Nitin Gadkari – Vishwa Samvad Kendra Andhra Pradesh

ట్రక్కు డ్రైవర్ల పని వేళలపై త్వరలో చట్టం – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి
2025 ఏడాది చివరి నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. రోడ్డు భద్రతా వారంలో 4 గంటల టెలిథాన్, ఔట్రీచ్ ప్రచారం “సడక్ సురక్ష అభియాన్”లో మంత్రి పాల్గొంటూ ట్రక్కు డ్రైవర్ల పని వేళలను నిర్ణయించేందుకు దేశంలో త్వరలో చట్టం తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నటుడు అమితాబ్ బచ్చన్, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు, పలువురు ఇతర భాగస్వాములు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ రోడ్డు ప్రమాదాలు, గాయాలను గణణీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఇందుకు గాను రోడ్డు భద్రతకోసం 4ఈ లు అంటే ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్‌లో బహుళ కార్యక్రమాలను చేపట్టినట్టుగా తెలిపారు. ఈ సంవత్సరం “స్వచ్ఛత పఖ్వాడా” కింద, అందరికీ సురక్షితమైన రోడ్ల అనే అంశాన్ని ప్రచారం చేయడానికి జనవరి 11 నుండి 17 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాన్ని (ఆర్.ఎస్.డబ్ల్యు) నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఈ వారోత్సవాలలో భాగంగా ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో నుక్కడ్ నాటకాలు (వీధి ప్రదర్శనలు), కార్పొరేట్‌ల సహకారంతో పాఠశాల & కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, పోటీలను, రోడ్డు భద్రత ప్రదర్శనలను నిర్వహించింది. వాక్‌థాన్, టాక్స్ షోలతో పాటుగా సీనియర్ ప్రభుత్వ అధికారులు పరిశ్రమ నాయకులతో ప్యానెల్ చర్చా కార్యక్రమాలను నిర్వహించింది.

దీనికి తోడు ఎన్.హెచ్.ఏ, ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్ మొదలైన రోడ్డు యాజమాన్య ఏజెన్సీలు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను పాటించడం, పాదచారుల భద్రత, టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్ల కోసం కంటి తనిఖీ శిబిరాలు, ఇతర రహదారి ఇంజనీరింగ్ సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాయి.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రవాణా, పోలీసు విభాగాలు, ఎన్.జి.ఒలు, ప్రైవేట్ కంపెనీలు, దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మొదటి ప్రతిస్పందన శిక్షణలు, నియమాలు & నిబంధనలను అట్టడుగు స్థాయి వరకు కఠినంగా అమలు చేయడం, ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమంలో ఆయా విభాగాలు చురుకుగా పాల్గొన్నాయి.

రోడ్డు భద్రతకు సంబంధించిన వర్క్‌షాప్‌లు & అడ్వకసీ కార్యక్రమాలను నిర్వహించారు. రహదారుల భద్రతా వారోత్సవాలకు సంబంధించి టెలివిజన్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతమైన కవరేజీని అందిచాయి, ఆయా మాద్యమాల ద్వారా రహదారి భద్రత ప్రచారం లక్షలాది మంది ప్రజలకు చేరుకుంది.

The post ట్రక్కు డ్రైవర్ల పని వేళలపై త్వరలో చట్టం – కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో రూ. 5 లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి: నితిన్ గడ్కరీ వెల్లడి
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 2024 నాటికి రూ.5 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 129 కి.మీ విస్తీర్ణంలో సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టనున్న 2, 4 వరుసల 3 జాతీయ రహదారులు, 5 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇదే వేదిక నుంచి శంకుస్థాపన చేశారు.

‘ఏపీకి రానున్న 3 నెలల్లో రూ.3వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేస్తాం.

రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి భూములు కేటాయిస్తే లాజిస్టిక్‌ పార్కులు ఇస్తాం. భువనేశ్వర్‌ నుంచి భోగాపురం వరకు 6లైన్ల హైవే.. విజయవాడ తూర్పు బైపాస్‌ రోడ్డు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం- వేమగిరి- కాకినాడ కెనాల్‌ రోడ్డును కాకినాడ పోర్టుకు అనుసంధానం చేస్తాం. సముద్ర రవాణాలో కీలకమైన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలూ సౌర, విద్యుత్తు, బయోడీజిల్‌ వాహనాలను ప్రోత్సహించాలి. గ్రీన్‌ బ్యాంకు ద్వారా పచ్చదనం అభివృద్ధిచేసి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు గ్రీన్‌ ఎనర్జీదే’ అని గడ్కరీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో రూ. 5 లక్షల కోట్లతో రోడ్ల అభివృద్ధి: నితిన్ గడ్కరీ వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆటోమేటిగ్గా టోల్ వసూలు
* టోల్ ‌ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా ఆటోమేటిగ్గా టోల్ చెల్లించే అధునాతన విధానం దిశగా కేంద్రం అడుగులు

టోల్ ‌ప్లాజాల వద్ద రద్దీని మరింత తగ్గించే లక్ష్యంగా ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను కేంద్రం తీసుకురానుంది. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్ట్ ‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. దీని ద్వారా టోల్ ‌ప్లాజా వద్ద వాహన రద్దీని తగ్గించడంతో పాటు టోల్‌ వర్తించే హైవేలపై, ప్రయాణించిన దూరానికే టోల్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని గడ్కరీ తెలిపారు. ఇండో అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు. టోల్ ‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపకుండానే ఆ వాహనం నంబర్‌ ప్లేట్ ‌ను రీడ్‌ చేసే కెమెరాల ద్వారా టోల్‌ ఫీజు ఆటోమేటిక్ ‌గా చెల్లించే విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీన్ని పైలట్‌ ప్రాజెక్ట్ ‌గా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ద్వారా ట్రాఫిక్ ‌ను అరికట్టడమే కాకుండా వినియోగించిన దానికే చెల్లించే విధానం తీసుకురానున్నట్లు చెప్పారు. టోల్ ‌ప్లాజాల వద్ద ఆటోమేటిక్‌ టోల్‌ చెల్లింపుల వ్యవస్థను తీసుకురావడం కోసం రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నామని గడ్కరీ తెలిపారు. అందులో ఒకటి వాహనాల్లో జీపీఎస్‌ ట్రాకర్‌ కాగా.. ఇంకోటి నంబర్‌ ప్లేట్‌ విధానమని చెప్పారు. నంబర్ ప్లేట్ టెక్నాలజీ వల్ల భవిష్యత్ ‌లో టోల్ ‌ప్లాజా అనేదే ఉండదని, ఆ స్థానంలో అధునాతన కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఉంటుందని గడ్కరీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆటోమేటిగ్గా టోల్ వసూలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు
* కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా దేశ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేసే అంశంపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్‌ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో సైతం సోలార్‌ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 26 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ ‌ప్రెస్‌ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ హైవేలు అంటే..?

ఎలక్ట్రిక్‌ హైవేలను సులువుగా చెప్పాలంటే.. ఇవీ రైల్వే లైన్లనే పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా అయితే పైనున్న విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని పరుగులు తీస్తాయో.. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు సైతం అదే విధంగా విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని వాహనంలోని బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటాయి. సోలార్‌ ఎనర్జీని ఇందుకోసం వినియోగించుకుంటాయి. ప్రధాన కారిడార్‌లో ఏ రూట్‌లో ఈ ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు
ముంబైలో ప్రారంభించిన నితిన్ గడ్కరీ

ముంబై: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారు చేసిన డబుల్‌ డె​క్కర్‌ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్‌ రోడ్లపైకి రానున్నాయ‌ని, తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించార‌న్నారు. ముంబైలోని బృహన్‌ ముంబాయ్‌ ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్టు స్విచ్‌ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్‌ గన్‌ చార్జింగ్‌ సిస్టమ్‌ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశంలో తొలి ఎలక్ట్రానిక్ డబుల్ డెక్కర్ బస్సు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం!
పూణే: ఆర్‌ఎస్‌ఎస్ హాస్పిట‌ల్ ఒక్క‌ హిందువులకేనా? అని ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. అయితే, మతం ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వివక్ష చూపదని తాను చెప్పిన‌ట్టు గ‌డ్క‌రీ వెల్లడించారు. మహారాష్ట్ర పూణేలోని సింహగడ్ ప్రాంతంలో ఛారిటబుల్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రారంభిస్తూ గతంలో రతన్‌ టాటా, ఆయనకు మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేశారు.

శివసేన-బీజేపీ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఔరంగాబాద్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవార్ పేరిట ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసిన్నట్టు చెప్పారు. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించడం కోసం ఓ సీనియర్ ఆర్‌ఎస్‌ఎస్ నేత తన సహాయం కోరారని తెలిపారు.

తాను రతన్ టాటాను సంప్రదించి, హాస్పిటల్ ప్రారంభానికి ఒప్పించాను అని పేరొంటూ.. అయితే రతన్ టాటా హాస్పిటల్‌కు చేరుకున్నాక ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఈ ఆసుపత్రి ఈ హాస్పిటల్ కేవలం హిందువులకే సేవలు అందిస్తుందా అని అడిగారని గడ్కరీ చెప్పారు.

అయితే, మీరు ఎందుకు అలా అనుకున్నారు? అని తాను అడిగినట్టు గడ్కరీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినది కావడంతో తనకు ఆ సందేహం కలిగిందని రతన్‌ టాటా వెంటనే బదులిచ్చారని తెలిపారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి అన్ని వర్గాల కోసమని, ఆర్‌ఎస్‌ఎస్‌లో ఎలాంటి వివక్షలు ఉండవని తాను చెప్పానని పేర్కొన్నారు. దీని గురించి మరింతగా వివరించడంతో రతన్‌ టాటా చాలా సంతోషించారని అప్ప‌ట్లో జ‌రిగిన స‌న్నివేశాన్ని నితిన్‌ గడ్కరీ గుర్తు చేసుకున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్‌ఎస్‌ఎస్‌ ఆసుపత్రి ఒక్క‌ హిందువులకేనా? రతన్ టాటా సందేహం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు అవ‌స‌రం
వాహన కంపెనీలకు గడ్కరీ సూచన

దిల్లీ: మధ్య తరగతి ప్రజలు అధికంగా కొనుగోలు చేసే చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా వాహన సంస్థలు చూడాలని కేంద్ర రవాణా, రహదారి మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఎంతసేపూ సంప‌న్నులు కొనుగోలు చేసే పెద్ద కార్లలోనే ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు ఉండేలా కంపెనీలు చూసుకుంటున్నాయన్నారు.

ప్రమాదాలు సంభవించిన సమయంలో మరణాలు నిరోధించేందుకు ఎయిర్‌బ్యాగ్‌లు ఎంతగానో సహకరిస్తాయని, చిన్న ఎకానమీ కార్లలోనూ అధిక ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చి వినియోగదార్ల భద్రతకు వాహన సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాలని గడ్కరీ సూచించారు. చిన్న కార్లలో అదనపు ఎయిర్‌బ్యాగ్‌లకు తక్కువ వ్యయమే అయ్యే అవకాశం ఉందని, దేశంలో అందరికీ వాహన భద్రత సమానంగా ఉండాలని వెల్లడించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చిన్న కార్లలోనూ తగినన్ని ఎయిర్‌బ్యాగ్‌లు అవ‌స‌రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.