NH16 – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఒడిశా నుంచి ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా!
బరంపురం: ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దీనిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై నుండి కోల్‌కతాకు కలిపే ఎన్‌హెచ్‌-16 ద్వారా అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది.

జజ్‌పూర్‌, ఖుర్దా జిల్లాలోని భజరంగ్‌ దళ్‌ కార్యకర్తల సహాయంతో ఆదివారం ఒడిశాలోని రెండు వేర్వేరు జిల్లాల్లో రెండు బీఫ్‌ కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు.

అందిన సమాచారం ప్రకారం… జాజ్‌పూర్‌ జిల్లాలోని కుయాకియా పోలీసు పరిమితిలోని బిలిపాడు సమీపంలో ఎన్‌హెచ్‌`16లో 20 టన్నుల బీఫ్‌ను రవాణా చేస్తున్న కంటైనర్‌ను జాజ్‌పూర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర 24 పరగణ జిల్లాకు చెందిన జావేద్‌ మండల్‌(40), బాపి మండల్‌ (30)లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

వెహికల్‌ నంబర్‌ డిఎల్‌ 1 జిసి 4302 ఉన్న కంటైనర్‌ బిలిపూర్‌ సమీపంలో ఎన్‌హెచ్‌`16లో సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. కంటైనర్‌ నుండి రక్తం కారుతుండడాన్ని స్థానిక గ్రామస్తులు చూసి, భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ కార్యకర్తలకు సమాచారం అందించారు. భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక పోలీసులను సంఘటన స్థలానికి పిలిచారు.

వాహనం డ్రైవర్‌, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం ప్రారంభించారు. వారు గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నారని మొదట అంగీకరించలేదు. కానీ, తరువాత వారు గొడ్డు మాంసం రవాణా చేసినట్టు అంగీకరించారు. సంబల్పూర్‌ నుండి కంటైనర్‌ కోల్‌కతాకు వెళుతోంది. ఎటువంటి పత్రాలు లేవు. భజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ కార్యకర్తలు స్థానిక పోలీస్‌ స్టేషన్లను ఘెరావ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

‘ఎన్‌హెచ్‌-16 ద్వారా ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఆవులు, టన్నుల గొడ్డు మాంసం పశ్చిమ బెంగాల్‌కు రవాణా అవుతున్నాయి. అయితే, దీనిని నిరోధించడానికి పోలీసులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ కార్యకలాపాలను నిలిపివేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. పాలకులు మా డిమాండ్‌ని వినకపోతే, మేము వీధిలోకి రావాల్సి వస్తుంది’అని వీహెచ్‌పీ జాజ్‌పూర్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అక్షయ కుమార్‌ బాల్‌ హెచ్చరించారు.

అదేవిధంగా, ఖుదా పోలీసులు 7 క్వింటాల్‌ బీఫ్‌తో ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. గొడ్డు మాంసం పశ్చిమ బెంగాల్‌కు రవాణా చేస్తున్నారు. ఎండీ ఆసిక్‌, మెహమూద్‌ ఖాన్‌, తుకు ఖాన్‌, ఎస్కే ఇస్లాం, ఫిరోజ్‌ అలీ ఖాన్‌ అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒడిశా నుంచి ఆవులు, గొడ్డు మాంసం అక్రమ రవాణా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.