీపావళి పరిపూర్ణమవుతుంది. మీ ముఖంపై చిరునవ్వులు చూస్తే నా ఆనందం రెట్టింపవుతుంది’ అని మోడీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. భారత జవాన్ల శౌర్యపరాక్రమాలు అసమానమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రపంచంలోని ఏ శక్తీ మన సైనికులను అడ్డుకోలేదంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లను హెచ్చరించారు. త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకుంటూ శత్రుమూకలపై విజయం సాధిస్తున్నాయని ప్రశంసించారు. ఇందుకు 1971లో పాక్‌తో జరిగిన యుద్ధమే ఉత్తమ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు.

భారతావనికి గర్వకారణం…

దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లకు 130 కోట్ల మంది భారతీయులు అండగా ఉన్నారని మోడీ తెలిపారు. సైనికుల ధైర్యసాహసాలు, పరాక్రమాలకు ప్రతి భారతీయుడూ గర్వపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా లోంగేవాలా యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. జవాన్ల పరాక్రమాల గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ లోంగేవాలా యుద్ధం గుర్తొస్తుందని చెప్పారు. ‘మీతో(జవాన్లు) ఎంత ఎక్కువ సమయం గడిపితే.. అంత ఎక్కువగా ఈ దేశానికి సేవ చేయాలనే నా కాంక్ష మరింత బలపడుతుంది’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.

యోగా చేయండి :

ఈ సందర్భంగా సాయుధ బలగాలకు ప్రధాని మోడీ కొన్ని సూచనలు చేశారు. జవాన్లు యోగా చేయాలని సూచించారు. మాతృభాష, ఇంగ్లిష్‌ కాకుండా మరో బాష నేర్చుకోవాలన్నారు. ఇవి జవాన్లలో ఉత్సాహాన్ని నింపడమేగాక, సరికొత్త దృక్పథాలు ఏర్పడడానికి తోడ్పడుతాయని ఆయన చెప్పారు.

2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం దీపావళి పండగను సరిహద్దు జవాన్లతోనే జరుపుకొంటున్న సంగతి పాఠకులకు విదతమే.

Source : Enadu.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హద్దు దాటితే బుద్ధి చెబుతాం – పాక్, చైనాలకు ప్రధాని మోడీ హెచ్చరిక appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.