#Pahalgam Terror attack – Vishwa Samvad Kendra Andhra Pradesh

పర్యాటకుల మతంపై ఆరా తీసిన పోనీ రైడ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌
పహల్గాంలో గుర్రం స్వారీ సమయంలో నిర్వాహకుడొకరు తమను మతం గురించి అడిగాడంటూ ఓ పర్యాటకురాలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోపై గండేర్‌బల్‌ పోలీసులు కూపీ లాగారు. అతడిని గండేర్‌బల్‌లోని గోహిపొరాకు చెందిన ఐజాజ్‌ అహ్మద్‌ జుంగల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడితో ఇతడికి సంబంధముందా అనే కోణంలో అతడిని ప్రశి్నస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు విడుదల చేసిన నలుగురు అనుమానితుల స్కెచ్‌లపై యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన యుక్తా తివారీ అనే పర్యాటకురాలు స్పందించారు. వారిలో ఇద్దరితో ఘటన రోజున తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే, తాను వారి పేర్లు అడగలేదని చెప్పా రు. ఆమె వెంట ఉన్న స్నేహితులు సైతం వీరిని గుర్తు పట్టారు. అతడు తమను, పేరు, మతం గురించి అడిగాడని, ఎన్నడైనా అజీ్మర్‌ దర్గాకు గానీ అమర్నాథ్‌కు గానీ వెళ్లారా అని కూడా ఆరా తీశాడన్నారు.

హిందూ ముస్లిం మతాల్లో ఏదంటే ఎక్కువ ఇష్టమని మరొకడు ఆరా తీశాడని యుక్తా తివారీ పోలీసులకు తెలిపారు. ‘ఖురాన్‌ చదివారా, స్నేహితుల్లో హిందువులెందరు, ముస్లింలెందరు అని కూడా అడిగాడు. ఉర్దూ నాకు రాదని చెప్పగా, ఖురాన్‌ హిందీలోనూ ఉంటుందన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఇంతలోనే అతడి ఫోన్‌ మోగింది. ఆ వ్యక్తి ప్లాన్‌ ఏ బ్రేక్‌ ఫెయిల్‌. ప్లాన్‌ బి 35 తుపాకులు పంపాం.

వ్యాలీలో గడ్డిలో దాచామని చెప్పా డు. నేను వింటున్నట్లు తెలుసుకుని, వెంటనే మాట మార్చాడు’అని వివరించారు. అలా వారితో చాలా సేపు మాట్లాడామన్నారు. అతడు ఏడేళ్లుగా ఖురాన్‌ బోధిస్తున్నట్లుగా చెప్పాడన్నారు. అక్కడ తనకు పోలీసులెవరూ కనిపించకపోవడంతో ఈ విషయాలను చెప్పడం కుదరలేదని ఆమె వివరించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఆ తర్వాత తనకు కనిపించలేదన్నారు. తమ మతం గురించి, 35 తుపాకులను గురించి మాట్లాడినందువల్లే ఆ ఇద్దరూ తనకు, తన స్నేహితులకు బాగా గుర్తుండిపోయారని తివారీ వివరించారు.

కూంబింగ్‌ ముమ్మరం

పర్యాటకులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసు విభాగం స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ అనుమానితుల కోసం కథువా జిల్లాలో శుక్రవారం భారీ స్థాయిలో గాలింపు చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఆపరేషన్‌ మొదలైందని అధికారులు తెలిపారు. అదేవిధంగా, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో నిషేధిత జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ ఫ్రంట్‌(జేకేఎన్‌ఎఫ్‌) సంస్థ కార్యకలాపాలు, స్థానికులకు సంబంధాలపై విచారణ మొదలు పెట్టారు. పట్టణలోని గులాం మహ్మద్‌ గనీ నివాసంలోనూ సోదాలు జరిపారు. ఎగ్జిక్యూటివ్‌ మేజి్రస్టేట్‌ సమక్షంలో జరిపిన తనిఖీల్లో జేకేఎన్‌ఎఫ్‌కు సంబంధించిన సాహిత్యం లభ్యమైంది. వీటిన్నిటినీ రికార్డు చేశారు.

ఆ్రక్టాయ్‌ పోస్ట్‌ను మూసేసిన భారత్‌

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో భారత్‌–పాక్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ఆ్రక్టాయ్‌ పోస్ట్‌ను మూసివేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ పోస్ట్‌ ద్వారా రెండు దేశాల పౌరుల రాకపోకలకు ఇకపై అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమైన అట్టారీ ఇంటిగ్రేటెడ్‌ బోర్డర్‌ పోస్టును పూర్తిగా మూసివేయడం తెల్సిందే.

The post పర్యాటకుల మతంపై ఆరా తీసిన  పోనీ రైడ్‌ నిర్వాహకుడి అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌..
తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు దాయాది నీచ బుద్ధిని బయటపెట్టాయి. అయితే, అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ ఆ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాక్‌ చాలాకాలంగా చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటీ?’’ అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి ఖవాజా బదులిస్తూ.. ‘‘అమెరికా,  బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది’’ అని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని అన్నారు.

The post చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పహల్గాం ఉగ్ర దాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఉసిగొల్పారా..?
ప్రస్తుత పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశం ఉంది. దీనికి తోడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకొంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత్‌లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.

పుల్వామా దాడి వేళ మునీరే ఐఎస్‌ఐ అధిపతి..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనక పాక్‌ కోణాన్ని విస్మరించలేము. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్‌ ఆసీమ్‌ మునీర్‌ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలు బలపర్చే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓవర్సీస్‌ పాకిస్థాన్ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్‌ గతంలోనూ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్‌ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్‌ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గాం దాడి చోటుచేసుకొంది. అదే సమయంలో పాక్‌ వాయుసేనకు చెందిన రవాణ, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్‌, రావల్పిండి బేస్‌లకు తరలించడం అనుమానాలను బలపరుస్తోంది.  2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్‌ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అధిపతి. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్‌ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారు.

ప్రచారంలోకి ఖలీద్‌ పేరు..

ఇక పాక్‌ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్‌ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్‌ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఇద్దరు ఆపరేటీవ్‌లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఇక దాడిలో పాల్గొన్న వారు లష్కరే ముసుగు సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’కు చెందినవారు. వారు ఈ మారణ హోమం మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.

అంతర్జాతీయం చేయడానికి.. నాడు క్లింటన్‌ పర్యటన సమయంలో..

20 మార్చి 2000లో అనంత్‌నాగ్‌ జిల్లాలో ఛత్తీసింగ్‌పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకొన్నారు. నాడు సిక్కువర్గంలోని వారే ఉగ్రమూక లక్ష్యంగా మారారు. వాస్తవానికి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ న్యూదిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూకశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్‌ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు.

నాడు ఉగ్రవాదులు భారీ తుపాకులు, రెండు సైనిక వాహనాల్లో  ఛత్తీసింగ్‌పొర గ్రామంలోకి వచ్చారు. వారు ఇంటింటికీ తిరిగి తమను సైనిక సిబ్బందిగా చెప్పుకొని.. తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరినీ గురుద్వారా వద్ద ఉంచి కాల్చి చంపేశారు. సైన్యమే ఆ పని చేసిందన్నట్లు అక్కడిని వారిని నమ్మించేలా నినాదాలు చేశారు. చివరికి దర్యాప్తు సంస్థలు పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు గుర్తించాయి.

జేడీ వాన్స్‌ సందర్శన సందర్భంగా..

పహల్గాం ఉగ్ర దాడికి.. గతంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సతీసమేతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో పహల్గామ్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు దాడి చేసినవారు భద్రతా దళాల దుస్తుల్లో వచ్చారు. పర్యటకుల ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. ఇక్కడా పురుషులనే లక్ష్యం చేసుకోవడం గమనార్హం.

The post పహల్గాం ఉగ్ర దాడి.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఉసిగొల్పారా..? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.