PAKISTAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌..
తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు దాయాది నీచ బుద్ధిని బయటపెట్టాయి. అయితే, అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ ఆ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్‌ చాలాకాలంగా చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటీ?’’ అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఖవాజా బదులిస్తూ.. ‘‘అమెరికా,  బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది’’ అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని అన్నారు.

The post చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట..
అంతర్జాతీయ వేదికలపై ఎన్ని మొట్టికాయలు పడినా పాకిస్థాన్  తన వైఖరిని మార్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్ పేరు చెప్పి, భారత్‌ను నిందలపాలు చేయాలని పాకులాడి బోర్లా పడుతున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా దాయాది దేశం ఆర్మీచీఫ్ అసిమ్‌ మునీర్ మళ్లీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. అది తమ జీవనాడి అని, దానిని మర్చిపోలేమని వ్యాఖ్యానించారు.

ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్థానీస్ కన్వెన్షన్‌లో మునీర్ మాట్లాడారు. ‘‘విదేశాల్లో నివసిస్తోన్న పాకిస్థానీయులంతా దేశ రాయబారులు. మీరు ఉన్నతమైన భావజాలం, సంస్కృతికి చెందినవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ పిల్లలకు పాక్‌ స్టోరీ చెప్పాలి. హిందువులతో పోలిస్తే మనం భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆశయాలు భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఈ దేశం ఏర్పాటు కోసం మన పూర్వీకులు ఎంతో పోరాడారు. ఈ స్టోరీని తర్వాత తరాలకు చెప్పడం మర్చిపోవద్దు. అప్పుడే వారికి పాకిస్థాన్‌తో ఉన్న బంధం దృఢంగా ఉంటుంది’’ అని మాట్లాడారు.

‘‘ఉగ్రవాద కార్యకలాపాల వల్ల పాకిస్థాన్‌కు పెట్టుబడులు రాకపోవచ్చని చాలామంది భయపడుతున్నారు. ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును హరించగలరని మీరు భావిస్తున్నారా..?’’అంటూ భారత సైన్యాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు బలోచిస్థాన్‌ గర్వకారణమన్నారు. అలాగే కశ్మీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టం. కశ్మీర్ సోదరులను మేం అలా వదిలేయం’’ అంటూ బీరాలు పలికారు.

The post పాక్‌ దుర్బుద్ధి.. కశ్మీర్‌ను మర్చిపోలేకపోతోందట.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ
రతదేశానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెరుగుతున్న మద్దతు దృష్టా, దానిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఏప్రిల్ 28న కెనడాలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉందని  ఆ దేశం ఆరోపించింది. కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్‌ఐఎస్‌) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ వెనెస్సా లాయిడ్ ఈ ఆరోపణలు చేశారు.

పాకిస్తాన్‌లో రాజకీయ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించేందుకు, భారతదేశానికి పెరుగుతున్న మద్దతును ఎదుర్కొనేందుకు పాక్‌ తన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా  కెనడాతో విదేశీ  దౌత్య కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా కెనడా.. పాక్‌, భారత్‌లపై ఇలాంటి ఆరోపణలను మోపింది. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

2021, 2019 కెనడా సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ భారతదేశం, పాకిస్తాన్ రహస్యంగా జోక్యం చేసుకున్నాయని కెనడా ఆరోపించింది. ఎన్‌డీటీవీ ఒక కథనంలో.. రాబోయే కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని పరిశీలిస్తున్న సమాఖ్య 2024లో గూఢచారి సంస్థ అందించిన సమాచారాన్ని విడుదల చేసిందని పేర్కొంది. ఖలిస్తానీ ఉద్యమం లేదా పాకిస్తాన్ అనుకూల వైఖరికి సానుభూతిపరులైన భారతీయ సంతతికి చెందిన ఓటర్లు కెనాడాలో ఉన్నారని వెనెస్సా లాయిడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాక్సీ ఏజెంట్ అనుకూల అభ్యర్థులకు అక్రమ ఆర్థిక సహాయం  అందించిన ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయిని లాయిడ్‌ ఆరోపించారు. కెనడా ఎన్నికల్లో భారత్, చైనాలు జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

The post కెనడా ఎన్నికల్లో పాక్‌ జోక్యం?: కెనడా ఆరోపణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు
పంజాబ్ అమృతసర్ లోని భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. అమృతసర్ సెక్టార్‌ రియర్ కక్కర్ ప్రాంతంలో చొరబడిన పాక్ డ్రోన్‌ను శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేశారు. పాకిస్థాన్ ఈ డ్రోన్ ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల సరఫరా కార్యకలాపాలు సాగిస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ దళాలు సరిహద్దు కంచె వద్ద శుక్రవారం ఉదయం డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

డ్రోన్‌తో పాటు నిషేధిత డ్రగ్స్ ప్యాకెట్‌ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా పంజాబ్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి క్రమంగా అక్రమ కార్యకలాపాలు పెరిగాయి. చలికాలం కావడం… పొగ మంచు ఉండటంతో దాన్ని ఆసరా చేసుకుని పాక్ ఉగ్రవాదులు మాదకద్రవ్యాలను భారత్ లోకి పంపుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా పంజాబ్ సెక్టార్‌లో జరిగిన మూడో సంఘటన కావడం పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుస్తోంది.

The post సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా?
ఉదయం, సాయంత్రం రాత్రి అనే తేడా లేదు.. ఇంట్లో కరెంటు ఉంటే ఒట్టు… పోయిన కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు.. సాధారణంగా ఒక గంట విద్యుత్తు లేకతేనే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతుంటాయి. ఇదే సంక్షోభంలో పాకిస్థాన్‌ ఇప్పుడు ఉంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో అవస్థలు పడుతుండగా.. ప్రస్తుతం విద్యుత్‌ సంక్షోభం కూడా తోడైంది. ఇప్పటికే తినడానికి తిండి కూడా దొరకక, గోధుమపిండి కోసం తొక్కిసలాటల్లో మరణాలు సంభవిస్తున్న దీనస్థితిలోకి చేరిన పాక్‌.. తాజాగా విద్యుత్‌ సంక్షోభంలోకి కూడా జారిపోయింది. దక్షిణ పాకిస్థాన్‌లోని నేషనల్‌ గ్రిడ్‌లో వైఫల్యం తలెత్తడంతో దేశంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌లోని జంషోరో, దాదుల మధ్య విద్యుత్‌ సరఫరా ఫ్రీక్వెన్సీలో మార్పులు, వోల్టేజీలో హెచ్చుతగ్గులు రావడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇస్లామాబాద్‌, కరాచీ, లాహోర్‌, పెషావర్‌ తదితర అన్ని ప్రధాన నగరాలతో పాటు దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 7.30 గంటల నుంచే విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. సాయంత్రం వేళ అయినా కరెంటు రాకపోవడంతో విద్యుత్‌ ఆధారిత పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలతో పాటు ఇళ్లల్లో ఉండే సామాన్య ప్రజలు కూడా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెజారిటీ ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా విద్యుత్తు సరఫరా ప్రారంభం కాలేదు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు చాలా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తాత్కాలికంగా సమస్య ఉంది.. : ఇంధన మంత్రి

దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పటికీ ఇది తీవ్ర సంక్షోభమేం కాదని పాక్‌ ఇంధన మంత్రి ఖుర్రమ్‌ దస్తగిర్‌ అన్నారు. ‘‘శీతాకాలంలో విద్యుత్‌కు తక్కువ డిమాండ్‌ ఉంటుంది. అందువల్ల రాత్రి సమయంలో విద్యుత్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తాం. అలాగే ఆదివారం రాత్రి కూడా నిలిపివేశాం. విద్యుత్‌ ఫ్రీక్వెన్సీలో మార్పుల వల్లే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో విద్యుత్‌ను పునరుద్ధరించాం. మిగిలిన ప్రాంతాలలోనూ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి, విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు.

The post పాకిస్థాన్‌లో చీకట్లు.. గ్రిడ్‌ విఫలంతోనే అసలు సమస్యా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతం మారలేదని హిందూ బాలికపై అత్యాచారం.. పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన!
పాకిస్థాన్‌లో మతమార్పిడుల ఘటనలు భయాందోళనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇస్లాంలోకి మారని హిందూ యువతులు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌ దేశంలోని సింధ్‌ ప్రావిన్సు ఉమర్‌కోట్‌ జిల్లాకు చెందిన ఓ హిందూ బాలికను ఇస్లాం మతంలోకి మారాలని కొందరు ముస్లింలు బలవంతం చేశారు. దానికి బాలిక అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంపై బాధిత బాలిక ఓ వీడియోలో తనపై జరిగిన ఉదంతాన్ని వివరించింది. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మూడు రోజులుగా అఘాయిత్యం..

పాక్‌లోని సింధ్‌ ప్రాంతంలో హిందూ యువతుల్ని ఇస్లాంలోకి మార్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.. మారనివారిపై అక్కడి ముస్లింలు అకృత్యాలకు తెగబడుతున్నారని బాధిత బాలిక వాపోయింది. తొలుత కిడ్నాపర్లు తనను ఇస్లాంలోకి మారాలని బెదిరించారని దానికి తాను నిరాకరించానని.. దీంతో తనపై అత్యాచారం చేశారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. మూడు రోజులపాటు బాలికను ఓ గదిలో బంధించి కిడ్నాపర్లు అత్యాచారం చేశారని తెలిపింది. చివరికి వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరానని వివరించింది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినా నిందితులపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో బాలిక తెలిపింది. ఇబ్రహీం మాంగ్రియో, పున్హో మాంగ్రియో, వీరి సహచరుడు తనను అపహరించినట్లు బాలిక పేర్కొంది.

హిందువులే లక్ష్యంగా పాక్‌లో దాడులు..

పాకిస్థాన్‌ దేశంలో హిందువులు అధికంగా ఉండే ప్రాంతాలైన థార్‌, ఉమర్‌కోట, మీర్‌పుర్కాస్‌, గోటికి, ఖైరిపూర్‌ తదితర చోట్ల ముస్లింలు పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బలవంతపు మతమార్పిడులు చేసి హిందూ యువతులను పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వారి మాట వినకపోతే అత్యాచారానికి పాల్పడటం లేదా అంతం చేయడం వంటి ఘాతుకాలకు ఒడిగడుతున్నారు.

గత ఏడాది జూన్‌లో.. కరీనా కుమారి అనే హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక అదే ఏడాది మార్చి నెలలో ముగ్గురు బాలికలకు మతం మార్చి కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే వివాహం జరిపించారు. పూజ కుమారి అనే మరో యువతిని మతం మారాలని బలవంతం చేయగా.. ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన దుండగులు ఆమెను హత్య చేశారు.

The post మతం మారలేదని హిందూ బాలికపై అత్యాచారం.. పాకిస్థాన్‌లో అమానవీయ ఘటన! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత మహిళా ప్రొఫెసర్‌తో పాక్‌ ఎంబసీ అధికారి అనుచిత ప్రవర్తన.. కోరిక తీర్చాలని వేధింపులు!
పంజాబ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహిళ పట్ట పాకిస్తాన్‌ ఎంబసీలో ఉన్న ఓ అధికారి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. 2021లో కరాచీలో నిర్వహిస్తున్న ఓ సమావేశానికి ఆమె హాజరయ్యేందుకు వెళ్లే క్రమంలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబసీకి వెళ్లగా.. అక్కడి అధికారి ఒకరు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. వీసా మంజూరు చేసే క్రమంలో పలు ఇబ్బందికర ప్రశ్నలు వేస్తూ తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. వీసా ఇంటర్వ్యూ కోసం రెండుసార్లు వెళితే.. రెండు సార్లు ఇలాగే జరిగిందని పంజాబ్‌కు చెందిన ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి పాక్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లేఖలో ఏముందంటే..

‘నేను మార్చి 2021, గత సంవత్సరం జూన్‌లో న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. నన్ను లాంజ్‌లో చాలా సేపు వెయిట్ చేయించారు. ఆ తర్వాత నాకు వీసా మంజూరు చేయలేమని చెప్పారు. ఇక కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండగా.. పాక్ హైకమిషన్‌లో పనిచేసే ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. మీరు నా దగ్గరకు వచ్చి ఉంటే, మీకు వీసా చేయించేవాడిని అన్నాడు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీసా అధికారి వస్తారని చెప్పి, నన్ను మళ్లీ లాంజ్‌లో వెయిట్ చేయించాడు’ అని ఆమె తెలిపారు. కాసేపటి తర్వాత తనను ఓ గదిలోకి పిలిచిన సదరు అధికారి.. అనుచిత ప్రశ్నలు వేశాడని బాధితురాలు వెల్లడించారు. ‘అతడు నా వీసా అవసరం గురించి అడిగాడు. నాతో సాధారణంగా మాట్లాడటం ప్రారంభించాడు. నేను సమాధానం ఇస్తూనే ఉన్నాను. మీకు పెళ్లైందా అని అడిగాడు. నేను ఇంకా కాలేదని చెప్పా. బోర్ కొడితే తాము నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటామని అతడు చెప్పాడు. ఆపై పెళ్లి ఎందుకు చేసుకోలేదని అతడు అడిగాడు. అంతటితో ఆగకుండా మీరు మీ లైంగిక కోరికను ఎలా తీర్చుకుంటారు? అని అడిగాడు. నేను చాలా ఇబ్బందికి గురయ్యా’ అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో విసిగిపోయిన తాను పైకి లేచి వీసా అధికారిని పిలవమని అడిగానని తెలిపారు.  తానొక ప్రొఫెసర్ అని, లాహోర్‌‌లోని చారిత్రక ప్రదేశాల్ని పరిశీలించాలి అనుకుంటున్నానని తెలిపింది. అలాగే అక్కడి యూనివర్సిటీలో లెక్చర్ కూడా ఇవ్వబోతున్నట్లు చెప్పింది. ఇంటర్వ్యూ ముగిసే సమయానికి మరో అధికారి కలుగజేసుకుని, వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. ఆ మహిళా ప్రొఫెసర్‌‌ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించాడు ఆ అధికారి. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటున్నారని, సెక్స్ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో తాను చాలా ఇబ్బందిపడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.

భారత్‌‌కు, కాశ్మీర్‌‌‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కథనాలు రాయాలని పాక్‌ హైకమిషన్‌కు చెందిన అధికారి తనను కోరారని ఆ మహిళ ఆరోపించారు. తనకు డబ్బు ఆశజూపారని తెలిపారు.

దీనిపై స్పందించిన పాక్‌ విదేశాంగ ప్రతినిధి..

పాక్‌ ఎంబసీలో పనిచేసే అధికారిపై వస్తున్న లైంగిక ఆరోపణల గురించి.. పాక్‌ విదేశాంగ ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ స్పందించారు. తమ దౌత్య కార్యాలయానికి వచ్చే వారితో తాము ఎప్పుడు తప్పుగా ప్రవర్తించమని తెలిపారు. వాస్తవాలు నిరూపితమైతే తప్పకుండా అధికారిపై చర్యలు తీసుకుంటాం.. దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని వారు తెలిపారు.

The post భారత మహిళా ప్రొఫెసర్‌తో పాక్‌ ఎంబసీ అధికారి అనుచిత ప్రవర్తన.. కోరిక తీర్చాలని వేధింపులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్థాన్‌ను ఆక్రమించుకునేందుకు భారత్‌కు ఇదే అసలైన అవకాశం.. కానీ ఇండియా అలా చేయదు.. ఎందుకంటే?
పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గోధుమ పిండి కోసం కూడా అక్కడ తొక్కిసలాటలు జరిగి పలువురు గాయాల పాలయ్యారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాక్‌లోని ఓ టీవీ ఛానల్‌లో నిపుణులు అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడుతూ… భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకీ భారత్ శక్తిమంతం అవుతోందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌పై దాడి చేసి ఆధీనంలోకి తీసుకోవచ్చని అన్నారు. కానీ… భారత్‌కు అలాంటి ఆలోచన లేదని కితాబునిచ్చారు. కొంత మంది పాక్ నేతలు ఇండియాను అణుబాంబుల పేరు చెబుతూ బెదిరిస్తున్నాయి. భారత్ కూడా అందుకు గట్టి బదులే ఇస్తోంది. ఇలాంటి కీలక తరుణంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జర్నలిస్ట్‌తో ఆ పొలిటికల్ అనలిస్ట్ ఇంకా ఏమన్నాడంటే..

“పాక్‌లోనే పరిస్థితే భారత్‌లో ఉండి ఉంటే కచ్చితంగా పాకిస్థాన్ ఇండియాపై దాడి చేసేది. ఇప్పటికిప్పుడే ఆ దేశాన్ని సర్వనాశనం చేసేది. కశ్మీర్‌నూ లాక్కునేది. కానీ… ఇండియా మాత్రం ఇలా ఎప్పటికీ ఆలోచించదు. పాక్‌ రోజురోజుకీ దిగజారిపోతోంది. ఇండియా మాత్రం ఎదుగుతోంది. పాక్‌ను ఇలాంటి తరుణంలో పడగొట్టాలన్న దురాలోచన భారత్‌కు రానందుకు ముందుగా అభినందనలు చెప్పాలి. అక్కడి నేతలు ఎంతో గౌరవంగా నడుచుకుంటున్నారు. పాకిస్థాన్‌ నేతలు ఇది అర్థం చేసుకోవాలి”

The post పాకిస్థాన్‌ను ఆక్రమించుకునేందుకు భారత్‌కు ఇదే అసలైన అవకాశం.. కానీ ఇండియా అలా చేయదు.. ఎందుకంటే? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు!
భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్‌ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ వెల్లడిస్తోంది. దీనిపై ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాద్‌ మాట్లాడుతూ.. తమ దేశం దివాళా తీయదని, ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని చెబుతున్నారు. అయితే ఆర్థిక నిపుణుల అంచనాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. పాక్‌ ఆర్థిక వ్యవస్థ దివాళాకు దగ్గరగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గోధుమ పిండి కోసం తొక్కిసలాట..

ఇక అక్కడ గోధుమల కొరత వల్ల అందరికి పిండి అందుబాటులో ఉండటం లేదు, సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం వేలాది మంది ప్రజలు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. దాంతో , సింధ్, బలూచిస్థాన్, తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు వచ్చాయి. రేషన్ దుకాణాల వద్ద తోపులాటలు సర్వసాధారణమైనట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. భద్రతా బలగాల పహారాలో పిండిని పంపిణీ చేసేందుకు వాహనాలు వస్తున్నాయి. వాటి చుట్టూ జరిగే తోపులాటలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా కొందరు ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని ఒక దుకాణంలో పిండి తక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. తన ఆరుగురు సంతానం ఆకలి తీర్చేందుకు ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.

ఆకాశన్నంటుతున్న ధరలు..

ఈ సంక్షోభం వేళ.. గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ పిండికి రూ.150కి పైగా చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు ఇదే అదనుగా మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు. కొన్నిచోట్ల 20 కేజీల పిండి ధర రూ.3,000కు చేరుకుంది. పాక్ చరిత్రలోనే ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. బలుచిస్థాన్లో గోధుమల నిల్వలు నిండుకున్నాయని, తక్షణమే 4,00,000 బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా కారణం, పాక్ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంక) పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయరంగం కుదేలయ్యింది.

The post రోజు రోజుకీ దిగజారుతున్న పాక్‌ ఆర్థిక పరిస్థితి.. పిండి కోసం తొక్కిసలాటలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌
భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సామాన్య ప్రజలు, కొన్ని వర్గాలు ఉగ్రవాదానికి పాకిస్తాన్‌కు సంబంధం ఉందని ఆరోపించడం సహజంగా జరిగేదే.. కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి స్థాయిలో ఉన్న జయశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటే అందులో నిజం లేకపోలేదని చాలా మంది నిపుణులు అభిప్రాయాపడుతున్నారు. తాజాగా మంత్రి జయశంకర్‌ కూడా తాను చేసిన వ్యాఖ్యలకు సమర్థించుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జయశంకర్‌ బదులిచ్చారు. ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబయి వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులు, విదేశీ పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. రోజూ భారత సరిహద్దు గుండా ఉగ్రమూకలు చొరబాట్లకు పాల్పడుతున్నారు. వీరందరూ పాక్‌ నుంచే వస్తున్నారు. ఇక పాక్‌ను ఉద్దేశించి ఇంకేమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది అంటూ.. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు అక్కడ నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్‌ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్‌ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని ఆయన హితవు పలికారు.

The post ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర బిందువు – భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.