PAKISTAN PRIME MINISTER IMRAN KHAN – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్
భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ పావులా వాడుకుంటోందని అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏళ్లపాటు తన అవసరాలకు ఉపయోగించుకుందని.. భారత్ తో పోల్చితే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. తమను అసలు పట్టించుకోవడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ వాషింగ్టన్ 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో వదిలిపెట్టిన “గందరగోళాన్ని” క్లియర్ చేయడానికి మాత్రమే పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటోందని.. కానీ భారతదేశానికి మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. బుధవారం నాడు ఇస్లామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జో బిడెన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడకపోవడంపై ఇస్లామాబాద్ అసంతృప్తిగా ఉంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయిద్ యూసుఫ్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ బాధను బయటపెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని కీలక సమస్యలలో పాకిస్తాన్ ను ఒక ముఖ్యమైన దేశంగా పరిగణించినప్పటికీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను సంప్రదించడానికి అమెరికా అధ్యక్షుడు బిడెన్ సంప్రదించకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. అమెరికా నాయకుడు తమ దేశ నాయకత్వాన్ని విస్మరించడం కొనసాగిస్తే తమకు ఇతర అవకాశాలు కూడా ఉన్నాయని యూసఫ్ చెప్పారు.

ఆగస్టు 31 లోపు అమెరికా మరియు నాటో దళాలను ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హింస పెరిగిపోయింది. తాలిబాన్ నేతలు గతంలో పాక్ కు వచ్చినప్పుడు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని వారికి తాము సూచించినట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆఫ్ఘన్ లో ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంగీకారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. అష్రాఫ్ ఘని అధికారంలో ఉన్నంతకాలం తాము శాంతిచర్చలకు వెళ్లబోమని తాలిబాన్ నేతలు అంటున్నారని ఇమ్రాన్ తెలిపారు.

తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తోంది. తాలిబాన్లకు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పాక్ పంపిస్తూ ఉంది. కొన్ని వేల మంది పాక్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి తాలిబాన్ల తరపున పోరాడుతూ ఉన్నారు. ఆ కారణాల వల్ల అమెరికా పాకిస్తాన్ ను కావాలనే పక్కన పెడుతోంది. మరోవైపు పాకిస్తాన్ చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉండడం కూడా అమెరికాకు నచ్చడం లేదు.

Source : Nationalist hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.